కరుణామయా. ....ఓ యేసయ్య
#

కరుణామయా. ....ఓ యేసయ్య

Today's Prophecy || ఈ రోజు ప్రవచనము Grace! Grace! Grace unto you! Sinner shall become a saint in Christ. Weak shall become strong in Christ. Poor shall become a rich in Christ. Victim shall become a Victor in Christ. Whatever your condition may be now you shall become what God says that you become. Meditate: Jh 1:16, 2 Cor 12:9, Gal 6:18, 1 Cor 1:2, Phil 1:1, 2 Cor 12:9-10, 3 Jh 1:2, 2 Cor 8:9, 1 Cor 15:56-57, 2 Cor 5:17, Eph 1:3-7. కృప! కృప! నీకు కృప కలుగును గాక! పాపి క్రీస్తు నందు పరిశుద్ధుడు యగును. బలహీనుడు క్రీస్తు నందు బలవంతుడగును. బీదవాడు క్రీస్తునందు ధనవంతుడగును. బాధితుడు క్రీస్తు నందు విజేతయగును. ప్రస్తుతము నీ యొక్క స్థితి ఏది అయినను నీవు ఏమి అయ్యేదవని దేవుడు సెలవిచ్చి యున్నాడో నీవు ఆ విధముగానే అయ్యెదవు. ధ్యానించుడి: యోహా 1:16, 2 కొరి 12:9, గల 6:18, 1 కొరి 1:2, ఫిలి 1:1, 2 కొరి 12:9-10, 3 యోహా 1:2, 2 కొరి 8:9, 1 కొరి 15:56-57, 2 కొరి 5:17, ఎఫె 1:3-7. Say I am a saint..
126 వీక్షించారు
5 నెలల క్రితం
#

కరుణామయా. ....ఓ యేసయ్య

💐💐దేవుడు మనిషిలా చూడడు💐💐 👉👉“ మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు . . . మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును . ” 1సమూ . 16 : 7 . . 👍👍 👂ఒక మనిషి ఇంకో మనిషిలో లోపాలు మాత్రమే చూస్తాడు . కాని దేవుడు మాత్రం ఒక మనిషిలో కొంచెమైనా నీతి నిజాయితి ఉన్నాయా అని పరిశీలిస్తాడు . ఒక తెల్ల పేపరు తీసుకొని దాని మీద మధ్యలో నల్ల పెన్నుతో ఒక చిన్న చుక్క పెట్టి , ఎవరికైనా చూపించి , దీనిలో నీకేమి కనబడుతుంది అని అడిగితే , నల్ల మచ్చ కనబడుతుందని ఠక్కున చెప్పేస్తారు . నువ్వెంత నీతి నిజాయితీగా ఉన్నా , ఏదైనా చిన్న పొరపాటు చేస్తే మాత్రం , నీ మొత్తం నీతి నిజాయితీని పక్కన పెట్టి నువ్వు చేసిన చిన్న పొరపాటుని పదే పదే ఎత్తి చూపిస్తారు . కానీ దేవుడు మాత్రం నిన్ను రక్షించటానికి నువ్వు ఎంత ఘోరపాపివైనా సరే , నీలో లేశమాత్రమైనా నీతి నిజాయితి ఉంటే మాత్రం దేవుడు నిన్ను తప్పక రక్షిస్తాడు . దేవుడు . సొదొమ గొమొఱ్ఱ పట్టణాలను నాశనం చేయడానికి ముందు అబ్రాహాముతో మాట్లాడేటప్పుడు అక్కడ పదిమంది నీతిమంతులున్నా సరే ఆ పట్టణాలను నాశనం చేయనని చెప్పటం మనం గమనించగలం . మన యొక్క నీతి నిజాయితి దేవునికి మాత్రమే తెలుసు . దేవుని నమ్మటం నీతి , దేవుని మీద ఆధారపడటం నిజాయితి . ఈ రెండూ దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటున్నాడు . హృదయాలను పరిశీలించే దేవున్ని మనం మోసం చేయలేము కాబట్టి దేవున్ని హృదయపూర్వకంగా నమ్మి , దేవునిపై ఆధారపడి నీతి నిజాయితీతో జీవిద్దాం .💖💖💖 👉👉ప్రార్ధన::; ప్రభువా , మేము ఈ లోకంలో ఉన్నంత కాలం నీతి నిజాయితీతో జీవించేలాగున సహాయం దయచేయయ్యా . మా జీవితకాలమంతా నిన్ను హృదయపూర్వకంగా నమ్మి , నీ మీదనే ఆధారపడి జీవించేలాగున సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి .🙌🙌🙌 ఆమేన్ .
118 వీక్షించారు
11 నెలల క్రితం
#

కరుణామయా. ....ఓ యేసయ్య

💐💐చింతింపకుడి 💐💐 “ మీలోనెవడు చింతించుట వలన తన యెత్తు మూరేడెక్కువ చేసిన గలడు ? ” మత్తయి 6 : 27 . 👉మీలో ఎవరైనా చింతిస్తూ ఉండటం వలన తన యెత్తు మూరెడు ఎక్కువ చేసికోలేడు కదా ! అంటే చింతించటం వలన ఎలాంటి ఉపయోగం లేదు అని అర్ధము . చింత అనేది భయం వలన కలుగుతుంది . రేపటిని గూర్చి చింతింపకుడి అని యేసుప్రభువు చెప్పాడు . భవిష్యత్ గురించి చింతించని వారు ఎవరూ వుండరు . సాతాను దగ్గర ఉన్న పెద్ద ఆయుధం భయపెట్టడం . ప్రతి ఒక్కరికి భవిష్యతని చూపించి భయపెడుతుంది ఎలా బ్రతుకుతావు ? అని . ప్రతి ఒక్కరినీ నిరుత్సాహపరుస్తూ దేవునికి దూరం చేస్తుంటుంది . అందుకే ప్రతి ఒక్కరూ భవిష్యత్ గురించి చింతిస్తుంటారు . అయితే 1పేతురు 5 : 7లో “ ఆయన ( యేసు ) మీ గురించి చింతించు చున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ” అని వ్రాయబడియున్నది . కాబట్టి యేసుప్రభువు మన గురించి చింతించు చున్నాడు . మానవులుగా మనం అనేక రకాల సమస్యలతో ప్రతిదినము చింతిస్తుంటాము . కుటుంబంలోని వ్యక్తుల గురించి , ఉద్యోగ వ్యాపారాల గురించి , మనం చింతించుట వలన మనకు మనం ఏ మేలు చేసికొనలేము . మనం ఏర్పరచుకొనే తంత్రముల మనకు వచ్చే కష్టాలను చూచి ప్రభువు మన కొరకు చింతిస్తున్నాడు . ప్రభువు మన కొరకు ఏమైనా చేయగలడు గనుక మన చింత యవత ఆయన మీద వేయవచ్చు . దేవున్ని హృదయపూర్వకముగా నమ్మేవారు ఎవరూ ఏ విషయమై చింతింపరు . 👍👍👍 🙌🙌ప్రార్ధన::-ప్రభువా , మేము ఈ లోకంలో ఉన్నంత కాలం ఏ విషయమై చింతింపక , మా చింత యావత్తు నీ మీద వేసి నిశ్చింతగా ఉండేలాగున మాకు శక్తి దయచేయండి . సాతాను కుతంత్రాల నుండి మమ్ము దూరపరచండి . నిత్యము మీద ఆధారపడేలాగున సహాయపడమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి . ఆమేన్ .💖💖
142 వీక్షించారు
11 నెలల క్రితం
#

కరుణామయా. ....ఓ యేసయ్య

💐💐ఇంతేగదా దేవుడు నిన్ను అడిగేది 💐💐 “ న్యాయముగా నడుచుకొనుటయు , కనికరమును ప్రేమించుటయు , దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు , ఇంతేగదా దేవుడు నిన్నడుగుచున్నాడు ” ( మీకా 6 : 8 ) . | 👉👉 ఎవరైనా దేవున్ని గొంతెమ్మ కోరికలు కోరటం మనకు తెలుసు . మనుష్యులు దేవునికి ఎందుకు ప్రార్ధన చేస్తారు ? ఏమని ప్రార్ధన చేస్తారు ? ప్రార్ధన మొదలు పెట్టిన దగ్గర్నుండి ముగించే వరకు అన్నీ అడగటమే . అసలు ప్రార్ధన అంటే అడగటమే అనుకుంటారు చాలామంది . అదీకాక బైబిల్ లో ఉంది కదా!! ‘ అడుగుడి మీకు ఇవ్వబడును ' అని వాదిస్తారు . నాకు తెలిసిన ఒక పాస్టరు దేవున్ని 100 కోట్ల రూపాయలు ఇవ్వమని ప్రార్ధన చేయటం నేను విన్నాను . అసలు మనం దేవున్ని ఏమి అడగొచ్చో , ఏమి అడగకూడదో మనకు తెలియదు . ఇశ్రాయేలీయులు రాజు కావాలని , సొలొమోను జ్ఞానము కావాలని దేవున్ని అడిగి , పొందిన దాని వలన వారు ఏం ప్రయోజనం పొందలేదు . అసలు మనం అడగక మునుపే మన అక్కరలను ఎరిగిన దేవున్ని ఏమి అడగాలి ? ఇదంతా మానవులుగా మనకుండే కోరికల ప్రభావమే . అయితే దేవుడు కూడా అడుగుతున్నాడు . మనుష్యుల నుండి ఆయన ఏమి కోరుకుంటున్నాడు . దేవుడు మనుష్యులను కోరే దాని వలన మనుష్యులకే మేలు కలుగుతుంది . న్యాయముగా నడుకోమని , కనికరము , దీనమనస్సు కలిగి ఉండమని కోరుతున్నాడు . వీటి వలన మనుష్యుల మధ్య సఖ్యత కలిగి ఒకరినొకరు ప్రేమించు కోవాలన్న ఉద్దేశ్యమే . ఇదే దేవుడు మన నుండి కోరుకొనేది . మరి మనం ఈ నూతన సంవత్సరం నుండి అయినా దేవుడు మనల్ని అడిగిన దాని ప్రకారం నడుచుకుందాము . 🙌🙌🙌ప్రార్ధన::- ప్రభువా , మేము ఈ లోకంలో న్యాయముగా నడచుకొనుటకు , దీనమనస్సు కలిగి ఒకరినొకరము ప్రేమించుకొనే మనస్సు మాకు దయచేయుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రీ , ఆమేన్ .!!💖
157 వీక్షించారు
11 నెలల క్రితం
#

కరుణామయా. ....ఓ యేసయ్య

💐గర్వించుటకు మనకు హేతువు లేదు!!!💐 ఎందుకనగా;👉👉👉 1. మనము వేరకొరిచేత సృష్టింపబడినవారము . నిస్సహాయ శిశువులవలె మనమొట్చాము.ఆ విషయములో మన ప్రమేయము లేదు . స్త్రీగా లేక పురుషునిగా జన్మించే నిర్ణయము మనది కాదు . బలహీనులముగా లేక బలవంతులుగా నిర్మించబడే నిర్ణయము మనది కాదు ( కీర్తన 100 : 3 ; 1 కొరింథీ 6 : 19 - 20 ; యోబు 38 : 4 ) .👍 2. మార్చుకోలేని పాప స్వభావము గలవారము ( యిర్మియా 13 : 23 . వీరన 39 : 5 ; యెషయా 64 : 6 ) . మనలో నీతి అంటూ ఏమైనా ఉంటే అది దేవుని వలన కలిగినదే . మనలో పుట్టినది మంచిది ఏమీ లేదు ( రోమా 7 : 18 - 21 ) . 👍 3 . దేవుడు అనుగ్రహించినది తప్ప మనలో సామర్థ్యము లేక శక్తి ఏమీ లేదు . సర్వ సామర్థ్యము - శారీరక , మానసిక లేక ఆధ్యాత్మికమైనవి దేవుని వలన మాత్రమే కలిగినవి ( ద్వితి 8 : 18 ; 1 కొరింథీ 4 : 7 ; యోహాను 3 : 27 ) . తనంతట తాను దేనిని మనుష్యుడు చేయలేడు . 👍 4 . మన గమ్యము మన చేతులలో లేదు . మనల్ని మనము నడిపించుకోలేము ( యిర్మియా 10 : 23 , యాకోబు 4 : 13 - 16 ; ప్రసంగి 8 : 8 ) . రేపు అనేది మానవుని చేతిలో లేదు . అంతేగాక తన్నుతాను గ్రహించుకోలేడు . తన నిజ అవసరతల కొరకైన సమాధానములు తనయొద్దలేవు . కాబట్టి ఒక మనుష్యుడు గర్వించినప్పుడు తన్నుతాను మభ్యపెట్టుకొనుచున్నాడు . మోసగించబడిన స్థితిలో తానున్నాడు . కాబట్టి తలంచ గలిగిన స్థితికంటే ఎక్కువగా తనను గూర్చి తాను తలంచవద్దని పౌలు హెచ్చరిస్తున్నాడు మన సొంత తెలివితేటలను బట్టి జ్ఞానులమని తలంచరాదని కూడా సెలవిస్తున్నాడు..👍👍🙌🙌💖💖
125 వీక్షించారు
11 నెలల క్రితం
మరిన్ని పోస్ట్‌లు లేవు
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post