🔱 దేవి శరన్నవరాత్రులు 🔱
70 Posts • 57K views
PSV APPARAO
659 views 9 days ago
#శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు) #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 #శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు 🙏 🔱🕉️🔱🙏 #🔱 దేవి శరన్నవరాత్రులు 🔱 శరన్నవరాత్రులు - జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు *రేపటి నుంచే శరన్నవరాత్రులు ప్రారంభం* సారస్వత కల్పంలో సత్త్వరజస్తమోగుణాలు మూడింటికి అధిష్టాత్రి మహాలక్ష్మి. సమస్త విశ్వానికి ఆమె మొదట ఉంది. ఆమె స్వరూపం లక్ష్యాలక్ష్యంగా ఉంటుంది. ఆమె అంతటా వ్యాపించి ఉంది. ఆమె శూన్యంగా ఉన్న జగత్తును చూసి మహాకాళి రూపాన్ని ధరించింది. సత్వ గుణంతో సరస్వతీ రూపం ధరించింది. శరన్నవరాత్రుల్లో పూజలందుకునేది జగన్మాతే. వివిధ రూపాల్లో ఆమెను ఈ పుణ్యదినాల్లో విశేషంగా ఆరాధిస్తుం టారు. 'అమ్మలగన్న యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ' అని మహాకవి పోతన సరస్వతీ, లక్ష్మి పార్వతులకు కన్న తల్లి అని జగజ్జననిని స్తుతించారు. ఆయన పద్యంలో దుర్గమ్మను స్తుతి చేశారు. పార్వతినే దుర్గ అంటారు కదా. ముగ్గురమ్మలలో పార్వతి ఉంది కదా! దుర్గ పార్వతిని కనడమేమిటి అనే సంశ యం కలుగుతుంది. దీనికి సమాధానంగా పురాణం ఏం చెబు తోందో చూడాలి. ప్రస్తుతం శ్వేత వరాహ కల్పం నడుస్తోంది. ఇలాంటి కల్పాలనేకం ఉన్నాయి. వాటిలో సారస్వత కల్పం ఒకటి. దేవీ భాగవతం ఆ కల్పానికి చెందిన కథలతో ఉంటుంది. ఆ కల్పంలో సత్త్వరజస్తమోగుణాలు మూడింటికి అధిష్ఠాత్రి మహాలక్ష్మి. సమస్త విశ్వానికి ఆమె మొదట ఉంది. ఆమె స్వరూ పం లక్ష్యాలక్ష్యంగా ఉంటుంది. ఆమె అంతటా వ్యాపించి ఉంది. ఆమె శూన్యంగా ఉన్న జగత్తును చూసి మహాకాళి రూపాన్ని ధరించింది. సత్వగుణంతో సరస్వతీ రూపం ధరిం చింది. అపుడు మహాలక్ష్మి వారిని తమకు జంటగా దేవతలను సృష్టించమని చెప్పింది. తాను బ్రహ్మను, లక్ష్మీదేవిని సృష్టిం చింది. మహాకాళి చంద్రశేఖరుని, భారతిని సృష్టించింది. సర స్వతి విష్ణువును, గౌరీదేవిని సృష్టించింది. ఇలా మొదట ఉన్న ఆద్య లక్ష్మి ముగ్గురమ్మలకు మూలపుటమ్మ అయింది. ఆ ఆద్య మహాలక్ష్మియే దుర్గమ్మ. మహాలక్ష్మి బ్రహ్మకు భారతిని, రుద్రు నికి గౌరిని, విష్ణువుకు లక్ష్మిని ఇచ్చింది. ఇలా అక్కచెల్లెళ్ళు వివాహం చేసుకోవచ్చా అనే సంశయం కలుగుతుంది. మనలా పార్థివ శరీరాలతో ఉన్నవారికి కలిగే పిల్లలకు వావి వరసలుం టాయి. కాని తేజోమయమైన మానసిక సృష్టిలోని వారికి ఈ వావి వరుసలుండవు. వారికే దోషం ఉండదు. బ్రహ్మ భారతితో కలిసి బ్రహ్మాండాన్ని పుట్టించాడు. గౌరి తో కూడిన రుద్రుడు బ్రహ్మాండాన్ని భేదించాడు. బ్రహ్మాండ మధ్యంలో మహాభూతాదులు, స్థావరజంగమాత్మకమైన జగ త్తు పుట్టింది. లక్ష్మితో కూడిన విష్ణువు ఆ జగత్తును పోషించి పాలించాడు. గౌరితో కూడిన మహేశ్వరుడు ఆ జగత్తునంతటినీ సంహరించాడు. ఇలా త్రిమూర్తులూ సృష్టి స్థితి సంహారాలు చేస్తున్నారు. ఆద్య మహాలక్ష్మి సర్వ సత్త్వమయియై, నిరా కారంగాను, ఆకారంతోను, అనేకమైన పేర్లతో విలసిల్లుతూ ఉంది. సృష్టి ప్రారంభంలో జగత్తంతా ఒకే సముద్రంగా ఉంది. అప్పుడు ఆదిశేషునిపై విష్ణు దేవుడు పవ్వళించి యోగనిద్రలో ఉన్నాడు. ఆయన చెవి గులివి నుంచి ఇద్దరు రాక్షసులు బయలు దేరారు. వారి పేర్లు మధుకైటభులు. విష్ణుదేవుని నాభికమలం నుంచి బ్రహ్మ ఆవిర్భవించాడు. మధుకైటభులు బ్రహ్మను చంపడానికి ప్రయత్నించారు. ఆయన ఏకాగ్ర హృదయంతో యోగమాయను స్తుతించాడు. ఆమె యోగనిద్రా రూపిణి. విష్ణువు నుంచి బయటకు వచ్చింది. అప్పుడు మెళకువ పొం దిన విష్ణువు, మధుకైటభులతో యుద్ధం చేశాడు. మధు కైట భులు యోగమాయా మోహితులై 'నీ యుద్ధం మాకు సంతో షం కలిగించింది. ఏమి కావాలో కోరుకో' అన్నారు. 'మీరు నాకు వధ్యులు కావాలి' అన్నాడు విష్ణుదేవుడు. వారు అనవ సరంగా వరమిస్తామన్నామనుకుని నాలిక కరచుకుని 'నీళ్ళు లేని చోట మమ్మల్ని వధించవచ్చు' అన్నారు. విష్ణువు తన శరీరాన్ని పెంచి తొడపై వారి నుంచి చక్రంతో వారి శిరస్సులు ఛేదించాడు. ఇలా సృష్టికి పూర్వం విష్ణువుకు యోగనిద్ర తొల గించి, అసురులకు మోహం కలిగించి తోడ్పడింది యోగ మాయ. అవిడే మహాకాళి. మరోసారి మహిషుడనే అసురుడు దేవతలను జయిం చాడు. అష్టదిక్పాలకాదుల అధికారాలన్నీ అతనే వశం చేసుకు న్నాడు. అతడు గొప్ప తపస్వి. స్త్రీ చేతిలో తప్ప అతను మరణిం చడు. అమిత బలం కల అతనిని ఏ స్త్రీ ఎదిరిస్తుందని దేవతలు బ్రహ్మదేవుని ఎదుట బెట్టుకుని విష్ణు మహేశ్వరులను శరణు వేడారు. విష్ణు దేవునికి, శంకరునికి కోపం వచ్చింది. అప్పుడు వారి ముఖాల నుంచి గొప్ప తేజస్సు వెలువడింది. ఇంద్రాది దేవతల శరీరరాల నుంచి కూడా తేజ స్సులు వెలువడ్డాయి. ఆ తేజస్సు లన్నీ ఏకమై అన్ని దిక్కులూ వ్యాపించాయి. ఆ తేజం చివరి కొక స్త్రీ రూపం ధరించింది. శంభుని తేజస్సుతో అమెకు ముఖం ఏర్పడింది. యముని తేజస్సుతో జుట్టు ఏర్పడింది. విష్ణువు తేజస్సుతో బాహువు లేర్పడ్డాయి. ఇలా దైవ తేజస్సు లతో ఏర్పడిన ఆమెకు దేవతలు తమ ఆయుధాల నుంచి శూలం, చక్రం, వజ్రం మొదలైన ఆయు ధాలను ఏర్పరచి సమర్పిం చారు. ఆమెకు హిమాలయుడు సింహవాహనం సమర్పించాడు. ఆమె అట్టహాసం చేసింది. దేవతలు భక్తితో నమస్కరించారు. ఈ తేజస్విని గురించి మహి షాసురుడు విన్నాడు. అప్పుడతడు ఆమెను వశం చేసుకోవడం కోసం సైన్యాన్ని పంపాడు. విక్షురుడు, ఉదగ్రుడు, అసిలో ముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన అసుర నాయకు లను సైన్య సమేతంగా పంపాడు. ఆ దేవి నిశ్వాసం నుంచి లక్షలాది శక్తి గణాలు ఆవిర్భవించాయి. ఆ శక్తి గణాలు అసుర సైన్యాన్ని ఓడించాయి. దేవతలు పూలవాన కురిపించారు. ఈ దేవి మహాలక్ష్మి. ఈ జగజ్జనని మహిషాసురుణ్ని సంహరిం చింది. దేవతలందరు ఈ తల్లిని స్తుతించారు. ' నిన్ను స్మరించినంతనే మా ఆపదలు తొలగించు' అని ప్రార్థించారు. ఆమె అంగీకరించి అంతర్థానమైంది. ఆ తర్వాత శుంభనిశుంభులనే మహా పరాక్రమవంతులు బయలుదేరారు. వారు దేవతలను జయించారు. దేవతల అధి కారాలు లాక్కున్నారు. దేవతలకు జగజ్జనని గుర్తుకు వచ్చింది. ఆమెను ప్రార్థించారు. ఆ సమయంలో పార్వతీ దేవి జాహ్నవీ నదికి స్నానానికి వచ్చింది. ఆమె శరీరంలో నుంచి మహా సర స్వతి వెలుప లికి వచ్చింది. పార్వతి శరీరమనే కోశాన్నుంచి వెలువడింది కనుక ఆమెను కౌశికి అంటారు. అప్పుడు పార్వతి నల్లటి రూపంతో కాళిక అయింది. చండ ముండులనే భృత్యులు అంబిక సౌందర్యం గురించి శుంభునికి చెప్పారు. శుంభుడు అంబిక దగ్గరకు సుగ్రీవుని దూతగా పంపారు. అతడు త్రిలోకాధిపతి అయిన శుంభుని వరిం చమని కోరాడు. ఆమె 'నన్ను సంగ్రామంలో జయంచినవాడే నా భర్త అవుతాడని ప్రతిజ్ఞ చేశాను కాబట్టి శుంభనిశుంభులలో ఎవరైనా నన్ను జయించి వివాహం చేసుకోవచ్చు' అంది. ఆ దూత అంబికను బెదిరిం చాడు. వానిని ఆమె లెక్క చేయ లేదు. అప్పుడు శుంభుడు ధూమ్రలోచనుడు, చండుడు, ముండుడు అనే వారిని అంబిక ను జయించమని పంపించాడు. అంబిక ధూమ్రలోచనుణ్ని భస్మం చేసింది. చండముం డులను కాళిక సంహరించింది. అప్పుడు నిశుంభుడు సైన్య సమేతంగా అంబికనెదుర్కొన్నాడు. అపుడుడు బ్రహ్మాది దేవతల శక్తులు స్త్రీరూప ధారిణులై ఆయు ధ సమేతంగా అంబిక సైన్యంగా ఏర్పడ్డారు. ఆ స్త్రీశక్తులన్నీ ఆయా దేవతల ఆకారాల్లో వారి వారి ఆయుధాలతో ఆ యుద్ధం లో పాల్గొన్నారు. అపుడు అంబిక శరీరాన్నుండి ఒక మహాశక్తి ఈవలకు వచ్చి 'శివునితో నీవు శుంభుని వద్దకు దూతగా వెళ్ళి 'ఇంద్రుని మూడులోకాలు ఇంద్రుడికి ఇచ్చి పాతాళానికి వెళ్లు. బలగర్వం తో సమరానికి దిగితే మా శక్తులు మీకు జవాబు చెబుతాయి అనే సందేశం వారికి చెప్పు' అంది. ఇలా శివుని దూతగా పంపినం దున ఆమెను శివ దూతి అన్నారు. అప్పుడు అసురులు యుద్ధా నికి తరలి వచ్చారు. అప్పుడు రక్త బీజుడనే అసురుడు దేవీ శక్తుల్ని సంహారం చేస్తున్నాడు. కింద పడిన అతని ఒక్కో రక్త బిందువు నుంచి అతనితో సమానబలం గల ఒక్కో అసురుడు జన్మిస్తాడు. ఇది అతనికున్న వరం. దేవీ శక్తులు ఆయుధాలతో కొట్టగా అతని రక్తం నేలపై పడడంతో అనేక రక్త బీజులు పుట్టి విధ్వంసం సృష్టించడం జరిగింది. అప్పుడు కాళిక సాయంతో రక్తం కింద పడకుండా అంబిక రక్తబీజుని సంహరించింది. తరు వాత నిశుంభుడు దేవితో తీవ్ర యుద్ధం చేశాడు. నిశుంభుడు మరణించిన తర్వాత శుంభుడు 'ఇతర శక్తుల ప్రభావంతో నీవు గర్విస్తున్నావ'ని దేవిని ఆక్షేపించాడు. దానితో నా కంటే ఇతరు లెవరున్నారని ఆ శక్తులందరినీ తనలో విలీనం చేసుకుంది అంబిక, అంబిక, శుంభుడు హోరాహోరీ పోరాడాక దేవి శుంభుని నాశనం చేసింది. అపుడు దేవతలందరు దేవిని స్తుతిం చారు. ఈ మూడు చరిత్రలు పారాయణ చేయడం అమ్మ వారికిష్టం. నవరాత్రాలలో వీటిని పారాయణ చేస్తారు. వైవస్వత మన్వంతరంలో కూడా మరల శుంభనిశుంభు లనే అసురులు అల్లకల్లోలం సృష్టించినపుడు యశోదకు పుట్టిన విష్ణుమాయ వారిని సంహరించింది. ఆమె వింధ్యాచలంపై నివసిస్తుంది. అలాగే ఒక కాలంలో వైప్ర చిత్తులనే దానవులు లోకాలను పీడించారు. వారిని రక్త దంతిక అనే శక్తి సంహ రించింది. ఒకప్పుడు నూరు సంవత్సరాలు అనావృష్టి ఏర్ప డగా మునులు జగజ్జననిని స్తుతించారు. అప్పుడామె నూరు నేత్రాలతో వారిని ఆదరంగా చూసి వారి ఆకలి తీర్చంది. ఆ తల్లిని శతాక్షి అంటారు. ఈమెను హరిశ్చంద్రుడు ఆరాధిం చాడు. ఈ శతాక్షి కూరలతో మునులకు ఆహారం అందజేసింది. అందుకే ఆమెను శాకంభరి అని కూడా అంటారు. ఇప్పటికీ శాకంభరిగా అమ్మవారిని అలంకరిస్తుంటారు. ఒకప్పుడు దుర్గ ముడనే అసురుడు జనాన్ని పీడించేవాడు. అపుడు అమ్మవారు వానిని సంహరించారు. దీని వలన దుర్గాదేవిఅనే పేరు వచ్చిం ది. మరొకసారి అసురులు మునులను పీడిస్తుండగా భయం కరాకారంతో ఆ అసురులను సంహరించింది. ఆమెను భీమా దేవి అన్నారు. అరుణుడనే అసురుడు జనులకు చాలా పీడ కలి గించాడు. అపుడు దేవి అనేక భ్రమర రూపాలు ధరించి మూడు లోకాల హితం కోసం అతన్ని సంహరించింది. అమెను భ్రామరి అని ప్రశంసించారు. ఆమే భ్రమరాంబ. ఈ కథలు మార్కండేయ పురాణంలో సంగ్రహంగా ఉన్నాయి. దేవీ భాగ వతంలో ఈ కథలు విస్తృతంగా ఉన్నాయి. భువనేశ్వరిఅక్కడ ఇంకా భువనేశ్వరి, గౌరి, గంగ, సరస్వతి, ధర, వేదవతి, తులసి, సావిత్రి, మహాలక్ష్మి, స్వాహా, స్వధా, దక్షిణ, షష్ఠి, మంగళచండి, మానస, సురభి, రాధ, గాయత్రి మొదలైన దేవతా శక్తుల గాథలు కూడా ఉన్నాయి. వీరందరూ ఒకే జగజ్జనని అవతారాలని చెప్పడం కోసం దేవాలయాల్లో దేవికి వివిధ దేవతా శక్తుల అలంకారాలు చేస్తారు. అదే వరుసలో అలంకారాలు చేయాలనే నియమం లేదు. పాడ్యమి నాడు బాలా త్రిపుర సుందరి, విదియ నాడు గాయత్రి, తదియనాడు మహాలక్ష్మి, చవితినాడు అన్నపూర్ణ, పంచమి నాడు లలిత, షష్ఠినాడు శాకంభరి, సప్తమి నాడు సరస్వతి, అష్టమి నాడు దుర్గాదేవి, నవమినాడు మహిషాసుర మర్దిని, దశమినాడు రాజరాజేశ్వరి అలంకారాలు కొన్ని దేవాలయాల్లో చేస్తున్నారు. బాలను అర్చించేవారు బాలను, లలితను అర్చించేవారు లలి తను, రాజేశ్వరి ఆరాధకులు ఆమెను చండికను పూజించేవారు ఆమెను తొమ్మిది రోజులూ అర్చిస్తారు. 🚩*🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
15 likes
7 shares