లవ్
#

లవ్

సాయిబాబా నీ పాదాల👣🕉️సాక్షిగా🔥 నా మాటలని నిశబ్దంగా బంధించా💝 నా ఈ బాధ నా కంటి నుండి మౌనంగా జారుతున్న ప్రతీ కన్నీటి బొట్టుకి తెలుసు... సాయి !నీకు తెలుసు నా ప్రేమేంటో నేను అనుభవిస్తున్న ఈ బాధ ఎంతో! 😢ఎందుకు సాయి నాకు ఇంత శిక్ష విధించావు...హా? ఒకటిగా కలిపి ఉంచలేనప్పుడు ఒకటిగా కలపడం ఎందుకు??? ఇంత ప్రేమని జీవితాంతం నిలపలేనప్పుడు అంత ప్రేమని రుచి చూపించడం ఎందుకు??? నాది అనుకున్న ప్రేమని నా సొంతం అనుకున్న హృదయాన్ని నాకు మాత్రమే సొంతం అనుకున్న నా ప్రాణాన్ని తీసుకెళ్లి నీవు మరొకరికి ఇస్తోంటే చూస్తూ నేను ఎలా భరించగలను సాయి 😢 నీకు తెలియదా ఆ బాధ ఎలా ఉంటుందో! అణుక్షణం తన ప్రేమే ప్రాణంగా అతనే నా లోకంగా జీవించినందుకు నువ్వు నాకిచ్చిన ఫలితం ఇదా... ప్రతీ ఆటలో ప్రతీ పనిలో ప్రతీ విషయంలో నను గెలిపించిన నువ్వు... ఈ బంధం విషయంలో మాత్రం ఎందుకు ఓడించావ్??? నీకు తెలియదా అది నా జీవితమని నీకు తెలియదా నా జీవితాన్ని మరొకరికి ఇస్తే నేను తట్టుకోలేనని😢 నీకు తెలియదా నా హృదయం ఈ బాధని తట్టుకోలేదని💔 ఎవర్ని నిందించగలను ఈ బంధం నాకు వేస్తున్న శిక్షకి నిన్ను తప్ప😢 సాయినాధ నిన్ను ఆరాధనగా తలిచే ఈ హృదయంతోనే గా తనని కూడా ఆరాధించా! మరెందుకు ఇంత బాధని మిగిల్చావ్ నా హృదయానికి😢 ఈ కన్నీటిని నీకు తప్ప ఎవ్వరికీ చూపించలేను... నా ఈ బాధని నీకు తప్ప ఎవ్వరికీ చెప్పుకోలేను... నువ్వు తప్ప నాకూ ఎవ్వరూ లేరు సాయిబాబా నిన్ను నిత్యం నా హృదయంలో నిలుపుకుంటాను నా ప్రేమ లాగే💝నీవు నా ప్రేమని దూరం చేశావు... తను నా ప్రాణాన్ని దూరం చేస్తున్నాడు... ఈ దూరం ఎంత భారంగా ఉందో చెప్పాలెనూ బాబా😢 ఓం సాయి రాంॐॐॐ #లవ్ #💕✍🏼 ప్రేమ కవితలు/కోట్స్
180 వీక్షించారు
8 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post