ఈ రోజు మన ఇంటి పసిపాపలను కాపాడుకోవాల్సిన రోజు.. మన ఆడబిడ్డలను బ్రతికించుకోవాల్సిన రోజు....
స్త్రీ జాతి బ్రతుకు పసితనం నుంచి పండు ముసలి అయ్యేంతవరకూ కష్టాలే..
కష్టాల కడలి లో నిట్టూర్చే నా తోటి ఆడపడుచులందరికి నిర్భయంగా బ్రతుకే ఆశ కల్పిద్దాం...
తల్లి కడుపులో ఉండగానే ఆడపిల్ల అని తెలుసుకుని మరీ చంపేస్తున్నారు.. కుదరకపోతే పుట్టిన తర్వాత పురిటిలో చంపేస్తున్నారు.. ఏం ఏం తప్పు చేసిందని??
మిమ్మల్ని కన్న అమ్మ కూడా ఆడదే కదా.. ఆ రోజు మీ అమ్మమ్మ, తాతయ్యలు, వారికి పుట్టిన బిడ్డ ఆడబిడ్డ అని పురిటిలోనే చంపేసి ఉంటే, మనం ఈ భూమి మీదకు వచ్చే వాళ్లమా? ఈ జీవితాన్ని చూడగలిగే వాళ్లమా??
అందరూ ఆడపిల్ల, ఆడపిల్ల అని చులకనగా చూస్తారు గానీ, అసలు ఆడపిల్ల వల్ల కలిగే కష్ట, నష్టాలు ఏంటి??
ఏ ఒక్కరైనా చెప్పగలరా?? గుండెలమీద చెయ్యివేసి చెప్పండి....
తన బిడ్డకు ప్రాణం పోయడం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ఆనందంగా తన బాధను ఓర్చకొని, ఆ పసికందుని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది..
మనం కడుపులో ఉండి కాళ్ల తో తన్నుతూ ఉన్నా.. ఆబాధను ఆనందంతో అనుభవిస్తూ మనకు జన్మనిచ్చింది.... అటువంటి అమ్మ కడుపున పుట్టినందుకు ఆమె ఋణం తీర్చుకోకపోయినా ఫర్వాలేదు.. మరొక బిడ్డను బలికాకుండా కాపాడుదాం...
ఆడపిల్లలను
పుట్టనిద్దాం
ఎదగనిద్దాం
బ్రతకనిద్దాం
బ్రతికించుకుందాం....
ఈ చిరుదీపాలను వెలగనిద్దాం..
ప్రపంచానికి వెలుగునందిద్దాం.....
✒మీ కవిత రాణి
#
అంతర్జాతీయ బాలిక దినోత్సవం👭