reddy
233 Posts • 9M views
( 16 - 11- 2025) బేతంచెర్ల నగరంలో జరిగిన రెడ్డి కులస్తుల వనభోజన కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధికంగా టాక్స్ లు కడుతున్నది మన రెడ్డి కులస్తులే అని, కాబట్టి రెడ్డి సామాజిక వర్గంలో వున్న బీదవారిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చాలా తీవ్ర స్థాయిలో డిమాండ్ చేస్తున్నామని,అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపున ప్రతి యొక్క రెడ్డి సోదరుల ప్రదాన డిమాండ్ ఏమంటే రెడ్డి కార్పొరేషన్ పాలకమండలి ఏర్పాటు చేసేందుకు,అందుకు నిధులు సమకూర్చేందుకు డిసెంబర్ 15 లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు మన రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు తక్షణమే చర్యలు చేపట్టాలని లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమం తరపున ' ఐకమత్యమే మహాబలం ' అనే తరహాలో ప్రతి యొక్క రెడ్డి కులస్థులు కూడా ఏకతాటిపై నిలిచి( అంటే రాష్ట్ర వ్యాప్తంగా వున్న 70 లక్షల పైచిలుకు రెడ్డి కులస్తులు) మా హక్కుల సాధన కోసమని ఓక పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ ప్రత్యేక సందర్బంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు శ్రీ గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి గారు!రెడ్డి కులస్తుల ఐక్యత మరో పదికాలాల పాటు వర్ధిల్లాలి అత్యంత దిగ్విజయంగా! జయ జయహో రెడ్డి బ్రదర్స్! క్యాప్షన్: కలిస్తే నిలుస్తాం! విడిపోతే పడిపోతాం అధ: పాతాళానికి!ఏదైనా సాదించాలన్న ఒక చేతితో చేయడం సాధ్యం కాదు అందుకు పది చేతులు కలవాలి,చెయ్యి చెయ్యి కలిపితేనే కొండలను సైతం పిండి చేయగలం,అసాధ్యాల్ని సైతం సాధ్యం చేయగలం! ఈ ప్రదాన నీతి సూత్రాన్ని ప్రతి యొక్క రెడ్డి కులస్థులు దృష్టిలో ఉంచుకొని మన హక్కుల సాధనపై ఈ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి మనమనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు మనమంతా ఉద్యమిద్దాం,అందులో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి అయిన మన రెడ్డి కులస్తుల హక్కులను అత్యంత విజయవంతంగా సాధించుకుందాం! రెడ్డి సామాజిక వర్గం జిందాబాద్!✍️✍️✍️ - మధుసూదనరెడ్డి బుగ్గన,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల! #reddy
15 likes
8 shares