తెలంగాణ బడ్జెట్ 2019
గతంలో బ్యాంకులు మేనేజ్ చేసే వారికే స్కీమ్ లు అన్న దానిని #📰 తెలంగాణా న్యూస్ #📰జాతీయ/అంతర్జాతీయ న్యూస్ #📣తెలంగాణా పొలిటిక్స్ #బంగారు తెలంగాణ #తెలంగాణ బడ్జెట్ 2019 సిఎం కేసిఆర్ వచ్చాక మార్చారు... ఊరికి ఒకటో, రెండో యూనిట్లు ఇచ్చి గతంలో చేతులు దులుపుకుంటే...ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున యూనిట్లు ఇస్తున్నాం... 52 మంది గిరిజన బిడ్డలకు డ్రైవర్ కమ్ ఓనర్ పథకం కింద కార్ల పంపిణీ  గతంలో ఎప్పుడూ చేయనంత పెద్ద ఎత్తున సిఎం కేసిఆర్ ఆధ్వర్యంలో గిరిజనులకు లబ్ది జరుగుతోంది గిరిజన బిడ్డల జీవితాల్లో మార్పు తెచ్చే ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం గిరిజన తండాలో పుట్టిన నాకు ఆ శాఖ మంత్రిగా బాధ్యత ఇచ్చి సిఎం కేసిఆర్ నామీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాను తండాలు, గూడాలు, చెంచులు ఎవరైనా తమ ఆడబిడ్డ సత్యవతి మంత్రిగా ఉన్నారని వచ్చి తమ సమస్య చెప్పుకోవచ్చు... ట్రైకార్ ద్వారా మరో వందిమందిని పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తో కమిషనర్ క్రిస్టినా ఒప్పందం డ్రైవర్ కమ్ ఓనర్ పథకం కింద కార్ల పంపిణీ కార్యక్రమంలో గిరిజన, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ హైదరాబాద్, సెప్టెంబర్ 20 : గతంలో ప్రభుత్వ పథకాలంటే...బ్యాంకులు మేనేజ్ చేసే వారికే అవి అందుతాయని ఉండేది...కానీ కేసిఆర్ గారు సిఎం అయ్యాక ఆ పద్దతి మారింది. అదేవిధంగా ఊరికి ఒకటో, రెండు యూనిట్లు ఇచ్చి చేతులు దులుకుపుకునే గత ప్రభుత్వాల తీరును పూర్తిగా మార్చేసి ఇంత పెద్ద ఎత్తున స్కీమ్ అమలు చేస్తూ గిరిజన బిడ్డల జీవితాల్లో మార్పును తీసుకొస్తున్నందుకు సిఎంగారికి కృతజ్ణతలు అని గిరిజన, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. నేడు దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో జరిగిని డ్రైవర్ కమ్ ఓనర్ పథకం కింద 52 మంది డ్రైవర్లకు కార్లను ఆమె పంపిణీ చేశారు. త్వరలోనే మరో వందమంది గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తు ఒప్పందం చేసుకున్నారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.... “ నేను గిరిజన శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గిరిజన బిడ్డల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే మంచి కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ నుంచి డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్ 2017 సంవత్సరానికిగాను లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని ఈరోజుచేయడం చాలా గొప్పగా ఉంది.  ట్రైబల్ వెల్ఫేర్ సహకారంతో, వారి సబ్సిడీతో, ఎస్బీఐ రుణంతో మీరు వాహనానికి ఓనర్ గా అయ్యే చక్కటి అవకాశం ద్వారా నేడు 52మంది మా గిరిజన బిడ్డలు ఓనర్లుగా మారుతున్నందుకు వారికి మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలిపుతున్నాను.  ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి, నాకు దైవ సమానులు అయిన కేసిఆర్ గారికి ప్రత్యేక కృతజ్ణతలు తెలుపుతున్నా. ఒక గిరిజన బిడ్డ అయిన నాకు, ఒకతండాలో పుట్టి పెరిగిన నాకు, గిరిజన సంక్షేమ శాఖకు మంత్రిగా ఇవ్వడం, గిరిజనులను అభివృద్ధిలోకి తీసుకురావడానికి వారి ఆలోచన క్రమం, బహుశా ఈమె తండాలో ఉంటుంది, వారి కష్టసుఖాలు తెలిసిన మనిషి కాబట్టి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తుందనే నమ్మకంతో నాకు మంత్రి పదవి ఇచ్చారు, కావునా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ  రాష్ట్రంలో ఉండే గిరిజన బిడ్డలు, తండాలో, మైదాన ప్రాంతంలో, ఆదివాసి, కోయగూడాల్లో నివసిస్తున్నచెంచు పెంటలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు, మా సోదరి, మా ఆడబిడ్డ మంత్రిగా ఉంది, మాకు కష్టం వస్తు చెప్పుకోవచ్చు అనే విధంగా వారి నమ్మకాన్ని, విశ్వాసాన్ని చూరగొని, ఒక ఆడబిడ్డ ఉందనే భరోసా ఇవ్వాలనే ప్రయత్నం చేస్తాను. గతంలో ఈ కార్యక్రమం ద్వారా ఏ విధంగా ఆదాయం వారికి వస్తుందో మా సోదరులు చెప్పారు...అందులో ఒక సోదరుడు గుగులోతు నగేష్...మా ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి ఉన్నారు..నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను..నాకు 50వేలు వస్తే చాలు అనుకున్నా...ఇంకా ఎక్కువ కష్టపడితే ఇంకా ఎక్కువ వస్తుందన్నారు. ఈ హైదరాబాద్ లో గతంలో 25 ఏళ్ల కింద బస్సు దిగి, ఆటో దిగి వస్తుంటే ఎక్కడ చూసినా ఆ గ్రామాల్లో వారి బతుకుదెరువులు, వారి సరైన సదుపాయాలు లేక జీవనోపాధి కోసం పొట్ట చేతిన పట్టుకుని హైదరాబాద్ కు వచ్చిన వారిలో ఎక్కువ మంది ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు గా పనిచేసే వారిని చూశాను. మీరు సొంతంగా ఆటో , కారు కొనుక్కోవచ్చు కదా అని నేను అడిగినప్పుడు ఊరు వదిలేసి వచ్చాము, బ్యాంకుల చుట్టూ తిరగాలి, ప్రభుత్వం కూడా ఊరికి ఒకటో, రెండు  ఇచ్చేది...ఇంత పెద్ద స్కీమ్ కాదు 50వేల రూపాయలు ఇస్తేనే గగనంగా ఉండేది. గతంలో ఒక అభిప్రాయం ఉండేది...ఎవరైతే బ్యాంకులను మేనేజ్ చేస్తారో వారికే స్కీమ్స్ వస్తాయనే చెడు అభిప్రాయం ఉండేది...కానీ ఇప్పుడు సిఎం గారి స్కీమ్ ల వల్ల ఆ అభిప్రాయం పోయింది” అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, కార్పోరేటర్ రుబీనా, గిరిజన శాఖ కార్యదర్శి బెన్హర్ మహేష్ దత్ ఎక్కా, కమిషనర్ డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తు, ట్రైకార్  డిప్యూటీ జనరల్ మేనేజర్ శంకర్ రావు, ఎస్బీఐ అధికారులు, మారుతీ-సుజుకీ ప్రతినిధులు పాల్గొన్నారు.
#

📰 తెలంగాణా న్యూస్

📰 తెలంగాణా న్యూస్ - WW TELANG ENTOR OVERNM NA . 30 . 000 9 . SABOO RKS MOTOR PVT . LTD . TS 11 TR - ShareChat
210 వీక్షించారు
5 నెలల క్రితం
#

📰 తెలంగాణా న్యూస్

504 వీక్షించారు
5 నెలల క్రితం
#

తెలంగాణ బడ్జెట్ 2019

🌷💞🕊️...Nisha...🕊️💞🌷
#తెలంగాణ బడ్జెట్ 2019
350 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
#

తెలంగాణ బడ్జెట్ 2019

సౌజన్య 💓💖
#తెలంగాణ బడ్జెట్ 2019
416 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
#

తెలంగాణ బడ్జెట్ 2019

495 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post