#🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
#🕉🕉🕉🕉గోవింద జై జై గోపాల జై జై🙏🙏🙏🙏🙏
#🕉🕉🕉🕉🕉శ్రీ విష్ణు దేవాయ నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
#🌺💙💞శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశాయ గోవిందా💞💙🥰🌺 గోవిందా హరి గోవిందా 🥰
#🛕దేవాలయ దర్శనాలు🙏
*తొమ్మిది రకాల ముక్తి మార్గాలు*
👇👇👇👇
1. *శ్రవణం*( వినడం ) భక్తి చేత పరిక్షిత్ మహరాజు తరించాడు.
2. *కీర్తనం*( పాడడం ) చేత నారద మహర్షి, అన్నమయ్య, త్యాగరాజు తరించారు.
3 *స్మరణం* ( నోటితో ఎల్లప్పుడు పలకడం ) చేత ప్రహ్లదుడు తరించాడు.
4 *పాదసేవనం* తో, లక్ష్మీదేవి, లక్ష్మణుడు తరించాడు.
5 *అర్చనం* తో పృధు చక్రవర్తి తరించాడు.
6 *వందనం* చేత అక్రూరుడు తరించాడు.
7 *దాస్య భక్తి* (సేవ )చేత గరుత్మంతుడు, హనుమంతుడు తరించాడు.
8 *సఖ్యం* భక్తి చేత అర్జునుడు, కుచేలుడు తరించారు.
9 *ఆత్మనివేదనం* తో బలిచక్రవర్తి తరించారు.
మనిషి మహనీయుడు కావాలంటే ఈ క్రింది లక్షణాలు కలిగి ఉండాలి.
జీవితంలో దైవనామాన్ని నిరంతరం
తరించు
జీవితంలో నీ అంతఃరాత్మకు లోబడి జీవించి తరించు.
జీవితంలో శాస్త్రం ను అనుసరించి జీవించి తరించు.
తత్వ విచారణ చేసి జీవించి తరించు.
యోగ మార్గంలో ఆత్మ విచారణ చేసి జన్మ రాహిత్యం చేసుకోని తరించు.
పూజ పారమార్దం:- పూజ అర్చన జపం.
*స్తోత్రం. ధ్యానం. దీక్ష. అభిషేకం. మంత్రం. ఆసనం. తర్పణం. గంధం. అక్షితలు. పుష్పం. ధూపం. దీపం. నైవేద్యం. ఆచమనీయం. అవాహనం. స్వాగతం. పాద్యం మధుపర్కం. స్నానం. వందనం. ఉద్వాసన.... పూజ-పరమార్థాలు:*
పూజ అనగా పూర్వజన్మ వాసనలను తొలగింపచేసేది. జన్మమృత్యువులను లేకుండాచేసేది సంపూర్ణ ఫలాన్నిచ్చేది.
అర్చన అనగా అభీష్ట ఫలాన్నిచ్చేది చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది. దేవతలను సంతోషపెట్టేది.
జపం అనగా అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పర దేవతను సాక్షాత్కరింప చేసేది జపం.
స్తోత్రం అనగా మెళ్ళ మెళ్ళగా మనస్సునకు ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.
ధ్యానం అనగా ఇంద్రియ నిగ్రహాన్ని మనస్సుతో నియమింప చేసేది, ఇష్ట దేవతను తపింపచేసేది ధ్యానం.
దీక్ష అనగా దివ్య భావాలను కల్గించేది, పాపాలను కడిగివేసేది, సంసార బంధాల నుండి విముక్తిని కల్గించేది దీక్ష.
అభిషేకం అనగా అహం భావాన్ని పోగొట్టేది, భయాన్ని మథించేది, పవిత్రోదకాన్నిచల్లేది, ఆనందాన్ని కల్గించేది.
మంత్రం అనగా మననం చేసేవారిని కాపాడేదే మంత్రం అని అంటారు. మంత్ర తత్త్వం వల్ల భయాలు తోలగిపోతాయి నిరంతర మననం ధ్యానం వల్ల మనసు చెంచలత తొలగి, మనిషిని తిరిగి కర్తవ్యోన్ముఖున్ని చేస్తుంది
🌹🙏🌴🪔🪔🪔🪔🌴🙏🌹
ఆధ్యాత్మికత అనేది చిన్నవయసు నుండే అలవాటు చేసుకోవాలి.
పాపంపై భయం, దేవునిపై ప్రేమ, సమాజం పట్ల సేవా దృక్పథం వంటివి లేత వయసులోనే నాటుకోవాలి.
లేతవయస్సులో మన పంచేంద్రియాలను కామ క్రోధాదులనే రాక్షసులకు అర్పితం చేసి, వృద్ధాప్యంలో ఏడుస్తూ కూర్చుంటే వచ్చే ఫలితమేమి?
కనీసం ఇప్పుడైనా మేల్కొని భగవచ్చింతనతో సమాజసేవలో జన్మను సార్థకం గావించుకోవడానికి కృషి చేయాలి.
ఈనాడు నీవు పెద్దవాడవు కావచ్చు, విద్యావంతుడవు కావచ్చు, ధనవంతుడవు కావచ్చు, అధికారివి కావచ్చు.
కానీ,
ఈ స్థాయి ఎవరివలన వచ్చింది అనే విషయాన్ని మరచిపోకూడదు.
ఆచార్యదేవో భవః
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
*తిలకము లేదా బొట్టు ఎందుకు ధరించాలి?*
*తిలకము ధరించుట ఆచారమా? శాస్త్రీయమా... ?*
🌹🙏🌴🪔🪔🪔🪔🌴🙏🌹
*మానవ శరీరము లో 7200 నాడులు వున్నవని స్వర శాస్త్ర మంజరి, కుండలిని ఉపనిషత్, యోగోపనిషత్, దర్శనోపనిషత్ వంటి అనేక శాస్త్రములు చెబుతున్నాయి. అందులో ముఖ్యమైనవి "ఇడ" నాడి (ఎడమ నాసాగ్రములో) మరియు "పింగళ" నాడి (కుడి నాసాగ్రము లో). వీటినే చంద్ర, సూర్య నాడులు అంటారు. రెండు కనుబొమ్మలకు మధ్య నుదుటి భాగములో "ఇడ" మరియు "పింగళ" అను రెండు నాడులు కలిసి "సుషుమ్" నాడిగా పరివర్తనము చెందుతుంది.ఈ రెండు నాడుల ఉద్దీపనమును "కుండలినీ" అని పేరు. ఈ స్థలములో తిలకము ధరించడం వలన కుండలినీ శక్తి జాగృతం అవుతుంది. ఈ శక్తి నాడుల ద్వారా మానవ శరీరమందలి అన్ని భాగములకు ప్రాణ శక్తిని అందిస్తుంది.*
*సైన్స్ ప్రకారము మెదడులో గల భాగములలో ఎడమ భాగమునకు కుడి నాసాగ్రము (పింగళ నాడి) తోను, కుడి భాగమునకు ఎడమ నాసాగ్రము (ఇడ నాడి) తోను సంబంధము కలదు. మెడికల్ టర్మ్ లో చెప్పాలంటే సింపతటిక్, పరాసింపతటిక్ అండ్ సెంట్రల్ నెర్వస్ సిస్టమ్. కావున ఇడ-పింగళ నాడుల మధ్య తిలకము ధరించడం వలన మెదడులోని ప్రతీ కణమునకు కలుపబడిన నాడుల వల్ల శరీరములోని అన్ని భాగములకు ప్రాణ శక్తి అందించబడుతుంది.అందుకే నుదుట తిలకధారణం చేయాలి. అంతేకాకుండ లలాటానికి సూర్య కిరణాలు తాకకూడదు. అందుచేత కూడా లలాటంలో తిలకం ధరించాలి...*
🌹🙏🌴🪔🪔🪔🪔🌴🙏🌹