Trending
అంతర్జాతీయ బాలిక దినోత్సవం👭

అంతర్జాతీయ బాలిక దినోత్సవం👭

ఈ రోజు మన ఇంటి పసిపాపలను కాపాడుకోవాల్సిన రోజు.. మన ఆడబిడ్డలను బ్రతికించుకోవాల్సిన రోజు.... స్త్రీ జాతి బ్రతుకు పసితనం నుంచి పండు ముసలి అయ్యేంతవరకూ కష్టాలే.. కష్టాల కడలి లో నిట్టూర్చే నా తోటి ఆడపడుచులందరికి నిర్భయంగా బ్రతుకే ఆశ కల్పిద్దాం... తల్లి కడుపులో ఉండగానే ఆడపిల్ల అని తెలుసుకుని మరీ చంపేస్తున్నారు.. కుదరకపోతే పుట్టిన తర్వాత పురిటిలో చంపేస్తున్నారు.. ఏం ఏం తప్పు చేసిందని?? మిమ్మల్ని కన్న అమ్మ కూడా ఆడదే కదా.. ఆ రోజు మీ అమ్మమ్మ, తాతయ్యలు, వారికి పుట్టిన బిడ్డ ఆడబిడ్డ అని పురిటిలోనే చంపేసి ఉంటే, మనం ఈ భూమి మీదకు వచ్చే వాళ్లమా? ఈ జీవితాన్ని చూడగలిగే వాళ్లమా?? అందరూ ఆడపిల్ల, ఆడపిల్ల అని చులకనగా చూస్తారు గానీ, అసలు ఆడపిల్ల వల్ల కలిగే కష్ట, నష్టాలు ఏంటి?? ఏ ఒక్కరైనా చెప్పగలరా?? గుండెలమీద చెయ్యివేసి చెప్పండి.... తన బిడ్డకు ప్రాణం పోయడం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ఆనందంగా తన బాధను ఓర్చకొని, ఆ పసికందుని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది.. మనం కడుపులో ఉండి కాళ్ల తో తన్నుతూ ఉన్నా.. ఆబాధను ఆనందంతో అనుభవిస్తూ మనకు జన్మనిచ్చింది.... అటువంటి అమ్మ కడుపున పుట్టినందుకు ఆమె ఋణం తీర్చుకోకపోయినా ఫర్వాలేదు.. మరొక బిడ్డను బలికాకుండా కాపాడుదాం... ఆడపిల్లలను పుట్టనిద్దాం ఎదగనిద్దాం బ్రతకనిద్దాం బ్రతికించుకుందాం.... ఈ చిరుదీపాలను వెలగనిద్దాం.. ప్రపంచానికి వెలుగునందిద్దాం..... ✒మీ కవిత రాణి
#

అంతర్జాతీయ బాలిక దినోత్సవం👭

అంతర్జాతీయ బాలిక దినోత్సవం👭 - ShareChat
1.4k views
1 months ago
#

అంతర్జాతీయ బాలిక దినోత్సవం👭

నేడు అంతర్జాతీయ బాలికల దినోత్సవం' సందర్భంగా.....  VINAY KUMAR MUKKANI     IMPORTANT DAYS      No comments     "ఆడపిల్లని బాటకనిద్దాం-చదవనిద్దాం-ఎదగనిద్దాం"....చిట్టితల్లి నవ్వాలి.. 🔻బాలికల హక్కుల ఉల్లంఘన, మానవహక్కులకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్లని ప్రపంచానికి తెలియజేయడంతో పాటు బాలికలకు అవగాహన పెంచే ఉద్దేశంతో ప్రతి ఏడాది అక్టోబర్ 11 వ తేదీని అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి మొదట డిసెంబర్‌ 19న 2011లో ప్రకటించింది. 🔻కౌమార దశలో ఆడపిల్లలు, యువతులు ఎదుర్కొనే వివిధ రకాల హింసను అంతం చేయాలని , హింసను ఎదుర్కోవడమే కాకుండా, లేకుండా చేయడానికి ఆడపిల్లలు తమ శక్తి సామర్ధ్యాలను గుర్తించాలి. సాధికారిత ప్రాముఖ్యాన్ని గుర్తించాలని అభిప్రాయపడింది . కిశోర బాలిక మహిళగా రూపొందే కీలక దశ కౌమార దశ. ఆమెను వర్తమానంలోనే కాదు భవిష్యత్తులోనూ సాధికరతా దిశలో నడిపించడానికి ఆమెకు అవగాహన అవసరం. ఆమెను చైతన్యం చేయడం అవసరం. అందుకే UNO కొన్ని కార్యక్రమాలు రూపొందించింది. 🔻UNITE TO END VIOLENCE AGAINST WOMEN CAMPAIGN  ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా బాలికల పట్ల వివక్ష, అసమానత, చిన్నచూపు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హింస, ఆధిపత్యం వివిధ రకాలగా హాని కలిగిస్తున్నాయి. ఈ ధోరణి సమాజాభివృద్దికి, మహిళా సాధికారతకి అది అవరోధం కలిగిస్తుంది. అందుకే బాల్యవివాహా లని నిరోధించి,హింస నుండి ఆమెను రక్షించడానికి కుటుంబం , మిత్రులు, సమాజం అంతా సన్నద్ధం కావాలి. 🔻కిశోర బాలికలని స్వశక్తివంతు లుగా తీర్చి దిద్దడానికి విద్య ప్రధానమైన ఆయుధం. బాలికల విద్యా హక్కు కోసం ఉద్యమిస్తున్న పాకిస్తానీ బాలిక చొరవ , సాహసం, చైతన్యం ఆమెను నోబెల్ బహుమతి దక్కేలా చేశాయి. విద్యావంతుల కుటుంబంలో, సామాజిక చైతన్యం గల నేపథ్యం నుండి వచ్చిన మలాలా లే కాదు. కొద్ది పాటు చైతన్యం ఇస్తే సామాజికంగా వెనుకబడ్డ, నిరక్షరాస్యుల కుటుంబాల్లోంచి కూడా ఏంటో మంది మలాలాలు ఉద్భవిస్తారు. తమపై జరిగే హింసని , దాడులని తిప్పికోడతారు. 🔻కిశోర బాలికలపై జరిగే హింసని అంతం చేయడానికి, ఆమెని స్వశక్తి వంతురాలిగా చేస్తూ సాదికారితవైపు పయనింప చేయాలంటే అది ఏ ఒక్కరో కాదు చేయాల్సింది. ప్రభుత్వం, పౌర సంస్థలు, ప్రజలు, ప్రభుత్వ-ప్రభుత్వేతర సంస్థలు ఏకం కావాలి. కలసి కట్టుగా ప్రణాళికా బద్దంగా నిబద్దతతో కృషి చేయాలి. 🔻కిశోర బాలికలకి సాంకేతిక, వృత్తి విద్యా అవకాశాలు కల్పించాలి. శిక్షణ ఇవ్వాలి. తన జీవితాన్ని తాను తీర్చి నడిపించుకునేందుకు వృత్తి నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, జీవన నైపుణ్యాలు, సామాజిక , ఆర్ధిక , ఆరోగ్యఅంశాలపై అవగాహన కల్పించాలి. శిక్షణలు ఇవ్వాలి. 🔻నేటి ఆడపిల్లలకి తప్పని సరి అవసరమైన భద్రత, సాంకేతిక విజ్ఞానాన్ని సేవల్ని అందుబాటులో ఉంచాలి. సామాజిక, ఆర్ధిక , రాజకీయ పరిస్థితులపట్ల అవగాహన కలిగించాలి. 🔸బాలికలకు అబ్బాయిలతో సమానంగా సరైన వనరులు, విద్యని అందించగలిగితే వారు ప్రపంచ వ్యాప్తంగా ఆకలి పస్తులు అనుభ విస్తున్న 16 శాతానికి తగ్గించగలరు. 🔸భారతదేశంలో 47 శాతం మంది మధ్య వయసు బాలికల్లో (కౌమార దశ) బరువు తక్కువగా ఉన్న లక్షణాలు కనిపిిస్తాయి. 🔸భారత్‌లో లింగ నిర్థారణ పరీక్షలపై నిషేధం ఉన్నా అవి అక్రమంగా జరిగిపోతున్నాయి. ఇది 1000 కోట్ల రూపాయల అక్రమ, అనైతిక పరిశ్రమగా రూపుదాల్చింది. భ్రూణ హత్యలకు కారణమవుతోంది. 🔸ప్రపంచంలో ఏదోఒక చోట ప్రతి 10 నిమిషాలకు బాలికలు హింస కారణంగా మరణిస్తున్నారు 🔸16వ శతాబ్దం వరకు గాళ్‌ అనే పదంతో ఆడ, మగ ఇద్దరినీ సంబోధించేవారు. 🔸ఆఫ్రికా ఖండంలో మాధ్యమిక విద్య లేని బాలికలు దాదాపు 2కోట్ల మందిగా నివేదికలున్నాయి. 🔸ప్రపంచ వ్యాప్తంగా 36 మిలియన్ల మంది బాలికలు పాఠశాల విద్యను అందుకోలేకపోతున్నారు. 🔸ప్రపంచవ్యాప్తంగా 70 కోట్లమంది అడపిల్లల వివాహాలు 18 సంవత్సరాలలోపు జరుగుతున్నాయి. వీళ్లలో ప్రతి ముగ్గురిలో ఒకరి కంటే ఎక్కువ మంది బాలికల వివాహం 15 సంవత్సరాలలోపే జరుగుతోంది. 🔸కౌమార దశలో ఉన్న అమ్మాయిల స్థిరమైన అభివృద్ధి, లింగ సమానత్వం లక్ష్యంగా ఈ ఏడాది అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 🔸అన్ని అభివృద్ధి చెందుతున్నదేశాల్లో దాదాపు సగం శాతం ఆడపిల్లలు 18 సంవత్సరాలోపే తల్లులుగా మారడంతో ఆరోగ్యసమస్యల్ని ఎదుర్కొంటున్నారు. 🔻ఇలాంటి ప్రత్యేక దినోత్సవాల్లో ఏదో ఒక కాంపెయిన్ చేసి చేతులు దులుపుకోవడం కాకుండా అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంటే తప్ప ఆడపిల్లపట్ల తరతరాలుగా నిండి ఉన్న భావనలు సమూలంగా పోవు. IF
1.5k views
1 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post