వైఎస్ వివేకానందరెడ్డి హత్య
#

వైఎస్ వివేకానందరెడ్డి హత్య

కడప జిల్లా... వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన భార్య సౌభాగ్యమ్మ వేసిన పిటీషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఏపీ పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని సౌభాగ్యమ్మ పిటీషన్‌లో వివరించారు. ఈ పిటీషన్‌తో పాటు వివేకా హత్యపై గతంలో దాఖలైన పిటీషన్లపై నేడు విచారించే అవకాశం ఉంది. వివేకా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.   సిట్ పోలీసులు ఈ కేసును ఓ సవాలుగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకూ 62 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. హత్య జరిగిన రోజు తొలుత హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి కొన్ని సాక్ష్యాలను తారుమారు చేశారని పోలీసులకు సమాచారం అందటంతో ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
150 వీక్షించారు
11 నెలల క్రితం
#

వైఎస్ వివేకానందరెడ్డి హత్య

వైఎస్ వివేక హత్య కేసును అలా వాడుకోబోతున్నారా! Mar 23, 2019 😳🙄😂 వైఎస్ వివేకాన్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఇప్పటికే ఒక వారం గడిచింది. అయితే ఇప్పటికీ ఈ కేసులో పోలీసులు తేల్చింది ఏమీ లేదు. ఇదొక మర్డర్ అని స్పష్టం అవుతోంది. హతం అయినది ఒక మాజీ ఎంపీ! మాజీ మంత్రి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కు బాబాయ్ ఆయన. అలాంటి వ్యక్తి హతం అయితే… ఈ కేసు విచారణను పోలీసులు ఎంతకూ తెమల్చడం లేదు. పైగా ఈ కేసులో విచారణకు అని సిట్ నియామకం అయ్యింది! ఒక ప్రముఖుడు దారుణంగా హత్యకు గురి అయితే..ఇప్పటి వరకూ ఈ కేసులో ఏమీ తేల్చలేకపోవడం విచారణ అధికారుల వైఫల్యం అని అనడానికి వెనుకాడనక్కర్లేదు. హత్యకు గురి అయ్యింది ఏ గుర్తు తెలియని వ్యక్తో అయితే.. పూర్వా పరాలను తేల్చడానికి సమయం తీసుకుంటుంది. ఒక ప్రముఖుడు హత్యకు గురి అయితే విచారణ కోసం ప్రత్యేకంగా సిట్ ఏర్పడి కూడా ఏమీ తేల్చడం లేదంటే.. లోలోపల ఏదో జరుగుతోందనే అనుమానాలకు తావిచ్చినట్టే అవుతుంది. ఇప్పుడు ఆ అనుమానాలనే వ్యక్తం చేస్తూ ఉన్నారు వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబీకులు. ఈ విషయంలో వైఎస్ వివేక కూతురు వైఎస్ సునీత స్పందిస్తూ.. సిట్ విచారణ పారదర్శకంగా లేదని అన్నారు. ఈ కేసులో విచారణను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రభావితం చేస్తున్నారనే అనుమానాలను ఆమె వ్యక్తీకరించారు. అంతే కాదు.. ఈ హత్య కేసులో తమ కుటుంబీకులను నిందితులుగా చేర్చేందుకు కూడా కుట్ర జరుగుతోందని ఆమె అన్నారు. తన తండ్రి హత్యపై పారదర్శకమైన విచారణ జరగకపోగా.. తన కుటుంబీకులనే కార్నర్ చేసేలా విచారణ జరుగుతూ ఉండటాన్ని ఆమె తీవ్రంగా తప్పు పడుతూ ఉన్నారు. ఇక ఇదే సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. తన చిన్నాన్న వివేకను హత్య చేసిన వారు ఇప్పుడు తన కుటుంబీకుల మీద కూడా కక్షకు దిగుతున్నారని వారిని నిర్భందించి కడప ఎంపీ సీటును నెగ్గాలని ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారని జగన్ వ్యాఖ్యానించారు. వారిని నిర్భందించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అస్థిర పరిచి అల్లర్లను రెచ్చగొట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై హింసాత్మక ముద్రను వేయాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారని జగన్ అంటున్నారు.ఈ కేసులో రానున్న రెండు మూడు రోజుల్లో కీలకమైన పరిణామాలు సంభవించవచ్చు.. తీవ్రమైన కుట్రలను చంద్రబాబు నాయుడు అమలు చేయవచ్చు అని కూడా జగన్ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏం జరిగినా.. సంయమనంగా ఉండాలని కుట్రలను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని జగన్ తన పార్టీ శ్రేణులకు సందేశం ఇచ్చారు. వివేకానందరెడ్డి హత్యను చేయించిన వాళ్లే ఇప్పుడు దాన్ని వైఎస్ కుటుంబీకుల మీదకు నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అధికారాన్ని అడ్డం పెట్టుకుని హత్య చేయించిన వాళ్లకు ఈ కుట్ర కష్టం కావడం లేదని.. తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని.. సంయమనం కోల్పోవద్దని పులివెందుల వేదికగా జగన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ కేసు విచారణలో ఇప్పటి వరకూ మిస్టరీగానే సాగుతున్న విచారణలో ఇంకా ఎన్ని విడ్డూరాలు చోటు చేసుకుంటాయనే అంశం గురించి చర్చ జరుగుతోంది.
188 వీక్షించారు
11 నెలల క్రితం
#

వైఎస్ వివేకానందరెడ్డి హత్య

💕🆂🅁🅰🆅🅰🅝🅸💕~{32.5k✔ followers +}🎸🌷🎸
#వైఎస్ వివేకానందరెడ్డి హత్య it's true
193 వీక్షించారు
11 నెలల క్రితం
#

వైఎస్ వివేకానందరెడ్డి హత్య

💕🆂🅁🅰🆅🅰🅝🅸💕~{32.5k✔ followers +}🎸🌷🎸
#వైఎస్ వివేకానందరెడ్డి హత్య
445 వీక్షించారు
11 నెలల క్రితం
#

వైఎస్ వివేకానందరెడ్డి హత్య

424 వీక్షించారు
11 నెలల క్రితం
#

వైఎస్ వివేకా నందరెడ్డి కన్నుమూత

1.1k వీక్షించారు
11 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post