దేవదాస్‌ మూవీ రివ్యూ
విశ్లేషణ ;ఇంతవరకు స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన అనుభవం లేకపోయినా.. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య దేవదాస్‌ను బాగానే డీల్ చేశాడు. తను అనుకున్న కథకు తెర రూపం ఇవ్వటంలో విజయం సాధించాడు. అయితే కథనం మాత్రం పడుతూ లేస్తూ రోలర్‌ కోస్టర్‌ రైడ్‌లా సాగుతుంది. హీరోలుగా నాగ్‌, నానిలను ఎంచుకున్నప్పుడే సగం విజయం సాధించిన ఈ యువ దర్శకుడు వారిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నాడు. ఫస్ట్‌ హాఫ్ దేవ, దాస్‌ల మధ్య ఫ్రెండ్‌షిప్‌, కామెడీ ఆకట్టుకున్నా.. ప్రేమకథలు ఆసక్తికరంగా లేకపోవటం నిరాశకలిగిస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్‌ డ్రామా స్టార్ట్‌ అయిన తరువాత కథనం బాగా స్లో అయ్యింది. అయితే దేవ క్యారెక్టర్‌ ఎలివేషన్‌, కామెడీతో అన్ని మర్చిపోయేలా చేశాడు దర్శకుడు. చాలా రోజులు తరువాత ఓ స్టార్ హీరో సినిమాకు సంగీతమందించిన మణిశర్మ తన మార్క్‌ చూపించాడు. నేపథ్య సంగీతం విషయంలో మణిశర్మకు తిరుగులేదని దేవదాస్‌తో మరోసారి ప్రూవ్‌ అయ్యింది. సినిమాకు మరో మేజర్‌ ప్లస్‌ పాయింట్‌ శ్యామ్‌ దత్‌ సినిమాటోగ్రఫి. ప్రతీ ఫ్రేమ్‌ కలర్‌ఫుల్‌ గా చూపించేందుకు శ్యామ్‌ పడిన కష్టం తెర మీద కనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
#

దేవదాస్‌ మూవీ రివ్యూ

దేవదాస్‌ మూవీ రివ్యూ - ShareChat
5.3k వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post