📙 ఒక కథ చెప్పు బ్రదర్
#

📙 ఒక కథ చెప్పు బ్రదర్

శ్రీ రామ జయమ్ ఒక ఊరిలో ఒక తెలివైన వ్యక్తి ఉన్నాడు. అతనికి దేవుడిపై భక్తి ఎక్కువ, ఎప్పుడు గుడికి వెళ్తూ ఉండేవాడు. దేవుడికి నమస్కారం చేసుకోని అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బులతో ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నాడు . ఒక రోజు ఎప్పటిలాగానే అడవికి వెళ్తూ దారిలో ఒక నక్కని చూసాడు. ఆ నక్కకి రెండు కాళ్ళు లేవు. ఏదో ప్రమాదంలో దాని రెండు కాళ్ళు పోయినాయి అనుకుంటున్నాడు . నక్క దాని దారిన అది వెళ్ళి ఒక చెట్టు క్రింద కూర్చుంది. దానిని చూసి అతనికి ఒక సందేహం వచ్చింది. ఈ నక్కకు రెండు కాళ్ళు లేవు అది ఎలా వేటకు వెళ్ళి దాని ఆహారాన్ని సంపాదించుకుంటుంది అని ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తున్న సమయంలో అక్కడికి ఒక పులి వచ్చింది. ఆ పులిని చూసి అతను ఒక చెట్టు వెనక్కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉన్నాడు. ఆ పులి ఏమి చేస్తుంది అంటే ఒక పెద్ద జింకని వేటాడి అక్కడికి ఇడ్చుకొని వచ్చి తినింది. ఆ పులి తిన్న తరువాత మిగిలినది అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయింది . పులి వెళ్లిపోయిన తరువాత ఆ కాళ్ళు లేని నక్క అక్కడికి వెళ్ళి మిగిలిన ఆహారాన్ని కడుపు నిండా తినింది. ఇది అంతా గమనిస్తూ ఉన్న అతనికి ఇలా అనిపించింది, రెండు కాళ్ళు లేని ఈ నక్కకు ఆ దేవుడు ఆహారాన్ని ఇస్తున్నప్పుడు రోజు దేవుడికి పూజలు చేసే నేను ఎందుకు ఇంత ఎండలో, వర్షంలో కష్టపడి చెమటోర్చి కట్టెలు కోట్టాలి అని ఆలోచించాడు. ఆ సంఘటన తర్వాత అడవికి వెళ్ళటం మానేశాడు, గొడ్డలి పడేశాడు ఏమి మాట్లాడకుండా ఒక ప్రక్కన కూర్చున్నాడు అప్పుడప్పుడు గుడికి వెళ్లి వస్తున్నాడు. ఆ దేవుడే నన్ను కాపాడతాడు, నాకు భోజనం పెడతాడు అని నమ్ముకొని దేవుడి గుడి మండపంలో ఒక స్తంభాన్ని ఆనుకొని కూర్చున్నాడు. రోజులు గడుస్తున్నాయి, భోజనం దొరికే సూచనలు కనిపించలేదు. అతను ఆకలితో బాగా నిరసించిపోయి ఎండిపోయిన ఆకులాగా, ఎలుగుబంటి తోలు వలే మారిపోయాడు. ఒక రోజు రాత్రి గుడిలో ఎవ్వరు లేని సమయంలో కళ్ళు తెరిచి దేవుడా! నా భక్తి మీద నీకు నమ్మకం లేదా నేను ఇలా ఆకలితో మాడి చనిపోవాల్సిందేనా ! అడవిలో ఉన్న నక్కకి పులి ద్వారా ఆహారం పంపించావు కానీ నన్ను ఇలా వదిలేశావు నీకు ఇది న్యాయమా! అని అడిగాడు. దేవుడు మెల్లగా కళ్ళు తెరిచి ఇలా చెప్పాడు. వెదవా! నువ్వు నేర్చుకోవాల్సింది నక్క దగ్గర కాదు పులి దగ్గర, పులి లాగా నువ్వు కష్టపడి కావల్సినది తిని మిగిలినది ఇతరులకు ఇవ్వాలి అని అన్నాడు. చదివిన దానిలో నచ్చినది మనం ఎవ్వరి దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలి అనేది మనమే నిర్ణయం తీసుకోవాలి. !!శుభమ్ కలుగుగాక!!
4.5k వీక్షించారు
6 నెలల క్రితం
#

📙 ఒక కథ చెప్పు బ్రదర్

💞🐥 VELAMAREDDI SAI KUMAR🐥💞
#📙 ఒక కథ చెప్పు బ్రదర్
226 వీక్షించారు
6 నెలల క్రితం
#

📙 ఒక కథ చెప్పు బ్రదర్

💞🐥 VELAMAREDDI SAI KUMAR🐥💞
#📙 ఒక కథ చెప్పు బ్రదర్
228 వీక్షించారు
6 నెలల క్రితం
#

📙 ఒక కథ చెప్పు బ్రదర్

342 వీక్షించారు
6 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post