రామ భక్త హనుమాన్ వైభవం 🕉️🔱🙏
16 Posts • 5K views
PSV APPARAO
959 views 1 months ago
#రామ భక్త హనుమాన్ వైభవం 🕉️🔱🙏 #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🕉️శ్రీ ఆంజనేయం #ఆంజనేయ స్వామి #మంగళవారం ఆంజనేయ స్వామి ఆంజనేయుని యుక్తి -- బుద్ధి బలం, వివేకం.....!! ఆంజనేయుడు కేవలం శక్తిసామర్థ్యాలు, ధైర్యసాహసాలు కలవాడు మాత్రమే కాదు, అత్యంత బుద్ధిశాలి కూడా. ఒక సన్యాసి రూపంలో శ్రీరాముని దగ్గరకు వెళ్లి, తన వాక్చాతుర్యంతో ఆయన్ని ఆకట్టుకున్నాడు. ఆ తరువాత శ్రీరాముడు, సుగ్రీవుడు మిత్రులుగా మారడానికి వారధిగా నిలిచింది ఆంజనేయుడే. సీతాన్వేషణకై వెళ్తున్న హనుమపై శ్రీరామునికి ఉన్న నమ్మకం ఎంత గొప్పదంటే, తన ఉంగరాన్ని ఇచ్చి సీతకు తన గుర్తుగా ఇవ్వమని చెప్పాడు. లంకకు వెళ్లే మార్గంలో హనుమకు ఎదురైన సవాళ్లు, వాటిని ఆయన అధిగమించిన తీరు ఆయన బుద్ధి బలానికి నిదర్శనం. * సురసను జయించడం: "నా నోటిలోకి వెళ్లకుండా ముందుకు వెళ్లలేవు" అని దేవతల వరం పొందిన సురస అడ్డుపడితే, హనుమ సూక్ష్మ రూపంలో మారి ఆమె నోటిలోకి వెళ్లి, అంతే వేగంగా బయటకు వచ్చాడు. * మైనాకుడిని మెప్పించడం: సముద్రం మధ్యలో కనిపించిన మైనాకు పర్వతం ఆతిథ్యం ఇవ్వబోతే, బుజ్జగింపు మాటలతో అతడిని మెప్పించి, తన లక్ష్యం వైపు ముందుకు సాగాడు. * సింహికను అంతమొందించడం: నీడను పట్టుకుని మింగే సింహిక రాక్షసి ఎదురైనప్పుడు, వెంటనే చిన్న రూపంలో మారి ఆమె నోటిలోకి వెళ్ళాడు. ఆ తర్వాత తన శరీరాన్ని పెద్దది చేసి, పదునైన గోళ్ళతో ఆమెను చంపేశాడు. రాక్షసుల శక్తిని తెలుసుకోవడం కోసం......... రాత్రివేళ పిల్లి రూపంలో లంకలో తిరిగాడు. సీతమ్మ కనిపించక పోవడంతో తీవ్ర నిరాశకు గురైనా, ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఎన్నో దోషాలు వస్తాయని గ్రహించాడు. "బ్రతికి ఉంటే ఏదో ఒక రోజు సుఖం లభిస్తుంది" అని తన మనసును నియంత్రించుకుని, బుద్ధిబలంతో చివరి ప్రయత్నంగా అశోకవనంలో వెతికి సీతమ్మను కనుగొన్నాడు. రాక్షస స్త్రీల బాధలు భరించలేక ప్రాణాలు వదలాలనుకున్న సీతమ్మను చూసి, ఆమెకు నేరుగా కనిపించకుండానే రాముని కథను వినిపించి ఆమెకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఈ అద్భుతమైన తెలివితేటలు ఆంజనేయునికే సొంతం. సీతాన్వేషణ ఒక్కటే కాకుండా, ఆంజనేయుడు రావణునికి తన శక్తిని తెలియజేయడం, రాక్షసుల బలాన్ని అంచనా వేయడం వంటి అదనపు పనులను కూడా పూర్తి చేశాడు. అందుకే పట్టాభిషేక సమయంలో శ్రీరాముడు "ఎవరి బుద్ధిబలం, పరాక్రమం నీ మనసుకు ఆనందాన్ని ఇచ్చిందో, వారికి ఈ ముత్యాల హారాన్ని బహుమతిగా ఇవ్వు" అని చెప్పగా, సీతమ్మ ఆ హారాన్ని హనుమకు ఇచ్చింది. ఆంజనేయుని ఈ బుద్ధిబలం, సమయస్ఫూర్తి మనందరికీ ఆదర్శం. ఈ లక్షణాలను మనం కూడా అలవర్చుకుని, మనం చేసే పనులను సమర్థవంతంగా పూర్తి చేద్దాం.
12 likes
9 shares
PSV APPARAO
1K views 1 months ago
#హనుమ వైభవం #రామ భక్త హనుమాన్ వైభవం 🕉️🔱🙏. ఆంజనేయుని యుక్తి -- బుద్ధి బలం, వివేకం.....!! ఆంజనేయుడు కేవలం శక్తిసామర్థ్యాలు, ధైర్యసాహసాలు కలవాడు మాత్రమే కాదు, అత్యంత బుద్ధిశాలి కూడా. ఒక సన్యాసి రూపంలో శ్రీరాముని దగ్గరకు వెళ్లి, తన వాక్చాతుర్యంతో ఆయన్ని ఆకట్టుకున్నాడు. ఆ తరువాత శ్రీరాముడు, సుగ్రీవుడు మిత్రులుగా మారడానికి వారధిగా నిలిచింది ఆంజనేయుడే. సీతాన్వేషణకై వెళ్తున్న హనుమపై శ్రీరామునికి ఉన్న నమ్మకం ఎంత గొప్పదంటే, తన ఉంగరాన్ని ఇచ్చి సీతకు తన గుర్తుగా ఇవ్వమని చెప్పాడు. లంకకు వెళ్లే మార్గంలో హనుమకు ఎదురైన సవాళ్లు, వాటిని ఆయన అధిగమించిన తీరు ఆయన బుద్ధి బలానికి నిదర్శనం. * సురసను జయించడం: "నా నోటిలోకి వెళ్లకుండా ముందుకు వెళ్లలేవు" అని దేవతల వరం పొందిన సురస అడ్డుపడితే, హనుమ సూక్ష్మ రూపంలో మారి ఆమె నోటిలోకి వెళ్లి, అంతే వేగంగా బయటకు వచ్చాడు. * మైనాకుడిని మెప్పించడం: సముద్రం మధ్యలో కనిపించిన మైనాకు పర్వతం ఆతిథ్యం ఇవ్వబోతే, బుజ్జగింపు మాటలతో అతడిని మెప్పించి, తన లక్ష్యం వైపు ముందుకు సాగాడు. * సింహికను అంతమొందించడం: నీడను పట్టుకుని మింగే సింహిక రాక్షసి ఎదురైనప్పుడు, వెంటనే చిన్న రూపంలో మారి ఆమె నోటిలోకి వెళ్ళాడు. ఆ తర్వాత తన శరీరాన్ని పెద్దది చేసి, పదునైన గోళ్ళతో ఆమెను చంపేశాడు. రాక్షసుల శక్తిని తెలుసుకోవడం కోసం......... రాత్రివేళ పిల్లి రూపంలో లంకలో తిరిగాడు. సీతమ్మ కనిపించక పోవడంతో తీవ్ర నిరాశకు గురైనా, ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఎన్నో దోషాలు వస్తాయని గ్రహించాడు. "బ్రతికి ఉంటే ఏదో ఒక రోజు సుఖం లభిస్తుంది" అని తన మనసును నియంత్రించుకుని, బుద్ధిబలంతో చివరి ప్రయత్నంగా అశోకవనంలో వెతికి సీతమ్మను కనుగొన్నాడు. రాక్షస స్త్రీల బాధలు భరించలేక ప్రాణాలు వదలాలనుకున్న సీతమ్మను చూసి, ఆమెకు నేరుగా కనిపించకుండానే రాముని కథను వినిపించి ఆమెకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఈ అద్భుతమైన తెలివితేటలు ఆంజనేయునికే సొంతం. సీతాన్వేషణ ఒక్కటే కాకుండా, ఆంజనేయుడు రావణునికి తన శక్తిని తెలియజేయడం, రాక్షసుల బలాన్ని అంచనా వేయడం వంటి అదనపు పనులను కూడా పూర్తి చేశాడు. అందుకే పట్టాభిషేక సమయంలో శ్రీరాముడు "ఎవరి బుద్ధిబలం, పరాక్రమం నీ మనసుకు ఆనందాన్ని ఇచ్చిందో, వారికి ఈ ముత్యాల హారాన్ని బహుమతిగా ఇవ్వు" అని చెప్పగా, సీతమ్మ ఆ హారాన్ని హనుమకు ఇచ్చింది. ఆంజనేయుని ఈ బుద్ధిబలం, సమయస్ఫూర్తి మనందరికీ ఆదర్శం. ఈ లక్షణాలను మనం కూడా అలవర్చుకుని, మనం చేసే పనులను సమర్థవంతంగా పూర్తి చేద్దాం. #శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 🍃🌿🌿💐🌹🥀🌺🌷 జైశ్రీరామ్, 💐💐💐💐 జపాలి ఆంజనేయ స్వామి 💐 #ఆంజనేయ స్వామి #శ్రీ ఆంజనేయ స్వామి #ఆంజనేయ స్వామి
16 likes
13 shares
PSV APPARAO
893 views 4 months ago
#రామ భక్త హనుమాన్ వైభవం 🕉️🔱🙏 *🌹హనుమాన్ సర్వస్వం🌹* 🙏🙏🙏 *పరాశర సంహిత నుంచి సేకరించిన సమాచారం ప్రశ్నలు జవాబులు.* 🚩1) శ్రీ హనుమంతుని తల్లి పేరు? జవాబు : అంజనా దేవి ! 🚩2) హనుమంతుని తండ్రి పేరు? జవాబు : కేసరి ! 🚩3) కేసరి పూర్వ జన్మలో ఎవరు? జవాబు : కశ్యపుడు ! 🚩4) అంజన పూర్వ జన్మలో ఎవరు? జవాబు : సాధ్య ! 🚩5) హనుమంతుని జన్మ తిథి ఏది? జవాబు : వైశాఖ బహుళ దశమి! 🚩 6) హనుమంతుని జన్మ స్థలం ఏది? జవాబు : తిరుమల - అంజనాద్రి. 🚩7) హనుమంతుని నక్షత్రము ? జవాబు : పూర్వాభాద్ర నక్షత్రము. 🚩8) హనుమంతుని జనన లగ్నం ? జవాబు : కర్కాటక. 🚩9) హనుమంతుడు ఏ యోగం లో పుట్టాడు ? జవాబు : వైదృవీయోగం లో 🚩10) హనుమంతుడు ఏ అంశతో పుట్టాడు ? జవాబు : ఈశ్వరాంశ 🚩11) ఎవరి వరం వలన హనుమంతుడు పుట్టాడు ? జవాబు : వాయుదేవుని వరం వలన. 🚩12)హనుమ జనన కారకులు ? జవాబు : శివ,పార్వతులు, అగ్ని,వాయువులు. 🚩13) హనుమంతుని గురువు ? జవాబు : సూర్య భగవానుడు. 🚩14) హనుమంతుని శపించిన వారు ? జవాబు : భృగుశిష్యులు. 🚩15) హనుమంతునికి గల శాపం ? జవాబు : తన శక్తి తనకు తెలియకుండా ఉండడం. 🚩16) హనుమంతుని శాప పరిహారం ? జవాబు : స్తుతించినా, నిందించినా తన శక్తి తను గ్రహించుట. 🚩17) హనుమంతుని బార్య ? జవాబు : సువర్చలా దేవి. 🚩18) సువర్చాలా దేవి మాతామహుడు ? జవాబు : విశ్వకర్మ. 🚩19) హనుమంతుని మాతామహుడు ? జవాబు : కుంజరుడు. 🚩20)సువర్చల తల్లి పేరు ? జవాబు : సంజాదేవి, ఛాయాదేవి. 🚩21) హనుమంతుని బావమరుదులు ? జ : అశ్వనీ దేవతలు, శని,యముడు. 🚩22) హనుమంతుని వివాహ తేదీ ? జ : జేష్ఠ శుద్ధ దశమి. 🚩23) హనుమంతుని తాత, అమ్మమ్మ ? జ : గౌతముడు , అహల్య. 🚩24) హనుమంతుని మేన మామలు ? జ : శతానందుడు, వాలి, సుగ్రీవులు. 🚩25)హనుమంతుడు నిర్వహించిన పదవి ఏది ? జ : సుగ్రీవుని మంత్రి. 🚩26) హనుమంతుడు నిర్వహించిన పదవి స్థానం ఏది ? జ : ఋష్యమూక పర్వతం. 🚩27) శ్రీరాముని కలియుటకు హనుమంతుడు ఏ రూపం ధరించాడు ? జ : భిక్షుక రూపం. 🚩28) హనుమంతుడు శ్రీరాముని తొలుత చూసిన స్థలం ఏది ? జ : పంపానదీ తీరం . 🚩29)హనుమంతుని వాక్ నైపుణ్యాన్ని తొలుత మెచ్చింది ఎవరు ? జ : శ్రీరాముడు. 🚩30)హనుమంతుడు అగ్ని సాక్షిగా ఎవరికి మైత్రి గూర్చాడు ? జ : శ్రీరామ సుగ్రీవులకు. 🚩31)హనుమంతుడు వాలిని సంహరింపని కారణం? జ : తల్లి అజ్ఞ. 🚩32)హనుమంతుడు లక్ష్మణుని కి ఆసనంగా వేసినది ? జ : చందన వృక్ష శాఖ. 🚩33)హనుమంతుని సంపూర్ణ చరిత్ర కలిగిన మహత్ గ్రంథం ? జ : శ్రీ పరాశర సంహిత. 🚩34)హనుమంతుని మేన మామలు వాలి సుగ్రీవుల భార్యలు ? జ : తార, రమ. 🚩35) చైత్ర మాసంలో హనుమత్ పర్వదినం ? జ : పుష్యమి నక్షత్రం గల రోజు. 🚩36) సీతా దేవి నీ వెతుకుటకు హనుమంతుడు నీ ఏదిక్కుకు పంపారు.? జ : దక్షిణ దిక్కు. 🚩37)వైశాఖ మాసంలో హనుమత్ పర్వదినం ఏ నక్షత్రం కలది ? జ : ఆశ్లేష నక్షత్రం. Sri Hanuman Gayathri Mantra 🙏🏻🙏🏻🙏🏻 https://youtu.be/_rmz_6f--EQ 🚩38) హనుమంతుడి ఆదేశం తో వానరులు ప్రవేశించిన గుహ ఎవరిది ? జ : స్వయంప్రభది. 🚩39) ప్రాయోప ప్రవేశ యత్నం లో ఉన్న అంగదాదులను భక్షించిన పక్షి ? జ : సంపాతి. 🚩40) సముద్ర లంఘనం కోసం హనుమంతుడు ఎక్కిన పర్వతం ? జ : మహేంద్ర పర్వతం. 🚩41)హనుమంతుడు దాటిన సముద్ర విస్తీర్ణము ? జ : 100 యోజనాలు. 🚩42)హనుమంతునికి అడ్డు వచ్చిన పర్వతం ? జ : మైనాకుడు. 🚩43)హనుమంతునికి ఆతిథ్యం ఇవ్వాలని తలచింది ఎవరు ? జ : సముద్రుడు. 🚩44) మైనాకుని హనుమంతుడు ఎం చేశాడు? జ : రొమ్ము తో తాకాడు. 🚩45) మైనాకుడు హనుమంతుడిని ఎల అనుగ్రహించాడు.? జ : చేతితో స్పృశించి. 🚩46)హనుమంతుని కి ఏర్పడిన 2 వ విఘ్నం ? జ : సురస. 🚩47) సురస ఏ జాతి స్త్రీ ? జ : నాగజాతి. 🚩48) సురస నుండి హనుమంతుడు ఏలా తప్పించుకున్నాడు.? జ : ఉపాయంతో. 🚩49) సురసను పంపిన దెవరు ? జ : దేవతలు. 🚩50) సురసను దేవతలు ఎందుకు పంపారు ? జ : హనుమంతుని శక్తి సామర్థ్యాలు పరీక్షించుటకు . 🚩51) హనుమంతునికి ఏర్పడిన 3 వ విఘ్నం ? జ : సింహిక. 🚩52) సింహిక హనుమంతుని ఎం చేసింది ? జ : నీడ పట్టి లాగింది. 🚩53) సింహిక వృత్తి ఎమిటి ? జ : లంకను కాపాడడం. 🚩54) హనుమంతుని చరిత్ర ఎవరితో చెప్పబడింది ? జ : శ్రీ పరాశర మహర్షి చే. 🚩55) హనుమంతుడు లంక లో ఏ ప్రాంతంలో వాలాడు.? జ : సువేల పర్వత ప్రాంతం లో. 🚩56) హనుమ వెళ్లిన పర్వతం మొత్తానికి గల పేరు ? జ : త్రికూటాచలం. 🚩57) సువేల పై హనుమంతుడు ఎందుకు అగాడు ? జ : సూర్యాస్తమయం కోసం. 🚩58) లంకలోకి హనుమంతుడు ఎంత రూపంలో వెళ్ళాడు? జ : పిల్లి పిల్ల అంత వాడు అయ్యి. 🚩59) లంకా ప్రవేశ ద్వారం వద్ద హనుమను అడ్డగించింది ఎవరు ? జ :లంకిణి 🚩60) లంకిణిని హనుమంతుడు ఎల కొట్టాడు ? జ : ఎడమ చేతి పిడికిలి తో. 🚩61) లంకలో హనుమంతుడు ఎలా ప్రవేశించాడు ? జ : ప్రాకారం దూకి. 🚩62) శతృపుర ప్రవేశంలో హనుమంతుడు పాటించిన శాస్త్ర నియమం ఎమిటి ? జ : ఎడమ కాలు ముందు పెట్టీ పోవడం. 🚩63) ఎవరిని చూసి హనుమంతుడు సీతగా బ్రమించాడు ? జ : మండోదరిని. 🚩64)హనుమంతుడు ప్రవేశించిన వనం ? జ : అశోక వనం. 🚩65) అశోక వనం ఏ పర్వతం పైన ఉన్నది ? జ : సుందర పర్వతం. 🚩66)లంకా నగరం ఏ పర్వతం పై ఉన్నది ? జ : నీల పర్వతం. 🚩67)శ్రీ హనుమత్ చరిత్ర అంతా పరాశర మహర్షి చే ఎవరికి చెప్పబడింది ? జ : మైత్రేయ మహర్షి కి. 🚩68)హనుమంతుడు అందించిన అద్భుత సందేశం ? జ : జీవనృద్రాణిపశ్యతి. -(బ్రతికి ఉండిన శుభములు బడయవచ్చు) 🚩69) సీతను హనుమంతుడు ఏ చెట్టు కింద చూచాడు ? జ : శింశుపా వృక్షము. 🚩70) సీతకు హనుమంతుడు ఆనవాలుగా ఏమిచ్చాడు ? జ : రాముడి ఉంగరం. 🚩71) హనుమంతునికి తన ఆనవాలుగా సీత ఎమి ఇచ్చింది ? జ : చూడామణీ. 🚩72)హనుమంతుడు అశోక వనం ద్వంసం అనంతరం ఏ రాక్షస వీరుని చంపారు ? జ : జంబుమాలిని. 🚩73) హనుమంతుని చేతిలో మరణించిన రావణ సుతుడు ఎవరు ? జ : అక్షయ కుమారుడు. 🚩74)హనుమంతుడు ఎవరికి బందీ అయ్యాడు ? జ : ఇంద్రజిత్తు నకు. 🚩75) హనుమంతుని రావణ దర్భారు లో ఎవరు ప్రశ్నించారు. ? జ : ప్రహస్తుడు . 🚩76) సముద్రం తిరిగి దాటడానికి ఆధారం చేసుకున్న పర్వతం ? జ : అరిష్ట పర్వతం. 🙏🙏🙏🙏 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
14 likes
20 shares