రోబో 2.0
#

రోబో 2.0

248 వీక్షించారు
6 నెలల క్రితం
#

రోబో 2.0

29 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన రోబో2.0 రివ్యూ: తారాగణం: సూపర్ స్టార్ "రజిని" అక్షయ్ కుమార్ అమీ జాక్సన్ మరియు తదితరులు సంగీతం: ఏ ఆర్ రెహమాన్ నిర్మాత: లైకా ప్రొడక్షన్స్ దర్శకత్వం: శంకర్ కథ: పక్షులను ప్రేమించే ఓ ముసలివాడు ఒకరోజున హఠాత్తుగా సెల్ ఫోన్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ తర్వాత రోజు నుండి నగరంలో ఉన్న సెల్ ఫోన్స్ అన్ని మాయమవుతూ ఉంటాయి. సెంట్రల్ హోమ్ మినిస్టర్ అత్యవసరంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాడు దానికి వశీ కరణ్ (రజినీ)హాజరవుతాడు. కట్ చేస్తే తన లేడీ రోబో అయిన వెన్నెల (అమీ జాక్సన్) తో కలిసి ఆరా తీస్తూ పోతే ఒక నెగెటివ్ ఎనర్జీ వశీకరన్ మీద దాడి చేస్తుంది. అంత నెగెటివ్ ఎనర్జీని తట్టుకోవాలంటే మళ్లీ "చిట్టి"ని యాక్టివేట్ చేస్తానంటాడు వశి కరణ్ దానికి హోంమినిస్టర్ ఒప్పుకోడు. కట్ చేస్తే ఒకరోజు పెద్ద సెల్ ఫోన్ కంపెనీ అధినేత, సర్వీస్ ప్రొవైడర్ ,టెలికాం మినిస్టర్ అంతుచిక్కకుండా చనిపోతారు. కట్ చేస్తే చివరకు హోమ్ మినిస్టర్ ఒప్పుకోవడంతో చిట్టిని రంగం లో దింపుతాడు వశి కరణ్. నెగటివ్ ఎనర్జీని ఎదుర్కొంటాడు. చివరకు ఆ నెగటివ్ ఎనర్జీ ప్రొఫెసర్ పక్షి రాజు అని తెలుస్తోంది. అసలు పక్షి రాజు ఎవరు? అతనికి నెగటివ్ ఎనర్జీ ఎందుకు వచ్చింది? సెల్ ఫోన్స్ కు పక్షిరాజు కు సంబంధం ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా వెండితెరపై చూడాల్సిందే........ విశ్లేషణ: మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. దాని వల్ల జరిగే నష్టాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వాతావరణం గురించి పట్టించుకోవటం లేదు. సెల్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వల్ల పక్షులకు ఇతర జీవరాసుల కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అవి లేకపోతే మనుషులు బ్రతకలేరు అని దర్శకుడు కథగా రాసుకున్నాడు. అయితే సినిమాలో ట్విస్టులు ఏం లేవు. ఒక వ్యక్తి మంచి వాతావరణం కోసం పాటు పడితే అది జరగకపోగ ఆ తర్వాత నెగిటివ్ ఎనర్జీ గా మారి ఏం చేశాడనేదే కథ. సినిమా ఎక్కడా బోర్ అనిపించదు.డైరెక్టర్ శంకర్ విజువల్ వండర్ గా ఈ సినిమాని తెరకెక్కించాడు. ముఖ్యంగా రజిని 4 షేడ్స్ పాత్రల్లో అవి వశి కరణ్, చిట్టి, వర్షన్ టు పాయింట్ జీరో (బ్యాడ్ చిట్టి), మరుగుజ్జు చిట్టి (3.0) నటించి మెప్పించాడు. ప్లస్ పాయింట్స్: *చిన్న పిల్లలు చూడదగ్గ సినిమా * రజనీ , అక్షయ్ కుమార్ ల నటన * బ్యాగ్రౌండ్ స్కోర్ * భారీ తనం మైనస్ పాయింట్స్: *శంకర్ డైరెక్షన్ లో గతంలో వచ్చిన చిత్రాల వలే ట్విస్ట్లు లేకపోవడం *కథ కథనం బలంగా లేకపోవడం *గ్రాఫిక్స్ లో ఎక్కువగా వాడటం *క్లైమాక్స్ తేల్చేయటం *ప్రొఫెసర్ పక్షిరాజు(నెగిటివ్ ఎనర్జీ) గా మారటం వెనుక కథ బలంగా లేకపోవటం
2.6k వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
#

రోబో 2.0

తుడిచి పెట్టుకుపోయిన బాహుబలి 2 రికార్డ్.. రజని 2.0మానియా! Telugu Filmibeat 22 Nov. 2018 17:55 సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన 2.0 చిత్రం విడుదలకు ముందే రికార్డుల వేట మొదలు పెట్టింది. కళ్ళు చెదిరే గ్రాఫిక్స్, ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలతో వినోదాన్ని పంచడానికి నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు వారం రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఆసక్తికరమైన పోస్టర్స్ విడుదల చేస్తూ ఈ చిత్రంలో గ్రాఫిక్స్ తీవ్రత ఎలా ఉంటాయో చెబుతున్నారు. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 2.0 చిత్రం కోసం అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తికతో ఎదురుచూస్తున్నారు. విడుదలకు ముందే 120 కోట్లు 2.0 చిత్రం మరే ఇండియన్ మూవీకి సాధ్యం కానీ రీతిలో విడుదలకు ముందే 120 కోట్లు రాబట్టేసింది. అడ్వాన్స్ బుకింగ్ రూపంలో విడుదలకు ముందే 100 కోట్లకు పైగా రాబట్టిన చిత్రంగా రజని 2.0 చరిత్ర సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా 2.0 భారీ స్థాయిలో విడుదలవుతుందని ట్రేడ్ విశ్లేషకులు ముందుగానే అంచనా వేశారు. అందుకు తగ్గట్లుగానే 2.0 మరో రికార్డ్ నెలకొల్పింది. బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ 2.0 చిత్రం దేశవ్యాప్తంగా 6800 స్క్రీన్స్‌లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. దీనితో 2.0 చిత్రం ఇండియాలో అత్యధిక థియేటర్స్‌లో విడుదలవుతున్న చిత్రంగా రికార్డు నెలకొల్పింది. గతంలో బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. బాహుబలి 2 చిత్రం ఇండియా మొత్తం 6500 స్క్రీన్స్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఊహకందని విధంగా ఓపెనింగ్స్ సూపర్ స్టార్ రజని, శంకర్ దర్శత్వం, అక్షయ్ కుమార్ విలక్షణ నటన.. ఇన్ని బలాలు ఉన్న 2.0 చిత్రం తొలి రోజు అదిరిపోయే ఓపెనింగ్స్ సొంతం చేసుకోవడం ఖాయం అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా 2.0 భారీ విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. దాదాపు 3000 మందికి పైగా టెక్నీషియన్లు ఈ చిత్రం కోసం పనిచేశారు. వాయిదాకు కారణం 2.0 చిత్రం గత ఏడాదే విడుదల కావాల్సింది. కానీ గ్రాఫిక్స్ రూపకల్పనలో జాప్యం జరగడంతో విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది. విజువల్ వండర్ గా రూపొందితున్న ఈ చిత్రానికి గ్రాఫిక్స్ చాలా కీలకం కావడంతో శంకర్ ఎక్కడా రాజీ పడలేదు. మంచి నాణ్యతతో గ్రాఫిక్స్ వచ్చే వరకు విశ్రమించలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ స్టంట్ డైరెక్టర్స్ ఈ చిత్రానికి పనిచేశారు. హాలీవుడ్ విఎఫ్ఎక్స్ సంస్థలు విజువల్స్ అందించాయి. రోబోతో సంబంధం లేదు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శంకర్ మాట్లాడుతూ ఆసక్తికర విషయం వెల్లడించాడు. కొన్ని ప్రధాన పాత్రలు మినహా రోబో చిత్రంతో 2.0కి ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తి భిన్నంగా ఉంటుందని శంకర్ తెలిపాడు. మొబైల్ ఫోన్ కు బానిస కావడం అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న అక్షయ్ కుమార్ పాత్ర రూపొందించినట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ విడుదల చేసే ప్రతి పోస్టర్ లో వికృత రూపంతో, శరీరం మొత్తం మొబైల్ ఫోన్స్‌తో అక్షయ్ కుమార్ కనిపిస్తున్నాడు.
769 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
#

రోబో 2.0

కొన్ని క్రేజీ కాంబినేష‌న్స్ సినిమాలంటే అంచ‌నాలే వేరుగా ఉంటాయి. సినిమా కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి క్రేజీ కాంబినేష‌న్‌లో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌.. డైరెక్ట‌ర్ శంక‌ర్‌ల‌ది. వీరి క‌ల‌యిక‌లో శివాజీ, రోబో చిత్రాలు మంచి విజ‌యాల‌ను సాధించాయి. ఇప్పుడు హాట్రిక్ ప్ర‌య‌త్నంగా రూపొందిన చిత్రం `2.0`. ఎనిమిదేళ్ల క్రితం.. 2010లో విడుద‌లైన రోబో సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన చిత్ర‌మిది. రోబోలో రెండు ర‌జ‌నీకాంత్‌ల‌కు మ‌ధ్య గొడ‌వ‌ను చూపించిన శంక‌ర్ ఈ సినిమాలో మ‌రో మెట్టు ఎక్కువ‌గా చూపించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఏకంగా బాలీవుడ్ స్టార్ అక్ష‌య్‌కుమార్‌ని విల‌న్‌గా పెట్టి.. ఓ మెసేజ్‌ను మిక్స్ చేసి ఈ సినిమాను తెర‌కెక్కించారు. సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత పెంచాయి. విజువ‌ల్ వండ‌ర్‌గానే కాదు.. ఇండియ‌న్ సినిమాల్లో ఇంత వ‌ర‌కు ఏ సినిమాకు పెట్ట‌ని బ‌డ్జెట్ 550 కోట్ల రూపాయ‌ల‌తో ఈ సినిమాను తెర‌కెక్కించారు. మ‌రి శంక‌ర్.. ర‌జ‌నీకాంత్‌ను తెర‌పై ఎలా ఆవిష్క‌రించాడు? అక్ష‌య్‌కుమార్ పాత్ర ఎలా ఉంది? విజువ‌ల్‌గా సినిమా ఆకట్టుకుందా? లేదా? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా క‌థేంటో చూద్దాం... బ్యాన‌ర్ : లైకా ప్రొడ‌క్ష‌న్స్ తారాగ‌ణం: ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, ఎమీజాక్స‌న్‌, సుధాంశు పాండే, అదిల్ హుస్సేన్‌, రియాజ్ ఖాన్ త‌దిత‌రులు సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌ ఎడిటింగ్‌: నిరవ్ షా ఆర్ట్‌: ముత్తురాజ్‌ కెమెరా: నిర‌వ్‌షా నిర్మాత‌: సుభాస్క‌ర‌న్‌ \ ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.శంక‌ర్‌ సెన్సార్‌: యు/ఎ వ్య‌వ‌ధి: 2గం.29ని. క‌థ‌: త‌మిళనాడు ద‌గ్గ‌ర ఓ ప్రాంతంలో ముస‌లి వ్య‌క్తి బాధ‌ప‌డుతూ వ‌చ్చి సెల్‌ఫోన్ ట‌వ‌ర్‌కు ఊరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు. ప‌క్క రోజు నుండి సెల్‌ఫోన్స్ మాయ‌మ‌వుతూ ఉంటాయి. ఎవ‌రి ద‌గ్గ‌రా సెల్‌ఫోన్సే ఉండ‌వు అన్నీ మాయ‌మ‌వుతూ ఉంటాయి. విష‌యం అర్థం కాక సెంట్ర‌ల్ హోం మినిష్ట‌ర్ సైంటిస్ట్ వ‌శీక‌ర‌ణ్‌(ర‌జ‌నీకాంత్‌)ని క‌లుస్తాడు. వ‌శీక‌ర‌ణ్, త‌న హ్యుమనాయిడ్ లేడీ రోబోట్ వెన్నెల‌(ఎమీజాక్స‌న్‌)తో క‌లిసి సెల్‌ఫోన్స్ ఏమ‌య్యాయ‌నే దానిపై ఆరా తీస్తూ పోతే ఓ నెగ‌టివ్ ఎన‌ర్జీ వ‌శీక‌ర‌ణ్‌పై దాడి చేస్తుంది. అలాంటి నెగ‌టివ్ ఎన‌ర్జీని త‌ట్టుకోవాలంటే సూప‌ర్ ప‌వ‌ర్ కావాల‌ని అందుకోసం చిట్టిని మ‌ళ్లీ యాక్టివేట్ చేస్తాన‌ని అంటాడు వ‌శీక‌ర‌ణ్‌. కానీ హోం మినిష్ట‌ర్ ఒప్పుకోడు. ఈలోపు పెద్ద సెల్‌ఫోన్ షాప్ య‌జ‌మాని, సెల్‌ఫోన్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్‌, టెక్నాల‌జీ మినిష్ట‌ర్ అంతు చిక్క‌కుండా చ‌నిపోతారు. చివ‌రర‌కు హోం మినిష్ట‌ర్ ఒప్పుకోవ‌డంతో చిట్టి రంగంలోకి దిగి అస‌లు ఆ నెగ‌టివ్ ఎన‌ర్జీని ఎదుర్కొంటాడు. చివ‌ర‌కు ఆ నెగటివ్ ఎనర్జీ ప్రొఫెస‌ర్ ప‌క్షిరాజు(అక్ష‌య్‌కుమార్) అని తెలుస్తుంది. అస‌లు ప‌క్షి రాజు ఎవ‌రు? అత‌నికి నెగ‌టివ్ ఎన‌ర్జీ ఎందుకు వ‌చ్చింది? సెల్‌ఫోన్స్‌కు, ప‌క్షిరాజుకు ఉన్న సంబంధం ఏంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.. ప్ల‌స్ పాయింట్స్‌: - న‌టీన‌టులు - బ్యాగ్రౌండ్ స్కోర్‌ - కెమెరా ప‌నిత‌న‌ - గ్రాఫిక్స్‌ - శంక‌ర్ టేకింగ్‌ మైన‌స్ పాయింట్స్‌: - కథ‌లో ట్విస్టులేం ఉండ‌వు. సాంకేతిక‌పై ఆధార ప‌డి తెరకెక్కించిన సినిమా. రోబో కంటే 2.0లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ పర్సెంట్ త‌క్కువే. స‌మీక్ష‌: సాంకేతికత పెరుగుతున్న కొద్ది మ‌నుషుల్లో అజాగ్ర‌త్త పెరిగిపోతుంది. ముఖ్యంగా వాతావ‌ర‌ణం గురించి ఎవ‌రూ పట్టించుకోవ‌డం లేదు. మ‌నిషికి టెక్నాల‌జీ ఎంతో అవ‌స‌రం. అయితే అది మ‌నిషికున్న క‌నీస అవ‌స‌రాల‌ను తీర్చేది.. వారి బాధ‌ల‌ను తొల‌గించేదిగా ఉండాలి. అలాగే ఈ భూప్ర‌పంచం కేవ‌లం మ‌నుషుల‌ది మాత్ర‌మే కాదు.. చాలా జీవిరాశులున్నాయి. వాటికి కూడా జీవించే ప‌రిస్థితుల‌ను మ‌న‌మే క‌ల్పించాలనే అంశాన్ని ద‌ర్శ‌కుడు ఓ క‌థ‌గా రాసుకున్నాడు. అయితే క‌థ‌లో పెద్ద‌గా ట్విస్టులేం లేవు. ఓ వ్య‌క్తి త‌ను ఓ మంచి కోసం పాటు ప‌డితే ఆ మంచి జ‌ర‌గ‌క‌పోగా వాతావ‌ర‌ణానికి న‌ష్టం క‌లుగుతుంటే అత‌నేం చేశాడ‌నేదే. అయితే దీనికి సాంకేతిక‌త‌ను జోడించి డైరెక్ట‌ర్ శంక‌ర్ ఎక్క‌డా బోర్ కొట్టించ‌కుండా తెర‌కెక్కించాడు. ర‌జ‌నీకాంత్ నాలుగు షేడ్స్‌.. వ‌శీక‌ర‌ణ్‌.. చిట్టి, వెర్ష‌న్ 2.0(బ్యాడ్ చిట్టి)..తో పాటు యూనిట్ దాచిన సీక్రెట్ ఏంటంటే వెర్ష‌న్ 3.0లోని మ‌రుగుజ్జు చిట్టి వెర్ష‌న్ 3.0 పాత్ర‌ల్లో ర‌జ‌నీకాంత్ చ‌క్క‌గా న‌టించాడు. ఫ‌స్టాఫ్ అంతా వ‌శీక‌ర‌ణ్‌, వెన్నెలగా న‌టించిన ఎమీజాక్స‌న్‌, చిట్టిరోబో... చుట్టూనే తిరుగుతుంది. సెంక‌డాఫ్‌లో బ్యాడ్ చిట్టి అవ‌స‌రం ఉండంతో 2.0 వెర్ష‌న్‌ను రీలోడ్ చేయ‌డం.. అది పక్షిరాజుతో చేసే పోరాటంతో సాగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా బావుంది. గ్రాపిక్స్ సినిమాలో కీ రోల్ పోషించాయి. ఓ ర‌కంగా టెక్నిక‌ల్ విజువ‌ల్ వండ‌ర్‌గా సినిమా మెప్పిస్తుంద‌నండంలో సందేహం లేదు. రెహమాన్‌, ర‌సూల్ పూకుట్టి బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు మ‌రింత బ‌లాన్నివ్వ‌గా.. నిర‌వ్‌షా మ‌రింత అద్భుతంగా సినిమాను తెర‌కెక్కించాడు. ఆర్ట్ వ‌ర్క్ బావుంది. ముఖ్యంగా ల్యాబ్ సెట్ బావుంది. అక్ష‌య్‌కుమార్ ఎన్‌త్రాల‌జీ ప్రొఫెస‌ర్‌గా.. చివ‌ర‌కు నెగ‌టివ్ ఎనర్జీ ఉన్న ప‌క్షిరాజుగా మెప్పించాడు. ముఖ్యంగా ఈసినిమాలో ర‌జ‌నీకాంత్ కంటే అక్ష‌య్‌కుమార్‌కే ఎక్కువ క‌ష్టం ఉంది. ఎందుకంటే అత‌ను వేసుకున్న మేక‌ప్ ఆసాధారణంగా ఉంటుంది. లేడీ హ్య‌మ‌నాయిడ్ రోబోట్‌గా ఎమీజాక్స‌న్ పాత్ర ప‌రిధి మేర బావుంది. ఈ పాత్ర అక్క‌డ‌క్క‌డా చెప్పే సీరియ‌ల్‌, సినిమా డైలాగ్స్ కాస్త ఎంట‌ర్‌టైనింగ్ వేలో ఉంటాయి. యాక్ష‌న్ పార్ట్ బావుంది. కొత్త క‌థేం కాక‌పోయినా.. అస‌లు ఓ మ‌నిషి ఓరా నెగ‌టివ్ ఎన‌ర్జీగా ఎలా మారుతుంద‌నే అంశాన్ని శంక‌ర్ లాజిక‌ల్‌గా చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. ఆ ప‌వ‌ర్‌ను న్యూట్ర‌లైజ్ చేయ‌డం.. చివ‌ర‌కు అది త‌ప్పించుకుని బ‌య‌ట‌కు రాగానే.. చిట్టి వెర్ష‌న్ 2.0 దాంతో స్టేడియంలో చేసే ఫైట్ అంతా బావుంది. ఇలాంటి సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు శంక‌ర్ అభినంద‌నీయుడు అయితే.. 550 కోట్లు ఖ‌ర్చు పెట్టి సినిమాను నిర్మించిన నిర్మాత‌ల‌ను అభినందించాల్సిందే. చివ‌ర‌గా.. 2.0.. మెసేజ్ క‌ల‌గ‌లిసిన విజువ‌ల్ వండ‌ర్
702 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
మరిన్ని పోస్ట్‌లు లేవు
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post