లవ్ స్టోరీ
#

లవ్ స్టోరీ

"మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్" పార్ట్ 7 ఉదయం 3:40 నిమిషాలు... "పెళ్ళి కూతుర్ని తీసుకురండి..."అన్నమాటతో తన కోసం తల పైకెత్తి మరీ చూస్తున్నాడు రేవంత్ 10 నిమిషాలు గడిచింది....రామ్మూర్తి టెంషన్ గా అటు-ఇటు తిరుగుతూ కనిపించడంతో రేవంత్ కి భయమేసింది... 8 నిమిషాలు గడిచింది..."ఏమయ్యిందని..."రేవంత్ లేచి అడుగుదామనుకుంటుండగా ముత్తైదువులంతా నేహని తీసుకొచ్చి రేవంత్ ఎదురుగా తెర వెనక కూర్చోబెట్టారు.... ఆమె తెర వెనక కూర్చొని కనుమరుగయ్యేంతవరకూ ఆమెనే చూస్తుండిపోయాడు రేవంత్....జీలకర్ర బెల్లం కార్యక్రమం తర్వాత....తెర తొలిగించగానే...తల వంచుకొని వున్న నేహ వైపు చూస్తూ..."ఐ లవ్ యూ .."అన్నాడు తనకి మాత్రమే వినపడేటట్టు...ఆ మాటతో చప్పున తల పైకెత్తి... తన వైపే తీక్షణంగా అనురాగంతో చూస్తున్న రేవంత్ ని చూసింది నేహ ఆ తర్వాత ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టారు.....పంతులు గారు చెప్పినవన్ని చేస్తూ పోతున్నారు ఇద్దరు....ముఖ్య ఘట్టం దగ్గరయ్యేకొద్ది గుండె వేగాన్ని అందుకోవడం తెలుస్తోంది ఇద్దరికి.... "మనసులు కలవని మమ్మల్ని ఈ మనువు కలిపేనా....?"అని నేహ ఆలోచిస్తుంటే "నా గొంతులో ఊపిరున్నంత వరకూ ఈ పెళ్ళి బంధాన్ని ప్రేమ బంధంగా మార్చడానికి నా వంతు ప్రయత్నిస్తాను నేహ...నీ గుండెల్లో చోటు సంపాదిస్తాను...."అని అనుకుంటుండగా..."బాబు...ఈ మంగళసూత్రాన్ని తీసుకుని మాంగళ్య దారణ గావించు...."అన్న పంతులి గారి మాట వినిపించి మంగళ సూత్రాన్ని చేతపట్టుకోని పైకి లేచాడు రేవంత్..... ఒక్కో ముడి వేస్తూ......తన ప్రియ సఖిని ఎలా ఆశ్చర్యపరచాలో ఆలోచిస్తూ....3 ముళ్ళు కంప్లీట్ చేసి.....కొద్దిగా వంగి ఆమె నుదిటి మీద ముద్దిచ్చాడు రేవంత్... ఆ ముద్దు ఆమె నుదురుని అలకరించేసరికి...అప్పటిదాకా కుమారి గా వున్న ఆమె శ్రీమతి అయ్యేసరికి.....కళ్లలోంచి నీళ్ళు పొంగుకొచ్చాయి....."ఇదే నేను కోరుకున్న నా జీవితం...నేను కలలుకన్నది....నేను బతకాలనుకున్నది..."అని మనసులో అనుకోని తల ఎత్తి అతని కళ్లలోకి చూసింది.... అలా ప్రోగ్రాంస్ అన్ని ముగించుకోని తిరుపతి కి వెళ్ళడానికి కార్ లో బయల్దేరారు.... మీనాక్షి-రామ్మూర్తి ఇంటి దగ్గర ఏర్పాట్లు చూడ్డానికని వుండిపోయారు... కార్ వెనక సీట్లో ని ఒక డోర్ పక్కన నేహ...మరో డోర్ దగ్గర రేవంత్....ఉత్తర దక్షిణ దృవాల్లో అంటీ ముట్టనట్టు కూర్చున్నారు... "నేహ నువ్వు తిరుపతికి లాస్ట్ ఎప్పుడూ వెళ్ళావు....?"అని సంబాషణని మొదలుపెట్టడానికి ట్రై చేశాడు....కాని నేహ మారు మాట్లాడకపోవడంతో తన ప్రయత్నాన్ని మానుకున్నాడు కొద్ది సేపటి తర్వాత: నేహకి నిద్ర ఆగక సీట్ మీదకి ఒరిగి నిద్రపోసాగింది...తను నిద్రపోయిందని గుర్తించి తన పక్కగా జరిగాడు....నేహ తలని ఎత్తి తన భుజం పై వాల్చుకున్నాడు......అలా కాసేపు గడిచాక..ఆమె తలని తన ఒళ్ళొ పెట్టుకున్నాడు.... మూసివున్న కళ్ళల్లో తన అలసట తెలుస్తుంది....బుగ్గ చుక్క ని చూస్తే ఆమె అందానికి దిష్టి తగలకుండా పెట్టిన దిష్టి చుక్క లాగా అనిపించసాగింది......చిన్నపిల్లలా అరవిరిసిన మందారంలా ఆమె ముఖం ఎంత ముద్దుగా వుందో...! "పిల్లి పిల్ల..."అని ఆమె బుగ్గని నిమిరేలోపే...తన గోరింటాకు చేతుల్లో ఏదో వుండడాన్ని గుర్తించి...అదేంటా అని చేతిలోకి తీసుకున్నాడు...అదొక పెన్.... ఏంటిది...?అని అటు-ఇటూ తిప్పి చూశాడు...దాని మీద ..."R" అనే అక్షరం వుంది 6 గంటల తర్వాత.... వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు ఇద్దరూ..... ఇంటికి రాగానే వాళ్ళిద్దరి చేత సత్యనారయణ వ్రతం చేయించారు.....పక్క పక్క కూర్చుని అన్నీ సాంప్రదాయ బద్ధంగా ముగించారు...... ఆ రాత్రి 9:00 గంటలకి శోభనానికి ముహూర్తం పెట్టారు.... "ఈ రాత్రి నాకు కాళరాత్రే...కింద పడుకోమంటుందేమో అమ్మగారు...?"అనుకున్నాడు రేవంత్ మనసులో.... "దానికన్నా ముందే నిద్రపోతే నన్ను లేపదు కదా...సూపర్ ఐడియా రా రేవంతూ...."అనుకోని గప్ చుప్ గా నిద్రపోయాడు...(నిద్రపోయినట్టు నటించాడు) తలుపు తీసి లోపలికి వచ్చింది నేహ......రేవంత్ ని చూసి కోపంగా.... దడేల్మని తలుపేసింది... "వామ్మో....!ఈవిడ కోపం చూస్తే తలుపులు కూడా బద్దలు అయిపోతాయేమో....."అనుకున్నాడు రేవంత్ రేవంత్ వద్దకి వచ్చి...అతని భుజం పై తట్టింది.... "వామ్మొ కింద పడుకో మంటుందేమో.....నేను లేవను కాక లేవను...."అని మనసులో అనుకున్నాడు రేవంత్ ఈసారి గట్టిగా తట్టింది.....అయినా రేవంత్ లేవలేదు...... కోపం వచ్చి తెచ్చిన వేడి పాల గ్లాస్ ని అతని బుగ్గ మీద పెట్టింది....ఒక వైపు గ్లాస్ చెంప పై కాలుతున్నా,......బాధని పంటి దిగువున నొక్కి కళ్ళు మూస్కోనున్నాడు రేవంత్ "ఓహో...ఇలా కూడా లేవరా తమరు...."అని పెద్దగా అని...గ్లాస్ ని మెల్లగా వంచ సాగింది......అది చూసిన రేవంత్ దెబ్బకి లేచి కూర్చున్నాడు.... "రాక్షసి.....డ్రాకులా....శాడిజానికి బ్రాండ్ అంబాసిడర్ వే నువ్వు...ఇంతకు ముందు జన్మ లో యమలోకంలో యమకింకరిగా పని చేసుంటావ్...అందుకే అక్కడ వెయ్యాల్సిన శిక్షలన్ని నాకు వేస్తున్నావు....!ఎందుకే నీకు నేనంటే అంత కుళ్ళు....?"అడిగాడు రేవంత్ "ఇంక ఆపుతావా...?నిన్ను చూసే కుళ్ళుకోవాలి మరి....ఎదవ యాక్టింగ్లు చేస్తే ఒళ్ళు మండదా...?నాకు తెలీదనుకుంటున్నావా ఏంటి నువ్వు నిద్ర పోవట్లేదని....అందుకే ఇదంతా చేశా.....ఇంకోసారి నీ డ్రామాలు నా దగ్గర చేస్తే గంగాళం(పెద్ద పాత్ర) నిండా పాలు కాగబెట్టి నీ మీద పోస్తా...జాగ్రత్త....!"అంది నేహ "వామ్మొ...వారి దేవుడో...అలాంటివి మాత్రం చెయ్యకు తల్లో...ఇంతకి నన్నెందుకు లేపినట్టు...కొంపదీసి ఫస్ట్ నైట్ రోజు నిద్రపోయానని కోపమొచ్చిందా...?నన్ను నువ్వు క్షమించేశావా...?"అని ఆశగా అడిగేసరికి "అంత లేదు.....ఉదయం తిరుపతి వెళ్ళేటప్పుడు నా పెన్ నొక్కేశావ్ గా...అది నాకిచ్చేయ్..."అంది నేహ "ఏంటి నేనా...?నీ పెన్ నేను నొక్కేశానా...?నాకింకేం పని లేదు మరి..."అన్నాడు రేవంత్ ఉక్రోషంగా' "అదే...అదే వొద్దు....గ్లాస్ ఇంకా ఫుల్ గానే వుంది...అబద్ధాలాడితే ఈ గ్లాస్ కాళి అయ్యి అందులోని పాలు నీ నెత్తి మీదుంటాయి..."అంది నేహ ఆ మాట వినడంతోనే,...."హి...హి....జోక్ చేశా...బంగారం ఇదిగో ..."అని పెన్ ఇస్తూ.."నీకోటి తెల్సా....ఇలాంటి పెన్ నే మా నాన్న అమెరికా ట్రిప్ కి వెళ్ళి నాకోసం తెచ్చారు...అది మా నన్న గారి లాస్ట్ గిఫ్ట్....ఈ పెన్ కి మాదిరిగానే నాన్న ఇచ్చిన పెన్ కి కూడా R అని వుండేది తెల్సా..R ఫర్ రేవంత్....R ఫర్ రాజేష్ మా నాన్న పేరు....ఆ తర్వాత యాక్సిడెంట్లో చనిపోయారు..."అని అంటూ చెబుతున్న అతని గొంతు గద్గదమైంది.... అతని మాటలు వింటున్న నేహకి కళ్ళు చెమ్మగిల్లాయి...."మరి ఆ పెన్ ఏమైంది...?"అంది అతని మూడ్ మార్చడానికి "ఇలాంటి పెన్ నేను బిటెక్ చదువుతున్నప్పుడు పోగొట్టుకున్నాను...మై బ్యాడ్ లక్....ఆ పెని తో రాసిన ప్రతిసారి...నాన్న నా భుజం తట్టి చిన్నప్పుడు నేర్పించిన abcd లే గుర్తొచ్చేవి.....ఐ ఫీల్ ఆయన నాతోనే వున్నట్టు అనిపిస్తుంది....కాని ఆ పెన్ పోయిన్నప్పటి నుంచి...ఏదో వెలతి...ఏదో నా నుంచి దూరమైపోయినట్టు అనిపించింది...."అని నేహ ఒళ్ళొ తల పెట్టుకుని ఏడ్చేశాడు... "ఒకే...కూల్...."అని కన్నీళ్ళు తుడిచి.."ఇది నీ దగ్గరుంటే పైనున్న మావయ్య నీతో వున్నట్టు నువ్ ఫీల్ అవుతావా....?"అడిగింది నేహ తలూపాడు రేవంత్...."ఇదిగో అయితే తీస్కో...ఇంక అమ్మాయిలా ఏడ్వకుండా చప్పుడు చెయ్యకుండా పడుకో...లేకపోతే..."అని నేహ అంటుండగా "మరి ఈ పెన్ నీకెవ్వరు ఇచ్చారు...?"అడిగాడు నేహని "ఇదా....నేనే మా నాన్న గారికి ఇద్దామని తెప్పించాను....R ఫర్ రామ్మూర్తి...ఆయన బర్త్ డె కి ప్రసంట్ చేద్దామనుకున్నాను..."అంది నేహ "అయ్యొ అవునా అయితే నువ్వే వుంచుకో...."అన్నాడు రేవంత్ పెన్ వెనక్కి ఇచ్చేస్తూ "లేదు లే నేను ఇంకోటి కొంటాను గాని...ఇక క్వశ్చిన్లెయ్యకుండా నిద్రపో...."అని నేహ అంటుండగానే...రేవంత్ నిద్రపోయాడు... రాత్రి 12:00 గంటలు... నిద్ర లేచిన నేహ తన బ్యాగ్ లోని డైరిని బయటకి తీసి....పక్కనున్న సోఫాలో కూర్చుని ఆ బెడ్ లైట్ వెలుతురులో డైరి ఓపెన్ చేసి....ముందు పేజిలో వున్న పేరుని ప్రేమగా తడిమి.....రాయడం మొదలుపెట్టింది.... డైరి రాయడం పూర్తి చేసి తల ఎత్తేసరికి ఎదురుగా రేవంత్ కనిపించాడు,...మరో ఆలోచన లేకుండా డైరిని దాచిపెట్టి...."ఎప్పుడు చూడూ నా వెనకే వుంటావ్...వేరే పనిలేదా...పో....!"అని అరిచేసి అతనెళ్ళి పడుకోగానే ఆ సోఫాలోనే నిద్రపోయింది.... మరుసటి ఉదయం: నేహ ముందుగానే లేచి...పేపర్ చదువుతుండగా...."నేహ పేపర్ ఇవ్వు..."అని అడిగేసరికి "బుర్రే లేదనుకున్నా కళ్ళు కూడా కనిపించడం లేదన్నమాట...!"అంది నేహ "నేను అడిగేదేంటి...?నువ్వు చెప్పిందేంటి....?"అరిచాడు రేవంత్ "అయ్యా....బోధి దర్మా....కళ్ళు కనిపించడం లేదా....నేను పేపర్ చదువుతున్నా కదా....?" "నువ్వు చదువుతున్నది కాదు వేరే పేపర్...అది కూడా తెలియదా మెంటల్ ...."అన్నాడు రేవంత్ "నాకు అలా ముక్కలు ముక్కలు చేసి చదివితే చదివినట్లు అనిపించదు...నేను ఇవ్వను...." "ఓ అమ్మొ...నీ పని ఇలాగా కాదు ..."అని మనసులో అనుకోని పక్కకి వెళ్ళి రామ్మూర్తి వాయిస్లో...."అమ్మా...!నేహ టిఫిన్ చేశావా...?"అని మిమిక్రి చేశాడు ఆ మాటకి నేహ::హా ఇంకా తినలేదు నాన్న...మీరు తినెయ్యండి..నేను తర్వాత తింటా....! నేహ మాటతో రేవంత్ షాక్ అయ్యాడు.... "వామ్మొ...టిఫిన్ తయారు చేశావా అంటే తినలేదు అంటది ఏంటి....ఇది మామూల్ది కాదు...."అని అనుకోని...మళ్ళి రామ్మూర్తి వాయిస్లో..."ఎప్పుడూ నీ గురించే కాదు అల్లుడు గారి గురించి కూడా ఆలోచించు...టిఫిన్ ప్రిపేర్ చెయ్యి వెళ్ళి...."అనేసరికి "ఛా...."అని ఉసూరుమంటూ కిచెన్లోకి నడిచింది.... తను ఉప్మా చేస్తుండగా వాళ్ల నాన్న అక్కడికి వచ్చి కూతుర్ని వంట చేస్తుండగా చూసి...."అబ్బొ ఇంతకుముందు నేను ఎన్ని సార్లో బతిమాలితే...ఏ పండక్కో...పబ్బానికో వంట చేసేదానివి...కాని ఇప్పుడేంటి...పెళ్ళి అయిందోలేదో భలే మారిపోయావే....చెప్పకుండానే చక చకా చేస్తున్నావ్....?మంచిది తల్లి..."అన్నాడాయన ప్రేమగా కూతురి తల నిమురుతూ "నాన్న మీరిందాక నాకు టిఫిన్ చేయమని చెప్పలేదా....?"అడిగింది నేహ "లేదే...."అన్నాడాయన నేహ కళ్ళు ఎర్రబడ్డాయి,....10 నిమిషాల్లో టిఫిన్ చెయ్యడం ముగించి...హాల్లోకి వచ్చి..."ఏవండి...ఏవండి.....టిఫిన్ రెడి అయ్యింది...మింగటానికి ....అదే తింటానికి రండి...."అంది ప్రేమగా "వామ్మో ! ఇంత రెస్పెక్ట్....!మహానటి సావిత్రి నెక్స్ట్ వారసురాలు నేహ లా వచ్చేసింది..ఎంత వినయం ఎంత వినయం....డైరక్టర్ గా కాకుండా హీరోయిన్ గా ట్రై చెయ్యాల్సింది అమ్మగారు..."అని మనసులో అనుకోని నేహ వెనక టేబుల్ దగ్గరికి నడిచాడు రేవంత్ రేవంత్ టేబుల్ పై వున్న పాత్రలని తెరచి చూసి..."వావ్! ఉప్మా.....నాకు చాలా ఇష్టం...."అన్నాడు ఆనందంగా.... "అయ్యొ బాబు...నువ్వలా చెప్పకు.....ఎందుకంటే నేహకి అదొక్కటే వచ్చు.....ఇక నువ్వు ఇష్టమని కమిట్ అయితే నీకు బ్రేక్ ఫాస్ట్,లంచ్,డిన్నర్ కి కూడా అదే చేస్తుంది....."అన్నాడు రామ్మూర్తి నవ్వుతూ "మావయ్య..పర్లేదు ఐ కెన్ ఎడ్జస్ట్...."అన్నాడు రేవంత్ "అవునా ఐతే ఒక బెట్ నీ ప్లేట్ లో పెట్టిన ఉప్మా మొత్తం తినేయాలి....సరేనా...?"అని అడిగాడు ఆయన "హా..ఒకే...చాలెంజ్..."అన్నాడు రేవంత్ నేహ వాళ్ళ బెట్ కి పగలబడి నవ్వుకుంది..... రేవంత్ ఉప్మా ని కొంచెం నోట్లో పెట్టుకోగానే....షాక్....ఆ ఉప్మా సగం ఉప్పు...సగం కారంతో మిళితమై వుంది....వెంటనే నేహ వైపు చూశాడు.. "హ...హ...హ...నా చేతి టిఫిన్ కావాలా నీకు....తిను..తిను...ఎలా తింటావో నేను చూస్తాను....."అని మనసులో విలన్లాగా నవ్వుకుంది....రేవంత్ దయనీయంగా ముఖం పెట్టి తన వైపు చూసేసరికి....ఆమె ముఖం లో విజయ దరహాసం విరిసింది... "ఎలా వుంది బాబు..?"అడిగాడు రామ్మూర్తి "సూపర్ మావయ్య....అమృతం ఇలానే వుండేదేమో అన్నట్టుంది...."అన్నాడు రేవంత్ "సరే బాబు నాకు కొంచెం పనుంది..."అని ఆయన టిఫిన్ తినేసి వెళ్లిపోవడంతో....వాటర్ జగ్గులో నీళ్లన్నీ ఒక్కసారిగా తాగేశాడు.... "ఏవండి....ఇది మీకోసమే స్పెషల్ గా చేశా....తినండి...."అంది అతని ప్లేట్లో వడ్డిస్తూ "ఒసేయ్...నామీద నీకు కోపం వుందని తెల్సు కాని....ఇంతలా పగబడతావని అనుకోలేదే...."అన్నాడు రేవంత్ "ఇదేం వుంది...ముందు ముందు వుందస్సలు పండుగ...ముందయితే ఈ టిఫిన్ తినేసెయ్యి....."అంది నవ్వుతూ "నేహ...నీ ప్రేమ ఏమో కాని నీ పగ మాత్రం చాలా కష్టంగా వుందే....ముప్పుతిప్పలు పెడతావేమో పోను పోను,...ప్లీస్ ఏం చేస్తే క్షమిస్తావో చెప్పు...."అన్నాడు రేవంత్ "ఫైన్ క్షమాపణ గురించి ఆలోచించాలంటే నువ్వీ ఉప్మా మొత్తం తినాలి..."అంది నేహ చేతులు కట్టుకోని *** రేవంత్ నేహ క్షమాపణ కోసం ఆ పనిని చేస్తాడా...? నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం...! ****** హాయ్ రీడర్స్ నేను:💞💞🇧‌🇴‌🇧‌🇧‌🇾💞💞 ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి.. ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి... నా ప్రొఫైల్ ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి...
162 వీక్షించారు
22 గంటల క్రితం
#

లవ్ స్టోరీ

"మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్" పార్ట్ 6 ఇంక రేవంత్ ఏమో తన గతాన్ని కాసేపు పక్కన పెట్టి నేహ గురించి ఆలోచించసాగాడు...నేహ పెళ్ళి వద్దనటానికి కారణం వరుణ్...ఆ...? అసలు ఈ వరుణ్ ఎవరు అని ఆలోచించసాగాడు..... వరుణ్ వల్ల నేహకి మునుపటిలా కాల్స్ మెసేజెస్ చెయ్యలేకపోయాడు *** ఫోన్ పెట్టేసిన తర్వాత నేహ రేవంత్ తో కాంటాక్ట్ లోకి రాలేదస్సలు... 30 గంటల తర్వాత.... ఉదయం4 గంటలు అవుతుండగా.... ఫోన్ రింగవ్వడంతో నిద్ర లేచిన రేవంత్..."హలో మావయ్య చెప్పండి..."అన్నాడు ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని... "నేహ బెంగుళూరు నుంచి మార్నింగ్ ట్రైన్ కి వస్తుంది బాబు...ఏమనుకోకపోతే కాస్త పిక్ చేస్కోవా....?"అని అడగడంతో..."అయ్యొ మావయ్య మీరింతలా అడగాలా.....నేను తీసుకొస్తాను..."అని చెప్పి బైక్ వేసుకొని బయల్దేరాడు....వాళ్ళమ్మ ఒక పక్క కార్ తీసుకెళ్ళమన్నా బైక్ ఐతేనే బావుంటదనుకోని వచ్చాడు....ఫర్ ద ఫస్ట్ టైం బైక్ ...పైగా లైట్ గా వర్షం ఇంటెంషనల్లి వైట్ షర్ట్ బ్లూ జీంస్ వేసుకుని ఎప్పుడు లేనంతగా కొంచెం ఎక్కువగా నేహ కోసం రెడి అయ్యాడు....2 డేస్ అవుతోంది తనని చూసి.... రేవంత్ స్టేషన్ కి వెళ్ళిన 10 నిమిషాలకి వచ్చింది ట్రైన్....తను ఎస్ 4 బోగి లో వుందని గుర్తొచ్చి...అక్కడికెళ్ళి నిల్చున్నాడు....నేహ ట్రైన్ లోంచే రేవంత్ ని చూసి...వేరే వైపున్న ఎంట్రంస్ వద్దకి వెళ్ళి నిల్చుంది..... చాలా మంది దిగారు...రేవంత్ కళ్ళు నేహ కోసం చూస్తున్నాయి....అలా దిగుతున్న వాళ్ళు ఎంట్రంస్ కి అడ్డంగా వున్నాడని రేవంత్ ని ఒక్క తోపు తోశారు..... ఆ తోపులతో పడబోయి తనని ఎవరో పట్టుకోవడం తో బ్యాలెంస్ చేసుకుని...తనని పట్టుకున్నది ఎవరా అని చూస్తే తను ."నేహ..." ఆమెని చుసి పట్టలేని సంతోషంతో గట్టిగా హగ్ చేసుకున్నాడు.... రేవంత్ కి చెప్పలేనంత ఆనందంగా వుంది నేహని చూసేసరికి...తన ఆనందాన్ని మాటల్లో చెప్పలేకున్నాడు...నేహకి కూడా ఇంచుమించు అలానే వుంది...రేవంత్ తననెంత గట్టిగా పట్టుకున్నాడో...తను కూడా అంతే గట్టిగా హత్తుకోవాలనుకుంది కాని తనకి ప్రియాంక గుర్తొచ్చేసరికి అతని వెనకగా వెళ్ళిన చేతులు అతన్ని తాకకుండానే ఆగిపోయాయి.... ఇద్దరూ బైక్ పై ఇంటికి బయల్దేరారు... రేవంత్(మనసులో):అడుగుదామా వద్దా....? నేహ(మనసులో):ప్రియాంక గురించి అడగాలా వద్దా....? నేహ:రేవంత్....2 డేస్ అయ్యిందిగా...ఎనీ థింగ్ ఇంట్రస్టింగ్...? రేవంత్:లేదు రా... "రా.."అనే పిలుపు ఇద్దరికీ కొత్త....ఆ మాట వినడంతోనే నేహ కంట్లోంచి నీళ్ళొచ్చాయి....ఆ కన్నీళ్ళని మిర్రలోంచి చూసిన రేవంత్..."ఏయ్....నేహ ఏమైంది...?ఎందుకు ఏడుస్తున్నావ్....?"అని అడగడంతో నేహ::రేయి ...కాస్త బండి పక్కకి తియ్యరా.... రేవంత్:ఎందుకే మొన్నటిలాగా నన్ను వదిలేసి పోతావా....? నేహ:అరే ఆపరా బాబు... రేవంత్ బండి ఆపాడు.... "రా..."అని రేవంత్ ని నేహ పక్కకి లాక్కెళ్ళి...."ప్రియాంక ఎవరు రా...?"అడిగింది నేహ "ఏ ప్రియాంక నే...?"అడిగాడు రేవంత్ "మొన్న నేను కాల్ చేసినప్పుడు ప్రియాంక అన్నావ్...?" "అదా....ప్రియాంక అని కొత్తగా మా ఆఫీస్ లో జాయినయ్యింది...ముందు 4 సార్లు డౌట్స్ వుంటే కాల్ చేసింది....ఇంక తనేనేమో అనుకోని అలా పిలిచాను అంతే...."అని చెప్పాడు రేవంత్ నేహ::నిజంగానా...? రేవంత్::నిజమే..బాబు నన్ను నమ్ము...!! అంతే రేవంత్ ని గట్టిగా హగ్ చేస్కుంది...."లవ్ యూ రా...మొన్న నువ్వు ప్రియాంక అన్నప్పటి నుంచి ఎంత మధన పడ్డానో తెల్సా....ఐ రియల్లి లాస్ట్ మై సెంస్.....ఐ లవ్ యూ...ఐ లవ్ యూ...."అంటూ ముద్దు పెట్టింది "ఏంటే...ఏం మాట్లాడవు...?ఎందుకు ఏడుస్తున్నావ్....?"అన్న రేవంత్ మాటలకి...అప్పటిదాక వూహల్లో వున్న నేహ బయటకి వచ్చి..."ఏం లేదు....మంచు పడుతుంది కదా...అందుకే అలా అనిపించి వుంటుంది నీకు....."అంది నేహ ఇంతలో నేహ వాళ్ళిళ్ళు వచ్చేసరికి బండి దిగి వాళ్ళింటి వైపు నడుస్తుండగా... రేవంత్::నేహ.... ఆ పిలుపుతో వెనక్కి తిరిగి చూసింది నేహ..."ఒకసారి ఇలా రా...."అన్నాడు సైగ చేస్తూ నేహ అతని వద్దకి చేరి..."ఏంటి...?"అన్నటొక లుక్ ఇచ్చింది....రేవంత్ తన బండి దిగి...నేహ చేతిని ఒక చేత్తో పట్టుకుని.........."బుజ్జి ఒక్కసారిగా అలా వదిలేసి వెళ్ళకే లోపల ఏదోలా వుందే....నిజం చెప్పాలంటే ఈ బాధేంటో అర్థం కావడం లేదు....గుండెని మెలిపెట్టేసినట్టుగా వుంటుంది...ఎప్పుడు అలా వదిలెయ్యకు...సరేనా...?"అని అంటుంటే నేహ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి...రేవంత్ ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి పూర్తిగా తీస్కుని....కన్నీళ్ళతో...."చాలా చెప్పాలే నీకు....చాలా అడగాలే నిన్ను ...సాయంత్రం వెయిట్ చేస్తుంటా నీకోసం...మెల్లిగా లోపలికి వెళ్ళు....చెప్పాను కదా..ఒక్కసారిగా వెళ్లిపోతే....ఏంతో బాధగా వుంటుంది..."అని రేవంత్ అనడంతో తలూపి మెల్లిగా నడస్తుంది.... రేవంత్ ఆమెనే చూస్తున్నాడు...సడన్ గా .."నేహ...నేహ..."అని పిలవడంతో వెనక్కి తిరిగి చూసింది నేహ..."ఐ మిస్డ్ యూ ఏ లాట్...."అన్నాడు రేవంత్ ఒక నవ్వు నవ్వి వెనుదిరిగింది నేహ "రాక్షసి మిస్ యూ టూ కూడా చెప్పవా....."అని అనుకోని తను లోపలకి వెళ్ళగానే తనెళ్ళిపోయాడు.... సాయంత్రం 6 గంటలు... వాళ్ల స్పాట్ లో నేహ కోసం ఎదురుచూస్తున్నాడు రేవంత్....నేహ ఎంత సేపైనా రాకపోయేసరికి ఫోన్ కి ట్రై చేశాడు..."మీరు డయల్ చేసిన వ్యక్తి ప్రస్తుతం అందుబాటులో లేరు...."అన్న మాటతో....వాళ్ల మావయ్య కి కాల్ చేశాడు...ఆయన నేహ ఎప్పుడో బయల్దేరింది అని చెప్పేసరికి.......ట్రాఫిక్ లో ఇరుక్కుపోయుంటుందని తన కోసం వెయిట్ చెయ్యసాగాడు.... ఇంకొక్క అరగంట భారంగా గడిచింది...ఇంతలో రేవంత్ ఫోన్ రింగవ్వడంతో నెంబర్ చూస్కోకుండా...లిఫ్ట్ చేసి..."హలో నేహ...."అని పలకరిచాడు....కాని అవతల కాల్ చెసింది నేహ కాదు వాళ్ళ బాస్ అని తెలియడానికి ఎక్కువ సమయమేమి పట్టలేదు... "ఏంటి రేవంత్..?నేను నీ నుంచి ఇదస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు...నువ్వింత ఇరెస్పాంసిబుల్ గా వుంటావనుకోలేదు...ఇంత పెద్ద మిస్టేక్....అది నీ వల్ల జరిగింది.....ఐ వోంట్ స్పేర్ యూ ...యూ ఆర్ డిస్ మిస్డ్...."అని బాస్ అరుస్తుండగా "సార్ గివ్ మీ ఏ చాంస్ ....అసలు ఏం అయ్యిందో చెప్పండి....నా వల్ల ఏ తప్పు జరిగిందో తెలియజేయండి..."అని ఇంగ్లీష్ లో అడిగాడు... నథింగ్ డూయింగ్...ఐ సెడ్ యూ ఆర్ ఔట్...గెట్ లాస్ట్..."అని కోపంగా కాల్ కట్ చేసాడు బాస్ ఒక పక్క నేహ ఇంకా రాలేదని ఫ్రస్టేషన్..ఇంకో పక్క ఏమైందో తెలియకుండానే జాబ్ పోయింది...ఇంత కోపం చిరాకు లో వుండగా నేహ నుంచి కాల్ వచ్చింది...ఫోన్ ఎత్తి నేహ ఏం చెబుతుందో వినసాగాడు.... నేహ::హలో...హలో.....అది...వరుణ్....?! ఇంతలో కాల్ కట్ అయ్యింది.... 10 నిమిషాలకి మునుపు....వెంకటేశ్వర స్వామి గుడిలో...."ఉదయం రేవంత్ ఏదోదో మాట్లాడాడు...మిస్ యూ అన్నాడు....?మరి అంతలా మిస్ అయ్యేవాడు నన్ను పట్టుకుని ప్రియాంక అని ఎందుకన్నట్టు....?ఇప్పుడు అతని దగ్గరికి వెళ్లాలా వద్దా.....పాపం తను వెయిట్ చేస్తుంటాడు......ఇప్పటికే తను రమ్మని చెప్పి గంట దాటిపోతుంది....."అని లేచి స్కూటి స్టార్ట్ చేసింది నేహ రేవంత్ కి నేహ నుంచి కాల్ వచ్చిన 2 నిమిషాల తర్వాత.... నేహ రేవంత్ దగ్గరికి వచ్చింది.....అతను మౌనంగా కూర్చుని వుండడంతో....అతని వద్దకి నడిచి..."రేవంత్....?"అని పిలిచిందో లేదో....తల ఎత్తి కోపంతో ఎర్రగా మారిన కళ్లతో తన వైపు వురిమి చూశాడు రేవంత్ "ఎందుకొచ్చావే....?బతికానో చచ్చానో చూద్దామని వచ్చావా...?నీ పాటికి నువ్వు ఫోన్ స్విచ్చాఫ్ చెసుకోని హ్యాపిగానే తిరుగుతావ్.....ఇక్కడ నేను పిచ్చోడిలా నీకోసం టెంషన్ పడుతుంటా.....నీ వల్ల కేవలం నీ వల్ల ఐ జస్ట్ లాస్ట్ మై హ్యాపినెస్....ముందు నీ మాటలతో మా అమ్మని బుట్టలో వేసుకున్నావు......నాకేదో హెల్ప్ చేస్తున్నట్టు నటించి నన్ను మాయ చేశావ్.....ఇప్పుడేమో ఇగ్నోర్ చేస్తూ నీ వెంట తిప్పుకోవాలని చూస్తున్నావా....?నాకు మొదటి నుంచి కొడుతూనే వుంది....గుడిలో గొడవైనప్పుడే నన్ను మింగేశేలా చూశావ్...ఇంక నీ ఫోన్ లో నా ఫోటోలు సేవ్ చేస్కుంటే ఏమో అనుకున్నాను...ఇదా నీ ప్లానూ....నన్ను ట్రాప్ చెయ్యాలనుకున్నావ్ కదా.....నన్ను మా అమ్మని ట్రాప్ చేశావ్....బాగుంది...చాలా బాగుంది....దీనివల్ల నీకే లాభమో నాకు తెలియదు కాని నీ ఇంటెంషన్ నాకు పూర్తిగా అర్థమయ్యింది....నా హ్యాపినెస్ ని నానుంచి దూరం చెయ్యాలనుకున్నావ్ కదా....ఆల్రెడి సగం ఆ ప్రియాంక ఎత్తుకెళ్ళింది.....ఇప్పుడు నువ్వొచ్చావా....?అది జరగనివ్వను...ఇప్పుడు చెప్తున్నా విను నువ్వు ఒప్పుకున్నా ...ఒప్పుకోకున్నా ఐ డోంట్ కేర్...నేను నిన్ను పెళ్ళి చేసుకుంటా.....నా లైఫ్ తో ఆడుకోవాలనుకోని నువ్వెంత పెద్ద తప్పు చేశావో నీకు తెలిసేలా చేస్తా...గుడ్ బై...."అని వెళ్ళిపోయాడు... నేహ అతని మాటలకి చాలా బాధపడింది..."నేను తన లైఫ్ తో ఆడుకున్నానా....అసలేం మాట్లాడాడు.....?నేనెందుకు తన ఆనందాన్ని చిదిమేయాలనుకుంటాను...నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాడా....?"అంటూ చాలా సేపు అక్కడే కూర్చుని మౌనంగా రోదించింది నేహని తిట్టేసి ఇంటికి వచ్చి ఏం తినకుండా నిద్రపోయాడు రేవంత్...ఉదయం ఫోన్ రింగ్ అవ్వడంతో నిద్ర లేచిన రేవంత్ కాల్ అటెండ్ చేసాడు...."సారి రేవంత్..చిన్న మిస్ అండర్ స్టాడింగ్ వల్ల అలా అనేసాను...ఐ యాం రియల్లి సారి ఫర్ ఇట్...నువ్వు నీ జాబ్ లో కంటిన్యూ అవ్వొచ్చు..."అని చెప్పాడు బాస్ "ఒకే సర్..."అని కాల్ కట్ చేసిన రేవంత్ తల పట్టుకుని ఆలోచించసాగాడు...."చా....జాబ్ ఫ్రస్టెషన్..తను రాలేదన్న కోపం కలిసి.....నేహని చడామడా తిట్టేశాను...అసలు ప్రియాంక కి తనకి ఎలా కంపారిజన్ చేశాను...?మరి ఇంత ఫూలిష్ గా బిహేవ్ చేస్తాననుకోలేదు...నేహ కి అర్జెంట్ గా సారి చెప్పాలి...."అనుకోని తన నెంబర్ కి ట్రై చేశాడు.ఎన్నిసార్లు రింగ్ అయినా నేహ కాల్ లిఫ్ట్ చెయ్యకపోయేసరికి....ఇలా కాదని వాళ్ళింటికి వెళ్తాడు... బెల్ నొక్కగా తలుపు తీసిన రామ్మూర్తిని చూసి..."మావయ్య నేహ....?"అని అడిగేసరికి "నేహ రాసిన స్క్రిప్ట్ ఒక డైరక్టర్ కి బాగా నచ్చింది రేవంత్....అందుకని నేహని అసిస్టెంట్ గా తీసుకున్నాడు....పొద్దున్నే షూటింగ్ వుండడంతో వెళ్ళిపోయింది....."అనేసరికి..."సరే అంకుల్ ...షూటింగ్ ఎక్కడ...?"అని ఆయనని అడిగి ప్లేస్ తెల్సుకుని...అక్కడికి వెళ్ళడానికి కార్ తీశాడు... "ఇంత పెద్ద విషయం నాకు నేహ అస్సలు చెప్పలేదేంటి....?"అని ఆలోచిస్తూ షూటింగ్ స్పాట్ కి వచ్చేశాడు.... "అయినా నోటికొచ్చిన్నట్టు తిట్టేశాను...చాలా ఫీల్ అయ్యుంటది కదా....అసలు వర్క్ మీద కాంసట్రేట్ చేస్తుందో లేదో..."అనుకుంటూ అక్కడ కనిపించిన అతన్ని నేహ గురించి అడిగితే తనున్న చోటు చూపించాడు.... తనని వెతుకుతూ లోపలికి వెళ్ళిన రేవంత్ కి...నేహ కుర్చిలో కూర్చుని ఏదో సిరియస్ గా చదువుతూ కనిపించింది....తన దగ్గరకి వెళ్లబోయేంతలో...ఒక అబ్బాయి నేహ కళ్లని మూసి..."ఎవరో చెప్పుకో చూద్దాం...."అన్నాడు "వరూణ్!"అంది నేహ ఆశ్చర్యపోతూ... ఆ అబ్బాయి తన కళ్ల మీద నుంచి చేతులు తీసేసి..."భలే కనిపెట్టేశావే...అలా ఎలా...?"అన్నాడు తన ముందున్న కూర్చిలో కూర్చుంటూ "అది తర్వాత గాని....మొన్న బెంగళూర్ లో కనిపించావ్ ఇప్పుడేంటిక్కడ....?"అంది నేహ అతన్ని తీక్షణంగా చూస్తూ "నీకోసమేనే....."అని ఆ అబ్బాయి ఏదో చెప్పబోతుండగా నిమిషం కూడా అక్కడ వుండలేక......బయటకి వచ్చేసి బైక్ ఎక్కి ఆఫీస్కి వెళ్తూ..."రేవంత్ కంట్రోల్ రా...కంట్రోల్....."అనుకుంటూ ఆఫీస్ చేరాడు.... *** ఆ రోజు తర్వాత రేవంత్ నేహ ని కాంటాక్ట్ చెయ్యలేదు.....తనతో మాట్లాడాలని మనసు లాగుతున్నా.....ప్రియాంక విషయమ్లో మోసపోయినట్టు మళ్ళి నేహ విషయమ్లో జరగకూడదని మనసు ని స్థిరం చేసుకుని...తనతో మాట్లాడలేదు.... ఎంగేజ్ మెంట్ రోజు..... "రేయ్ రేవంత్ ఎంతైనా నువ్వు చేసింది తప్పే.....నువ్వు నేహకి సారి చెప్పాల్సిందే.....మన్నించాలో వద్దో తను డిసైడ్ చేసుకుంటుంది...కాని నీ వంతుగా నువ్వు నీ తప్పుని సరిదిద్దు కోవాల్సిన బాధ్యత నీపై వుంది..."ఇలా మనసుని సంసిద్ధం చేసుకోని నేహకి సారి చెప్పాలని డిసైడ్ అయ్యాడు నిశ్చితార్థానికి ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు వాళ్ళ వాళ్లతో పాటు....రేవంత్ నేహ వైపు క్షమించమన్నట్టు చూశాడు...నేహ రేవంత్ ని కోపంగా చూస్తోంది.. రేవంత్(మనసులో):బాబోయి మింగేసేలా చూస్తుంది....దీన్ని ఎలా ఒప్పించాలి భగవంతుడా....! ఇద్దరూ రింగ్స్ మార్చుకున్న తర్వాత అందరూ భోజనాలకి వెళ్ళిపోయారు....ఫోన్ రావడంతో అవతల వారితో నవ్వుతూ మాట్లాడుతుంది నేహ....అలా తను నవ్వుతుంటే కళ్ళార్పకుండా చెంపల కింద చెయ్యి పెట్టుకుని తననే చూడసాగాడు రేవంత్...రేవంత్ తననే చూస్తుండడం గమనించిన నేహ...కోపంతో రేవంత్ కాలు మీద కాలేసి కసి తీరా తొక్కసాగింది....మొదట్లో నేహని చూసి మైమరిచిపోయిన రేవంత్ మెల్లిగా నొప్పి తెలుస్తుండడంతో..."అమ్మా..."అని అరిచాడు.... అతని అరుపుకి కంగారుపడి కాలు తీసేసింది నేహ....రేవంత్ ముఖం చూడ్డం ఇష్టం లేక పక్కకి వెళ్ళి నిల్చుని బయట పడుతున్న వర్షాన్ని చూస్తుండగా...ఎప్పుడొచ్చాడొ తెలియదు కాని రేవంత్ తన వెనకే వచ్చి నిల్చున్నాడు...."నేహ..."అని ధైర్యం కూడదీసుకుని పిలిచాడు... వెనక్కి తిరిగిన చూసిన నేహ...తన వెనకే వున్న రేవంత్ కనిపించడంతో కోపంగా చూసి పక్కకి వెళ్లబోయేంతలో తన చెయ్యి పట్టుకుని ఆపాడు.... "నా చెయ్యి వదులు...."మాట్లాడకపోయినా చూపులతోనే తన భావాన్ని కంవే చేసింది నేహ..."వదులుతాను కాని నువ్వు నాతో మాట్లాడాలి...."అన్నాడు తన కళ్ళలోకి చూస్తూ "నేను మాట్లాడను" అన్నట్టు తల అడ్డంగా వూపింది నేహ....ఇలా కాదని రేవంత్ తన చేతిని మెలిపెట్టి తన వైపుకి ఫోర్స్ గా లాక్కున్నాడు...ఆ దెబ్బతో...నేహ రేవంత్ గుండెలపై వాలిపోయింది.... "నేహ...నీతో మాట్లాడాలి..."అని మళ్ళి పలికాడు రేవంత్ నేహ దానికి సమాధానం ఇవ్వలేదు..."ఒసేయ్...!నీతో నే మాట్లాడేది....బెల్లం కొట్టినా రాయిలా నిల్చుంటావేంటే...మాట్లాడు ప్లీస్..."అన్నాడు రేవంత్ తల అడ్దంగా వూపింది నేహ.... "నేను తిడుతున్నంత సేపు తిట్టుంచుకున్నావు...ఒక్కమాట కూడా మాట్లాడలేదు...అలానే నా క్షమాపణ కూడా వినవే ప్లీస్...."అన్నాడు రేవంత్ "చెయ్యి వదులు వింటాను..."నేహ నుంచి మాట రావడం ఆలశ్యం చెయ్యి వదిలేశాడు రేవంత్ తన చెయ్యి అతని చేతినుంచి విముక్తి కావడంతో రెండో ఆలోచన లేకుండా అతని నుంచి పరిగెత్తింది...నేహ వెనకనే అడుక్కుంటూ వెళ్ళాడు రేవంత్... "ప్లీస్ నేహ....ఒక్కసారి వినొచ్చు కదా...."అని చాలా సార్లు అడిగి అడిగి విసుగొచ్చి చివరికి తన చెయ్యి పట్టుకుని మెట్ల మీదకి లాక్కెళ్ళాడు....ఎవ్వరూ లేరని నిశ్చయించుకున్నాక....ఆమె చేతిని అలానే పట్టుకుని తన కళ్లలోకి తీక్షణంగా చూడసాగాడు....నేహ మాత్రం తన చేతిని విడిపించుకోవాలని శతవిధాల ప్రయత్నిస్తుంది... "రెండే రెండు నిమిషాలు నేను చెప్పేది విను...అంతే..."అన్నాడు రేవంత్ చేతులు కట్టుకుని చెప్పమన్నట్టు సైగ చేసింది నేహ...."సారి నేహ ఆరోజు కోపం లో అలా వాగినందుకు...నేను అప్పుడు నా సెంసెస్ లో లేను...నాకప్పుడే జాబ్ పోయింది...నువ్వేమో కనపడకుండా పోయావ్......ఇవన్ని వెరసి...ఆరోజు ఎలా పడితే అలా మాట్లాడేశాను...ఐ యాం రియల్లి సారి...."అన్నాడు రేవంత్ అతని మాటలు పూర్తవ్వడంతోనే చప్పట్లు కొట్టింది నేహ..."వాహ్ ...!వాట్ యాన్ యాక్టింగ్....నేను నిన్ను ఆస్కార్ కోసం నామినేట్ చెయ్యనా...??కాదు కాదు మీ యాక్టింగ్ కి నోబెల్ లో సహజ నటుడు అని ఒక క్యాటగిరి పెట్టి...ఆ బహుమతి నీకివ్వాలి.......హలో మిష్టర్ రేవంత్,....ఆ రోజు మీరు చెప్పినదంతా నాకు గుర్తుంది....నా లైఫ్ ని నాశనం చేస్తాననేగా అన్నావు,....?వెరి గుడ్....దానికోసం ముందుగానే యాక్టింగ్ కూడా స్టార్ట్ చేశావు...యు ఆర్ గ్రేట్ ...యు ఆర్ ఏ బోర్న్ ఆర్టిస్ట్.....ఐ సెల్యూట్ యూ సార్..."అంది కోపంగా "ఎహే పిచ్చి!నిజం చెప్తే నమ్మవేంటి...?చూడు నేహ నేను చెప్పినదంతా నిజం...ప్లీస్ నమ్ము..."అన్నాడు రేవంత్ "మీరు అడిగిన 2 నిమిషాలు అయిపోయాయి...నేను వెళ్తున్నా...."అని వెళ్లబోతుంటే...చెయ్యి వదలకుండా గట్టిగా పట్టుకుని...నేహని తన వైపు లాక్కొని తన కౌగిలిలో బంధి చేస్తూ..."నేహ ...ఈ లోకం లో నన్నెవ్వరూ నమ్మకున్నా పర్లేదు కాని..నువ్వు నమ్మడం నాకు కావాలి...అందుకే ఇంత ఇదిగా నిన్ను బతిమాలుతున్నాను...ప్లీస్..."అన్నాడు రేవంత్ అతన్ని విడిపించుకోని...."నేను మీ ఆనందాన్ని నాశనం చెయ్యాలని వచ్చాను కదా...మరేందుకు నా నమ్మకం కావలనుకుంటున్నారు,...?"అంది కోపంగా ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీస్కుని ఎందుకంటే.... "నీ కళ్లలో నాపై ప్రేమ చూడాలనకుంటున్నా అసహ్యాన్ని కాదు....నీ పెదాల పై నా కోసం వచ్చే చిరునవ్వు చూద్దామనుకుంటున్నా...నీ కళ్లలోంచి వచ్చే కన్నీళ్ళని కాదు..."అన్నాడు తన కళ్ళలోకి చూస్తూ "వాహ్...వాట్ ఏ డైలాగ్..."అంది నేహ ఆమె అలా అనడంతో ఆమెని వదిలేసి......తన దగ్గరికి జరిగి ఆమె చేతిని తన హృదయం పై వుంచి...."ఐ నీడ్ యువర్ ట్రస్ట్ బికాస్ ఐ లవ్ యూ....."అని ఆమె నుదిటి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు.... తననుంచి దూరంగా వెళ్తూ..."ఇప్పుడు నేనేం చెప్పాను...?ఐ లవ్ యూ నా....?ఇదెలా సాధ్యం..?"అని అయోమయమ్లో పడ్డాడు రేవంత్ చెప్పిన మాటలు నేహ చెవుల్లో మారు మోగుతున్నాయి....తనలో ఆనందం పురివిప్పే సమయానికి వెంటనే మొన్న రేవంత్ చీప్ గా మాట్లాడినవి గుర్తొచ్చి....కళ్ళలో నీళ్ళు జల జలా రాలాయి...... ఒక్కొక్కటిగా అన్ని కార్యక్రమాలు అయిపోతున్నాయి....నలుగులు వ్రతాలు...అన్ని ఉత్సాహంగా చేయిస్తున్నారు రామ్మూర్తి-మీనాక్షి లు.... పెళ్ళి ముహూర్తం ఆ రోజు వుదయం 4 గంటలకి అనగా ...ముందురోజు రాత్రి 12 గంటలు సడన్ గా నిద్ర నుంచి మేల్కుంది నేహ...ఇంకో గంటన్నరలో తనని పెళ్ళికూతుర్ని చేస్తారు..... అది గుర్తొచ్చి...వడివడిగా కపోర్డ్ వైపు నడిచి...అందులో వున్న బట్టలన్ని వరసగా తీసింది....?! **** నేహ ఏం చెయ్యబోతుంది....? తెల్సుకోవాలనుందా...? నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే... అన్నట్టు కొన్ని కారణాల వల్ల నెక్స్ట్ ఎపిసోడ్ లేట్ అవ్వొచ్చు.... హాయ్ రీడర్స్ నేను:💞💞🇧‌🇴‌🇧‌🇧‌🇾💞💞 ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి.. ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి... నా ప్రొఫైల్ ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి...
247 వీక్షించారు
3 రోజుల క్రితం
#

లవ్ స్టోరీ

"మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్" పార్ట్ 5 వెంటనే తనని చేరేసరికి....అమె కూడా స్పృహ కోల్పోయిందని అర్థమైంది.....ఆమెని చూడ్డానికి ముందుకు వెళ్ళేసరికి ఆమె ముఖం అతనికి సుస్పష్టంగా కనిపించింది....అంతే ఆమెని చూసి షాక్ అయిపోయాడు రేవంత్ అరనిమిషమ్లో అతని శరీరం ముచ్చెమటతో తడిచిపోయింది....ఎవరో తన భుజం మీద చెయ్యి వెయ్యడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు....తలకి దెబ్బతో అతి కష్టం మీద అక్కడిదాకా వచ్చిన నేహ....కళ్ళు తిరిగి పడబోతుండగా పట్టుకున్నాడు రేవంత్...! **** తిరిగి కళ్ళు తెరిచేసరికి నేహ హాస్పిటల్ లో వుంది.....ఎదురుగా రేవంత్ కనిపించాడు... "నాన్నా..."అంటూ కలవరించింది నేహ "ఆన్ ద వే..."ఏదో ఆలోచిస్తూనే చెప్పాడు రేవంత్... "రేవంత్ నాకో ఐడియా వచ్చింది చెప్పనా....?" "దెబ్బ తగిలినా నీ బుర్ర బాగవలేదా...?మళ్ళి ఏ తొక్కలో ఐడియా తట్టింది నీ కోడి మెదడుకి...?"అడిగాడు రేవంత్ "మూస్కొని విను...మన వాళ్లకి ...ఈ పెళ్ళి అనుకోవడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని అనుమానం కలిగేలా చేస్తే...?వాళ్ళు మన పెళ్ళి చెయ్యడం గురించి ఆలోచిస్తారు కదా....?"అడిగింది నేహ రేవంత్ ఆలోచించడం చూసి "ఇప్పుడు చెప్పు నాది కోడి మెదడా....?"అనుమానంగా అడిగింది నేహ రేవంత్ బాగా ఎక్సేట్ అయిపోయి.....నేహ బుగ్గ పై ముద్దిచ్చి..."డార్లింగ్ నవ్వసలు తోపు, తురుము ,కత్తి.....ఇప్పుడే వస్తాను వుండు...."అని లేచి బయటకి వెళ్లాడు... రేవంత్ చేసిన పనికి షాక్ అయిపోయిన నేహ...ప్రేమగా తన బుగ్గని తడుముకుంది....ఇదిలా వుండగా రామ్మూర్తి కంగారుగా నేహ గదిలోకి వచ్చి.... "ఎలా వుందమ్మా...నేహ....?"అని అడగడంతో "పర్లేదు నాన్నా...బానే వుంది...కాకపోతే ఒక్కటి అడుగుతా ఏమనుకోవుగా....?"అని నేహ అడిగింది "హా చెప్పమ్మా...." "మేము చేయాల్సిన పూజలవి సరిగ్గా చెయ్యట్లేదేమో కనుక్కో నాన్నా...పొద్దున్న అలా పడబోయాను...ఇప్పుడేమో ఇలా అయ్యింది..."అంది బాధగా నేహ మాటలకి రామ్మూర్తి ఆలోచనలో పడ్డారు...మీనాక్షి కూడా అక్కడికి వచ్చేసరికి తలకి కట్టుతో వాళ్ళమ్మకి ఎదురెళ్ళాడు రేవంత్...కొడుకుని అలా చూసేసరికి మీనాక్షి కూడా రామ్మూర్తి లానే ఆలోచనలో పడింది...వారివురు మాట్లాడుకోని రేవంత్ నేహల జాతకాలు తీసుకుని వేరే పంతులు దగ్గరికి వెళ్ళారు.... ఆయన వాళ్ళిద్దరి జాతకాలు పరిశీలించి.."ఇద్దరి జాతకాలు పాలు నీళ్లలా కలిసిపోయాయమ్మా...అయినా వారివురుని ఎప్పుడైతే జత చెయ్యాలని మీరు భావించారో అప్పుడే వాళ్ళిద్దరి మధ్య బంధం ఏర్పడింది....ఆ బంధమే వారిద్దరిని పెద్ద గండం నుంచి గట్టెక్కించింది..."అని చెప్పేసరికి అక్కడే వున్న రేవంత్-నేహ ముఖముఖాలు చూసుకున్నారు....! ఆ సాయంత్రం నేహ::ఛా...అన్ని ప్లాంస్ ఫెయిల్ అవుతున్నాయి...ఏంటి రేవంత్ ఇది...? రేవంత్::కలికాలం ఏం చేస్తాం....? నేహ::ఇది చలికాలం కదా రేవంత్ రేవంత్::నీ బొందే నీ బొంద... నేహ::హి..హి...హి అవును నాకో డౌట్ అడగనా....? రేవంత్::అడగొద్దు అంటే మాత్రం వదులుతావా...?వదలవుగా...నీ abcd డౌట్ ఏంటో అడుగు.... నేహ:abcd ఏంటి...? రేవంత్::అమ్మా తల్లి బుద్ధి గడ్డి తిని ఏదో నోటికొచ్చింది వాగాను....ప్లీస్...నీ అమూల్యమైన అత్యద్భుతమైన డౌట్ ఏంటో అడుగమ్మా....!? నేహ::అంటే నేను స్పృహలోకి వచ్చాక నీ తలకి కట్టు లేదు....మరిప్పుడు వుందేంటి...? రేవంత్:నీ దిక్కుమాలిన ఐడియాకి మసాలా యాడ్ చేద్దామని నేనే కట్టుకున్నాను... "ముష్టి వేషాలు వెయ్యమాకు....ఇందాక నా ఐడియా విని తోపు తురుము అని..అది ఫ్లాప్ అయ్యేసరికి దిక్కు మాలిన ఐడియా అంటావా...అసలు ఈ పెళ్ళి ఆపడానికి నీ కంట్రిబ్యూషన్ ఎంత ?ముష్టి ఒక్క ఐడియా అది కూడా పాత సినిమాలన్ని చూసి కొట్టేసావ్...అదే నా కంట్రిబ్యూషన్ 2 ఐడియాలు.....నా బుర్ర ఉపయోగించి....సిట్యువేషన్ ని క్యాష్ చేసుకోని ఆలోచిస్తే వచ్చినవి...అది గుర్తించకుండా......ఓ తెగ షో చేస్తున్నావ్..."అని ఒక్క ఉదుటున తన కడుపులోని మంటని బయట పెట్టి ఊపిరి పీల్చుకుంది.... రేవంత్ నోరు తెరిచి మరీ ఆమె ప్రసంగం విని చేతులెత్తి దండం పెడుతూ....."అమ్మా తల్లి తప్పయిపోయింది...క్షమించు...నువ్వు నా పాలిట పైనుంచి దిగివచ్చిన కామధేనువమ్మా....ఈ మూర్ఖుడిని క్షమించమ్మా....!" *** మార్నింగ్ 6:00 గంటలు... లొకేషన్ :రెగ్యూలర్ మీటింగ్ స్పాట్... నేహ రాక కోసం రేవంత్ ముందుగానే అక్కడికి వచ్చి వెయిట్ చెయ్యసాగాడు....అరగంట గడిచినా నేహ రాలేదు..."ఈవిడ గారు ఏమై పోయారు....?"అని అనుకుంటూ తన ఫోన్ కి కాల్ కలిపాడు.....నేహ ఫోన్ స్విచ్చాఫ్ అని రావడంతో.... "సర్లే వెయిట్ చేద్దాం...."అని అలానే అక్కడున్న ప్రకృతిని ఆశ్వాదిస్తూ నేహతో తన పరిచయం ఎలా అయ్యిందో ఙపకం తెచ్చుకోసాగాడు.... అలా ఆలోచిస్తుండగా...అతని ముఖం మీద తెలియకుండానే చిరునవ్వు విరిసింది....టైం చూస్కోగా ఇంకొక అరగంట గడిచిపోయిందని తెల్సింది...మళ్ళి నేహ ఫోన్ కి ట్రై చేసినా స్విచ్చ్డ్ ఆఫ్ అనే రావడంతో ఇలా కాదు అని....తనకి కాబోయే మామగారు రామ్మూర్తికి కాల్ చేశాడు..... రామ్మూర్తి:హలో రేవంత్ చెప్పు..... రేవంత్::అంకుల్ నేహ.... రామ్మూర్తి:అయ్యొ చెప్పడమే మరిచిపోయా....నేహ మార్నింగ్ బెంగళూర్ కి వెళ్ళింది... రేవంత్:అవునా....తను నాకు చెప్పలేదే...? రామ్మూర్తి:ఏంటో రేవంత్ అర్జెంట్గా కాల్ రావడంతో విషయం కూడా సరిగ్గా చెప్పకుండా అప్పటికప్పుడు వెళ్ళింది.....నీకు చెప్పమని నాకు చెప్పింది...నేనే ఏదో పనిలో వుండి మర్చిపోయాను....నాకు తెల్సి ఒక 2 రోజుల్లో వస్తుందేమో.... మధ్యాహ్నం.... ఆఫీస్ లో రేవంత్ నేహ కి కాల్ చేశాడు....పొద్దున్న మాదిరిగానే తన ఫోన్ స్విచ్చాఫ్ అని రావడంతో...తన ఫోన్ కి...వాట్స్ అప్ కి.....ఫేస్ బుక్ కి,ఇన్ స్టా గ్రాం కి,హైక్ కి కూడా మెసేజ్ చేస్తాడు...కాని తన నుంచి ఎటువంటి రిప్లై రాలేదు.... ఆ సాయంత్రం..... ఆకాశం మేఘావృతం అయ్యి వుంది....అప్పుడే చిన్నగా చిరుజల్లు కురవడం మొదలైంది....అలానే ఒక్కడే నడుస్తూ తమ మీటింగ్ స్పాట్ కి చేరుకున్నాడు రేవంత్ నేహ తో మాట్లాడిన మాటలు...తిన్న తిట్లు...అట్టర్ ఫ్లాపైన ప్లాన్లు.....వేయించుకున్న పంచ్ లు....అన్ని గుర్తొచ్చాయి..... ఆ తర్వాత ఇంటికి చేరిన రేవంత్ ఏదో తిన్నాననిపించి....మళ్ళి నేహ కి కాల్స్ మెసేజ్స్ చెయ్యసాగాడు... ఆ రాత్రి 10 గంటల 29 నిమిషాలు అవుతుండగా తనకి వందవ మెసేజ్ పంపుతున్నాడు రేవంత్.....ఇంతలో తన ఫోన్ కి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ రావడంతో..లిఫ్ట్ చేసి.. రేవంత్:హలో నేహ అవతల ఏవో శబ్దాలు వస్తున్నాయి తప్ప ఏమి వినపడడం లేదు... రేవంత్ మళ్ళి తన గొంతు సవరించుకోని రేవంత్:హలో నేహా....నేహా....! అవతల నుంచి నేహ గొంతు వినిపించడంతో ప్రాణం లేచొచ్చింది రేవంత్ కి...."హలో...నేహా...నేహా...."అని అంటుండగా.... నేహ గొంతు వినిపిస్తుంది కాని తను మాట్లాడుతుంది రేవంత్ తో కాదు....తను మరొకరితో మాట్లాడుతుందని ఆమె మాటల ద్వారా తెలుస్తుంది....తనేం మాట్లాడుతుందో చెవులు రిక్కించి మరీ వింటున్నాడు రేవంత్... (నేహ ఎవరితోనో ప్రేమ గురించి ఎక్స్ ప్లెయిన్ చేస్తుంది...ఇక్కడ వచ్చేదంతా తన భావాలు...అని గుర్తించగలరు) నేహ::నీకు తెలియనివి చాలా వున్నాయి "వరుణ్"...ప్రతి అమ్మాయికి తనకి వచ్చే భర్త గురించి కొన్ని ఆలోచనలుంటాయి....నాకు వచ్చే వాడు ఇలా వుండాలి....అలా వుండాలి అని వూహించుకోవడం సహజం....కాని నాకు నిన్ను చూసే దాకా నాకు రాబోయే భర్త గురించి అలాంటి ఆలోచనలేమి లేవు...కాని ఒక్కసారి నిన్ను చూశాక...అలా ఊహల్లో బతకాల్సిన అవసరం పడలేదు....ఎందుకంటే నిన్ను చూసిన నేను నన్ను మరిచాను.... నీకు తెలియకుండా నీ వెంట నడిచాను..... వినడానికి సినిమా డైలాగ్ లా వున్నా ఇది నిజం...అప్పటిదాకా నాన్నే ప్రపంచంగా బతుకుతున్న నాకు...నీతో లైఫ్ కనిపించింది....కాదు కాదు నువ్వే నా లైఫ్ అనిపించింది...."నేను నిన్ను మొదటి సారిగా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో చూశాను......ఆ రోజు నేను ఫస్ట్ బెంచ్ లో కూర్చుని ఫస్ట్ క్లాస్ గురించి టెంషన్ పడుతుంటే ఎంట్రంస్ లోంచి వస్తూ నువ్వు కనిపించావు...ఆ క్షణమే ఫిక్స్ అయ్యా...నువ్వు లేని నేను "లేనని" క్లాస్ చెబుతోంది సార్ ఓ మేడమో...అసలేం సబ్జెక్టొ పట్టించుకునేదాన్ని కాదు 24 గంటలు నీ ధ్యాసే.....నువ్వేమో లాస్ట్ బెంచ్ నేనేమో ఫస్ట్ బెంచ్....అలా వెనక్కి తిరిగి చూడడం కష్టమవుతుందని.....నేను లాస్ట్ బెంచ్ కి మారిపోయానొక రోజు...కాని నా బ్యాడ్ లక్...ఆ రోజు నుంచి నువ్వు మొదటి బెంచ్ లో కూర్చోవడం స్టార్ట్ చేశావ్.... అయినా బెంచ్ల మధ్య దూరం నా కళ్ళలో నీ బొమ్మని చిత్రించుకోవడానికి అడ్డు కాలేదు.... నీలో నాకు బాగా నచ్చింది నీ నవ్వే రా......సార్ వాళ్ళు వేసే కుళ్ళు జోకులకి నవ్వేవాడివో లేక.....నీ పక్కన అబ్బాయి వల్ల నవ్వేవాడివో తెలియదు కాని...నువ్వు నవ్వుతున్నంత సేపు నా ప్రపంచం స్తంభించిపోయేదంటే నమ్ము....అసలేదో మత్తు వుందిరా బాబు నీ నవ్వులో....ఆ నవ్వు కే ఎవరైనా పడిపోతారు...అందులో నేను కూడా ఒకటి.... ఇక నీ విషయానికి వస్తే నువ్వస్సలు నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు కాని....నీ పక్కనోడు ముద్దుగా వాడికి నేను పెట్టుకున్న పేరు దిష్టి చుక్క.....ఆ దుష్టి చుక్క మాత్రం నేను నిన్ను తనివితీరా చూస్తుంటే వాడ్ని చూస్తున్నాననుకోని తెగ షో కొట్టేవాడు.... అసలు వరుణ్....నీ కోసం నేను చెయ్యని పనంటూ లేదు తెల్సా.... నిన్ను చూసిన రోజే నీ మీద ఒక కవిత రాశా.... ఆ తర్వాతి రోజు...నీ బొమ్మ గీశా....అఫ్ కోర్స్ అదంత బాగా రాలేదనుకో.... 5 వ రోజు....నీ గుర్తుగా వుంటుందని నీ బుక్ నొక్కేశా....అదే రోజు నీ బుక్ లో నా భావాలన్ని వ్యక్త పరుస్తూ ఒక లెటర్ కూడా పెట్టాను 6 వ రోజు ఏమైందో తెల్సా.....నేను లంచ్ చెయ్యడానికని హాస్టల్ కి వెళ్తుంటే.... ఆరోజు నీ పక్కనుండే నీ ఫ్రెండ్(దిష్టి చుక్క)...అదే ఇందాక నాకు లైన్ వేశాడని చెప్పానే వాడు నా వెనక ఫాలో అయ్యాడు.... అతను:ఓయ్ అమ్మాయ్.... నేను (నేహ):ఏంటి....? అతను:నా బుక్ నువ్వు తీసుకున్నావు...ఇచ్చేయి....! నేను:నేనా....? అతను:హా...మొన్న నేను బ్రేక్ కి వెళ్ళినప్పుడు తీశేశావ్...నాకు తెల్సు లే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని...అయినా నువ్వు నాకు చెప్పాలనుకున్నదంతా నిన్న లెటర్ లో రాసి బుక్ లో పెట్టావు కదా...ఇక నా బుక్ నీకెందుకు ఇచ్చేయి...అసలే నాకు చాలా ఇంకం ప్లీట్ వుంది.... నేను(మనసులో):నీ అయ్య....అది నీ నోట్స్ ఆ...మా వాడిది అనుకున్నానే....అది కాక నేనెంతో కష్టపడి రాసిన లెటర్ నువ్వు నొక్కేస్తావా....నీ పని చెప్తా రా.....అని మనసులో తిట్టుకోని నేను:మీరేదో పొరబడ్డారు...నేను ఆ పేపర్ పెట్టలేదు... అతను:నాకు తెల్సు లే...దొంగ అనేసి నీ ఫ్రెండ్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు...తలకొట్టుకోవడం నా వంతయ్యింది.... ఇక 7 వ రోజు ఏం జరిగిందంటే అని నేహ వివరించబోతుండగా లైన్ కట్ అయ్యింది....... దానితో రేవంత్ ఆ నెంబర్ కి కాల్ చేశాడు...ఫోన్ రింగ్ అవుతుంది కాని ఎవ్వరూ ఎత్తడం లేదు...దీనితో రేవంత్ కోపం తారాస్థాయికి చేరి తన ఫోన్ ని విసురుగా పరుపుకేసి కొట్టి బెడ్ పై వాలిపోయాడు...ఒక్కసారిగా అతని గతం అతని కళ్ల ముందుకు రాసాగింది.... రేవంత్ గతం....(రేవంత్ బీటెక్ చేరిన కొత్తల్లో....) "రోల్ నెం75:గీతిక" అని పిలిచారు సార్ అటెండంస్ కోసం ఒక అమ్మాయి లేచి....."సర్ రోల్ నెం:75 నేను.....నేను థర్డ్ కౌంసిలింగ్ లో ఈ రోజే వచ్చాను....నా పేరు ప్రియాంక అని చెప్పడంతో "ఓహ్...ఒకే..."అన్నారు సార్... ఆ కొత్తగా వచ్చిన అమ్మాయి వాయిస్ నచ్చి ఎవరా అని చూశాడు రేవంత్ అదే ఫస్ట్ టైం తను ప్రియాంకని చూడడం.... వారం తర్వాత: "రేవంత్..."అనే పిలుపు మృధుమధురంగా తన చెవులని తాకడంతో వెనక్కి తిరిగాడు రేవంత్...తన ఎదురుగా ప్రియాంక నిల్చోని కనిపించేసరికి తనని పట్టించుకోకుండా...తనని ఎవరు పిలిచారా...అని అటు-ఇటూ చూడసాగాడు.... ప్రియాంక::హలో మాష్టారు...నేను పిలిస్తే దిక్కులు చూస్తారేంటి...? రేవంత్:హో...మీరేనా నన్ను పిలిచింది..? ప్రియాంక::అంత రెస్పెక్ట్ అక్కర్కేదండి..."మీరు."అని గౌరవిస్తే నేను మీకు అక్కనో అత్తనో అనిపిస్తుంది...నా గోల్ అది కాదు సో అలా పిలవొద్దు రేవంత్:మరి నన్ను మీరెందుకు "మీరు..."అని అంటున్నారు...? ప్రియాంక:అమ్మో అనకపోతే ఎలా...తరతారాలు గా భారత స్త్రీ పాటిస్తున్న విలువల్ని నేను పాటించాలిగా...! రేవంత్::ఏంటో ఆ విలువలు....???? ప్రియాంక:ముందు ముందు మీకే తెలుస్తుంది లే...వి విల్ కీప్ ఇన్ టచ్.... ఆ రోజు నుంచి ప్రియాంక వీలునప్పుడల్లా రేవంత్ ని కదిలిస్తూనే వుంటుంది...చూస్తుండగానే .కొంచెం ఇబ్బందిగా అనిపించినా కూడా....రేవంత్ తనతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు.. మరొక రోజు:ఆ రోజు రేవంత్ బర్త్ డే... రవి:మామా...పార్టి.... రేవంత్:అబ్బా....ఇస్తాలే గాని మీ ఐశ్వర్య రాయ్(రవి ప్రేమించిన అమ్మాయి) ఏది చూపిస్తా అన్నావు కదా....అడగడమే మర్చిపోయాను ఇప్పుడు చూపించు.... రవి:ఇంకెక్కడి ఐశ్వర్య రాయ్...తను వెళ్లిపోతేనేగా తన ప్లేస్ లో మీ శిల్పా శెట్టి వచ్చింది...? రేవంత్:శిల్పా శెట్టి ఆ ఎవరు రా....? రవి:అదిగో వస్తుంది గా.....మీ ప్రియాంక....నా ఐశ్వర్యరాయ్ 3 కౌంసిలింగ్ లో వేరే కాలేజ్ కి వెళ్ళిపోతే ఆ ప్లేస్ లో మీ ప్రియాంక వచ్చింది....!ఇప్పటికైనా అర్థమయ్యిందా...? ఇంతలో ప్రియాంక వాళ్లని చేరి... ప్రియాంక:మెనీ మోర్ హ్యపి రిటర్న్ స్ ఆఫ్ ది డే హీరో....అని గిఫ్ట్ రేవంత్ చేతిలో పెట్టింది రేవంత్::థ్యాంక్యు ప్రియాంక ప్రియాంక:పార్టి....?? రేవంత్:ఏం కావాలి....చెప్పు ప్రియాంక:నీతో పాటు ఒక గంట వుండాలి....సాయంత్రం5-6 నీకు ఒకేనా....? రేవంత్::అంటే అమ్మ వస్తుంది....ఆ టైమ్లో....నీకు4-5 ఒకే నా ప్రియాంక? ప్రియాంక:హా....ఒకే లైబ్రరి లో కలుద్దాం...సీయు.... ఆ సాయంత్రం లైబ్రరిలో... ప్రియాంక కోసం చూస్తున్నాడు రేవంత్.... ఇంతలో రేవంత్ కి ప్రియాంక నుంచి కాల్ రావడంతో...ఫోన్ లిఫ్ట్ చేసి,...."హా ప్రియాంక ...?"అన్నాడు రేవంత్ **** ప్రస్తుతం..... అదే పనిగా ఫోన్ మోగుతుండడంతో గతం లోంచి బయటకి వచ్చిన రేవంత్ ఫోన్ ఎత్తి.."హలో ప్రియాంక....?"అన్నాడు అవతల నేహకి రేవంత్ నోట్లో నుంచి వచ్చిన "ప్రియాంక" అనే పేరు వినగానే తనకి తెలీకుండానే కళ్ళలోంచి నీళ్ళొచ్చాయి.....ఏం చెయ్యాలో తెలియక...వెంటనే ఫోన్ కట్ చేసింది నేహ.... కట్ అయిన ఫోన్ ని పక్కన పడేసి మళ్ళి....గతమ్లోని ఆలోచనలోకి వెళ్ళిపోయాడు రేవంత్.... **** రేవంత్ గతం: ఫోన్ రింగవ్వడంతోనే రేవంత్ కాల్ లిఫ్ట్ చేసి..."హలో ప్రియాంక...."అన్నాడు ఉత్సాహంగా "నేను ఇన్ స్పెక్టర్ ని మాట్లాడుతున్నాను...ఈ ఫోన్ గల అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యింది...లాస్ట్ మీ నెంబర్ కి కాల్ చేసుంది...మీరు అర్జెంట్గా సిటి కేర్ హాస్పిటల్ కి రండి...."అని కాల్ కట్ చేశాడు ఇన్ స్పెక్టర్ ఆ మాట వినడంతోనే రేవంత్ ఫోన్ చేతిల్లోంచి జారిపోయింది......పరిగెత్తుకుంటూ ఆ హాస్పిటల్ కి వెళ్ళాడు... *** రేవంత్ లైఫ్ లో ప్రియాంక స్థానమేంటి...? ప్రియాంక వల్ల రేవంత్-నేహ ల మధ్య విబేధాలు రానున్నాయా...? నెక్స్ట్ ఎపిసోడ్ లో చుద్దాం...! హాయ్ రీడర్స్ నేను:💞💞🇧‌🇴‌🇧‌🇧‌🇾💞💞 ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి.. ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి... నా ప్రొఫైల్ ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి...
300 వీక్షించారు
4 రోజుల క్రితం
#

లవ్ స్టోరీ

"మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్" పార్ట్ 4 "రాక్షసి...అడ్డంగా బుక్ చేసేసింది నన్ను అని అనుకుంటుంది పాపం పిచ్చి పిచ్చుక..."అని ఫోన్ తీశాడు....అది చూసి షాక్ అయిపోయాడు.....!ఎందుకంటే అది తన ఫోన్ కాదు ....నేహది "ఇది ఎలా మారింది....?"అని ఎంత ఆలోచించినా తనకి తట్టక పోవడంతో..."సరే ముందు ఎవరికో ఒకరికి కాల్ చేద్దాం...."అని నెంబర్ నొక్కబోతే...ఒక్క నెంబరూ ఙపకం రాలేదు.....అలా కాల్స్ చూస్తూ....తన చెయ్యి తగలడంతో అది డైరక్ట్ గా పిక్చర్ గ్యాలరి లోకి వెళ్ళేసరికి అందులోని పిక్స్ చూసి షాక్ అయ్యాడు రేవంత్! తేరుకుని వాళ్లమ్మకి కాల్ చేశాడు మీనాక్షి::హా ...కోడలా చెప్పమ్మా....! రేవంత్::నేను నీ కోడల్ని కాదు కొడుకుని..... మీనాక్షి:అబ్బో...అప్పుడే కోడలితో మీటింగ్లు షురూ చేశావా....? రేవంత్:అబ్బా...ఇప్పుడు మ్యాటర్ అది కాదు ఆ సురేష్ ని ఈ నెంబర్ కి కాల్ చెయ్యమని చెప్పు.... కొన్ని నిమిషాల తర్వాత సురేష్::ఏంది బావా....?ఈ నెంబర్ కి కాల్ చెయ్యమన్నావంట....? రేవంత్:అది తర్వాత చెప్తా కాని....ముందు నువ్వెక్కడున్నావ్...? సురేష్:రూం లో.... రేవంత్ తను వున్న చోటు చెప్పి సురేష ని రమ్మంటాడు.... సురేష్:కుదర్దు రా అక్కడికి నేను రాలేను రేవంత్:ఎ...ఎందుకురా...? సురేష్:బైక్ లో పెట్రోల్ లేదు రేవంత్:లేకపోతే పెట్రోల్ కొట్టించరా....! సురేష్:నా దగ్గర పైసలు లేవు రేవంత్:రేయ్...ఏదోటి చెయ్యరా....! సురేష్:నా రూం నుంచి బండి తోసుకుంటూ పెట్రోల్ బంకుకి తీసుకెళ్ళాలి....అ తర్వాత పెట్రోల్ కొట్టించి రావాలి.... కాబట్టి నువ్వు నడుస్తూ రా....నేను మధ్యలో వచ్చి పిక్ చేస్కుంటా...ఎందుకంటే నా దగ్గరున్న అరా కొరా డబ్బుతో ఎక్కువ పెట్రోల్ రాదు.... రేవంత్:హా సరే.... అని నడక ఆరంభించాడు రేవంత్.... అరగంట గడిచింది....సైద్యమైనంత మెల్లిగా నడుస్తున్నాడు రేవంత్....అయినా సురేష్ రాలేదు టైం అరగంట నుంచి ముప్పావు గంట వైపు పరుగులుపెడుతుండగా..."అబ్బా...వీడేంటి నన్నిలా బుక్ చేశాడు...పోని ఇంకెవరికైనా కాల్ చేద్దామా అంటే అమ్మ ఫోన్లో సురేష్ గాడి నెంబర్ తప్ప ఎవ్వరిదీ వుండదు...."అని వుసూరుమంటూ నడుస్తుండగా..... ఇంతలో దేవుడిలా ఎదురయ్యాడు నేహ వాళ్ల నాన్న.... "ఏంటి రేవంత్...?నడుస్తున్నావ్...?అమ్మాయిని కలిశావా...?"అడిగాడు ఆయన "దాని వల్లే గా నాకి పరిస్థితి వచ్చింది ..."అని మనసులో అనుకోని..."హా అంకుల్...కలిశాను...కాని నాక్కొంచెం అర్జెంట్ పనుంది మీరేమనుకోనంటే నన్ను కొంచెం మా ఇంటి దగ్గర దింపరా...?"అని రేవంత్ అడిగేసరికి "రా బాబు..."అని తన బండి ఎక్కుంచుకోని..."రేవంత్ నా బండిలో పెట్రోల్ తక్కువుంది...మా ఇల్లు ఎలాగో ఇక్కడే కదా....ముందు మా ఇంటికి వెళ్దాం....ఆ తర్వాత నేహ నిన్ను తన స్కూటి పై డ్రాప్ చేస్తుంది సరేనా....?"అని రామ్మూర్తి అడగడంతో "నో....."అని మనసులో గావు కేక పెట్టి బయటకి మాత్రం తప్పక సరే అన్నాడు.... నేహ వాళ్ళింట్లో..... గుమ్మం లో అలికిడి అవ్వడంతో నేహ వంటింట్లోంచే..."వచ్చేశారా నాన్న...!డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి టిఫిన్ పెడతాను..."అని చెప్పి బయటకి వచ్చి అక్కడున్న రేవంత్ ని చూసి స్టన్ అయిపోయింది.... "అల్లుడు గారికి కూడా టిఫిన్ పెట్టమ్మా..."అని వాళ్ళ నాన్న అనడంతో చేసేదేమి లేక వాళ్ళిద్దరికీ మాత్రమే చేసుకున్న వుప్మా లో తన భాగాన్ని రేవంత్ కి వడ్డిస్తూ అతని వైపు వురిమిరిమి చూసింది.... "బాగా అయ్యిందా...?"అన్నట్టు తన వైపొక లుక్ ఇచ్చాడు రేవంత్ "అమ్మ...!రేవంత్ కి ఏదో అర్జెంట్ పనుందంట...తనని నీ స్కూటి పై ఇంటి దగ్గర దించమ్మా....."అని చెప్పాడు వాళ్ళ నాన్న టిఫిన్ కానిచ్చి.... స్కూటి మీద బయల్దేరారిద్దరూ... "చూడు నువ్వు నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నా పెట్టలేవు...పాపం నాకు అపకారం తల పెట్టాలనుకుని నీ ఉప్మా పోగొట్టుకున్నావ్...ప్చ్...నిన్ను చూస్తే చాలా జాలేస్తుంది...."అన్నాడు రేవంత్ అతని మాటకి నేహ రియాక్షన్ ఇవ్వకపోవడంతో...."ఏంటి మళ్ళి ఏమైనా మాట్లాడితే ఏం జరుగుతుందో అని భయపడుతున్నావా.....?ఆ మాత్రం భయం వుండాలి లే నేనంటే....!"అన్నాడు రేవంత్ దానికి నేహ నుంచి సమాధానం రాకపోవడంతో...."ఏంటి మాట్లాడవా...?పోన్లే ఇలాగైనా నీ నస తగ్గింది నాకు...థాంక్ గాడ్...!"అన్నాడు రేవంత్ "ఐ లవ్ యూ...."అంది నేహ...? తను విన్నది నిజమో కాదో అన్న సంశయంలో వుండగా పొద్దున్న వాళ్ళు కలుసుకున్న ప్లేస్ కి వచ్చేశారు స్కూటి మీద.... అయినా రేవంత్ స్కూటి మీద నుంచి దిగకపోవడంతో..."హలో మాష్టారు...మీరు దిగాల్సిన చోటొచ్చింది....దిగండి..."అనేసరికి రేవంత్ స్కూటి దిగాడు...అతని ప్రవర్తన వింతగా తోచడంతో...శూన్యం లో చూస్తున్న అతని ముఖం పై చేతులాడించి.... "హలో సార్...మీ ఫోన్ ఇదిగోండి...నా ఫోన్ ఇస్తే నేను బయల్దేరతాను..."అని నేహ అనడంతో...రేవంత్ ఏదో మంత్రం వేసినట్టుగా తన పాకెట్ లో వున్న నేహ ఫోన్ తీసిచ్చి...ఆప్పుడు లోకం లోకి వచ్చాడు.... "నేహ నువ్విందాకా వచ్చేటప్పుడు ఏం చెప్పావ్...?"అడిగాడు ఆతృతగా "అదా...బావురు కప్పలా ఒక తెగ రెచ్చిపోతుంటేనూ మీ నస తట్టుకోలేక చిన్న ట్రిక్ ప్లే చేశా....అది వర్క్ అవుట్ అయ్యింది...సరే నాకు షూట్ కి టైం అయ్యింది వుంటా సీ యూ ఆన్ అవర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ డే..."అని చెప్పి ముందుకు వెళ్ళిపోయింది... ప్లాన్ 1 - ఇంప్లిమెంటేషన్ డే... నేహ వాళ్ళింట్లో.... హాల్లో రామ్ముర్తి మీనాక్షిలకి ఎదురుగా పంతులు కూర్చుని పంచాంగం తిరగేస్తున్నారు....నేహ రేవంత్ బయటే వుండి పంతులు ఏం చెప్తారా....అని నక్కి నక్కి చూస్తున్నారు.... పంతులు గారు పంచాంగం తిరగేస్తూ రకరకాల ఎక్స్ ప్రెషంస్ పెడుతుండడంతో...రామ్మూర్తి-మీనాక్షి ఒకర్నొకరు చూస్కున్నారు.... 10 నిమిషలా తర్వాత... రేవంత్-నేహ జాతకాలని....దానితో పాటు పంచాంగాన్ని టేబుల్ పై పెడుతూ..."అబ్బే లాభం లేదు రామ్మూర్తి గారు...వీళ్ళిద్దరి జాతకాలు కలవడం లేదు...."అన్నాడు ఆయన నిట్టూరుస్తూ. బయట వున్న రేవంత్ నేహ.....ఆనందంతో గంతులు వేస్తుండగా...."కలిసే మార్గం ఏం లేదా....?"అని వినిపించింది మీనాక్షి స్వరం "అంటే అది....!"అని ఆగాడు పంతులు.... "చెప్పండి పంతులు గారు ఏవైనా అభిషేకాలు,హోమాలు,శాంతి పూజలు లాంటివి ఏవైనా...ఎంతైనా పర్లేదు...చేసేద్దాం...."అని మీనాక్షి అనడంతో...రేవంత్ నేహల ముఖాలు పాలిపోయాయి.....ఆమె మాటతో..."లేకేనేం.....వున్నాయి...."అని చెప్పి...చాలా హోమాలు,పూజలు సజెస్ట్ చేసి సంబావన పుచ్చుకుని బయటకి నడిచాడు పంతులు గారు బయటకి రావడంతోనే యమకింకరుల్లా తన వైపే కొరాకొరా చూస్తున్న రేవంత్ నేహలను చూసి జడుసుకున్న ఆయన..."ఏంటయ్యా...?అలా చూస్తున్నారు..."అన్నాడు కొంచెం బెదురుగా "మీరు చెప్పింది ఏంటి చేసిందేంటి....?"అడిగాడు రేవంత్ "ఎహే నీకు వేరే డైలాగ్లేవి రావా....?అందరికీ ఆ డైలాగే కొడతావెందుకు....?"అంది నేహ "ఎహే నువ్వు నోర్మూస్కో..."అని ఆయన వైపు తిరిగాడు రేవంత్ "ఏం చెయ్యమంటావయ్యా...!మీ జాతకాలు అంత బాగా కలిశాయి మరి...!అందులోను మీ అమ్మ గారు హోమాలు పేరు చెప్పి నన్ను టెంప్ట్ చేశారు....సారి అబ్బాయి....సారి అమ్మాయి....నాకింకో ప్రోగ్రాం వుంది బై "అని చెప్పి పంతులు జంప్ అయ్యారు.... ఇద్దరూ ఒక దగ్గర దిగాలుగా కూర్చున్నారు.... "ముసలోడు బాగా దెబ్బ తీశాడు..."అంది నేహ "నువ్వింక ఆపమ్మా...నాకొకరు తెల్సని తీసుకెళ్ళావ్....ఆయనేమో 15000 తీసుకుని ప్లేట్ ఫిరాయించాడు...అయినా అతన్ని అని ఏం ప్రయోజనం నిన్ను అనాలి...."అన్నాడు కోపంగా "నాకేం తెల్సు ...ఆయనలా చేస్తాడని...?"అంది నేహ "హా...నీదేం పోయింది...అది నా ఐడియా కదా....ఇంత మంచి ఐడియాని ఇలా ఫ్లాప్ చేశావ్...చా..."అన్నాడు కోపంగా "ఓ...హలో ఒ 4 పాత సినిమాల సీడిలు చూస్తే నాక్కూడా వస్తాయి నీకన్నా మంచి ఐడియాలు...."అంది నేహ కోపంగా "వూరికే ఫోజులు కొట్టడం కాదు...దమ్ముంటే చేసి చూపించు...అప్పుడు నమ్ముతా...!"అన్నాడు రేవంత్ "చూపిస్తా....!" "చూపించు....."అని చాలేంజ్ చేసి మరీ అక్కడ నుంచి కదిలింది...! *** రోజు కొక హోమం పేరు చెప్పి గుళ్ళు గోపురాలు తిప్పుతూనే వున్నారు ఇద్దరిని....వాటన్నంటితో...వాళ్ళిద్దరికీ చాలా విసుగొచ్చింది.... ఒకరోజు.... గుడిలో పూజ ముగించుకోని అందరికన్నా ముందు మెట్లు దిగుతుంది నేహ.... పరుగులాంటి నడకతో ముందుకెళ్ళిన నేహ....మెట్ల మీద నూనె ఒలకి వుండడంతో జారి వెనక్కి పడబోవడం రేవంత్ వెంటనే తనని సమీపించి పట్టుకోవడం వెంట వెంటనే జరిగిపోయాయి...... అలా ఇద్దరూ ఒకరి కళ్ళలో ఒకరు చూస్కున్నారు...ఆ రెండు నిమిషాల కాల వ్యవధి వాళ్ళిద్దర్లో తెలియని పరవశమేదో కలిగించగా.....ఈ లోపు మీనాక్షి-రామ్మూర్తి వచ్చేశారు అక్కడికి.... వారి రాకతో రేవంత్ నేహని వదిలి కొంచెం దూరం జరిగాడు....."నేహ పర్లేదు కదమ్మా....?"అని మీనాక్షి అడగడంతో..."హా అత్తయ్య...ఒకే...."అని ముందుకు కదలబోయి కాలు పట్టుకుని కూర్చుండిపోయింది....నేహ బాధని గుర్తించిన రేవంత్ వాళ్ళమ్మ చెప్పకుండానే తన భుజాలమీద ఎత్తుకుని కార్ వరకూ తీసుకెళ్ళాడు.... అలా అతను ఎత్తుకున్న క్షణం నుంచి కార్ లో కూర్చోపెట్టేంత వరకు నేహ అతన్నే చూస్తుండిపోయింది.... హాస్పిటల్ లో..... "ఏ ప్రాబ్లం లేదు.....కాలు కూడా బానే వుంది...."అని డాక్టర్ చెప్పడంతో అందరూ వూపిరి పీల్చుకున్నారు..... మీనాక్షిని వాళ్ళింటిదగ్గర వదిలి పెట్టి.....నేహ వాళ్ళ నాన్న గారికి ఏదో పనుంటే ఆయన్ని మధ్యలో వదిలేసి....నేహ ని ఇంటి దగ్గర వదలటం కోసం ఇద్దరూ కార్ లో వెళ్తున్నారు....నేహ సైలంట్ గా వుంది.... "అమ్మా....మిస్ పుల్లల రాణి....కాస్త తినొచ్చు కదా.....!డైటింగ్లు గట్రా చెయ్యడం ఎందుకు....?అలా పడిపోవడం ఎందుకు....?"అన్నాడు రేవంత్ అయినా నేహ మౌనంగా వుంది "చేతులు పట్టేశాయే...తల్లి నిన్ను మోసి....కట్టల మోపుని మోసినట్టు అనిపించింది....ఒంటి నిండా ఎముకలే..తిప్పి తిప్పి కొట్టినా అరకిలో కండ కూడా వుండదేమొ....?"అన్నాడు రేవంత్ "నేను నిన్ను మోయమన్నానా.....?"అడిగింది నేహ కోపంగా "నువ్వు చెప్పవు అమ్మా...మా అమ్మ బాహుబలి లో శివగామి లా చూపులతో శాసనాలు ఇస్తది...నేను తప్పక అవన్ని చేస్తాను...అయినా నీ మట్టి బుర్ర లో రూపాయి బిల్లంత ఐడియా కూడా పుట్టని నిన్ను చేతులు అరిగేలాగా మొయ్యాల్సి వచ్చింది...."అన్నాడు రేవంత్ "ఇదే కరెక్ట్ చాంస్ నేహ....అసలే మొన్నటి నుంచి నువ్వేం ఐడియా ఇవ్వట్లేదని చీప్ గా చూస్తున్నాడు...ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకో...."అని మనసులో అనుకోని రేవంత్ వైపు తిరిగి...."నేను ఐడియా ఇవ్వలేదా....?చక్కగా ప్లాన్ చేసాను పెళ్ళి చెడగొడదామని...కాని నువ్వు మధ్యలో బకాసురిడిలా వచ్చి...మళ్ళి నన్ను అంటున్నావా....?"అంది నేహ "ఏంటి నువ్వు ప్లాన్ చేశావా...?ఏంటమ్మా నీ విరోచితమైన ప్లానూ....?"అడిగాడు నమ్మశక్యంకాక "నేను మెట్ల మీద నుంచి జారి పడ్డాననుకున్నావా....?కాదు.....నేనే కావాలని పడ్డాను...అలా కాలు జారినట్టు నటించి కింద పడితే....జాతకాలు కలవకపోయినా మన పెళ్ళి చేస్తున్నందుకే ఇలా అవుతుందని మీ అమ్మ-మా నాన్న అనుకోవాలి...అలా వాళ్ళు అనుకుంటే మనం ఏడ్చి గీ పెట్టినా మనకి పెళ్ళి చెయ్యరు.."అంది నేహ "ఏంటి...ఈ ప్లాన్ నీదేనా?లేక ఏదైనా కొరియన్ సినిమా నుంచి కొట్టేశావా...?"అనుమానంగా అడిగాడు రేవంత్ "అసలు అడిగేదాంట్లో లాజిక్ చూస్కోవా నువ్వు...?కొరియన్ వాళ్ళసలు గుళ్ళకెందుకు వెళతారు...వాళ్ళ సినిమాల్లోంచి కొట్టేయడానికి...?"అంది నేహ "అదే లేవమ్మా....గుడి మెట్లకి బదులు చర్చి మెట్లు అనుకో..." "నా కప్ ఐస్ క్రీం లో నీ పుల్ల ఐస్ ఏం కాదు.....?నా ఐడియా నే నాయన...మొన్న శపధం చేశావ్ గా అందుకే 3 రోజులు ఆలోచించి ఈ ఐడియా కనిపెట్టా..."అంది అప్పటికప్పుడు కథ అల్లేస్తూ.... "నువ్వేమన్నా కొలంబస్ వా అమెరికా ని కనిపెట్టినట్టు ఐడియాని కనిపెట్టడానికి...."అన్నాడు రేవంత్ "అబ్బా..నీ కుళ్ళు జోకులు ఆపి...నెక్స్ట్ ఏంటో చెప్పు....."అని నేహ అనేసరికి "ఏముంది నిన్ను మీ ఇంట్లో డ్రాప్ చేసి అర్జెంటుగా హోటల్ కి వెళ్ళి 4 పెసరట్లు,ఒక ఇడ్లి సాంబార్,ఒక కిచిడి తినాలి..."అని తన టిఫిన్ ప్లాన్ ని చెప్పేసరికి "చాలా ఒక ఉప్మా ప్లేటూ...ఒక పూరి ప్లేటూ....4 చపాతీలు కూడా లాగించు...."అంది నేహ వెటకారంగా "వద్దులే ఐ యాం ఆన్ డైట్..."అన్నాడు రేవంత్ నేహ..."కర్మరా బాబు..."అని తల కొట్టుకుంది... "హే బాధపడకు నీకో ఇంకో ఇడ్లి ముక్క పెడతాలే నాతో వస్తే..."అన్నాడు రేవంత్ నేహ కి కోపం వచ్చి.....రేవంత్ గొంతు పట్టుకుంది....... తనలా చెయ్యడంతో...కార్ అదుపు తప్పి.....బ్యాలెంస్ పోయింది.... కార్ రోడ్డు మీద జిగ్ జాగ్ గా పోయి...ఎదురుగా వస్తున్న అమ్మాయిని గుద్దబోయి...ఆ అమ్మాయి కార్ ని చూసి పక్కకి జరిగేసరికి ఆమెను లైట్ గా తాకి...వెళ్ళి అక్కడున్న రాళ్ళ గుట్టను తాకింది.....రాళ్ళన్నీ కార్ అద్దాన్ని బద్దలుకొడుతూ వీళ్ళిద్దరినీ తాకేసరికి లోపల వున్న రేవంత్ నేహ ఆ ధాటికి కిందకి వంగారు.... 2 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచాడు రేవంత్...పక్కనున్న నేహ ని చూస్తే తను స్పృహ కోల్పోయి కనిపించింది....."నేహ...నేహా..."అంటూ తన బుగ్గ పై తట్టగా....."ఊ..."అని మూల్గింది నేహ....ఇంతలో రేవంత్ కి రోడ్డు పై కార్ కి అడ్డం వచ్చిన అమ్మాయి గుర్తొచ్చి....డోర్ తీసుకుని రోడ్డు మీదకి పరిగెత్తాడు...కొద్ది దూరమ్లో ఆ అమ్మాయి రోడ్డు పై పడిపోయి కనిపించింది..... వెంటనే తనని చేరేసరికి....అమె కూడా స్పృహ కోల్పోయిందని అర్థమైంది.....ఆమెని చూడ్డానికి ముందుకు వెళ్ళేసరికి ఆమె ముఖం అతనికి సుస్పష్టంగా కనిపించింది....అంతే ఆమెని చూసి షాక్ అయిపోయాడు రేవంత్....!? ******* రేవంత్ చూసి అమ్మాయి ఎవరై ఉంటుంది...?? ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం...! హాయ్ రీడర్స్ నేను:💞💞🇧‌🇴‌🇧‌🇧‌🇾💞💞 ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి.. ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి... నా ప్రొఫైల్ ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి...
278 వీక్షించారు
5 రోజుల క్రితం
#

లవ్ స్టోరీ

"మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్" పార్ట్ 3 అందరూ తననే చూస్తుండటంతో నేహ అందరి వైపు చూస్తూ రేవంత్ వూహించనట్టుగా తల అడ్డంగా వూపింది.... అందరి ముఖాల్లో ఒక ప్రశ్న....అసలు ఏం అయ్యింది...అని ఎవరిపాటికి వాళ్ళు మనసులో కారణాలు విశ్లేషిస్తుండగా....రేవంత్ ముఖం ఆనందం తో వెలిగిపోయింది.... "ఏమయిందమ్మా...?"అని రామ్మూర్తి గారు అడగబోతుండగా "నాకు ...డబుల్ ఓకే....."అంటూ అరిచింది నేహ వూహించని ఆమె సమాధానం తో అక్కడ సీన్ రివర్స్ అయ్యింది...అందరి ముఖాల్లో ఆనందం నాట్యం చేస్తుండగా....రేవంత్ ముఖం వేసవి కాలం లో ఆకు కూర కట్టలా వాడిపోయింది....! నేహ అమోదంతో మీనాక్షి ఆనందానికి అవుధులు లేకుండా పోయాయి....మంచి రోజు చూసుకుని ముహుర్తాలు ఫిక్స్ చేసుకుందామని చెప్పి...కొడుకుతో ఇంటికి బయల్దేరింది మీనాక్షి... దారి పొడుగునా...తను నేహ ని మొదట ఎలా చూసింది....!తన పెళ్ళి చూపులు ఎలా చెడగొట్టింది చెబుతునే వుంది...కాని అవన్ని వినిపించుకునే స్థితిలో రేవంత్ లేడు....అతని మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది మరి...! ఆ రాత్రి.... మీనాక్షి కి నేహ నుంచి కాల్ రావడంతో చాలా సేపు నేహ తో మాట్లాడింది ఆవిడ రేవంత్ చూస్తుండగానే....!? రాత్రికి వాళ్ళమ్మ పడుకున్న తర్వాత.....తన రూం నుంచి బయటకి వచ్చాడు రేవంత్...పిల్లి లా అడుగులేసుకుంటూ వెళ్తుండగా...చీకట్లో టీపాయి మీద వున్న కుక్క బొమ్మ కింద పడింది...కిందకి వంగి దాన్ని చేతిలోకి తీస్కుని... "ష్....సైలంస్...."అన్నాడు తన నోటి మీద వేలేసుకుని.... అలానే మెల్లిగా నడుస్తూ వాళ్ళమ్మ రూం చేరి....పాక్కుంటూ వెళ్ళి టేబుల్ మీదున్న వాళ్ళ అమ్మ ఫోన్ ని చేతిలోకి తీసుకున్నాడు....ఆవిడ సెల్ కాంటాక్ట్స్ లో వున్న" కోడలు " అనే పేరున్న నెంబర్ ని పలుమార్లు చూసి మనసులో మననం చేస్కుని చివరికి చూడకుండా ఆ నెంబర్ కంఠతా వచ్చేయడంతో ఆనందం ఆత్రం ఆపుకోలేక...."యాహు...."అన్నాడు పెద్దగా.... అతని అరుపుతో నిద్ర లేచిన మీనాక్షి....రేవంత్ ని చూసి నవ్వేస్తూ...అతని తల మీద ప్రేమగా నిమురుతూ...."నేహ నెంబర్ కావాలంటే అడగొచ్చు కదరా.....ఇంతలా కష్టపడాలా....?సరే అమ్మాయి పడుకోక మునుపే కాల్ చెయ్యి..."అని ఆవిడ తిరిగి పడుకుంది.... "ఉఫ్..."అనుకుంటూ తన రూం లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చుని చాలా కోపంగా నేహ నెంబర్ కి కాల్ చేశాడు రేవంత్.... 4 రింగ్ల తర్వాత కనెక్ట్ అయిన కాల్ లోని అవతల వ్యక్తి "హలో...."నిద్రలోని గొంతు తనని పలకరించగా వులిక్కి పడిన రేవంత్ మరుక్షణం లో సర్దుకుని...."నేనేం చెప్పమన్నాను నువ్వేం చెప్పావు...."అని అరిచాడు కోపంగా "అసలు ఎవరయ్యా నువ్వు....?అర్థ రాత్రి ఫోన్ చేసి భజన కార్యక్రమం మొదలెట్టావు.....?ఏ నెంబర్ కి చెయ్యబోయి ఏ నెంబర్ కి చేశావు...?ఇంకోసారి ఫోన్ చేసి తిక్క తిక్కగా వాగితే పోలిస్ కంప్లైట్ ఇచ్చి మక్కెలిరగతీస్తా....."అరిచింది నేహ "ఆ పని చెయ్యి నీకు నాకు పెళ్ళి క్యాంసిల్ అయ్యిద్ది..."ఉక్రోషంతో అన్నాడు రేవంత్ అతని మాటతో...స్పృహ లోకి వచ్చి..."ఓ మీరా...రేవంత్ గారు....సారి ఎవడొ గొట్టం గాడని అలా అనేశాను...."అంది నేహ "ఆ గొట్టం గాడిని నేనని తెల్సింది గా....మళ్ళి ఎందుకు నన్ను గొట్టం అన్నావు...?అయినా ఇప్పుడది ముఖ్యం కాదు కాని....పొద్దున్న నేను నీకు ఏం చెప్పాను ...?నువ్వేం చేశావ్....?"కోప్పడ్డాడు రేవంత్ "నేను ఏం చేసానో మీరే చెప్పి మా మీద మీ కరుణాకటాక్షాలు కురిపించండి...."అంది వెటకారంగా "కాస్త తెలుగులో మాట్లాడతావా....?"అడిగాడు రేవంత్ "ఆహా...ఏం లేదు ఇప్పూడు టైం11 అయ్యింది....రేపు మాట్లాడదాం అని అంటున్నా "అంది కవర్ చేస్తూ "లేదు...ఇది ఇప్పుడే ఇక్కడే ఇలానే తేలిపోవాలి..."అన్నాడు మొండిగా "చూడండి...ప్రతి దానికి ఒక టైం అంటూ వుంటుంది...నాకు ఈ టైం నిద్దరోవడానికి.... బై...గుడ్ నైట్...."అని కాల్ కట్ చేసింది.... మరుసటి ఉదయం 5 గంటలు జాగింగ్ లో: "చలి చలిగా అల్లింది...."అని ఇయర్ ఫోంస్ లో వింటున్న పాటతో పాటు హం చేస్తూ....చలిలో నడుస్తూ .....ఆ మధ్యలో..."దొంగ సచ్చినోడు.....ఇంత పొద్దున్నే లేచేలా చేశాడు....నిష్ట దరిద్రుడు...."అని రేవంత్ ని తిట్టుకుంటూ నడుస్తున్న నేహ భుజం పై తట్టాడు రేవంత్ "ఏంటి.....బాగా తిట్టుకుంటున్నట్టున్నావ్....ఎవర్ని ఏంటి....?"అడిగాడు రేవంత్ "అబ్బే...అదేం లేదు....పాట వింటూ అదే హం చేస్తున్నా...."అంది నేహ "అవునా ఆ పాట ఏంటో....?"అడిగాడతను "కుక్క ముఖం నక్క ముఖం చక్కగున్నాదే....."అంది పాడుతూ "ఏయ్...ఏంటి తిడుతున్నావ్....?" "అయ్యొ మహాశేయ ఇది నిజంగా పాటే....ఆది పిన్ని శెట్టి ఫస్ట్ మూవి" ఒక విచిత్రం" లోది...చేతిలో ఫోన్ వుంది గా కావాలంటే చెక్ చేసుకోండి...."అంది మూతి తిప్పుతూ "సరే...అదంతా నాకెందుకు కాని....పద అక్కడ కూర్చుందాం...."అని ఒక బెంచ్ మీద కూర్చున్నారిద్దరూ అక్కడ కూర్చోవడంతోనే...."ఇప్పుడు చెప్పు..."అన్నట్టు నేహ వైపు చూశాడు రేవంత్ "ఇంత పొద్దు పొద్దున్నే ఎందుకు రమ్మన్నారు....నా టైం టేబుల్ మొత్తం కొలాప్స్ అయ్యింది మీ వల్ల...."అంది నేహ "ఈ చల్ల గాలిలో....."అని రేవంత్ చెప్తుండగా "ఏంటి పొయట్రీనా...నా వల్ల కాదు...ప్లీజ్...."అంది చేతులు జోడిస్తూ "పొద్దున్నే నా యాంగ్రీ లెవల్స్ నా కంట్రోల్లో వుంటాయి....అందుకే ఇప్పుడు కలవాలన్నాను..."అన్నాడు రేవంత్ "ఏంటి ...ఏ లెవల్స్...?కోపానికి కూడా లెవల్స్ ఆ....అబ్బబ్బ...మీరు మీ ప్లానింగ్...మీ డెడికేషన్....వాహ్...."అంది నేహ ఆశ్చర్యం నటిస్తూ "ఇదిగో ఇలానే ....నిన్న కూడా ఇంతే అని చివరికి బకరాని చేశావ్ నన్ను...."అన్నాడు రేవంత్ "వావ్...దీన్నే మా వూర్లో రియాలైజేషన్ అంటారు......ఇక పోతే నిన్న మీ పాటికి మీరు మాట్లాడకుంటూ వెళ్ళారు...నాకు అసలు ఇష్టమా ?కాదా అని అస్సలు అడగలేదు....."అంది నేహ "కొంపదీసి...నేను నచ్చేశానా ఏంటి....?నన్ను చూసినప్పటి నుంచి నన్ను తప్ప ఆ ప్లేస్ లో వేరే వాళ్ళని ఊహించకోలేకపోతున్నావా....చెప్పు..."అన్నాడు రేవంత్ "ఆహా...ఇక చాలు ఆపుతారా....?మీకు తెలియని విషయం ఏమంటే...మీరెలా మా నాన్న గారు ముందే తెలియడం వల్ల మీ నిర్ణయాన్ని అందరి ముందు చెప్పలేక నా సహాయం కోరారో...నేను కూడా మీ అమ్మ గారు ముందే తెలియడం వల్ల అలానే ఇబ్బంది పడ్డాను....నేను ఇప్పటిదాకా మా నాన్న సెలక్షన్ ని కాదన్నది లేదు....నిన్న పెళ్ళి చూపుల్లో మీ అమ్మగారి ద్వారా మా నాన్న గారికి మీరు బాగా నచ్చారని తెలిసింది......అది కాక.....మీరు మీ అమ్మ మాట జవదాటనని భారం మొత్తం నాపై వేశేశారు...మీరెలాగా మా నాన్నగారితో వున్న పరిచయం వల్ల చెప్పడానికి సంశయించారో...నేను మీ అమ్మ గారు తెల్సినందువల్ల మీరంటే ఇష్టం లేదని చెప్పలేకపోయాను.....అందుకే అలా చెప్పాను...అలా చెప్పడానికి ఇంకో రీసన్ ఏంటంటే నాక్కూడా మీలాగే పెళ్ళి మీదస్సలు ఇంట్రస్ట్ లేదు....మీ డౌట్స్ క్లియర్ అయితే హం చెలేంగే ఫిర్ మిలేంగే.....బై..."అంది నేహ రేవంత్(మనసులో):రాక్షసి.....ఈ ముక్క నిన్నే చెప్పి చావొచ్చు గా....ఏదోకటి చేసి తప్పించుకునేవాడ్ని.... ఆ సాయంత్రం రేవంత్ నేహ కి కాల్ చేశాడు.... రేవంత్(నేహ మాట వినకుండానే):నేహ సాయంత్రం 6 కి ఉదయం కలుసుకున్న ప్లేస్ దగ్గరికే వచ్చేయి...ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ...ఏదొకటి ప్లాన్ చేద్దాం.... అని నేహ మాట వినకుండా కాల్ కట్ చేశాడు.... "నేహ...నేహ....."అని వాళ్ళ నాన్న పిలవడంతో..."ఏంటి నాన్న....?"అంటూ వచ్చింది నేహ "అల్లుడు గారు నిన్ను 6 గంటలకి కలవమన్నారమ్మా....." "ఎక్కడ....నాన్న....?" "అదే మీరు వుదయం కలిశారంట కదా అక్కడికే వచ్చేయమన్నారు,....."అన్నాడు వాళ్ళ నాన్న "సారి నాన్న...ఉదయం మీకు చెప్పకుండా వెళ్ళాను...ఇప్పుడు వెళ్ళనా వద్దా....?"అడిగింది నేహ "ఆల్రెడి కలిశావ్ గా మళ్ళి ఎందుకు అడగడం....?"అన్నారయన నవ్వుతూ "అంటే నాన్న ఆయన అర్జెంట్ అనడంతో వెళ్ళాల్సి వచ్చింది...."అంది తలవంచుకోని "అయ్యొ తల్లి సరదాకి అన్నాను కాని...వెళ్ళమ్మా...వెళ్ళి కలిసిరా....అది సరే గాని అల్లుడు గారేంటి ఏదో ప్లాన్ అంటున్నారు...?"అడిగాడు ఆయన ఊహించని ఆ ప్రశ్నకి నేహ తడబడుతూ..."అదే నాన్న.....ఆయన పెళ్ళి గురించి మాట్లాడుతున్నారు....తనకి నాకు ఫస్ట్ మ్యారేజ్ కదా....?"అంది కవర్ చెయ్యడానికి "ఫస్ట్ మ్యారేజ్ ఏంటమ్మా.....?"అన్నాడు ఆయన "ఐ మీన్ ఇది ఫస్ట్ యండ్ లాస్ట్ కదా.....!అందుకే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తున్నాం...."అంది నవ్వుతూ "మంచి పనమ్మా...జాగ్రత్తగా వెళ్ళి రా...." సాయంత్రం6:00 గంటలు... సేం ప్లేస్....అరగంట ముందే వచ్చిన నేహ..."ఆ రేవంత్ రాని...కడిగి పారేశ్తాను..."అని చైనీస్ డ్రాగన్ లా పొగలు కక్కేంత కోపమ్లో వుండగా...రేవంత్ వస్తూనే...ప్లాన్ చెప్పు అనేసరికి ఆ కోపం కాస్త నషాళానికి అంటింది కోపంగా పైకి లేచి..."అసలు అవతల ఎవరు మాట్లాడుతున్నారో తెలియకుండా...నోటికి ఎంతొస్తే అంత ఎలా మాట్లాడతారేంటండి....?"అంది వూగిపోతూ "ఏ...ఏమయ్యింది...?అంకుల్ గాని ఎత్తారా ఫోన్...?అయినా నేను జస్ట్ కలుద్దామనేగా చెప్పింది....అందుకే ఆంకాలమ్మలా రియాక్ట్ అవ్వాలా...?" "అంతవరకూ అయితే బానే వుండేది.....ప్లాన్లూ రూళ్ళు అని ఏదో వాగారు కదా...కవర్ చెయ్యలేక చచ్చాను నేను..."అరిచింది నేహ "ఓహ్...ఐ యాం సారి...మనం కలవడానికి స్పెసిఫిక్ రీసన్ నీకు తెలియాలని చెప్పాను...." "మీరెలా చెప్పినా నాకు కోపం వచ్చింది...నాకున్న క్రియేటివిటి పోయింది...బై..."అని అక్కడ నుంచి విసురుగా వెళ్లిపోయింది... తనలా వెళ్ళడంతో.... "అసలు ఈమెకి నన్ను పెళ్ళి చేసుకోవాలని వున్నట్టుంది...అందుకే ఏదొక రీసన్ చెప్పి తప్పించుకుంటుంది...నేనే ఏదోకటి ఆలోచించాలి...."అనుకున్నాడు మనసులో.... ఆ మరుసటి రోజు వుదయం... "నేహ...సారి చెప్పాను కదా....మనకెక్కువ టైం లేదు...ఈ పెళ్ళి వీలైనంత త్వరగా చెడగొట్టాలి..."అన్నాడు రేవంత్ "హిం....ఏమైనా ఆలోచించారా....?" "హా...ఓల్డ్ ఐడియానే కాకపోతే ఓల్డ్ ఈస్ గోళ్డ్ అన్నారు కదా....ఆ వుద్దేశంతో నీకు చెప్తున్నా....విను"అని మొదలుపెట్టాడు రేవంత్ లక్ష్మి గణపతి ఫిలింస్ సమర్పించు..... "పేరేమి పెడదాం....?"అని అడిగాడు రేవంత్ నేహ ని "రేవంత్ బీ సీరియస్ పాయింట్లోకి రా డైరక్ట్గా..."అంది నేహ తల పట్టుకుంటూ "అంటే నువ్వు అసిస్టెంట్ డైరక్టర్ కావడానికి ట్రైయింగ్ అంట కదా....అందుకే అలా అయితే ఈసిగా అర్థమవుతుంది అని సినిమా భాషలో చెప్తున్నా...."అన్నాడు రేవంత్ "మహాను భావా మీకో దండం.....నేను జస్ట్ ట్రయిల్స్ లోనే వున్నాను....అంతకన్నా ముందు నేను చదివింది బిటెక్ లో ఐటి నే....సో మీరు జావా(కంప్యూటర్ ల్యాంగ్వేజ్) లో చెప్పినా నాకర్థం అవుతుంది...సో సూటిగా చెప్పు సుత్తి లేకుండా..."అంది చేతులెత్తి దండం పెడుతూ "అబ్బో...డైలాగులు బాగా చెప్తున్నావ్ గా...డైరక్టర్ గా కాకుండా.....సీరియల్లలో లేడి విలన్లకు బాగా సెట్ అవుతావు ట్రై చెయ్యిచ్చుగా...."అని వెటకారమాడాడు రేవంత్ నేహ కి చిరాకు వచ్చి లేచి వెళ్ళిపోతుండగా...తన చెయ్యి పట్టుకుని ఆపి....కుర్చోమని లాగేసరికి...తిరిగి అతని పక్కన కూర్చుంది నేహ "అమ్మా...తల్లి....నేనేదో నువ్వు నాపై కోపంగా వున్నావని కూల్ చేద్దామని ట్రై చేశా....నా ఐడియా చెప్తాను షార్ట్ యండ్ స్వీట్ గా...."అని మొదలుపెట్టాడు.... "మా అమ్మ-మీ నాన్న ముహుర్తాల కోసం పంతుల్ని పిలిపిస్తారు కదా.....ఆయన మన జాతకలు చూసి...అస్సలు కలవలేదని చెబుతారు...ఇంక మనోళ్ళు...మనకి పెళ్ళి చెయ్యాలనే ఆలోచనని విరమించుకుంటారు...ఎలా వుంది ఐడియా...." "పంతులెందుకు అలా చెప్తాడు...?"అడిగింది నేహ "అమ్మ ఆయనంతట ఆయన చెప్పరమ్మా...మనం డబ్బులిచ్చి అలా చెప్పిస్తాం...."అన్నాడు రేవంత్ "అబ్బో పర్లేదే....నీక్కూడా బుర్ర వుందని నిరూపించుకున్నావ్..?సరే నాకు తెల్సిన ఒక పంతులు వున్నారు....మనం ఆయన్ని కలుద్దాం...ఆయనైతే పక్కా కమర్షియల్ కూడానూ...."అని నేహ అనేసరికి... "సరే పద...."అన్నాడు రేవంత్ కార్ దగ్గరికి నడుస్తూ... ఎంత స్టార్ట్ చేసినా రేవంత్ కార్ స్టార్ట్ అవ్వకపోవడంతో..."చా...."అన్నాడు చిరాగ్గా.... నేహ::ఏమైంది...? రేవంత్:కార్ స్టార్ట్ కావడం లేదు....! నేహ::నాకు కళ్ళు బానే పనిచేస్తున్నాయి...కార్ స్టార్ట్ అవ్వట్లేదనే విషయం తెలుస్తూనే వుంది కాని ఎందుకు అవ్వట్లేదు...వాట్ ఈస్ ద రీసన్....? రేవంత్::ఆ...ఒక శనివారం రోజున ఒక బండ్రాయి తన స్కూటితో నా కార్ ని గుద్దింది లే...అప్పటి నుంచి ఇలా ట్రబుల్ ఇస్తుంది.... నేహ(మనసులో):ఓర్ని నన్నే బండ్రాయి అంటావా....?చెప్తా...చెప్తా....! రేవంత్::ఇప్పుడేం చేద్దాం...? నేహ::ఇదో పెద్ద జవాబు దొరకని ప్రశ్న మరి....ఎందుకు మొహం అలా పెట్టుకున్నావ్....నా స్కూటి వుంది కదా దానిపై వెళ్దాం పద.... రేవంత్:నీ డొక్కు స్కూటి పైనా...?నేను రాను....! నేహ:అబ్బో.....నీ కార్ ఏంటో పుష్పక విమానం అన్నట్లు ఫోస్ ఒకటి....నీ డబ్బా కార్ లో నేను రావడానికి ఒప్పుకోలేదా....?పని కావాలంటే రా....లేకపోతే చెప్పు...నేను స్టూడియో కి వెళ్ళాలి.... రేవంత్:రాక చస్తానా....పద ఇద్దరూ స్కూటి పై పంతులు గారి ఇంటికి బయల్దేరతారు.... పంతులు గారి ఇంట్లో... పంతులు గారు నేహ ని చూసి..."రామ్మా...నేహ పెళ్ళి కుదిరిందంట కదా...?ఈ అబ్బాయితోనేనా బావున్నాడు...."అన్నాడు ఆయన "చూశావా ?నువ్వెంత లక్కియో...నా అంత అందగాడు మళ్ళి నీకు దొరుకుతాడో లేదో...పూర్ గాళ్...."అని నేహ కి వినిపించేలాగా చెప్పాడు రేవంత్ "కాసేపు నోరు మూస్కుంటావా....?వచ్చిన పని కానియ్యి....."అని..."పంతులు గారు...మా ఇద్దరికి ఈ పెళ్ళి ఇష్టం లేదు.....మిమ్మల్ని నాన్న గారు ముహూర్తం పెట్టమని పిల్చినప్పుడు...మా ఇద్దరి జాతకాలు పరిశీలించి కలవలేదని చెప్పాలి..."అని క్లుప్తంగా విషయాన్ని చెప్పింది నేహ "అదెలా అమ్మా...అలా చెప్పడం...నా వృత్తికి అన్యాయం చేస్తున్నట్టు.....నేను చెయ్యలేను..."అని ఎథిక్స్...మోరల్ వ్యాల్య్సూ మీద అరగంట పాటు క్లాస్ పీకి...చివరికి నేహ వాళ్ళు 15000 ఆఫర్ చేసేసరికి అలా చెప్పడానికి ఒప్పుకున్నాడు.... బయట: "హమ్మయ్య...ఎలాగొ ఒకలాగా...ఒప్పుకున్నారు అదే పది వేలు..."అంది నిట్టురుస్తూ "పది వేలు కాదు పదిహేను వేలమ్మా...అయినా మీ వాళ్ళంతా నీలానే నా....?వూరికే సొల్లు వాగుతారు...?"అన్నాడు రేవంత్ అతని వైపు కొరా కొరా చూసింది నేహ వెళ్ళి స్కూటి తీసుకొచ్చి...."ఎక్కండి "అనేసరికి...రేవంత్ ఎక్కబోతుండగా....స్కూటి ని ముందుకు పోనిచ్చింది....తనలా చేసేసరికి సీట్ పై వుండాల్సినోడు కాస్తా రోడ్డు పై పడ్డాడు.... ఎలాగో కష్టపడి పైకి లేచి....ఫ్యాంట్ కి అంటిన దుమ్ము దులుపుకుని....ఆమె దగ్గరికి వెళ్ళి..."ఏంటలా పోనిచ్చావ్...?"అని అడిగేసరికి "మిష్టర్ రేవంత్ ఇందాక ఏమన్నారు....?నన్ను బండ్రాయి అంటారా....?ఇప్పుడు ఆ బండ్రాయే....మీకు ఈ డొక్కు స్కూటి పై లిఫ్ట్ ఇవ్వకూడదని నిశ్చయించుకుంది...ఎలాగో మీరు మీ వాలెట్ కార్ లో మర్చిపోయారు కనుక....20 కిమిల దూరం లో వున్న మీ కార్ కోసం మీ ప్రయాణం మొదలుపెట్టండి...అదీ నడిచి.....హ్యాపి జర్ని బై...."అని రయ్యని దూసుకుంటూ వెళ్ళిపోయింది.... "రాక్షసి...అడ్డంగా బుక్ చేసేసింది నన్ను అని అనుకుంటుంది పాపం పిచ్చి పిచ్చుక..."అని ఫోన్ తీశాడు....అది చూసి షాక్ అయిపోయాడు.....! "రేవంత్ షాక్ అవ్వడానికి రీసన్ ఏంటి....? "నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం....! హాయ్ రీడర్స్ నేను:💞💞🇧‌🇴‌🇧‌🇧‌🇾💞💞 రేవంత్-నేహ ల అల్లరి జంటని వాళ్ల గిల్లి కజ్జాలని మిస్ అవ్వకండి.... ఇప్పటి వరకు ఈ కథ మీకెలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాకు తెలపండి.... తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం....!
289 వీక్షించారు
6 రోజుల క్రితం
#

లవ్ స్టోరీ

వేణు.. నా అన్వేషణలో నేను..!
#లవ్ స్టోరీ
నా జాబిలి కోసం పార్ట్ 43. ముందుగా 1-42 పార్ట్శ్ చదివిన తరువాత 43 చదవండి. అను పెద్ద పూజారి గారి కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటుంది...... ఎవరికీ ఏమి అర్ధం కానీ పరిస్థితుల్లో అందరు మౌనం గా చూస్తూ ఉంటారు..... బామ్మ ముందుకు వచ్చి..... అయ్యా! మీరు ఈ అమ్మాయిని చూసి ఎవరో అనుకుని పొరపాటు పడుతున్నారేమో....ఈ అమ్మాయి కి ఎవరు లేరు.....అందుకే తనకు జరగవలిసిన పెళ్లి కూడా ఆగిపోయింది.....మరి  మీరేమో ఆ అమ్మాయిని.... కార్తీక్:  బామ్మ!! ఒక్క నిమిషం..... కార్తీక్ అను దగ్గరకు వచ్చి..... ఎవరు నువ్వు?? ఇక్కడ ఎం జరుగుతుంది??? నీకు తెలుసా!!!  మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకున్నారు....ఈ విషయం నీకు చెప్పాలని వచ్చే లోపు ఇక్కడ ఏదేదో జరుగుతుంది.... అసలు ఎవరు నువ్వు??? మొన్న ఆ ఏనుగు నీ మీదకు వచ్చినా నీ కళ్లలో భయం చూడలేదు నేను......పైగా  ఆ ఏనుగు నిన్ను దీవించింది.... ఉదయం మన పెళ్లి కి ముహూర్తం పెట్టడానికి వచ్చిన పంతులు గారు నీ జాతకం చూసి షాక్ అయ్యారు.....వెళ్తూ వెళ్తూ నీకు నమస్కారం చేసి వెళ్లారు.... ఇప్పుడు వీళ్ళు అంతా నిన్ను ఎదో గొప్పగా చూస్తూ.....నిన్ను మీరు అంటూ.....వంశం...రక్షా.... అంటూ ఎదో చేస్తున్నారు..... నువ్వు కూడా మౌనం గా ఉండిపోయావు... అసలు నువ్వు అనన్య వేనా??? నేను ప్రేమించిన నా చిన్నూ వేనా??? అంటూ  కార్తీక్  అను ని నిలదీస్తాడు... నిజాని కి ఆ ప్రశ్నలు అందరి బుర్రలలో తిరుగుతున్నవే... తన గురుంచి ఎవరికీ తెలియనివ్వను.... అని అరవింద్ గారి కి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవాలో....అర్ధం కానీ పరిస్థితుల్లో నిలబడి పోయింది అను..... నీ ప్రశ్నలకు  సమాధానం అక్కడ ఎప్పటికి దొరకదు....కేవలం నా దగ్గర మాత్రమే దొరుకుతుంది కార్తీక్!!!  అంటూ  వినిపించిన  వైపు చూస్తారు అందరు...కార్తీక్,అను తో సహా..... ఎదురుగా అర్జున్, అరవింద్ గారు, PA  విశ్వ గుమ్మం ముందు నిలబడి ఉంటారు.... అక్కడ ఉన్న చాలా మంది కి అర్జున్ ఎవరు??? అనేది తెలియదు....కార్తీక్, అను కి తప్ప.... అరవింద్ గారు గురుంచి కూడా ఎవరికీ తెలియదు....కార్తీక్ తండ్రి శివాజీ గారికి తప్ప..... అసలు ఎం జరుగుతుందో,తెలియని అయోమయం లో...అర్జున్ ని,అరవింద్ గారిని అక్కడ చూసిన అను వెనుక ఉన్న కుర్చీలో కూలబడి పోతుంది.... వచ్చిన వాళ్ళు ఎవరు అనే చూస్తున్నారు కానీ....ఎవరూ అను ని గమనించలేదు.... శివాజీ గారు అరవింద్ గారి దగ్గరకు వెళ్లి....... హలో సర్!  నేను  రీసెంట్ గా మీ కంపెనీ తో టై అప్ ఐన రూప ఇండస్ట్రీస్ ఛైర్మెన్ ని...గుర్తుకు వచ్చానా?? అంటూ షేక్ హ్యాండ్ ఇస్తారు శివాజీ గారు..... కార్తీక్ కూడా అర్జున్ దగ్గరకి వస్తాడు... కానీ  అర్జున్,అరవింద్...వాళ్ళవైపు కనీసం చూడకుండా  అను దగ్గరకు వెళ్తారు.... అర్జున్ అను ముందు మోకాళ్ల మీద కూర్చుంటాడు.... అను అర్జున్ వైపు అసలు చూడదు.... తన పక్కకు నిలబడి ఉన్న అరవింద్ గారి ని తల ఎత్తి చూసి.....కళ్ళ నిండా నీళ్లతో.....సర్!!  మీకు ఇచ్చిన మాట నేను తప్పలేదు సర్!!!!  నేను ఎవరు అనేది వీళ్ళకి ఇంత ఈజీ గా ఎలా తెలిసిందో నాకు తెలియడం లేదు సర్....నన్ను  క్షమించండి.....అంటూ ఏడుస్తూ తల దించుకుంటుంది  అను..... అరవింద్ గారు అను తల మీద చేయి వేసి...... చిట్టి తల్లి!!!  నువ్వు "అంటే అనన్య నేత్ర "ఎప్పుడూ మాట తప్పదు....అది  నాకు తెలుసు తల్లి..... నీ పెళ్లి అని తెలిసి...నేను చేసిన తప్పు సరిచేసుకోవాలి అని.....అర్జున్ ని తీసుకుని విశ్వాపురం వెళ్ళాను.... అక్కడ నీ గురుంచి ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాను..... అందుకే  నీ గురుంచి అందరికి నిజం చెప్పి ఆ వంశ  వారసురాలిగా నీకు చేయవలసినవి చేయమని చెప్పి పెద్ద పూజారి గారిని నేనే పంపాను..... ఇడీగో అమ్మ! నీ అర్జున్ ని నీకు అప్పచెప్తున్నాను..... నా తప్పుని క్షమించి...నన్ను మావయ్య...అని పిలుస్తావా??? అంటూ అరవింద్ గారు కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు..... అను ఇంకా మౌనం గానే ఉండిపోతుంది..... కార్తీక్ ,శివాజీ గారు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు..... ది గ్రేట్ బిజినెస్ మాన్ అరవింద్ గారు....అనన్య కి మావయ్య.....అంటే అర్జున్.... అంటూ  ఇద్దరు షాక్ అవుతారు.... అందరు ఇంకా ఏమి అర్ధం కానీ సిట్యుయేషన్ లోనే ఉన్నారు..... అను  దగ్గర మోకాళ్ల మీదే ఉన్న అర్జున్...అను తల పైకి పెట్టి..... జాబ్ కి రిజైన్ చేసి.....కార్తీక్ తో మాట్లాడుకుని వాడిని తీసుకుని నాకు దూరం గా వెళ్లిపోదామనుకున్నావు కదూ.... నాకన్నా వాడే ఎక్కువ అయ్యిపోయాడు కదూ.... ఇక్కడ ఇంతమంది లో నిన్ను పట్టుకుని అనాధ అంటుంటే...డాడ్ కి ఇచ్చిన మాట కోసం నీ జీవితం నాశనం చేసుకోవడానికి రెడీ అయ్యి పోయి...అనాధ అని ఒప్పుకున్నావు కానీ.... నువ్వు అనాధ అయ్యితే....నేను అనాధ అవుతాను అని...ఎందుకు అనుకోలేదు.... చెల్లి అనాధ అయ్యితే....ఈ అన్నయ్య కూడా అనాధ అవుతాడు కదా.....అది  ఎందుకు ఆలోచించలేదు  నువ్వు.... ఆ మాట తో అను కి ఎక్కడ లేని బాధ వచ్చేస్తుంది..... కింద కూర్చుండిపోయి అర్జున్....అంటూ అర్జున్ ని పట్టుకుని ఏడుస్తుంది.... ఇప్పుడైనా అన్నయ్య అని పిలువవే రాక్షసి.....అంటూ అర్జున్ అను ని దగ్గరకు తీసుకుని ఏడుస్తాడు..... అన్న చెల్లిని దూరం చేసిన తన తప్పు సరిచేసుకున్నందుకు.....అరవింద్ గారు కూడా సంతోషం తో కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు..... అర్జున్ తనని తాను కంట్రోల్ చేసుకుని.......అను బంగారం!!  ఏడవుకు రా....నేను  వచ్చేసాను  కదా....మా అమ్మ వి కదూ....అంటూ  అను ని బుజ్జగించి...తన ఏడుపు ఆపిస్తాడు.... అర్జున్, అను ఇద్దరు లేచి నిలబడి అరవింద్ గారి దగ్గరకి వస్తారు.... నీకు వరసకు మావయ్య ని ఐనా.....ఇక మీద నీకు తండ్రి స్థానం లో ఉండి నీ భాద్యత నేను తీసుకుంటాను...... మరి నన్ను క్షమిస్తుందా??? నా చిట్టి తల్లి అను....అంటూ చిన్న పిల్లాడి లా అడుగుతారు..... అను చిన్న నవ్వు నవ్వి మావయ్య!!  అంటూ అరవింద్ గారిని పట్టుకుంటుంది..... అరవింద్ గారు అను ని,అర్జున్ ని దగ్గరకు తీసుకుని చాలా సంతోషిస్తారు.... అక్కడ జరిగిన సెంటిమెంట్ సీన్ లో నుంచి అందరు నెమ్మది గా బయటకి వస్తారు.... అరవింద్ గారు శివాజీ గారి వైపు కోపం గా చూసి.... మీరు ఏ కంపెనీ తో టై అప్ కావాలని....2 ఇయర్స్ గా తిరిగిన నేత్ర గ్రూప్ అఫ్ ఇండస్ట్రీస్ కి వారసురాలు ఈ అనన్య నేత్ర శివాజీ గారు.... ఈ అమ్మాయి వల్లే మా కంపెనీ లెవెల్ కి ఏ మాత్రం సరిపోని మీ కంపెనీ తో టై అప్ అయ్యి మీకు పార్టనర్ షిప్ ఇచ్చాడు మా అర్జున్.... మీ అల్లుడు శివ పని చేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీ కూడా అనన్య దే..... నా వ్యాపార సామ్రాజ్యాలకు , నేత్ర ఆస్తిపాస్తులకి అర్జున్ వారసుడు కాదు.....నేత్ర వంశ వారసురాలు ఐన ఈ రాణి అనన్య నేత్ర మాత్రమే వారసురాలు..... ఆ మాట తో శివాజీ గారు షాక్ తో నిలబడిపోయారు..... మిగిలినవారెవరికీ నోటమాట లేదు.... కార్తీక్ అరవింద్  గారి దగ్గరకి వస్తాడు.... అంకుల్!!  మీరు ఎం చెప్తున్నారు ?? అను నేత్ర వారసురాలా? అర్జున్ కి మీరు డాడ్ అయితే.....అను కి బ్రదర్ ఎలా అయ్యాడు???? ఎం అర్ధం కావటం లేదు..... అరవింద్: ఎవరికి తెలిసినా,తెలియకపోయినా నీకు తెలియాలి కార్తీక్.....ఎందుకంటే నీ లైఫ్ అనుతో ముడిపడి ఉంది..... కానీ...నీతో పాటు ఇంక కొంత మందికి...ముఖ్యంగా అనన్య కి కూడ కొన్ని నిజాలు తెలియాలి.... అందుకు తెలుసుకోవలసింది అనన్య గురుంచి మాత్రమే కాదు....ఇంకా చాలా తెలుసుకోవాలి..... అది తెలియాలి అంటే నేత్ర వంశం గురుంచి,వాళ్ళు చేసిన తప్పు గురుంచి కూడా తెలియాలి..... అది తెలియాలి అంటే.....ఈ పెద్ద పూజారి గారే చెప్పాలి.... చెప్పండి పూజారి గారు!!!! పెద్దపూజారి గారు చెప్పడం మొదలు పెట్టారు.... ********************** నేత్ర వంశం వారిది విశ్వాపురం..... వారికీ ఉన్న ఆస్తిపాస్తుల్లో కుబేరులు కి తీసిపోరు అనుకునే వారు అంతా....... వారికీ ఎందులోను తిరుగు ఉండేది కాదు.... ఎందుకంటే నేత్ర వంశీయులు అమ్మవారి భక్తులు... విశ్వాపురం లో అమ్మవారి గుడి కూడా వారు కట్టించిందే.... అమ్మవారి నేత్రమే వాళ్ళకు తోడు గా,రక్ష గా ఉంటుందని నమ్మేవారు..... ఆ వంశం లో పుట్టిన ఆడపిల్లలని చాలా అపురూపంగా చూసేవారు......కారణం ఆ వంశం లో పుట్టిన ప్రతి ఆడపిల్ల అమ్మవారి జన్మ నక్షత్రం ఐన మూల నక్షత్రం లోనే జన్మించేవారు..... అందుకే ఆ వంశం లో ఆడపిల్లలని అమ్మవారి అంశ గా చూసేవారు.... ఆ అమ్మాయిలు కూడా అమ్మవారి మీద అపారమైన  భక్తి తో ఉండేవారు.... కాలక్రమేణా ఆ వంశం లో పుట్టిన అమ్మాయిలును ఆ వంశానికి రక్ష గా, ఒక రాణి లా చూసేవారు..... అటువంటి సమయం లోనే నేత్ర వంశం లోని రుద్రా నేత్ర గారు ఒక తప్పు చేసారు...... గర్భవతి ఐన ఆయన భార్యకు ఏ బిడ్డ పుడుతుందో  తెలుసుకోవాలని ఎన్నో పూజలు చేసి ఆడపిల్ల పుడుతుందని తెలుసుకున్నారు.... అది రుద్రా నేత్ర భరించలేకపోయారు.....తన వంశానికి  వారసుడిగా కొడుకు కావాలనుకున్నారు... అందుకోసం ఆ బిడ్డ పుట్టకూడదు అని.....నిండు గర్భవతి ఐన తన భార్య చేత ఏవో మూలికల రసం తాగించారు... పర్యవసానం గా నిండు గర్భిణీ ఐన రుద్ర నేత్ర గారి భార్య, కడుపులో బిడ్డ భూమి మీద పడకుండానే....చనిపోయారు...... ఐనా కూడా రుద్ర గారు బాధపడలేదు..... ఫలితం గా నేత్ర వంశ పతనం మొదలయ్యింది.... అడుగు అడుగున ఓటమి మొదలయ్యింది......నేత్ర వంశం మొత్తం చెల్లాచెదురు అయ్యిపోయింది.... పంట నేల మొత్తం బీడు గా మారిపోయింది...... ఎంతో కళ గా ఉండే నేత్ర సామ్రాజ్యం కళ విహీనం  అయ్యిపోయింది..... సృష్టి కి గమనం ఐన స్త్రీ  పుట్టుకకు అడ్డుపడితే  ఎం జరుగుతుందో....రుద్ర నేత్ర గారికి తెలిసింది.... తాను చేసిన తప్పుకి పరిహారం ఎం చేయాలి అని అప్పటి గుడి పూజారి గారిని పిలిపించారు... పూజారి గారు అంతా చూసి....అయ్యా!  మీరు చేసింది చాలా పేద్ద తప్పు....అమ్మవారి అంశ తో పుట్టవలసిన  ఆడపిల్లని ఈ భూమి మీద కు రాకుండా చేసారు..... ఇక మీ వంశం లో ఆడపిల్ల పుట్టేవరకు మీకు పతనం తప్పదు....పైగా ఈ వంశం లో మళ్ళీ  ఆడపిల్ల పుట్టే  యోగం 8 తరాల వరకు లేదు....8 తరాల తరువాత మళ్ళి అమ్మవారి మూల నక్షత్రం లో పుట్టే అమ్మాయి పుట్టుక తోనే మీ వంశానికి పూర్వ వైభవం వస్తుంది..... కానీ మీరు చేసిన పాపానికి ఆ అమ్మాయి కూడా చాలా బాధలు పడవలసి వస్తుంది.....అని చెప్తారు.... అప్పుడే రుద్ర నేత్ర తనచేసిన తప్పు కి ప్రాయశ్చిత్తంగా  ఎం చేయాలో నిర్ణయించుకున్నారు. ********************   అదండీ! నేత్ర వంశం లో జరిగిన తప్పు... అది జరిగిన 8 తరాల తరువాత......అంటే 25 సంవత్సరాల ముందు మళ్ళీ ఈ విశ్వాపురం లో బీడు వారిన నేల మళ్ళీ పంటలు పండటం మొదలయింది.... అప్పుడే మాకు అర్ధం అయ్యింది....నేత్ర వంశం లో మళ్ళీ ఆడపిల్ల పుట్టింది అని....కానీ...ఆ అమ్మాయి ఎవరో,ఎక్కడ ఉంటుందో...మేము తెలుసుకోలేక పోయాము....అంటూ పెద్ద పూజారి గారు చెప్పి ముగిస్తారు... అందరు అను ని కొత్తగా చూస్తారు...... కార్తిక్:  మరి అర్జున్ ,అను ???? అరవింద్: ఆ విషయం నేను చెప్తాను...... నేత్ర వంశం లో 8వ తరం లో పుట్టిన వాడే ప్రతాప్  నేత్ర .....అరవింద్ స్నేహితుడు..... ప్రతాప్, అరవింద్, అరవింద్ చెల్లెలు అను రాధా....ముగ్గురు కలిసి ఒక కాలేజీ లో నే చదువుకున్నారు.... ప్రతాప్ చాలా సింపుల్ గా ఉండేవాడు...అతను కస్టపడి ఎదగాలి అనే మనస్తత్వం......అతను నేత్ర వంశ వారసుడు అని ఎవరికీ తెలియదు..... అరవింద్ చెల్లి అనురాధ, ప్రతాప్ ప్రేమించుకుని...పెద్దల అంగీకారం తో పెళ్లిచేసుకున్నారు..... తరువాత తెలిసింది ప్రతాప్ గురుంచి.... ప్రతాప్,అరవింద్ కలిసి .....ఒక కంపెనీ కూడా స్టార్ట్ చేసారు.... ప్రతాప్ కి అరవింద్ చెల్లి అనురాధ కి పుట్టినవాడే  అర్జున్....అర్జున్ నేత్ర.... అర్జున్ పుట్టిన కొన్ని నెలలకే  అనురాధ గారు ఒక ఆక్సిడెంట్ లో చనిపోతారు........ ప్రతాప్ ఆ విషయాన్ని జీర్ణించుకోలేక పోతారు..... ప్రతాప్ నెమ్మదిగా తాగుడుకి బానిస అయ్యిపోతారు..... అర్జున్ ని పట్టించుకునే  స్థితిలో లేరు..... అప్పటికే అరవింద్ కి పెళ్లి అయ్యినా, పిల్లలు లేరు... ఒక రోజు ప్రతాప్ గారు అర్జున్ ని తీసుకుని అరవింద్ ఇంటికి వెళ్తారు....... తన కొడుకు ని పెంచే బాధ్యత అరవింద్ కు, అతని భార్య కి అప్పగించి.....తనకున్న ఆస్తులన్నిటిని అర్జున్ కి రాసి ఇచ్చి ........ఎవరు ఎంత చెప్తున్నా వినకుండా వెళ్ళిపోతారు...... పిల్లలు లేని అరవింద్ గారు,అతని భార్య కు అర్జున్ కొడుకు అయ్యాడు.... అర్జున్ కి మేనమామ ఐనా ఆ విషయం అర్జున్ కి  తెలియకుండా పెంచుతారు.... కొన్నాళ్ళకి అర్జున్ పేరు మీద ఉన్న ఆస్తులతోనే  బిజినెస్ ని ఇంకా పెంచుతారు అరవింద్ గారు...... తరువాత ఒక రోజు తెలిసింది అరవింద్ గారికి...... ప్రతాప్గారు కస్తూరి అనే ఆవిడా ని మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అని..... వాళ్ళకు పుట్టిన కూతురే అనన్య నేత్ర...... ప్రతాప్ తన కూతురుకిి పోయిన తన భార్య అను పేరు రావాలనే అనన్య అని పేరు పెట్టి...అను అని పిలిచేవారూ అని కూడా తెలిసింది..... కూతురు పుట్టిన తరువాత ప్రతాప్ లో చాలా మార్పు వచ్చింది అని.....తాగుడు మానేసి .......కూతురు కోసం ఒక జాబ్ చేసుకుంటున్నారు అని కూడా తెలుస్తుంది అరవింద్ గారికి......... కానీ వెళ్లి ప్రతాప్ ని కలిస్తే ఎక్కడ అర్జున్ ని మళ్ళీ తనకి ఇవ్వమని అడుగుతారెమో అన్న భయం తో అరవింద్ గారు ప్రతాప్ దగ్గరకి వెళ్ళలేదు..... కానీ కొన్నాళ్ళకి అరవింద్ గారికి తన ఫ్రెండ్ నుంచి ఫోన్ వస్తుంది........... ప్రతాప్ గారికి సీరియస్ గా ఉందని...హాస్పిటల్ లో అడ్మిట్ చేసారని......అర్జున్ ని కలవరిస్తున్నారు  అని..... కానీ అప్పటికే బిజినెస్ వల్ల ముంబై లో స్థిరపడ్డారు అరవింద్ గారు... వెంటనే అర్జున్ ని తీసుకుని ప్రతాప్ దగ్గరకి బయలుదేరతారు అరవింద్..... అర్జున్  కి అప్పటికి 10 ఇయర్స్......తనకి  సిట్యుయేషన్ అర్ధం కావడం కోసం ప్రతాప్ గురుంచి.... ప్రతాప్ తన తండ్రి అన్న విషయం....అర్జున్ కి చెప్పేస్తారు అరవింద్..... అరవింద్, అర్జున్ హాస్పిటల్ కి చేరేసరికి ప్రతాప్ ఆఖరి ఘడియల్లో ఉన్నారు.... ప్రతాప్ అర్జున్ ని దగ్గరకు తీసుకుని.....నీ చెల్లిని జాగ్రత్తగా చూసుకో"  అని చెప్పి కొడుకు చేతిలోనే చనిపోతారు.... అర్జున్ కి ఆ వయసులో నే గట్టి దెబ్బ తగిలింది..... ప్రతాప్ దశ దిన కార్యక్రమాలు జరిగే వరకు అరవింద్ గారు, అర్జున్ తో అక్కడే ఉంటారు........ ఆ పది రోజుల్లోనే అర్జున్ కి అనన్య మధ్య అన్న,చెల్లి బంధం తెలిసింది.... కానీ అనన్య కి అర్జున్ ఎవరు అనేది చెపితే అర్ధం చేసుకోలేని చిన్న పిల్ల..... అనన్య కి అర్జున్ తనకు అన్న అవుతాడు....అని తెలియక పోయినా అన్న !! అన్న!!!  అంటూ అర్జున్ ని వదిలేదు కాదు..... ఆ పది రోజుల్లో అర్జున్ ,అను కి ఎంత దగరయ్యడు అంటే అర్జున్ తినిపిస్తే కానీ తినేది కాదు...... అర్జున్ కి తన తండ్రి చెప్పిన చివరి మాటలే  గుండెల్లో నాటుకుపోయాయి.... అందుకే అను ని అపురూపం గా చూసుకునేవాడు.... అది చూసి అనన్య ని,కస్తూరి గారిని కూడా వాళ్ళతో తీసుకు వెళ్ళాలి అనుకున్నారు అరవింద్ గారు.... ప్రతాప్ గారి దశ దిన కార్యక్రమం పూర్తి ఐన తరువాత... కస్తూరి గారితో ఆ విషయం గురుంచి చెప్పారు.... కానీ ఆవిడ అది అర్ధం చేసుకోకుండా ఆస్థి కోసం నాటకం ఆడుతున్నారు అని.....తన బిడ్డ కు అన్యాయం చేసి ఆస్థి మొత్తం అర్జున్ కి వచ్చేలా చేసుకున్నారు అంటూ అరవింద్ గారిని, అర్జున్ ని నానా మాటలు అని....ఇంటి నుంచి బయటకు వెళ్లిపొమ్మంది...... జరిగిన అవమానం తట్టుకోలేక అరవింద్ గారు, అర్జున్ ని తిసుకుని ముంబై వెళ్లిపోయారు..... చాలా ఇయర్స్ గడిచిపోయాయి....అరవింద్ గారి భార్య కూడా కాలం చేసారు.... అరవింద్ గారి బిజినెస్ కూడా చాలా బాగా పెరిగిపోయింది... సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ గా పేరు ప్రఖ్యాతలు కూడా వచ్చాయి... అర్జున్ అను ని పూర్తి గా మర్చిపోయాడు....అనుకున్న అరవింద్  కి ఒక రోజు అర్జున్ రూమ్ లో అను చిన్నప్పటి ఫొటోస్ దొరికాయి..... ఆ ఫొటోస్ చిన్నప్పుడు అను ఇంటి నుంచి వస్తు అర్జున్ చెల్లి గుర్తు గా తనతో తెచ్చుకున్నాడు...అని అరవింద్ గారికి అర్ధం అయ్యింది.... అరవింద్ గారికి కస్తూరి గారి ప్రవర్తన గుర్తుకు వచ్చి...అర్జున్ కి ఆ రోజు జరిగిన విషయం చెప్పకుండా....అర్జున్ ని అను గురుంచి ఆలోచించద్దు....కలవడానికి ప్రయత్నం చెయ్యద్దు...అని గట్టిగా వార్న్ చేస్తారు.... పెంచిన తండ్రి మాట కాదనలేక....అను కి దూరం గా ఉండిపోయాడు అర్జున్.....కానీ అను కి ఎందుకు దూరంగా ఉండమంటున్నారో అర్ధం కాదు అర్జున్ కి... మళ్ళీ కొన్నాళ్ళకి కంపెనీ ప్రొఫైల్స్ లో కార్తీక్ కారణంగా అను ప్రొఫైల్ చెక్ చేయడం వల్ల అను తన చెల్లి అని అర్జున్ కి అర్ధం అవుతుంది.... ఇంకా "చెల్లి ని చూడాలి" అన్న కోరిక తో అరవింద్ గారి దగ్గరకు వెళ్లి పర్మిషన్ అడుగుతాడు అర్జున్... కానీ అరవింద్ గారు ఇంక లాభం లేదు అని...కస్తూరి చేసిన గొడవ అంతా చెప్పి.....అను ని చూడటానికి వెళ్లద్దు...అని గట్టిగా చెప్తారు....... కానీ....అర్జున్ తన చెల్లి కోసం సింగ్ వేషం లో కార్తీక్ తో హైదరాబాద్ వెళ్తాడు...... అను అర్జున్ ని కనిపెట్టేస్తుంది.....అర్జున్ అనుతో మాట్లాడి తనతో ముంబై వచ్చేయమంటాడు.... అందుకు అను ఒప్పుకోదు... "తన సంగతి ఎలా ఉన్నా అర్జున్ ని అరవింద్ గారిని వదిలి రావద్దు" అని అర్జున్ దగ్గర మాట తీసుకుంటుంది అను..... అను ని జాగ్రత్తగా చూసుకోమని కార్తీక్ కి చెప్పి ముంబై వెళ్లిపోతాడు అర్జున్.... కానీ ఈలోగానే అర్జున్ హైదరాబాద్ లో అను ని కలిసిన విషయం తెలుసుకుంటారు అరవింద్ గారు.... బిజినెస్ పేరు చెప్పి అర్జున్ ని అమెరికా పంపించేస్తారు... అర్జున్ అమెరికా వెళ్ళిపోయాక....అనుకి ఫోన్ చేసి అర్జున్ లైఫ్ లోకి రాకుండా వెళ్లిపొమ్మని.....డబ్బు కోసం నాటకాలు ఆడద్దు అని అను కి వార్న్ చేస్తారు అరవింద్ గారు.... అను కూడా సరే అని చెప్పి....తన లైఫ్ లో జరిగిన మార్పు ల కారణం గా వెంటనే వెళ్లలేక....ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి.......జాబ్ కి రిజైన్ చేసి....ఆ విషయం అరవింద్ గారికి ఇన్ఫోర్మ్ చేస్తుంది.... కార్తీక్ కి ఏదోకటి చెప్పి...కార్తీక్ ని తీసుకుని దూరం గా వెళ్లిపోవాలనుకుంది..... కానీ ఇంతలో కిషోర్ పెళ్ళికి రావటం తో అను ఎవరు అనేది బయటకు తెలిసింది... అరవింద్  గారి "హెల్త్ బాలేదు" అని తెలిసి అమెరికా నుంచి అర్జున్ రావటం....అను విషయం లో అరవింద్ గారు తన తప్పు తెలుసుకోవటం...అనుకి పెళ్లి అని తెలిసి విశ్వాపురం కి రావడం జరిగిపోయాయి..... కానీ విశ్వపూరం చేరుకున్న అరవింద్ గారికి, అర్జున్ కి గుడిలో పెద్ద పూజారి వల్ల అసలు విషయం తెలుస్తుంది.... తన తప్పు కి పరిహారంగా రుద్ర నేత్ర గారు ఆస్థి  అంతటిని వారసులకు...అంటే కొడుకు ,కొడుకు కి రాసి ఇచ్చే అధికారం ఉంటుంది.... కానీ ఎప్పుడైతే నేత్ర వంశం లో ఆడపిల్ల పుడుతుందో.... అప్పుడు నేత్ర వంశానికి చెందిన ఆస్తులు అన్ని కేవలం ఆ అమ్మాయికి...మాత్రమే చెందుతాయి అని....వాటి  మీద ఎవరికీ ఏ హక్కు ఉండదు అని వీలునామా రాసి దానిని శాసనంగా మార్చేశారు...అన్న విషయం పెద్దపూజారి  గారి ద్వారా తెలుసుకుంటారు... ఆ విదంగా  నేత్ర ఆస్తులకి , ఇప్పుడు అర్జున్ పేరు మీద ఉన్న ఆస్తులకి, అరవింద్ గారు నడిపిస్తున్న  కంపెనీ లకి అను మాత్రమే వారసురాలు అవుతుంది....... ******************** ఈ విషయాలు అన్ని చెప్పి అరవింద్ గారు మౌనం గా కూర్చుంటారు..... ఎవరూ మాట్లాడటం లేదు......ఈ అమ్మాయి వెనుక ఇంత కథ ఉందా...అని మనసులో నే అనుకుంటూ ఉంటారు.... ఏ స్టేటస్ లేదు అనుకున్న అమ్మాయి కి ఇన్ని వేల కోట్ల ఆస్థి ఉందా?? అనుకుంటూ నోరు వెళ్లబెడతారు శివాజీ గారు...... ఒక మాములు మధ్య తరగతి అమ్మాయి అనుకున్న అనన్య...నేత్రవంశ వారసురాలు అని, కొన్ని వేల కోట్ల ఆస్తికి వారసురాలు అని తెలిసిన కార్తీక్ కి మతి పోయింది...... శివ,శాంతి,కిషోర్,నిత్య,అను టీం అంతా మ్యూట్ లోకి వెళ్లిపోయారు..... సైలెన్స్ కూడా అంత భయంకరంగా ఉంటుందా??? అన్న సిట్యుయేషన్ లో నుంచి.....అరవింద్ గారి మాటలతో వాళ్ళ మూడ్ లో నుంచి బయటకి వస్తారు అందరు.... అరవింద్ గారు అను వైపు చూసి... అరవింద్: అను! నువ్వు అర్జున్ లైఫ్ లోకి ఎదో డబ్బు కోసం వస్తున్నావు అనుకున్నాను....కానీ నేత్ర ఆస్థి అంతటికి నువ్వే వారసురాలివి...... నేత్ర వంశానికి మహారాణివి.... ఈ ఆస్థి విషయాలు నీకు ఇప్పటివరకు తెలియదు... అలాగే ఎవరికీ తెలియదు.....అందుకే నీ గురుంచి అందరికి, ఆస్థి గురుంచి నీకు కూడా తెలియాలి అనే అందరి ముందు ఈ విషయాలు చెప్పాను... అర్జున్:  డాడ్!!! అరవింద్: చెప్పు అర్జున్!!! అర్జున్: మీరు ఇంకా నా చెల్లి అనన్య  గురుంచి అర్ధం చేసుకోలేదు.... అరవింద్: ఏమంటున్నావు అర్జున్?? అర్జున్: అనన్య నా చెల్లి గా కాదు.....నేనే రాణి అనన్య నేత్ర కి అన్నయ్య గా గర్వం గా చెప్పగలను..... అరవింద్:ఏంటి అర్జున్??? అర్జున్: నా నమ్మకం నిజమైతే నేను తన అన్నయ్య ని అన్న విషయం ఎప్పుడు తెలిసిందో...అప్పుడే ఆస్థి విషయం కూడా నా చెల్లి కి తెలుసు... కావాలంటే అను ని అడగండి..... అరవింద్: అను!! అర్జున్ చెప్పింది నిజామా?? అను: .......... అందరూ ఆసక్తి  గా చూస్తున్నారు..... అరవింద్: ఇప్పుడు నువ్వు చెప్పక పోతే నీ ప్రాణం గా ఫీల్ అయ్యే నీ అన్న అర్జున్ మీద ఒట్టు....అంటూ అను చేతిని అర్జున్ తల మీద పెడతారు... అను వెంటనే అర్జున్ తల మీద చెయ్యి తీసేస్తుంది... అను: తెలుసు మావయ్య!!! ఇప్పుడు కాదు ఎప్పుడో తెలుసు..... అరవింద్: ఇంత ఆస్థి నీకు ఉందని తెలిసి కూడా నువ్వు ఇలా ఎందుకు ఉన్నావు??? నువ్వు తలచుకుంటే...నేను నడిరోడ్డు మీద ఉంటాను.....ఐనా నేను నిన్ను అన్ని మాటలు అన్నా ఎందుకు భరించావు??? నిన్ను అనాధ...ఆస్థి,అంతస్థు  ఏమి లేవు....నువ్వు వాళ్ళ స్టేటస్ ముందు ఎందుకు పని రావు....అంటూ  నిన్ను అవమానించినా ఎందుకు నోరుమూసుకున్నావు ??? అసలు ఈ ఆస్థి విషయం నీకు ఎప్పుడు తెలుసు??? ఇంకా ఉంది......................................................... నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం... హాయ్ ఫ్రెండ్స్ నేను మీ.....🏅 🇻​🇪​🇳​🇺​ 🏅 స్టోరీ నచ్చితే... లైక్, షేర్, కామెంట్ అండ్ ఫాలో మీ.
ఇంకా చూడడానికి
218 వీక్షించారు
2 నెలల క్రితం
#

లవ్ స్టోరీ

నా జాబిలి కోసం పార్ట్ 21. ముందుగా పార్ట్ 1-20  చదివిన తరువాత పార్ట్ 21 చదవండి. ప్రిన్సిపాల్  'గొడవకు కారణం ఐన సుజాత' ని చూసి ఇంకా కోపంతో ఆ అమ్మాయిలని తిడతాడు.😬😬😬 అను: సర్! మీతో మాట్లాడాలి సర్.... ప్రిన్సి: వచ్చేసావా... ఇంకా రాలేదు ఏంటి అనుకున్నా....ఈగొడవలో నీ ఫ్రెండ్స్ ఉన్నప్పుడే నువ్వు వస్తావు అని తెలుసు......ఐనా ఇంజనీరింగ్ లోకి రాగానే ఎదో పెద్దవాళ్ళలా ఫీల్ అయ్యిపోతారు... లవ్, గ్యాంగ్, గొడవలు అంటూ కాలేజీ లో న్యూసెన్స్  చేస్తున్నారు. అను: అసలు ఎం జరిగిందో తెలుసుకోకుండా....😏😏😏😏😏 ప్రిన్సి: ఓహో....ఎం జరిగిందో నాకు తెలియకుండా మాట్లాడుతున్నాను....నీకు మాత్రం అంతా తెలుసు...నువ్వు వచ్చి నాకు చెప్తావు...అంతేనా.... అను(కొంచెం గట్టిగా):  సర్! ఇది ఒక అమ్మాయి కి సంబందించిన విషయం.... అందరి ముందు డిస్కషన్ ఏంటి సర్... ప్రిన్సి: ఆ విషయం నీ ఫ్రెండ్ ఆ అమ్మాయికి ,చెప్పు... ఆడపిల్ల అయ్యుండి ..... అను: సర్! ఇందులో సుజాత తప్పు ఏమి లేదు...అసలు తప్పు చేసింది నేనే సర్... ప్రిన్సి: నువ్వా???😲😲😲😲 అను: అవును సర్... డీటెయిల్స్ అన్ని నేను చెప్తాను సర్...ముందు ఇక్కడి నుంచి అందరిని పంపించేయండి.... ప్రిన్సి: ఇంత గొడవ చేశారు.....వీళ్ళని పంపించేయాలా? అంటే రవీందర్ ని, చందు ని, సుజాత ని ఉంచి  మిగిలన వారిని పంపించేయండి సర్...ప్లీజ్ సర్... ప్రిన్సి: సరే... అందరూ వెళ్ళండి...... అందరూ వెళ్ళిపోతారు. 30 నిమిషాల తరువాత............................... రవీందర్, చందు నవ్వుకుంటూ ఒకరి మీద ఒకరు చేతులు  వేసుకుని బయటకి వస్తారు. 😀😀😀😀😀😀😀😀 అదిచుసిన అందరూ షాక్ అవుతారు.😲😲😲😲😲😲 చందు అందరి ముందు రవీందర్ కి' సారీ 'చెప్తాడు. గొడవ అక్కడితో  క్లోజ్ అవ్వడంతో అందరూ వెళ్ళిపోతారు. అను, సుజాత, రవీందర్, అను ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు. అను ఫ్రెండ్స్ అయితే ఇంక షాక్ లోనే ఉంటారు.🤔🤔🤔🤔 సుజాత, రవీందర్ అను కి' థాంక్స్' చెప్తారు. థాంక్స్ కాదు... నాకు  ఐస్ క్రీం కావాలి....అని🍧🍧🍧 అను గొడవ మొదలు పెడుతుంది. పద....నీకు మాత్రమే కాదు' అందరికి నేనే ట్రీట్ ఇస్తాను పదండి కాంటీన్ వెల్దాము' అని రవీందర్ అందరిని కాంటీన్ కి తీసుకెళ్తాడు. అందరూ కావలిసింది తీసుకుని టేబుల్ దగ్గర కూర్చుంటారు. అను సైలెంట్ గా ఐస్ క్రీం మీద ఐస్ క్రీమ్స్ 🍨🍨🍨🍨🍨 తింటూ ఉంటుంది. ఫ్రెండ్స్: ఒసేయ్... తరువాత తిందువు గానీ, అసలు లోపల ఎం జరిగింది??? ఆ చందు అంత కూల్ గా రవి కి సారీ చెప్పడం ఏంటి??? అసలు ఎం చేసావే???👿👿👿👿👿 సుజాత, రవీందర్ నవ్వుకుంటూ ఉంటారు.😊😊😊😊 అను: అబ్బా... ఉండండి.ముందు ఐస్ క్రీం కి సామజిక  న్యాయం చేయనివ్వండి....తరువాత చెప్తాను.... ఫ్రెండ్స్: నీ ఐస్ క్రీం పిచ్చి తో మాకు పిచ్చి వచ్చేలా ఉంది లే కానీ....సుజాత, రవీందర్... మీరైనా  చెప్పండి....ఎం జరిగింది ??? సుజాత: సరే, నేను చెప్తాను..... 30 నిమిషాలకు ముందు మన కొండముచ్చు అను ఎం చేసిందంటే...... ********** ప్రిన్సి: అందరు వెళ్లిపోయారు కదా, ఇప్పుడు చెప్పు... అను: సర్! ఇది ఒక అమ్మాయి పర్సనల్ మ్యాటర్...ఇక్కడ ....ఇలా.... ప్రిన్సి: సరే, మీరంతా నా రూమ్ లోకి రండి.... అను: సరే సర్... అందరూ లోపలి వెళ్తారు. చందు, రవీందర్ ఎదురెదురుగా నిలబడి కోపంగా చూసుకుంటారు.😠😠😠😠😠😠😠😠 సుజాత ని తీసుకుని అను ప్రిన్సి కి ఎదురుగా నిలబడుతుంది. ప్రిన్సి కి వీళ్ళని చూస్తుంటే కోపం పెరుగుపోతుంది. సుజాత రాసిన లవ్ లెటర్ ని కోపంతో టేబుల్ మీద విసురుతాడు. ప్రిన్సి: ఇప్పుడు చెప్పు అను... ఎందుకలా అబద్దం చెప్పావు??? అను: నేనేం అబద్దం చెప్పాను సర్... 😞😞😞😞😞 ప్రిన్సి: నీ గురుంచి నాకు తెలుసు అను... నీ ఫ్రెండ్స్ కోసం నువ్వు ఇలా చేస్తున్నావు అని నాకు  తెలుసు... ఎవరైనా ప్రాబ్లెమ్ అంటే చాలు.....సాల్వ్  చేయడానికి '  రెడీ అంటావు... ఐనా మీరు ఇంకా చిన్న పిల్లలు...... ఈ లవ్ , గొడవలు మీకు అవసరమా? కాలేజీ కి వచ్చింది బుద్దిగా చదువుకోవడానికా........లేకపోతే ఇలాంటి....... అసలు ఆడపిల్ల అయ్యుండి ఈ అమ్మాయి.... అను: సర్... ఇందులో సుజాత తప్పేమి లేదు సర్... ప్రిన్సి: అంటే ఈ లెటర్ నువ్వు రాసావా ? అను:  ఛీ...చి ...ఛి ...నేను రాయలేదు సర్. ప్రిన్సి: నువ్వు నన్ను confuse చేయకు..... నువ్వే కారణం అంటావు...అమ్మాయి లైఫ్ అంటావు....🙄🙄🙄🙄🙄🙄 అను:  confuse ఏమి లేదు సర్! ఆ లెటర్ సుజాత , రవి కి రాసిందే... సుజాతకి,రవి కి టెన్షన్ మొదలయింది. ప్రిన్సి: కొంచెం క్లారిటీ గా చెప్పు తల్లి!!!! అను: ఆ లెటర్ ఈ సుజాత.....ఈ రవి కి రాసింది కాదు సర్... ప్రిన్సి: మరి... అను: ఆ లెటర్ మన ఇంగ్లీష్  ప్రొఫెసర్  సుజాత మేడం.....కాలేజీలో మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ రవి రాజన్ సర్ గారికి రాసింది సర్..... ప్రిన్సి: ఏంటి? సుజాత మేడం రాయడమేంటి??? అసలు ఎవడు ఆ రవి రాజన్ గా..... రవీందర్, చందు, సుజాత....ముగ్గురు  కరెంటు షాక్ కొట్టిన కాకుల్లా అయ్యిపోయారు  .😲😲😲😲😲 ప్రిన్సి ఉలుకు ,పలుకు లేకుండా కూర్చుండిపోయారు. అను శాంతి వైపు చూసి కన్ను కొడుతోంది .😜😜😜😜 అను: అవును సర్... సుజాత మేడం ఆ లెటర్ రాసింది మన ప్రిన్సిపాల్ రవిరాజన్ సర్ కే.... ప్రిన్సి(  తడబడుతూ):  ఏయ్  !  ఎం మాట్లాడుతున్నావు? నువ్వు ఎదో తప్పుగా అనుకుంటున్నావు? అను: లేదు సర్!  నేను సుజాత మేడం కి బాగా క్లోజ్ అని మీకు తెలుసూ......ఆ లెటర్ సుజాత మేడం రాసి..మీకు ఇవ్వమని నాకు ఇచ్చారు... కానీ...నేనేమో ఆడపిల్లని..... నేను వచ్చి మీకు ఇస్తే బాగోదు అని ...రవీందర్ తో మీకు పంపించాలి అనుకున్నాను....ఈ లోపు మన కృష్ణ మూర్తి  సర్ పిలిస్తే...సుజాతకి ఆ లెటర్ ఇచ్చి రవీందర్ తో మీకు పంపమన్నాను...😔😔😔😔 ఈలోపు వీళ్ళు ఎం మాట్లాడుకుంటున్నారో తెలియని చందు ఎదో వుహించుకుని గొడవ చేసారు... అది సర్ జరిగింది... అను చెప్తున్న స్టోరీ కి ప్రిన్సిపాల్ తో సహా అందరికి ఫ్యుజ్  లు ఎగిరిపోయాయి .💡💡💡💡 ప్రిన్సి(ఆశ గా):  నువ్వు చెప్పేది నిజమేనా??? అను: నిజం సర్!!!!  ఫ్యామిలీ కోసం పెళ్లి చేసుకోకుండా  మిగిలిపోయిన మీ బాచిలర్ లైఫ్ మీద ఒట్టు సర్. అందరూ నోళ్లు తెరచి ప్రిన్సిపాల్ వైపు చూస్తుంటారు.ఆయన మాత్రం గాలిలో తేలిపోతూ ఉంటారు. అను: ఐనా మీకు ఎందుకు సర్ అంత డౌట్!!! 🤔🤔🤔🤔 ఈ కాలేజీ లో అబ్బాయిల కన్నా మీరే హ్యాండ్సమ్ గా ఉంటారని కాలేజీ అమ్మాయిలంతా చెప్పుకుంటాం. అమ్మాయిలంతా మీ ఏజ్ 25+అని,30+అని...పందేలు కూడా వేసుకుంటున్నారు. ఇంతకీ మీ ఏజ్ ఎంత సర్!!!!!🤔🤔🤔🤔🤔 ప్రిన్సిపాల్ గాలిలో కూడ లేరు....ఆకాశం లో తేలిపోతున్నారు. అను: సర్లే సర్!!!  మీ ఏజ్ గురుంచి తరువాత మాట్లాడుకుందాం లెండి సర్..... ఇంక మన సుజాత మేడం... చిన్న వయసులో  నే భర్త చనిపోయి...ఆవిడ పేరెంట్స్ తో ఒంటరి గా బతుకుతున్న  ఒక ఏంజెల్  .👸👸👸👸👸 ఆవిడ పక్కన మేము నడుస్తుంటే అబ్బాయిలు ఎవరూ మా వైపు చూడరు...అందరు మేడం కి సైట్ కొట్టేవారే.... ఆ విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది.... అలాంటిది మేడం కి మీరు నచ్చడంలో, మీకు మేడం నచ్చడంలో ఆశ్చర్యం ఏముంది సర్?? ప్రిన్సిపాల్ ఆనందం తో ఉబ్బితబ్బిబ్బు అయ్యిపోతున్నారు. రవీందర్, సుజాత నవ్వు దాచుకోలేక చేతులు అడ్డుపెట్టుకుని మరీ నవ్వుకుంటున్నారు. ఇంకా చందు " అయ్యో! అనవసరం గా నా చెల్లిని, రవి ని తప్పు గా అర్ధం చేసుకున్నాను "  అని ఫీల్ అవుతూ ప్రిన్సిపాల్ ని చూసి నవ్వుకుంటాడు. అను: సరే సర్!!! ఎలా చూసినా తప్పు మాదే...కాలేజీ కి వచ్చి బుద్ది గా చదువు కోవాలి కానీ ....ఇలాంటి విషయాలలో ఎంటర్ అయ్యాను కనుక నన్ను, సుజాత ని, గొడవ పడి ఈ సీక్రెట్ ని బయట పడేలా చేసినందుకు రవి, చందు లను రెస్టిగేట్ చేసేయండి సర్!!!!😞😞😞😞 ప్రిన్సి( నవ్వు దాచుకుంటూ ):  సర్లే....ఈ సారి కి ఎదో జరిగిపోయింది ....వెళ్లి గొడవలు ఏమి చేయకుండా బుద్ది గా చదువుకోండి ... ఇంకో విషయం -ఇప్పుడు అను చెప్పిన విషయం బయట ఎవరికీ తెలియకూడదు..గుర్తుంచుకోండి . అందరూ 'సరే'  సర్ అంటారు. అను  చందు తో... అను: చూసావా చందు!!  విషయం తెలుసుకోకుండా నువ్వు చేసిన పని వల్ల ఎం జరిగిందో......పాపం !!! రవీందర్ తో పాటు ప్రిన్సిపాల్ సర్ ని కూడా ఇబ్బంది పెట్టావు... ప్రిన్సిపాల్ సర్ కి నువ్వు సారీ చెప్పక పోయినా క్షమిస్తారు...అంత మంచి వారు సర్!!!!! కానీ నువ్వు రవి కి మాత్రం సారీ చెప్పాలి...ఏమంటారు సర్???? ప్రిన్సిపాల్ పొంగిపోతూ........ అవును.....అను చెప్పింది కదా చందు, రవి కి సారీ చెప్పి మీరు మంచి ఫ్రెండ్స్ అవ్వండి. సరే అని, చందు రవి కి సారీ చెప్పి ఫ్రెండ్స్ అని షేక్ హ్యాండ్ ఇస్తాడు. రవి కూడా హ్యాపీ గా ఆక్సిప్ట్ చేస్తాడు. సుజాత మనసులో హమ్మయ్య!!  కొట్టుకుని బద్ద శత్రువులు అయ్యిపోతారు అనుకున్నాను......వీళ్ళని ఇలా ఫ్రెండ్స్ చేసేసావు...నువ్వు మాములు దానివి కాదే బాబు.... అందరు హ్యాపీ గా బయటకి వెళ్లిపోతుండగా ప్రిన్సి 'అందరిని ఒక నిమిషం బయట వెయిట్ చేయమని' చెప్పి అను ని మాత్రమే ఉండమంటాడు. ముగ్గురూ బయటికి వెళ్లినా ఒక చెవి మాత్రం గోడకి వేసి ఉంచుతారు. అను (అమాయకం గా):  ఏమైంది సర్???😞😞😞😞 ప్రిన్సి(టేబుల్ మీద ఉన్న లెటర్ వైపు చూస్తూ):  అది...అది... అను: అర్ధం అయ్యింది సర్!!!  ఆ లెటర్ చుస్తే మీకు చాల కోపం వస్తుంది కదా సర్....ఉండండి ఇప్పుడే చింపేస్తాను ..... ప్రిన్సి: ఆ ...ఆ....వద్దు...వద్దు....నీకు ఎందుకు అంత శ్రమ .....నీ చేతులు నొప్పి వస్తాయి....నేను చింపేస్తాను. కానీ..... అను: కానీ....ఏంటి సర్!!! ప్రిన్సి: ఇంకెప్పుడైనా సుజాత మేడం ఇలా లెటర్ ఇస్తే నువ్వే తీసుకు వచ్చి నాకు ఇవ్వు అమ్మ. ఈ అబ్బాయిలు ఎందుకు పనికి రారు.అంత న్యూసెన్స్ చేసేసారు .ప్లీజ్!!!! అను: చిన్న పిల్లని  నాకెందుకు సర్ ఇవ్వన్నీ ..... ఐనా ఇంత జరిగింది అని తెలిసాక మేడం ఓపెన్ అయ్యిపోయి మీ దగ్గరకు వస్తారేమో అని నాకు అనిపిస్తుంది సర్!!!! అలా వస్తే మీరు ఇంకేమి ఆలోచించకుండా, మేడం ని మాట్లాడనివ్వకుండా మీ మనసులో మాట చెప్పేయండి..... ప్రిన్సి: నా మనసులో ఏముంది?? ఎం లేదే ??? అను: ఎం ఉందొ, ఎం లేదో చిన్న పిల్లని నాకేం తెలుస్తుంది సర్!!!! నా ఊహ నిజం అయితే మీతో మాట్లాడటానికి ఈ పాటికి సుజాత మేడం వస్తూ ఉండాలి. ప్యూన్ వచ్చి సర్!!  సుజాత మేడం మీతో మాట్లాడాలని  వచ్చారు అని ప్రిన్సి తో చెప్తాడు. బెస్ట్ అఫ్ లక్ సర్!!!  అని చెప్పి అను అక్కడినుంచి వెళ్ళిపోతుంది.సుజాత మేడం ప్రిన్సి రూమ్ లో కి వెళ్తారు. ఇది జరిగింది. ********** అను ఫ్రెండ్స్ అందరూ షాక్ తో అను వైపు చూస్తారు. అను మాత్రం రెండు చేతుల్లో  రెండు కోన్ ఐస్ క్రీం లు పెట్టుకుని తింటుంది. ఫ్రెండ్స్: ఒసేయ్!! ఎం చేసావో నీకు తెలుస్తుందా? అను: ఐస్ క్రీం కి న్యాయం చేస్తున్నా. ఫ్రెండ్స్: ఐస్ క్రీం గురుంచి కాదు, వీళ్ళ లవ్ ని ప్రిన్సి కి అంటగట్టావు...అది తెలుస్తుందా???? అను: అవునా???😯😯😯😯 ఫ్రెండ్స్: ఇదేంటి ఇంత కూల్ గా ఉంది. అను:  మీరూ నాలా ఎప్పుడు ఐస్ క్రీం తింటూ ఉండండి...మీరూ కూల్ గా ఉంటారు.🍦🍦🍦 ఫ్రెండ్స్:  ఒస్సేయ్! ప్రిన్సి ని బాగానే మేనేజ్ చేసావు....కానీ నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు ?సుజాత మేడం ప్రిన్సి దగ్గర కు వెళ్లారు!!!  అను: అయితే!!!! ఫ్రెండ్: ఇది టెన్షన్ పెట్టి చంపేస్తుంది..... రవి: అవును కదా!!!  ఇప్పుడు మ్యాటర్ మొత్తం బయటపడిపోతుంది కదా!!!! అను: హమ్మయ్య!!!  ఐస్ క్రీం అయ్యిపోయింది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్!!  మీరు అంత టెన్షన్ ఏమి పడక్కర్లేదు.... నా గెస్  కరెక్ట్ అయితే' ప్రిన్సి కి , మేడం కి మధ్యలో అక్కడ అడ్డుగా ఉన్న మన ప్యూన్ ని టీ  తీసుకు రమ్మని కాంటీన్ కి పంపించి ఉంటారు '. కావాలంటే చూడండి. అప్పుడే ప్యూన్ కాంటీన్ కి వస్తాడు. ఫ్రెండ్స్: అవునే వచ్చాడు. అను: వచ్చాడా !!!  అయితే బండి మెయిన్ ట్రాక్ లోకి వచ్చేసింది ....హ్యాపీ....ఇంకో ఐస్ క్రీం ..... ఫ్రెండ్స్: మళ్ళి ఐస్ క్రీం అంటే చంపేస్తాము 🔪🔪🔪🔪.....ముందు విషయం తేలాలి.....మేడం ప్రిన్సి దగ్గరకు వెళితే లెటర్ మేటర్ మాట్లాడుకుంటే అంతా తెలిసిపోతుంది కదా...మరి నువ్వు ఇంత కూల్ గా ఎలా ఉన్నావ్??? అను: ఏ లెటర్? ఫ్రెండ్స్: మన సుజాత రవి కి రాసిన లెటర్ గురుంచి.... అదా!! నేను ఇంకా మన ప్రిన్సి సుజాత మేడం కి రాసిన లెటర్ గురుంచి అనుకున్నా.... ఫ్రెండ్స్ (గట్టిగా):  ఏంటి?????? నీకు దణ్ణం పెడతాము....ఇలా సగం సగం చెప్పకు.....ప్లీజ్ !!!! ఫుల్ గా చెప్పవే  ...🙏🙏🙏🙏 అను: ఎం లేదు!!! మన రవి సుజాత కి రాసిన లవ్ లెటర్ నేను సుజాత దగ్గర తీసుకున్నాను కదా....ఆ లెటర్ లో కొన్ని చేంజెస్  చేసి సుజాత మేడం దగ్గరకు వెళ్లి ప్రిన్సిపాల్ సర్ ఇచ్చారు అని చెప్పి మేడం కి ఇచ్చేసాను...అంతే.... సుజాత: అంటే...ఇప్పుడు ఆ లెటర్స్.... అను: మీ ప్రేమ కోసం మీరు రాసుకున్న ఆ లెటర్స్ ఇప్పుడు వాళ్లని కలిపాయి... సుజాత:  కానీ...వాళ్లు ఎలా .... అను: నేను కాలేజీ కి వచ్చినప్పటినుంచి చూస్తున్న ప్రిన్సి కి సుజాత మేడం మీద ఉన్న కన్సర్న్ ని.అందుకే ఇలా చేశాను. 'మేడం కుడా ప్రిన్సి అంత మంచి వారు తన లైఫ్ లోకి వస్తాను అంటే  కాదనరు' అని నమ్మి ఈ పని చేశాను. ఫ్రెండ్స్:  నువ్వు కేక అను..... అను: సర్లెండి ....మీరు తింటూ ఉండండి ....నేనువెళ్లి ఇంకో ఐస్ క్రీం తెచ్చుకుంటాను...అని వెళ్తుంది. ఫ్రెండ్స్: దీనికి మొగుడు ఎవడు వస్తాడో కానీ, దీనికి ఐస్ క్రీమ్స్ కొనలేక చస్తాడు...... ఎం పర్వాలేదు.....నాకు ఒకే అని వినిపిస్తుంది వెనుక నుంచీ... చుస్తే ఎవరు అన్నారో అర్ధం కాదు ఎవరికీ... ఎవరో ఎదో మాట్లాడుకుంటున్నారు అనుకుంటారు అంతా....... అను: అంకుల్! ఇదిగోండి ఐస్ క్రీమ్స్ కి మనీ తీసుకోండి!!!!! షాప్అంకుల్:  లేదు అమ్మ!  'నువ్వు తీసుకున్న ఐస్ క్రీమ్స్ అన్నిటికి ఆ అబ్బాయి మనీ ఇచ్చేసాడు'  అంటూ ఒక అబ్బాయిని చూపించాడు. అను అటువైపు  చూసింది......ఓ రవి !!!..... ఇచ్చాడా  !!!  అంటూ వెళ్లి మళ్ళీ ఫ్రెండ్స్ తో జాయిన్ అయ్యింది. ******************** శాంతి జరిగిందంతా చెప్పి అను వైపు చూస్తుంది. అను కళ్ళు మూసుకుని ఒక కన్ను తెరిచి చూస్తుంటుంది. అందరూ అను చేసిన పనికి నవ్వుతూ ఉంటారు. అను ఎంతో సైలెంట్ అనుకున్న గాయత్రీ అను టాలెంట్ చూసి సైలెంట్ అయ్యిపోతుంది. తరువాత ఎమైంది శాంతి??? ఏముంది?  ఈ మేడం చేసిన పని వల్ల మేము  ఫైనల్ ఇయర్ లో ఉండగానే ప్రిన్సిపాల్ కి, సుజాత మేడం కి పెళ్లి అయ్యిపోయింది. ఇంకా మా ఫ్రెండ్స్ విషయానికి  వస్తే-  చందు, రవి ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యిపోవడం  వల్ల రవి ఎంత మంచివాడో  అర్ధం అయ్యి లాస్ట్ ఇయర్ రవి కి, సుజాత కి పెళ్లి చేసేసాడు చందు. అలా ఒక లెటర్ తో రెండు పెళ్లిళ్లు చేసేసింది. ఆమ్మో!! ఒక దెబ్బకి రెండు పిట్టలు అంటారు ....కానీ ఇక్కడ ఒక లెటర్...నాలుగు పిట్టలు...సూపర్ కదా... అందరూ నవ్వుతుంటారు. కిషోర్ గాయత్రీ తో మాట్లాడి వచ్చి మళ్ళీ టీం లో కలిసిపోతాడు. మరి అను ఎం చేసినా లోకకళ్యాణమే...అంటాడు రవి. శాంతి మనసులో-అవును!!! అను ఎం చేసినా లోక కళ్యాణమే......కానీ తన కళ్యాణమే..... గాయత్రీ:  ఫ్రెండ్స్!  మ్యూజిక్, డాన్స్ లేకుండా ఈ ట్రేడిషనల్ డే పూర్తి కాదు కదా....అందుకే  ఇప్పుడు మన  హ్యాండ్సమ్ కార్తీక్, మన లక్ష్మి దేవి అను ఒక మంచి డాన్స్ పెర్ఫార్మన్స్ చేస్తారు....ఓకే నా!!! అను, కార్తీక్ తప్ప అందరూ అరిచి గోల చేస్తూ ఉంటారు. అను, కార్తీక్ ఇద్దరు 'మాకు డాన్స్ రాదు 'అని తప్పించు  కోవాలని చూస్తారు. కానీ అందరూ పట్టుబట్టడంతో ఒప్పుకుంటారు. అను, కార్తీక్ ఇద్దరూ ఫ్లోర్ మధ్యలో నిలబడతారు. ఫ్లోర్ మొత్తం లైట్స్ ఆఫ్ చేసేస్తారు. కేవలం సెంటర్ లైట్స్ మాత్రమే వేసి ఉంచుతారు. గాయత్రీ 'మంచి ఫాస్ట్ బీట్  పెడతాను' అంటే కాదని కిషోర్ సరైనోడు మూవీ లో సాంగ్ పెడతాడు. తెలుసా....తెలుసా....ప్రేమించానని .... తెలుసా.....తెలుసా...ప్రాణం నువ్వు  అని..... సాంగ్ ప్లే అవుతుంటే అను, కార్తీక్ డాన్స్ చేస్తూ ఉంటారు. కార్తీక్ మాత్రం అను కళ్ళలోకి మాత్రమే చూస్తూ ఉంటాడు. వాళ్ళడాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళని చూసిన ప్రతి ఒక్కరూ 'వీళ్ళు నిజం గానే లవర్స్  'అన్నట్లు ఫీల్ అవుతారు. ఆఫీస్ అయ్యిపోయి అందరూ వెళ్ళిపోతారు. అను గుడికి వెళ్లి శాస్త్రి గారిని కలుస్తుంది. అనుని అలా చుసిన శాస్త్రి గారి సంతోషానికి  హద్దు ఉండదు. అను అమ్మవారికి నమస్కిరిస్తుండగా పక్కన ఎవరో వచ్చి నిలబడినట్లు అనిపించి చిన్నగా నవ్వుకుంటుంది. శాస్త్రి గారు అను ని, అను పక్కన ఉన్న కార్తీక్ ని అక్షింతలతో ఆశీర్వదిస్తారు.... శాస్త్రిగారు: అమ్మ అను! ఇవిగోమ్మ ఇవి అమ్మవారి గాజులు... వేసుకో తల్లీ....అంతా మంచి జరుగుతుంది. అను: థాంక్స్ అంకుల్!! శాస్త్రిగారు:  కానీ జాగ్రత !!  ఈ రోజు శ్రావణ శుక్రవారం... అందులోను అమ్మవారి గాజులు....అస్సలు పగలకూడదు...బాబు కార్తీక్!!! నువ్వు కొంచెం అమ్మాయికి సహాయం చెయ్యి  బాబు...నేను ఇప్పుడే వస్తాను.... కార్తీక్: సరే అంకుల్!!! అను, కార్తీక్ గుడిలో ఒక చోట కూర్చుంటారు. అను గాజులు తీసుకుని  సరిగా పెడుతూవుంటుంది. కార్తీక్ అను నే చూస్తూ ఉంటాడు. అను: ఆలా చూడకపోతే నా చేతికి గాజులు వేయచ్చు  కదా!!! కార్తీక్(షాక్ తో):  నేనా???? అను: నేనేమైనా నా మెడ లో తాళి కట్టమన్నానా !!! అంత షాక్ అయ్యారు........ ఇంకాఉంది...............................................................................నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం........ మీరు ఎంత షాక్ అయ్యారో  కామెంట్స్ రూపం లో చెప్పండి.....హా.....హా .....హా.... హా.... అక్షరదోషాలు ఉంటె మన్నించగలరు. హాయ్ ఫ్రెండ్స్ నేను మీ.....🏅 🇻​🇪​🇳​🇺​ 🏅 స్టోరీ నచ్చితే... లైక్, షేర్, కామెంట్స్ అండ్ ఫాలో మై ప్రొఫైల్.
1.1k వీక్షించారు
2 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post