మహానుభావులు
60 Posts • 14K views
ఒక పారిశ్రామికవేత్త తన ఆడంబరాన్ని పక్కన పెట్టి, మానవత్వాన్ని ఎంచుకున్నాడు. అరుదైన పెళ్లికి కోట్లు ఖర్చు చేయడం బదులు, 90 ఇళ్లు నిర్మించి, పేద కుటుంబాలకు బహూకరించాడు 🏠 🙏🙏🙏🙏🙏 #మహానుభావులు #mahanubhavulu #endharo mahanubhavulu #mahanubhavulu🙏🙏🙏 #endharo mahanubhavulu andhariki🙏🙏🙏
14 likes
12 shares
"సుబ్బలక్ష్మి"సంగీత ప్రపంచం లో మహారాణి. ఆవిడ గొంతు లో పాట వినని మనిషి ఉండరు అనటం లో అతిశయోక్తి లేదు. ఎన్నో పాటలు పాడి ప్రపంచ రికార్డులు నెలకొల్పిన భారత ముద్దు బిడ్డ సుబ్బలక్ష్మి గారి జయంతి సందర్బంగా ఆవిడ ని గుర్తు చేసుకుంటూ...🙏 టెలిఫోన్ ని కనిపెట్టిన అలెగ్జాడర్ గ్రాహం బెల్ భార్యకి వినికిడి శక్తి లేదు.మాట్లాడటం రావాలంటే ముందు వినపడటం మొదలవ్వాలి అలా ఆమెకు మాటలు నేర్పే పట్టుదల, అవిరామ కృషి లో భాగమే ఈ టెలిఫోన్ ఆవిష్కరణ కూడా .. అయితే ఈ గ్రాహం బెల్ ఏం చేసారంటే ..చూపు వినికిడి శక్తి లేని హెలెన్ కెల్లర్ ని అంధులకు విద్య నేర్పే "పెర్కిన్స్ ఇనిస్టిట్యూట్" (బోస్టన్) లో చేర్చమని కెల్లర్ తండ్రి కి సలహా ఇచ్చారు. అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారధిగా ప్రపంచ స్థాయిలో పేరొందిన "హెలెన్ కెల్లర్" స్వతహాగా తెలివైన వ్యక్తి కావడం తో బ్రెయిలీ నేర్చుకుని 19 ఏళ్ళకే బి ఏ పట్టా కూడా తీసుకున్నారు. చూపు, వినికిడిశక్తి లేని హెలెన్ కెల్లర్ మాట్లాడటం నేర్చుకోవడానికి చాలా సాధన చేశారు..ఎలా అంటే ..మనం మాట్లాడేటప్పుడు మన గొంతు దగ్గర వైబ్రేషన్స్ ఉంటాయి ..అలా ఎవరు మాట్లాడుతుంటే వాళ్ల గొంతుదగ్గర తన చేతిని పెట్టి ...గొంతుదగ్గర కదలికల ని బట్టి వాళ్ళు మాట్లాడేది నేర్చుకుని తర్వాతిరోజుల్లో పెద్ద వక్తగా కూడా పేరు తెచ్చుకున్నారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హెలెన్ కెల్లెర్.. ఈ హెలెన్ కెల్లర్ కి ..మన సంగీత సరస్వతి ఎం ఎస్ సుబ్బలక్ష్మి గారి పాట వినాలని కోరిక..సుబ్బలక్ష్మి గారితో చెప్తే ఆవిడ సరేననడం తో "భజగోవిందం,భావము లోన బాహ్యము నందున గోవింద గోవింద ..." అని సుబ్బలక్ష్మి గారు పాడుతుంటే తన చేతిని సుబ్బలక్ష్మిగారి గొంతుదగ్గరపెట్టి ..పాట ని అర్ధం చేసుకుంటూ లక్ష్మిగారు పాడటం పూర్తయ్యేసరికి ఆవిడ గళ మాధుర్యానికి కళ్ళలోనీళ్ళతో అలా ఉండిపోయారట హెలెన్ కెల్లర్. .నాకు వచ్చిన పురస్కారాలకంటే కూడా హెలెన్ కెల్లర్ ఆనందించడమే ఎక్కువ సంతోషాన్నిచ్చిందని అన్నారు ఎం ఎస్ సుబ్బలక్ష్మి.. అలాగే ఒకసారి ఎం ఎస్ సుబ్బలక్ష్మిగారు కచేరి చేసి వెళిపోతుంటే ఒక పెద్దావిడ గేట్ బయట ఈవిడని కలవాలని గొడవపడుతుంటే ...ఆ పెద్దావిడని లోపలకి పిలిచి ఏం జరిగిందని అడిగారు.. ఆ పెద్దావిడ...నేను మీ కచేరీ చూద్దామని పదిమైళ్ళు నడుచుకుని వచ్చాను కచేరీ అయిపోయిందని తెలిసింది,కనీసం ఒకసారి చూడనివ్వండని అడుగుతున్నాను అని అంటే, ఆవిడ్ని కూర్చోపెట్టి ముందు భోజనం పెట్టి ఆ తర్వాత "ఎందరో మహానుభావులు" అనే త్యాగారాజస్వామి పంచరత్న కీర్తనని పాడి వినిపించారు .. "గొప్పవాళ్ళు అయ్యేది గొప్ప ప్రవర్తనతోనే.. " భారతరత్న సుబ్బులక్ష్మి గారి వెంకటేశ్వర సుప్రభాతం ఒకటి చాలు మనకి అనుకుంటా నేను.. "పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనమ్ । ఇహ సంసారే బహుదుస్తారే కృపయాఽపారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం ..".అంటూ ఎంత చక్కగా పాడారు మహానుభావురాలు.. సంగీత సరస్వతి సుబ్బలక్ష్మిగారికి 🙏🙏🙏 #తెలుసుకుందాం #మహానుభావులు #endharo mahanubhavulu andhariki🙏🙏🙏 #endharo mahanubhavulu #mahanubhavulu🙏🙏🙏
11 likes
14 shares
ఉన్నది ఉన్నట్లు చెప్పగల ధైర్యం మీకుందా? - పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు (విద్య - విలువలు) మీలో ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా తగిన సంఖ్యలో ఉన్నారు కాబట్టి మేధావి, రాజనీతిజ్ఞుడు, మైసూర్ సంస్థానంలో దివాన్‌గా పనిచేసిన ఒక ప్రముఖ ఇంజనీర్ పేరు మీ అందరికీ కూడా పరిచితమే అని భావిస్తాను. ఆయన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సెప్టెంబర్ 15 ఆయన జన్మదినం కావడంతో ఆయన నుంచి స్ఫూర్తి పొందడానికి ప్రతిఏటా మనదేశంలో ఆ రోజు ‘ఇంజనీర్స్ డే’గా జరుపుకుంటున్నాం. వారిది కర్ణాటకలో స్థిరపడిన తెలుగు కుటుంబం. బ్రిటీష్ ఇండియా ఆయనను నైట్ కమాండర్‌గా సత్కరిస్తే భారత ప్రభుత్వం ఆయనను అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారి జీవితం గురించి చదువుతుంటే ఆశ్చర్యపోతాం. ఒకసారి కేంద్ర కేబినెట్ మంత్రి ఆయనను ఫలానా టైమ్‌లో కలవడానికి అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. కానీ ఇచ్చిన టైందాటి పోయినా కలవలేదు. తర్వాత తీరుబడిగా కలవడానికి వచ్చారు. విశ్వేశ్వరయ్యగారు టైం ఇవ్వలేదు. తర్వాత ఫోన్‌లో ఆయన అదేమిటి నేను కేంద్ర ప్రభుత్వంలో మంత్రిని, కాస్త టైం అటూ ఇటూ అవుతుంటుంది... అని ఏదో చెప్పబోయారు. దానికి విశ్వేశ్వరయ్య గారు..‘‘మీరు ఏదైనా కావచ్చు. నేను టైం ఇచ్చినప్పుడు ఆ టైంకు రావాలి. మీరు తర్వాత వచ్చేటప్పటికి నేను మరొకరితో చర్చిస్తుంటాను. అప్పుడు ఆ చర్చలకు భంగం కలగవచ్చు. క్రమశిక్షణ లేని మీ వంటి వ్యక్తి వచ్చి నాతో మాట్లాడటం కుదరని పని’’ అనడంతో మంత్రిగారు బిత్తరపోయారు. గాంధీగారు గ్రామసీమల అభ్యున్నతికోసం సేద్యపునీటి ప్రాజెక్ట్‌లకు సంబంధించి కొన్ని పథకాలు సిద్ధం చేశారు. వాటిని గురించి తెలుసుకోవడానికి సేద్యపు రంగంలో అప్పటికే బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆయన వద్దకు వెళ్లారు. అన్నీ కూలంకషంగా విన్న తరువాత ఇవి దేశాభివృద్ధికి పనికి రావని విశ్వేశ్వరయ్య చెప్పారు. దానికి గాంధీగారు మాట్లాడుతూ, ‘‘నేను చాలా గ్రామసీమలు తిరిగాను. అనుభవజ్ఞుడను’’ అని అన్నారు. దానికి మోక్షగుండం అన్నారు కదా, ‘‘నేను మీకన్నా పెద్దవాడిని వయసులో, సబ్జెక్ట్ పరంగా కూడా మీకన్నా నాకు ఎక్కువ తెలుసు. దేశాభివృద్ధికి ఇవి అసలు పనికిరావు’’ అంటూ ఎందుకు పనికిరావో చాలా విస్పష్టంగా చెబుతూ, ‘‘నేను అంగీకరించను. అది అసలు కుదరదు’’ అని ఎక్కడా రాజీపడకుండా తేల్చి చెప్పారు. అది శాస్త్రమైనప్పుడు, పెద్దలు చెప్పిన మాటయినప్పుడు, ఋషి ప్రోక్తమయినప్పుడు, అది పాడు చెయ్యదనుకున్నప్పుడు ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పగల ధైర్యం మీకుండాలి. ఒకప్పుడు కొందరు పిల్లలు రాష్ర్టపతి భవన్‌కు వెళ్లారు. వీరందరూ శారీరక, మానసిక వికలాంగులు. వీరిని మొగల్ సరాయ్ గార్డెన్స్‌లో కూర్చోబెట్టారు. కాసేపటికి అబ్దుల్ కలాం గారొచ్చారు. పిల్లలు... అయినా ఏం మాట్లాడాలో తోచక వారిని ఉత్సాహపరచడానికి ఆయన అంతకుముందెప్పుడో రాసుకున్న ఒక కవిత చదివి వినిపించారు. ‘‘బలవంతుడైన కొడుకును గురించీ తల్లీదండ్రీ ఆలోచించరు. బలహీనుడైన వారిని గూర్చే ఎక్కువగా ఆలోచిస్తారు. అందుకే భగవంతుడు కూడా మిమ్మల్ని గూర్చే ఎక్కువ ఆలోచిస్తాడు. బెంగపెట్టుకోకండి’’ అనేది ఆ కవితకు అర్థం. అయితే అదేదో ఓదార్పు మాటలా, తామేదో కష్టంలో ఉన్నట్లు, ఓదారుస్తున్నట్లు అనిపించింది ఇరాన్ నుంచి వచ్చిన ఒక పిల్లవాడికి. వాడికి మోకాళ్ల వరకు కాళ్లు లేవు. పర్షియన్ భాషలో ఒక చిన్న కాగితం మీద రాసి వాడు దేకుతూ వెళ్లి కలాంగారికి ఆ కాగితం ఇచ్చాడు. ఆయన చదివాడు. ‘‘నాకు మోకాళ్ల వరకు రెండు కాళ్లు లేవు. దానికి నేను ఏమీ బాధపడడం లేదు. కానీ నా జీవితంలో నేను ఎవరి ముందు మోకరిల్లవలసిన అవసరం లేదని గర్వపడుతున్నాను’’ అని ఉంది. అంతే కలాం ఒక్కసారి నిర్ఘాంతపోయాడు. ‘‘ఏం ధైర్యం! ఇంత ధైర్యం ఎలా వచ్చింది’’ అని ఆయన ఆశ్చర్యపోయాడు. అదీ నీకున్న ధైర్యంతో నీవు నిలబడగలగడం అంటే. మీకా ధైర్యం లేకపోతే అర్థం లేదు. ఒక్కటే ఒక్క పరీక్ష. మీరెప్పుడూ జ్ఞాపకం పెట్టుకోండి. మీకు ఎప్పుడు ఏ ఆలోచన మీ మనసులోకొచ్చినా... ఒక పొయ్యిలో కట్టె పెట్టి పొడిస్తే నిప్పురవ్వ రేగినట్లు వెంటనే అనేక ఆలోచనలు లేస్తాయి. ఒక్కో ఆలోచన రాగానే ఒక్కో భావన మనలో నుంచి పైకి లేస్తుంది. ముందుగా మాట్లాడేది పిరికితనం. ‘‘దీనివల్ల నాకు ప్రమాదం రాదు కదా’’ అంటుంది. రెండవది మనలో ఉండే లోభం. ‘‘దీనివల్ల నాకేమైనా కలిసి వస్తుందా?’’ అని అడుగుతుంది. లోపల ఉండే కీర్తికండూతి లేస్తుంది. ‘‘ఈ పనిచేస్తే నాకేమైనా పేరు ప్రతిష్ఠలు వస్తాయా’’ అంటుంది. మీ అంతరాత్మ ఒక్కటే ఎప్పుడూ ఒక్కటే అడుగుతుంది...‘‘ఇది చెయ్యవచ్చా?’’ అని అడుగుతుంది. మీ అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించండి. ‘ఇలా చెయ్యడం సబబేనా’ అని అడిగే అంతరాత్మ ప్రబోధాన్ని అనుమతించడం నేర్చుకోండి. దాని పీక నొక్కవద్దు. అది చెయ్యవచ్చో చెయ్యకూడదో తేల్చుకోవడానికి మీరు ఆదర్శంగా తీసుకున్న వ్యక్తిని ఉదాహరణగా తీసుకోండి. అలా తీసుకుని మీరు చెయ్య వలసినదొక్కటే. మీ రోల్‌మోడల్ తృప్తి కొరకు బతకండి. మీ రోల్‌మోడల్‌గా ఎవరిని తీసుకోవాలో నిర్ణయించుకోండి. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, అబ్దుల్ కలాం, మోక్షగుండం విశ్వేశ్వరయ్య... అలా ఎవరినైనా ఒకరిని ఎంచుకోండి. వారిని గుండెల్లో దాచుకోండి. అనుక్షణం వారిని అనుసరించండి. #తెలుసుకుందాం #endharo mahanubhavulu andhariki🙏🙏🙏 #మహానుభావులు #mahanubhavulu🙏🙏🙏 #endharo mahanubhavulu
12 likes
13 shares