🌹మంగళంపల్లి బాలమురళీకృష్ణ వర్ధంతి 🌹🌷

🌹మంగళంపల్లి బాలమురళీకృష్ణ వర్ధంతి 🌹🌷

#

🌹మంగళంపల్లి బాలమురళీకృష్ణ వర్ధంతి 🌹🌷

🇮🇳🙏 chittithalli🙏🇮🇳
#🌹మంగళంపల్లి బాలమురళీకృష్ణ వర్ధంతి 🌹🌷 #🌹మంగళంపల్లి బాలమురళీకృష్ణ వర్ధంతి 🌹🌷 #🆕📰తాజావార్తలు #😎సరిలేరు నీకెవ్వరూ టీజర్ #👯‍♀️ స్నేహితుల అడ్డా #👫 బంధం
182 వీక్షించారు
3 నెలల క్రితం
#🌹మంగళంపల్లి బాలమురళీకృష్ణ వర్ధంతి 🌹🌷 మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి వర్ద౦తి నేడు. చెన్నై: ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 22 11 2016 లో(86)కన్నుమూశారు. బాలమురళీకృష్ణ చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. బాలమురళీకృష్ణ 1930 జులై 6న తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో పట్టాభి సీతారామయ్య, సూర్యకాంతం దంపతులకు జన్మించారు. ఆరేళ్ల వయసులో సంగీత ప్రస్థానం.. బాలమురళీ కృష్ణ ఆరేళ్ల వయసులో గాయకుడిగా సంగీత ప్రస్థానం ప్రారంభించారు. బాలమురళీ కృష్ణ తండ్రి పట్టాభిరామయ్య వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా 25వేల కచేరీలు నిర్వహించారు. వయోలిన్, వీణ, మృదంగం తదితర సంగీత వాయిద్యాల్లో బాలమురళీ కృష్ణకు ప్రావీణ్యం ఉంది. జుగల్బందీ తరహా కచేరీ రూపకల్పనకు మంగళంపల్లి ఆద్యుడు. ఆయన టీటీడీ, శృంగేరి పీఠాల ఆస్థాన విద్వాంసుడు. విదేశాల్లో వేల సంఖ్యలో కచేరీలు.. మంగళంపల్లి బాలమురళీకృష్ణ అమెరికా, కెనడా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, శ్రీలంక, మలేసియా, సింగపూర్ దేశాల్లో వేల సంఖ్యలో కచేరీలు నిర్వహించారు. తెలుగు, కన్నడం, సంస్కృతం, తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో పాటలు పాడారు. ఆయన భక్తప్రహ్లాదలో నారదునిగా నటించి తన పాటను తానే పాడటం విశేషం. గంధర్వగాన సామ్రాట్, జ్ఞానసాగర, సంగీత కళానిధి, గాన కౌస్తుభ, గాన కళాభూషణం, గానగంధర్వ, గాయక శిఖామణి, జ్ఞానశిఖామణి, జ్ఞాన చక్రవర్తి, జ్ఞానపద్మం, నాదజ్యోతి, సంగీత కళాసరస్వతి, నాద మహర్షి వంటి ఎన్నో బిరుదులు ఆయన సొంతం. బాలమురళీకృష్ణ ఎన్నో విశ్వవిద్యాలయాల నుంచి గౌరవడాక్టరేట్లు అందుకున్నారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్ జాతీయ పురస్కారాలను అందుకున్నారు.మహతి, సుముఖం, సర్వశ్రీ, ప్రతిమధ్యమావతి, గణపతి, సిద్దిరాగాలు, భద్రాద్రి శ్రీరామ చంద్రుని సుప్రభాతాన్ని ఆయన ఆలపించారు.
#

🌹మంగళంపల్లి బాలమురళీకృష్ణ వర్ధంతి 🌹🌷

🌹మంగళంపల్లి బాలమురళీకృష్ణ వర్ధంతి 🌹🌷 - uy Pallavi SO OD MIN - ShareChat
2.2k వీక్షించారు
3 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post