ఆధ్యాత్మిక జ్ఞానామృతం
16K Posts • 24M views
మహాలయ అమావాస్య : కన్నవారిని కాదన్న వారిని పరమేశ్వరుడు కూడా ఇష్టపడడు. భగవంతుడి కన్నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అధిక ప్రాధాన్యమివ్వాలి. అందుకే పితృదేవతలను అర్చించి, వారికి ఉత్తమగతులు కలిగేలా మనిషిని ధర్మదీక్షాబద్ధుడిని చేసేందుకు కొన్ని నియమాలను మన శాస్త్రాలు విధించాయి. భాద్రపదమాసంలో బహుళ పక్షాన్ని (పూర్ణిమ తర్వాత వచ్చే పాడ్యమి నుంచి అమావాస్య వరకు పదిహేను రోజుల కాలం) పితృపక్షం అంటారు. ఈ కాలం పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైంది. పితృపక్షంలో అన్ని వర్ణాల వారూ గతించిన తమ పితృదేవతలను తలుచుకుంటూ శ్రాద్ధవిధులను తప్పక నిర్వహించాలి. పితృపక్షం పుణ్యకార్యాలు చేయటానికి మంచిది కాదు. పితృపక్షంలోని పదిహేను రోజులు పితృదేవతలకు సంబంధించిన శ్రాద్ధకర్మలు చేసేందుకు అత్యుత్తమమైనవి. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు గతించిన తర్వాత కూడా వారిని స్మరిస్తూ, వారికి అనంత పుణ్యలోకాలు ప్రాప్తించటానికి చేసే క్రతువు ఇది. వ్యాకరణ పరిభాష ప్రకారం శ్రాద్ధకర్మ అంటే శ్రద్ధతో చేసే కర్మ (పని) అని అర్థం. అంటే అత్యంత శ్రద్ధాభక్తులతో ఎవరి తల్లిదండ్రులకు వారు చేసే క్రియ ఇది. ఇక్కడ క్రియ లేదా ఆచారం కన్నా శ్రద్ధ, విశ్వాసం ముఖ్యం. #📰సెప్టెంబర్ 21st అప్‌డేట్స్📣 #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #⚫మహాలయ అమావాస్య : ఇలా చేయండి..అన్ని కలిసి వస్తాయి #✌️నేటి నా స్టేటస్
8 likes
9 shares
*పితృ దేవతా స్తుతి* *బృహద్ధర్మపురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి* *(21-09-2025 మహాలయ అమావాస్య సందర్భంగా)* ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజూ ఎవరు చదువుతారో వారికి ఈతిబాధలు ఉండవు♪. ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పుచేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రము చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతేకాక పితృదేవతలు చదివినవారిని అనుగ్రహిస్తారు. దీనిని ఎవరైతే వారి పుట్టిన రోజునాడు తండ్రికి నమస్కరించి వారి వద్ద చదువుతారో వారికి పితరుల అనుగ్రహం లభిస్తుంది. *బ్రహ్మఉవాచ:* *నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ!*_ *సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే* ఎవరివలన ఈ జన్మవచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో, ఎవరి ఆశీస్సులవల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు *సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే!* *సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ*_ సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమాన మైనవారు సకల పుణ్యతీర్ధములకు ఆలవాలమైన కరుణా సముద్రులైన పితరులకు నమస్కారములు *నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః* *సదా౬పరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ!!* సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించేవారైన శివ రూపులకు నమస్కారము. ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసే పితరులకు నమస్కారములు. *దుర్లభం మానుషమిదం యేనలబ్ధం మాయా వపుః!* *సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః!!* ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరి వలన లభించినదో ఆ పితృదేవతలకు నమస్కారములు♪. *తీర్ధస్నాన తపో హోమ జపాదీన్ యస్య దర్శనం!* *మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః* ఎవరిని చూసినంతనే అనేక తీర్థస్నానములు, తపస్సులు, హోమాలు, జపములు చేసిన ఫలితం కలుగునో మహా గురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు♪. *యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం!* *అశ్వమేధ శతైః తుల్యం తస్మై పిత్రే నమో నమః!!*_ ఎవరిని నమస్కరించినా, తర్పణాదులు చేసినా అవి వందల కొలది అశ్వమేధ యాగములతో సమానమో అటువంటి పితరులకు నమస్కారములు *ఫలశృతి:* _*ఇదం స్తోత్రం పితృః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః*_ _*ప్రత్యహం ప్రాతురుత్థాయ పితృశ్రాద్ధదినోపి చ*_ _*స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపివా*_ _*న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాది వాంఛితం*_ _*నానాపకర్మకృత్వాపి యఃస్తౌతి పితరం సుతః*_ _*సధృవం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీభవేత్*_ _*పితృప్రీతికరైర్నిత్యం సర్వకర్మాణ్యధార్హతి* #⚫మహాలయ అమావాస్య : ఇలా చేయండి..అన్ని కలిసి వస్తాయి #📰సెప్టెంబర్ 21st అప్‌డేట్స్📣 #ఆధ్యాత్మిక జ్ఞానామృతం
10 likes
3 shares