పెట్రోల్ భారం
పెట్రోలు రూ. 34.04, డీజిల్‌ రూ.38.67 మాత్రమే! అసలు ధర ఇంతే మిగతాదంతా పన్నులు, డీలర్ల కమీషనే ఏడాదిలో కేంద్ర ఎక్సైజ్‌ సుంకం రూ. 2.23 లక్షల కోట్లు లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడి దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోలు అసలు ధర ఎంతో తెలుసా! కేవలం రూ. 34.04 మాత్రమే. డీజిల్‌ ధర కూడా రూ. 38.67 మాత్రమే. కానీ వినియోగదారులకు చేరేసరికి ఆ ధరలు కాస్తా రూ. 70.63, రూ. 64.54లుగా మారిపోతున్నాయి. ఇంత భారీ తేడాకు కారణం పన్నులు, డీలర్ల కమీషనే. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్‌ప్రతాప్‌ శుక్లా లిఖితపూర్వకంగా వెల్లడించిన వివరాలివి. ఈనెల 19 నాటికి పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై వివరాలను ఆయన వెల్లడించారు. * దిల్లీలో లీటరుకు పెట్రోలుపై కేంద్ర ఎక్సైజ్‌ సుంకం రూ. 17.98, రాష్ట్ర వ్యాట్‌ రూ. 15.02, డీలర్‌ కమీషన్‌ రూ.3.59. అలాగే డీజిల్‌పై వరుసగా రూ. 13.83; రూ. 9.51; రూ. 2.53 వంతున విధిస్తున్నారు. ఇవన్నీ కలిపి పెట్రోల్‌పై 96.9 శాతం, డీజిల్‌పై 60.3 శాతం ధరను పెంచేస్తున్నాయి. * మార్కెట్‌ ధరకు అనుగుణంగా ప్రతిరోజూ పెట్రోలు, డీజిల్‌ ధరలు మారుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు విధించే వ్యాట్‌ రేటుకు అనుగుణంగా వీటి ధరలు ఒక్కోచోట ఒక్కోలా ఉంటాయి. . . www.bhaktibooks.in . . భారీగా ఎక్సైజ్‌ సుంకం.. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఎక్సైజ్‌ సుంకం రూపంలో పెట్రోలుపై రూ. 73,516.8 కోట్లు, డీజిల్‌పై రూ. 1.5 లక్షల కోట్లు వసూలు చేసినట్లు మంత్రి మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. అదే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి 6 నెలల్లో పెట్రోలు, డీజిల్‌పై వరుసగా రూ. 25,318.1 కోట్లు, రూ. 46,548.8 కోట్లు కేంద్రం వసూలు చేసినట్లు వివరించారు. పెరిగిపోతున్న పెట్రో ఉత్పత్తుల ధరలను నియంత్రించేందుకు గాను అక్టోబరు 4న కేంద్రం ఎక్సైజ్‌ సుంకంపై కొంత కోత విధించింది. ఫలితంగా మిగిలిన 6 నెలల కాలంలో ఎక్సైజ్‌ సుంకం రూ.7 వేల కోట్లు తగ్గనున్నట్లు అంచనా.
#

పెట్రోల్ భారం

పెట్రోల్ భారం - పెట్రోలు రూ . 804 - ShareChat
188 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post