Failed to fetch language order
మోటివేషన్ స్టోరీస్
12 Posts • 4K views
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
585 views 1 months ago
మన ఘనచరిత్రలో ... ఒక కలికి తురాయి ... మద్రాసు, 1930లు. ఒక అమ్మాయి. 15 ఏళ్లకే పెళ్లిఅయ్యింది. 18వ ఏట తల్లి అయింది ... మరియు, బిడ్డ పుట్టిన నాలుగునెలలకే ఆమె భర్త మరణించారు... శబ్దం లేదు. సమాధానం లేదు. కేవలం నిశ్శబ్దం ... కళ్ళముందున్న బిడ్డతో ఆమె జీవితం నిలిచిపోయినట్టే అనిపించింది. కాని అక్కడే ఆమె కథ ముగియలేదు... అక్కడినుంచే మొదలైంది... ఆమె పేరు అయ్యలసోమాయజుల లలితా. ఆమె తర్వాత ఏం చేసింది అంటే – భారతదేశం ఆనాటికి సిద్ధంగా లేదు. ఆమె తండ్రి – పప్పు సుబ్బారావు, ఇలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, ఆమె కళ్ళలోని మెరుపును గమనించారు. ఆమెను ఓదార్చడమే కాదు – ఆమె భవిష్యత్తును తిరిగి ఆవిష్కరించారు. కోలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గిండీకి ఆమెను తీసుకెళ్లారు.అది మగవాళ్ల కోట.అప్పటికి మగాడు మాత్రమే అడుగుపెట్టగల స్థలం. అలా అనుకున్నారంతా. కానీ ఆమె అడుగుపెట్టింది. 1943. ఆమె ఇలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిగ్రీతో బయటికి వచ్చింది.భారతదేశపు మొట్టమొదటి మహిళా ఇంజినీర్.ఎటువంటి కోటాలు లేవు.ఎటువంటి ఉద్యమాలు లేవు.కేవలం ధైర్యమే. ఇతరులు గుసగుసలాడినప్పుడు – ఆమె భాక్రా నంగల్ ప్రాజెక్ట్ కోసం ట్రాన్స్‌మిషన్ లైన్లను డిజైన్ చేసింది.దేశాలు గోడలు కడుతున్నప్పుడు – ఆమె వెలుగు అందిస్తూ భవిష్యత్తును నిర్మించింది. ఆమె AEI (అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్), కోల్కతాలో చేరింది.ముప్పై ఏళ్లపాటు పని చేసింది. సిస్టమ్స్ రూపొందించింది.లోపాలను సరిచేసింది. ఇంగ్లీషు యంత్రాలను – భారతీయ కలలతో కలిపింది. విధవలైనవారు ప్రయాణించకూడదు అన్న దురాచారాల వల్ల –సైట్ విజిట్లు ఆమెకు లభించలేదు.కానీ ఆమె ప్రతిభ ప్రయాణించింది. ఆమె టేబుల్ మీదే విద్యుత్ లైన్లను తీర్చిదిద్దింది. ఆమె గొంతెత్తి మాట్లాడలేదు.వాదించలేదు. ప్రతి రోజు తన పనితో చరిత్రను మలిచింది. 1964, న్యూయార్క్. మహిళా ఇంజనీర్లు మరియు శాస్త్రవేత్తల మొదటి అంతర్జాతీయ సమావేశం.ఆమె అక్కడ ఉంది. ఒక చీరలో.ఆమెకు పేరే తెలియని దేశం తరపున. 1966 నాటికి, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్స్ (లండన్)కి పూర్తి సభ్యురాలిగా ఎంపికైంది. ఇది కేవలం భారతీయ గాథ కాదు – ప్రపంచానికి చెప్పే సందేశం. కానీ మీరు మన పాఠ్యపుస్తకాలను అడగండి, ఇంజినీరింగ్ కాలేజీలను అడగండి, డ్యామ్‌లను, గ్రిడ్‌లను అడగండి – వారు వోల్టేజ్‌ను గుర్తుపెట్టుకుంటారు. ఆమె పేరు మర్చిపోతారు. కాబట్టి మళ్లీ ఎవరైనా అడిగితే – 'ఇంజనీరింగ్ రంగం మొదటినుంచీ పురుషులదేనా?' వెచ్చగా చిరునవ్వుతో చెప్పండి – 'ప్యానెల్లు, పాలసీలు రాకముందే – లలితాదేవి ప్రవాహాన్ని చీల్చింది' ... ఆమె తిరుగుబాటు చేయలేదు – తిరుగుబాటు అంటే ఏమిటో తిరిగి నిర్వచించింది. పోరాటం లేదు.కేవలం పరిపూర్ణత. #తెలుసుకుందాం #inspiring #మోటివేషన్ స్టోరీస్ #మోటివేషనల్ స్టోరీస్.. 🤠 #మహిళా శక్తి
14 likes
10 shares
జైవెల్ చెన్నైలో ఈ పేరు ఓ #ప్రభంజనం. బిచ్చం ఎత్తుకునే ఒక #యాచకురాలి కొడుకు అడ్వాన్స్డ్ #మొబైల్ ఇంజనీరింగ్ లో #సీటు సాధించడం అంటే మాటలు కాదు. అది కూడా ఏకంగా ప్రఖ్యాత #లండన్ కేమ్ బ్రిడ్జ్ #యూనివర్సిటీలో. అది 1980 వేసిన పంట చేతికి రాలేదు. వేరే గత్యంతరం లేక జై వెల్ #కుటుంబం పొట్ట చేత పట్టుకొని #నెల్లూరు నుండి చెన్నై కి వలస వచ్చింది. రావడం అయితే వచ్చారు గాని చేసేందుకు ఏ పని దొరకలేదు. #ఆకలి ఎంతటి పనైనా చేయిస్తుంది అలా #ఆత్మాభిమానం చంపుకొని #బిచ్చమెత్తడానికి సిద్ధమయ్యారు. ఊరి కానీ ఊర్లో ఫుట్ పాత్ తే వారి #నివాసం అయ్యింది రాత్రిపూట మూసి ఉన్న #షాపుల ముందు పడుకునే వాళ్ళు. ప్రతిసారి #పోలీసులు వచ్చి తరిమికొట్టేవారు. కొన్ని రోజులకు జై వేల్ తండ్రి #గుండెజబ్బుతో కన్నుమూశాడు. తల్లి కూడా జబ్బు ముదిరి #మంచానికి పరిమితం అయింది. ఏం చేయాలో తెలియని అయోమయం అప్పుడు జయదేవ్ వయసు ఆరేళ్లు. ఫుట్పాత్ మీద #అచేతనంగా పడిపోయిన తల్లి పక్కన ఏడుస్తున్న దృశ్యం #ఉమా మదురమన్ అనే దంపతులకు కంటపడింది. పిల్లాడి #దీనవస్థ ఆ దంపతులను కలచివేసింది. ఎలాగైనా #సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. వీరు నడుపుతున్న #సూర్యం అనే NGO #ట్రస్ట్ సాయంతో జైవేల్ల్ బడిబాట పెట్టాడు. తల్లి కోసం పగలు #భిక్షాటన, రాత్రిపూట #చదువుకుంటూ ఇంటర్మీడియట్ లో టాప్ #ర్యాంకర్ గా నిలిచాడు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది #మనసున్న మారాజులు సాయం చేశారు. వారందరి సహకారంతో కేన్ బ్రిడ్జ్ #యూనివర్సిటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ను విజయవంతంగా #క్లియర్ చేశాడు. ఆటోమోటివ్ ఇంజనీరింగ్ లో సీట్ సాధించాడు. #చెత్తకుండీ పక్కన పడి ఉన్న తల్లికి ఆ సీటు గురించి తన ర్యాంకు గురించి తెలియజేశాడు..✍️ #congratulations #motivational #మోటివేషన్ స్టోరీస్ #మోటివేషనల్ స్టోరీస్.. 🤠
9 likes
15 shares
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
592 views 3 months ago
DSP స్థాయిలో ఉన్న #తండ్రిని తోటి పోలీసులే #చంపేస్తే తండ్రికి జరిగిన అన్యాయం కోసం ఆరు #నెలల కూతురు 32 #ఏళ్ళు పోరాటం చేసి దోషులకు ఎలా #శిక్ష వేసిందో తెలుసా.. ఈమె పేరు #కింజల్ సింగ్ ఈమెకు ఆరు నెలల వయసున్నప్పుడు ఆమె తల్లి #రెండో సారీ ప్రగ్నెంట్ అని తెలిసింది. ఆ టైంలో కరుడుగట్టిన #క్రిమినల్స్ ఒక గ్రామంలో ఉన్నారని చెప్పి ఈమె తండ్రిని అక్కడికి రప్పించి తోటి #పోలీసులే నకిలీ #ఎన్కౌంటర్లో కాల్చి చంపి అతనితోపాటు 12 మంది #గ్రామస్తులను చంపేశారు. ఈమె తల్లి #వీవాదేవి ఇది నకిలీ ఎన్కౌంటర్ అని చెప్పి #కోర్టు చుట్టూ తిరిగి తిరిగి తన భర్తకు జరిగిన అన్యాయం గురించి #పోరాడుతూ.. కింజల్ సింగ్ డిగ్రీ చదువుతున్నప్పుడు ఆమె తల్లి కూడా #క్యాన్సర్ తో మరణించింది. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని కష్టపడి చదివి యూనివర్సిటీలో #గోల్డ్ మెడల్ సాధించింది డిగ్రీ పూర్తి చేసింది కింజల్. తన చెల్లి #ప్రాజల్ సింగ్ తో కలిసి ఒక రూమ్ తీసుకుని #సివిల్స్ కి ప్రిపేర్ అయ్యి దేశంలోనే 25వ #ర్యాంకును సాధించింది. #కలెక్టర్ అయ్యాక తనకున్న పలుకుబడిన వాడి గ్రామస్తులతో #CBI అధికారులతో మాట్లాడి #కేసు కావలసిన సాక్ష్యాలను సంపాదించి కోర్టుకు సమర్పించి ముగ్గురు పోలీసులకు #మరణశిక్ష మరో ఐదుగురికి #జీవిత ఖైదు శిక్ష విధించేలా చేసి కంటే #కూతుర్నే కనాలి అని నిరూపించింది..✍️ #తెలుసుకుందాం #motivational #మోటివేషన్ స్టోరీస్ #మోటివేషనల్ స్టోరీస్.. 🤠 #motivational stories
16 likes
11 shares
డబ్బుంది కదా అని అనవసరమైనవి కొంటూ పోతే అనవసరంగా అవసరమైనవి కూడా అమ్ముకోవాల్సి వస్తుంది ప్రపంచ ఫుట్బాల్ ఆటగాడు 27 ఏళ్ళ సాడియో మానె సెనెగల్ ￰ఆఫ్రికా దేశస్థ ఆటగాడు మన కరెన్సీ తో పోలిస్తే అతను వారానికి 140 మిలియన్లు సంపాదిస్తున్నాడని చెప్పబడింది అతను పలుచోట్ల పగిలిపోయిన ఫోన్ తో కనిపించాడు ఆ విషయమై ఒక్కసారి ఆయన్ను అడగగా అటువంటి ఫోన్ ఒక వెయ్యి 10 ఫెర్రారీస్ 2 జెట్ విమానాలు వైడూర్యపు గడియారాలు కొనగలను కానీ నేను ఎందుకు కొనాలి అని అడిగాడు నేను పేదరికాన్ని చూసినవాని నేను పేదరికాన్ని అనుభవించినవాణ్ణి నేను చదవలేకపోయాను అందుకే ప్రజల కోసం పాఠశాలలు కట్టించాను వేసుకోవడానికి కనీసం బూట్లు లేవు అవి లేకుండానే ఆటలు ఆడాను మంచి దుస్తులు లేవు ధరించడానికి కడుపు నిండా తిండి లేదు ఇప్పుడూ నేను చాలా పొందాను వాటిని అనవసరంగా వృధా చేయకుండా అవసరమైన వాటికి ఖర్చు పెట్టి నలుగురికి ఉపయోగపడేలా చేస్తున్నాను అన్నాడు నలుగురికి సాయపడే మనసు అందరికి రాదూ ఇటువంటి వారు ఎప్పుడూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము...! #motivational #మోటివేషన్ స్టోరీస్ #మోటివేషనల్ స్టోరీస్.. 🤠 #great #well done, Good job👏👏🙌🙌❤
10 likes
8 shares