497పై సుప్రీంకోర్టు తీర్పు
497,377 సెక్షన్ ల రద్దు ******************* ఓపిక ఉంటే చదవండి నేస్తాలు... నాణేనికి ఒక వైపు మాత్రమే చూడకండి... నాణేనికి మరో వైపు కూడా ఉంటుంది..... ఈ 497,377 సెక్షన్స్ రాజ్యాంగ బద్దం కాదు... రాజ్యాంగం అమలు సక్రమంగా అమలుజరుగుంది అని అనుకోడానికి వారు సమానత్వపు హక్కును ప్రాతిపదికగా తీసుకుంటారు.....497 సెక్షన్ స్త్రీ,పురుష సమానత్వాన్ని దెబ్బతీస్తుంది. వివాహేతర సంబంధం నేరం కాదు అది సామాజిక తప్పు అని మాత్రమే అని తెలుసుకోవాలి.వివాహేతర సంబంధాన్ని ఎక్కడా పెట్టుకోవచ్చు అని చెప్పలేదు. వివాహవ్యవస్థ దెబ్బతింటుందని బాధపడే మేధావులందరు కొన్ని విషయాలు గమనించలేమో... వివాహిత భర్త కాక మరో పురుషునితో సంభందం పెట్టుకుంటే వివాహ వ్యవస్థ దెబ్బ తింటుంది అంటున్నారు.వీటిని సుప్రీం తీర్పు ప్రోత్సహిస్తుంది అంటున్నారు మరి ఓ వివాహితుడు ఓ విధవతోనో ,మరో అవివాహితతోనో సంభందం పెట్టుకుంటే మాత్రం వివాహ వ్యవస్థ దెబ్బతినదా....? ఒక వివాహిత స్త్రీ భర్తకు తెలియకుండా ,భర్త కాని మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే అది నేరం అని సెక్షన్ 497 చెప్తుంది... మరి వివాహేతర సంబంధం పెట్టుకో అని భర్త అనుమతి ద్వారా సూచిస్తే అది నేరం కాదట...ఇక్కడ సరిగ్గా మనసు పెడితే వివాహ వ్యవస్థ పవిత్రత దెబ్బ తింటుంది అన్న విషయం మీద బాధ కాదు..భార్యను భర్త ఆస్తిగా పరిగణిoచడం మే ప్రధానంగా మీకు కనిపించడంలేదా......! ఉదాహరణకు... *****************.. మన వాహనం తాళాలు మన ఇష్ట పూర్వకంగా మనకు చెందని మరో వ్యక్తికి లేదా తనకు నచ్చిన వ్యక్తికి ఇచ్చి వాహనం నడపమంటే తప్పుకాదు.. అవే తాళాలు మనకు తెలియకుండ మరోవ్యక్తి తీసేసి ఆ వాహనాన్ని తీసుకెళ్లి నడిపితే ,తనతో ఉంచుకుంటే అది దొంగతనం అనే నేరం అవునా కాదా....? అది వాహనం ,మన స్వంత డబ్బులతో కొనుక్కున్నాం..కాబట్టి అది మన స్వంత ఆస్థి.... ఇదే విధంగా వివాహిత భర్త అంగీకారంతో పర.పురుషునితో సంభందం పెట్టుకుంటే నేరం కాదు...కానీ వివాహిత భర్త అనుమతి లేకుండా భర్త కాని మరో వ్యక్తితో సంభందం పెట్టుకుంటే నేరం... ఇది సెక్షన్ 497 స్థూలంగా.... అంటే ఆ వాహనం లాగే వివాహిత స్త్రీ కూడా భర్త స్వంత చరాస్తి అని చెప్తున్నట్లే పరోక్షంగా.... వాహనం అంటే జడపదార్దం...దానికి ఇష్ట, అయిష్టాలు లేవు.మరి స్త్రీ కి మనసు ,ఆలోచన,కోపం,ఇష్ట అయిష్టాలు లేని ఆ వాహనానికి ఇచ్చిన తీర్పే ఇస్తే ఎలా....?ఆమెకి మనసు లేదా... తన మనసుకి కూడా విలువ ఇచ్చి ,తనకు గౌరవం ఇచ్చి,తనని కూడా మనిషిగా పరిగణించే భర్తని వదిలి ఏ స్త్రీ వివాహేతర సంభందాల జోలికి వెళ్తుంది చెప్పండి....? వివాహ జీవితం సంతోషంగా వుండకపోడానికి వివాహేతర సంబంధం కారణం కాకపోవచ్చు....కానీ...వివాహ జీవితం సంతోషంగా వుండకపోవడం వల్లనే వివాహేతర సంబంధాలకు దారి తీస్తున్నాయని భావించవచ్చు. వివాహేతర సంబంధం నేరం గా పరిగణించకపోయినా...అది మాత్రం తప్పకుండా సామాజిక తప్పే...దానికి శిక్షలేకపోయిన...జీవిత భాగస్వామి చర్యల ఫలితంగా ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారని తగిన ఆధారాలు చూపించగలిగితే...ఆత్మహత్యకు ప్రేరేపించడం అనే నేరం క్రిందికి తప్పకుండా శిక్ష ఉంటుంది. చివరిగా చేప్పేదేమంటే... వివాహేతర సంబంధాలు పెట్టుకోమని సుప్రీం అనుమతి ఇవ్వలేదు....రాజ్యాంగం సక్రమంగా అమలు జరగకుండా అడ్డుకుంటున్న సెక్షన్ 497 ని మాత్రమే రద్దు చేసింది....స్త్రీ,పురుష సమానత్వాన్ని కాపాడటానికి తన వంతు పాత్ర పోషించింది... * వివాహిత మనసెరిగి మసలుకో *మనసు విరిగేలా మసలుకోవద్దు చాలు ఇప్పటికన్న భార్యని ఆస్తిగా కాక,మనసున్న మనిషిగా గుర్తిస్తే చాలు... ఈ తీర్పులు చూసి తీరుబడిగా తప్పు చేయాలని ఏ స్త్రీ కోరుకోదు....ఒక వేళ తప్పు చేయాలన్న ఉద్దేశ్యం కల స్త్రీ పురుషులు ఆ. 497 సెక్షన్ ని పట్టించుకోరు....మానవత్వంతో ఆలోచించితే మేలు..... ఇది తీర్పు ఉద్దేశ్యాన్ని చేరవేయడం నా బాధ్యత గా భావించి చేరవేశాను తప్ప...ఇది తీర్పు యొక్కసమర్ధనో, వివాహ వ్యవస్థ పట్ట విరక్తో కాదు...నిజం తెలుసుకోవాలి...పేపర్లోని మెయిన్ హెడ్డింగ్స్ చూసి ఆవేశపడకూడదు..అది వారి సర్క్యూలషన్స్ పెంచుకోడానికి పెట్టేవే...లోతులకి వెళ్లి విశ్లేషించుకోండి నేస్తం అర్ధం అవుతుంది సమస్తం..... మీ నేస్తం... ....నేస్తమా......! .
#

497పై సుప్రీంకోర్టు తీర్పు

497పై సుప్రీంకోర్టు తీర్పు - ShareChat
1.5k వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post