Failed to fetch language order
Failed to fetch language order
గానుగపూర్ శ్రీ దత్త పాదుకలు
2 Posts • 148 views
PSV APPARAO
580 views 16 days ago
#🛕గాణగాపూర్ శ్రీ దత్తాత్రేయ స్వామి🕉️ #దత్తాత్రేయ స్వామి ఆలయం. గానుగ పురం. కర్ణాటక #శ్రీ దత్త దివ్య క్షేత్రాలు: శ్రీ నృసింహ సరస్వతి స్వామి క్షేత్రం గానుగపూర్ (కర్ణాటక) 🙏 #గానుగపూర్ శ్రీ దత్త పాదుకలు గాణగాపురంలో శ్రీగురిని దర్శనం.......!! శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దర్శనం మనం చేయాలి అనుకుంటే చేసుకోలేమట, ఆయన దర్శనం నామ స్మరణం అన్నీ ఆయన అనుగ్రహాలేనట, ఈ చిత్రం మనం చూడగలుగుతున్నాం అంటే అది ఆయన అనుగ్రహము అని గుర్తుంచుకోవాలి ... గాణగాపురంలో శ్రీ గురుని దర్శనం గాణగాపురంలో శ్రీ గురుడుగా ప్రసిద్ధి గాంచిన శ్రీ నృసింహ సరస్వతీ స్వామి దర్శనం శ్రీ నృసింహ సరస్వతి అష్టకం ఆవిర్భావ వృత్తాంతం... దత్తాత్రేయుడి రెండో అవతారం నృసింహ సరస్వతి కలియుగంలొ దత్తాత్రేయులు , శ్రీపాదవల్లభుడు గాను తరువాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతో అవతరించి పరమగురువై ఆ దత్త మూర్తి నేటికీ గంధర్వపుర నివాసియై కృష్ణభీమా సంగమతీరంలో స్మరించిన వారికి ప్రసన్నుడవుతున్నాడు. ఆయన మహిమ చెప్పనలవి గానిది పుట్టిన వెంటనే ఏడిచే బదులు ప్రణవం ఉచ్చరించారు. ఇనుమును తాకి బంగారంగా మార్చారు .అక్షరాభ్యాసం లేకుండానే శిష్యులకు వేదపాఠం చెప్పారు. బాల్యంలోనే తల్లితండ్రులకు జ్ఞానం ఉపదేశించారు. చిన్న వయస్సులోనే సర్వ తీర్ధ క్షేత్రాలు పాదచారియై దర్శించి పావనంచేసారు. నానాటికీ పతనమవుతున్న సన్యాసమార్గాన్ని పునరుద్ధించారు. అపధ్య భోజనంతో ఒక భక్తుని ఉదర రోగం పోగొట్టారు. ఒక నిరుపేద బాపడి దారిద్ర్యాన్ని పోగొట్టారు. ఇలా ఎన్నోలీలలు చూపి భక్తులను ఉద్దరించారు. శ్రీ నృశింహ సరస్వతి వారి జయంతి (పుష్య మాసం విదియ ). వారు షుమారు 80 ఏళ్లు సశరీరులుగా ఉంటూ భక్తులను అనుగ్రహించారు, ఓంకార నాదాన్ని పలుకుతూ ఆవిర్భవించాడంటారు. నిరంతర మౌనం తోనేభక్తులకు సందేహ నివృత్తి చేసే వారాయన. మహారాష్ట్ర లోని కరంజలో జన్మించి,గుల్బర్గా సమీపం లోని గాణుగాపురంలో నివసించారు. ధర్మబోధ కొనసాగించారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి గాణుగాపురం నుంచి తన అవతార కార్యం నుంచి గుప్తం అవ్వడానికి శ్రీశైల క్షేత్రం వచ్చి పాతాళగంగ నుండి పుష్ప వాహనం లో దాటి, కదళివనం వెళ్లి అక్కడ గుప్తంగా 300 సంవత్సరాలు తపస్సు చేసి 3వ అవతారం స్వామి సమర్ధ (అక్కల కోటస్వామి )గా ప్రకట మయ్యారు స్వామి వారు ... ఓం శ్రీ నృసింహ సరస్వతీ స్వామినే నమః శ్రీ నృసింహ సరస్వతి అష్టకం ఆవిర్భావ వృత్తాంతం శ్రీ గురు అష్టకం / శ్రీ నృసింహ సరస్వతి అష్టకం నరహరిశర్మ అనే భక్తుడు పారవశ్యంతో శ్రీ గురుని ఈ అష్టకంతో స్తుతించాడు. కుష్టురోగంతో భాద పడుతున్న నరహరిశర్మ దేవతలెందరినో ఆశ్రయించి, జీవితంపై విరక్తిచెంది శ్రీగురుని గురించివిని చివరికి ఆయనని ఆశ్రయిస్తాడు. ఆతని నమ్మకాన్ని పరీక్షించడానికి శ్రీగురుడు ఆతనికి ఎండిన మేడిచెట్టు పుల్లనిచ్చి, "నాయనా మా మాట మీద విశ్వాసముంచి దీన్ని నాటి రోజూ నీరుపోస్తుండు, ఆ కట్టె ఎపుడయితే చిగురిస్తుందో అప్పుడు నీ వ్యాధి నయమవుతుంది" అంటారు. శ్రీ గురుడు చెప్పినట్టే చేస్తున్న అతన్ని చూసి సంగమంలో ఉన్న తోటివారు అతని ఎగతాళి చేస్తారు. అయినప్పటికీ నరహరిశర్మ శ్రీ గురుని మాటపై అచంచల విశ్వాసం ఉంచి అయన చెప్పినట్లే చేస్తూంటాడు. ఆసక్తి చంపుకోలేని సంగమంలోని కొందరు శ్రీ గురుని వద్దకు వెళ్లి....."గురుదేవా ఆ వెర్రివాడు వారం నుండీ తిండి తిప్పలు లేకుండా మీరు చెప్పినట్టే ఆ ఎండు మేడికట్టెను సేవిస్తున్నాడు...పైగా అతని బాగుకోరి హితం చెప్తున్న మాకు శ్రీ గురుడు చెప్పినట్లు చేయటం నా పని, ఆయన అన్న మాట నిలబెట్టుకోవడం ఆయన పని అంటూ ఉపవాసాలు చేస్తున్నాడు" అంటారు. అప్పుడు శ్రీ గురుడు..." నాయనలారా భూలోకంలో గురుదేవుని వాక్య మొక్కటే మానవులను తరింపజేయగలదు. గురుదేవుల మాటలను విశ్వశించిన వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి. భావాన్నిబట్టి ఫలితం ఉంటుంది. దేవత,మంత్రము,వైద్యుడు,పుణ్యతీర్ధము,గురువు వీటి పట్ల ఎవరికి ఎలాంటి భావముంటుందో,వారి ప్రాప్తం కూడా అలానే ఉంటుంది...అని శివలింగాన్ని అత్యంత శ్రద్ధవిశ్వాసంతో పూజించి తరించిన బోయవాని కథ చెప్పి,నరహరిశర్మ వద్దకు వెళ్తారు. అక్కడ భక్తి,శ్రద్ధలతో ఎండిన మేడికట్టెను పూజిస్తున్న అతని చూచి సంతుష్టి చెందిన ఆయన ఎండిన ఆ మేడికట్టె పై తమ కమండలంలోని నీటిని జల్లుతారు. ఆయన సంకల్పంతో మహిమాన్వితమైన ఆ మంత్ర జలం ఎండుకట్టెను తాకిన క్షణమే అది చిగురించడం ప్రారంభిస్తుంది. సంగమంలోని భక్తులు సంభ్రమాశ్చర్యాలతో ఆ వింతను స్తుండగానే ఆ చెట్టు పెరిగి పెద్దదవుతుంది.నివ్వెరబోయి చూస్తున్న నరహరిశర్మకి కుష్టురోగం అదృశ్యమై అతడి శరీరం బంగారు ఛాయతో మెరుస్తుంది.తనని తాను చూచుకున్న నరహరిశర్మ ఆశ్చర్యచకితుడై, శరీరమంతా రోమాంచితమవుతుండగా పారవశ్యంతో శ్రీ గురుని పైవిధంగా స్తుతిస్తాడు. ఈ స్తోత్రం అంటే శ్రీ నృసింహ సరస్వతీ స్వామి వారికి అత్యంత ప్రీతికరము. శ్రీ నృసింహ సరస్వతి స్తోత్రం.... || ఇందుకోటి తేజకర్ణసింధు భక్తవత్సలం నందనాత్రి సూనుదత్తమిందిరాక్ష శ్రీగురుం గంధమాల్య అక్షతాది బృందదేవ వందితం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం || [1] || మోహపాశ అంధకార జాతదూర భాస్కరం ఆయతాక్ష పాహి శ్రీయవల్లభేశ నాయకం సేవ్యభక్త బృందవరద భూయో భూయో నమామ్యహం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం || [2] || చిత్తజారి వర్గషడ్క మత్త వారుణాంకుశం సత్యసార శోభితాత్మ దత్తశ్రీయ వల్లభం ఉత్తమావతార భూతకర్తృ భక్తవత్సలం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం || [3] || వ్యోమవాయు తేజ ఆపభూమి కర్తృమీశ్వరం కామక్రోధమోహరహిత సోమసూర్యలోచనం కామితార్ధ దాతృభక్త కామధేను శ్రీగురుం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం || [4] || పుండరీక ఆయతాక్ష కుండలేందు తేజసం చండదురిత ఖండనార్ధ దండదారి శ్రీగురుం మండలీకమౌళి మార్తాండ భాసితాననం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం || [5] || వేదశాస్త్ర స్తుత్యపాద మాదిమూర్తి శ్రీగురుం నాదబిందు కళాతీత కల్పపాద సేవ్యయం సేవ్యభక్త బృందవరద భూయో భూయో నమామ్యహం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం || [6] || అష్టయోగ తత్వ నిష్టతుష్ట ఙ్ఞానవారిధిం కృష్ణవేణీ తీరవాస పంచనద్య సంగమం కష్టదైన్యదూరభక్త తుష్ట కామ్యదాయకం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం || [7] || నారసింహ సరస్వతీశనామ మష్టమౌక్తికం హార్కకృత్య శారదేన గంగాధరాఖ్య స్వాత్మజం ధారుణీక దేవదీక్ష గురుమూర్తి తోషకం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం || [8] ఫలశృతి: || నారసింహ సరస్వతీశ అష్టకంచ యఃపఠేత్ ఘోర సంసారసింధు తారణాఖ్య సాధనం సారఙ్ఞాన దీర్ఘ ఆయురారోగ్య సంపదాం చారువర్గ కామ్యలాభ నిత్యమేవ యఃపఠేత్ || ఓం శ్రీ నృసింహ సరస్వతీ స్వామినే నమః https://whatsapp.com/channel/0029Va4YUC6DeONFF8EDwQ2V
11 likes
6 shares