ఆడపిల్ల జీవితం...
#ఆడపిల్ల జీవితం... వివాహం అయిన ఒక ఆడపిల్ల తన తల్లికి వ్రాసిన ఉత్తరం ఇది.... అమ్మా! అందరు ఆడపిల్లలలాగే, నేను కూడా పెళ్ళి గురించి ఎన్నో అందమైన కలలు కన్నాను. ఒక అందమైన రాకుమారుడు నాకోసం వస్తాడు అని నా జీవితం అంతా అతనితో సంతోషంగా గడపాలని ఊహించాను. కానీ, ఈరోజు, నా వివాహం అయిన తర్వాత, నాకు తెలిసింది, పెళ్ళి అంటే పూలపానుపు కాదు అని. నేను ఊహించినదాని కన్నా ఇక్కడ భిన్నంగా ఉంది. ఇక్కడా నా కోసం నా వంతు, బాధ్యతలు, పనులు, త్యాగాలు, రాజీలు అన్నీ వేచి చూస్తున్నాయి. నేను నా ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేవలేను. నేను ఇంట్లో అందరికన్నా ముందు లేచి, వాళ్ళకు కావలసినవన్నీ సిధ్ధం చేయాలి అని ఆశిస్తారు. మన ఇంట్లో లాగా, పైజామాలతో రోజంతా, ఇల్లంతా తిరగలేను. ఇక్కడ నాకంటూ ఉన్న కొన్ని పధ్ధతుల ప్రకారం నడుచుకోవాలి. ప్రతిక్షణం అందరి పిలుపులకీ సిధ్ధంగా ఉండాలి. నా ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళలేను. అందరి అవసరాలు తీరడం నా చేతిలోనే ఉంది. నీ దగ్గర ఉన్నప్పుడు పడుకున్నట్టు నా ఇష్టం వచ్చినప్పుడు నేను పడుకోవడానికి వీలు లేదు. నేను ప్రతిక్షణం హుషారుగా, ఉత్సాహంగా ఉండి ఎవరికి ఏమి కావాలన్నా చేసి పెడుతుండాలి. నన్ను ఒక యువరాణి లాగా శ్రధ్ధ తీసుకునేవారు ఇక్కడ లేరు కానీ, నేను అందరి గురిచి శ్రధ్ధ తీసుకోవాలి. అప్పుడప్పుడు నీ దగ్గరే సుఖంగా హాయిగా ఉండక, నేను పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అని ఏడుపు వస్తుంది. ఒక్కోసారి, మళ్ళీ నీ దగ్గరకు వచ్చేసి, నీ దగ్గర గారాలుపోవాలని అనిపిస్తుంది. మన ఇంటికి వచ్చేసి, నాకు ఇష్టమైనవి అన్నీ నీ చేత వండించుకుని తినాలి అని, నా స్నేహితులతో ప్రతి సాయంత్రం బయటికి వెళ్ళాలి అని, ప్రపంచం లో నాకు ఇక ఏ బాధలు లేనట్టు నీ ఒడిలో తలపెట్టుకుని పడుకోవాలి అని ఎంతో అనిపిస్తుంది. కాని అప్పుడే నాకు గుర్తొస్తుంది....నువ్వు కూడా ఇలా పెళ్ళి చేసుకుని, ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వచ్చినదానివేగా అని....నువ్వు కూడా నీ జీవితంలో ఎన్నో త్యాగాలు చేసే ఉంటావు కదా...నువ్వు ఏవైతే గొప్ప సుఖాన్నీ, శాంతినీ, సౌకర్యాన్నీ మాకు అందించావో, వాటిని నేను మళ్ళి నేను అడుగు పెట్టిన నా మెట్టినింటికి ఇవ్వాలి కదా అని గుర్తొస్తుంది.. నేను చెప్తున్నా అమ్మ...కొంత కాలం గడిచేటప్పటికి నేను కూడా నీలాగే నా ఈ కొత్త కుటుంబాన్ని ప్రేమించడం తెలుసుకుంటాను. నువ్వు నీ జీవితం లో మాకోసం చేసిన త్యాగాలకు, రాజీలకు నా కృతజ్ఞతలు. అవి నాకు నా బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడానికి నాకు కావలసినంత శక్తిని, స్థైర్యాన్ని ఇచ్చాయి. థాంక్ యూ అమ్మా...
#

ఆడపిల్ల జీవితం...

ఆడపిల్ల జీవితం... - ShareChat
359 వీక్షించారు
3 నెలల క్రితం
మన ఇంటి 'ఆడ' కూతురు . """"""""""""""""""""""""""""""""" ఓ చిన్న కధ . చాలా బాగుంటుంది ... తన కూతురును ప్రేమించే ప్రతి తండ్రి చదవాల్సిన - అధ్బూత కధనం తప్పకుండా చదవండి . అమ్మాయి పెళ్ళికై నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నారు, ఆరోజున ! అది గొప్పింటి సంబంధం కావడంతో కుటుంబం ఎంతో సంతోషించింది. తండ్రి శర్మగారు ఎంతగనో ఆనందించాడు. పిల్లవాడు, అతని తల్లిదండ్రులు చాల మంచివారు. దాంతో శర్మగారికి ఎంతో భారం తగ్గినట్లనిపించింది. పెళ్ళికిముందు ఒకరోజు పెళ్ళికూతురు తండ్రి శర్మగారు వియ్యంకుడు వాళ్ళింటికి వెళ్ళాలసివస్తుంది. అయితే ఆరోజు శర్మగారి ఆరోగ్యం బాగాలేదు. మొదటిసారి కావడం తో కాదనలేకపోయాడు. వరునితరఫువాళ్ళు ఎంతో సాదరంగా ఇంటిలోనికి ఆహ్వానించారు. కొద్దిసేపు వచ్చినపని విషయమై మాట్లాడుతుండగానే తేనీరు వచ్చింది. శర్మగారికి మధుమేహం ఉండడంతో చక్కెర పదార్ధాలకు దూరంగా ఉంటున్నారాయన. అయితే మగపెళ్ళివారింటిలో శర్మగారు మొహమాటంతో ఇచ్చిన టీ కప్పును చేతిలోనికి తీసుకున్నారు తాగడానికై. మొదటిగుటక వేస్తూనే ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. అందులో పంచదార లేదు సరికదా, తనకిష్టమైన యాల కులపొడి వేశారు. మాఇంటిపధ్ధతిలోనే చేసిన టీ వీరింటిలోనూ తాగుతున్నారే అని అనుకున్నారాయన. మధ్యాహ్నం భోజనం చేశారు, అదీ అచ్చు తమ ఇంటివంట లాగానేఉంది. వెంటనే ఏం బయలు దేరుతారు, కొంచెంవిశ్రాంతి తీసుకోండి అంటూ పడకగదికి తీసుకెళ్ళారు. అచ్చటి దుప్పటి తను కప్పుకునే దుప్పటి లాగ పలచటిది. కునుకుతీసి లేచేటపపటికి రాగిచెంబులో నీరిచ్చారు తాగడానికి. బయలుదేరేముందు ఇక అడగకుండా ఉండలేకపోయేరు శర్మగారు...'నేను ఏం తింటాను, ఎలా తాగుతాను, నా ఆరోగ్యానికి ఏది మంచిది ... ఇవన్నీ మీకెలాతెలుసు?' అని. అమ్మాయి అత్త గారు ఇలా అంది.... 'నిన్నరాత్రి మీఅమ్మాయిఫోన్ చేసి మీగురించి అన్నీ చెప్పింది. మానాన్నగారు మొహమాట పడతారు. వారిగురించి మీరే శ్రధ్ధ తీసుకోవాలనికోరింది.' శర్మగారి కళ్ళల్లో నీరు తిరిగింది. శర్మగారు ఇంటికి రావడంతోనే భార్యను పిలిచి ఇలా అన్నారు... 'లలితా, మా అమ్మ చనిపోలేదు.' 'ఏవిటండీ మీరు మాటాడుతున్నది' 'అవును లలితా, నన్ను కంటికి రెప్పలా చూసుకొనే నా తల్లి బతికేఉంది.. నాకూతురు రూపంలో' అని జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పారు శర్మగారు కన్నీరు నిండిన కళ్ళతో. *అమ్మాయి 'ఆడ'పిల్ల అనుకొంటాము, మన ఇల్లు వదిలి పోతుందని. తను ఎక్కడికీ పోదు,తలిదండ్రుల హృదయాలలోనే ఉంటుంది. తన మనస్సులో తనవారి జ్ఞాపకాలను నింపుకుని.* *ఆడ పిల్లను బతకనిస్తే ..... అమ్మను గౌరవించినట్లే.....* అడకూతుర్లు గురించి ఓ మంచి ఆర్టికల్ ఇదీ . తన కన్న కూతురిని గౌరవించేవారు ప్రతి తండ్రి ఇట్టి నా కధనాన్ని తప్పకుండా షేరు చేయ్యండి . మీ తల్లి అత్మ ఎచ్చటున్న ఆనందిస్తుంది. సర్వ సృష్టి సూఖీనో భవత్
#

ఆడపిల్ల జీవితం...

ఆడపిల్ల జీవితం... - ShareChat
5.7k వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post