Failed to fetch language order
Failed to fetch language order
Failed to fetch language order
Failed to fetch language order
evening special snacks time
3 Posts • 1K views
పచ్చి శనగపప్పు మసాలా వడలు. #tasty homemade food recipes #tasty food recipes #tasty food recipes 😋 #Tea time snacks #evening special snacks time పచ్చి శనగపప్పు -- ఒక కప్పు. పచ్చిమిరపకాయలు -- 10 కరివేపాకు తరిగినది -- ఒక పావు కప్పు . ఉల్లిపాయలు -- సన్నగా తరిగినవి ఒక కప్పు అల్లం -- చిన్న ముక్క కొత్తిమీర -- ఒక చిన్న కట్ట సన్నగా తరుగు కోవాలి . పొదీనా -- అర కప్పు. సన్నగా తరుగు కోవాలి . కారం -- ఒక స్పూనున్నర ఉప్పు -- తగినంత జీలకర్ర -- అర స్పూను . బియ్యపు పిండి --- స్పూనున్నర . నూనె -- పావు కిలో తయారీ విధానము . ముందుగా పచ్చి శనగపప్పు మూడు గంటల ముందు నాన బెట్టు కోవాలి . తర్వాత నీళ్ళు వడగట్టి మిక్సీ లో శనగపప్పు ,చిన్నగా తరిగిన అల్లం ముక్కలు , జీలకర్ర , పచ్చిమిరపకాయలు , తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు పోసి కొంచెం కచ్చా పచ్చాగా వేసుకుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి . ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు , తరిగిన కరివేపాకు , తరిగిన కొత్తిమీర , సన్నగా తరిగిన పొదీనా , స్పూను కారం , స్పూనున్నర బియ్యపు పిండి వేసి కొద్దిగా నీళ్ళు పోసి చేతితో బాగా కలుపు కోవాలి . ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము నూనె పోసి నూనె బాగా కాగగానే అర చేతిలో ముద్ద పెట్టుకుని చిన్న చిన్న వడల లాగా వత్తుకొని బంగారు రంగు వచ్చే విధముగా వేయించుకోవాలి . ఆలూరు కృష్ణ ప్రసాదు. అంతే . కరివేపాకు , కొత్తిమీర మరియు పొదీనా సువాసనతో వేడి వేడి శనగపప్పు వడలు రెడీ . ఈ వడలు నానబెట్టిన శనగలు తో కూడా ఇవే పాళ్ళతో , ఇదే పద్ధతి లో చేసుకొనవచ్చును .
14 likes
26 shares