శ్రీ అన్న పూర్ణ దేవీ అలంకరణ శ్రీ దేవి శరన్నవరాత్రులు
3 Posts • 2K views
PSV APPARAO
828 views 10 days ago
#అన్నపూర్ణ దేవి స్తోత్రం #🍲శ్రీ అన్నపూర్ణ దేవి🍚 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శ్రీ అన్న పూర్ణ దేవీ అలంకరణ శ్రీ దేవి శరన్నవరాత్రులు #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 *శ్రీ అన్నపూర్ణా స్తోత్రం* నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ । ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 1 ॥ నానా రత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ ముక్తాహార విలంబమాన విలసత్-వక్షోజ కుంభాంతరీ । కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 2 ॥ యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠాకరీ చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ । సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 3 ॥ కైలాసాచల కందరాలయకరీ గౌరీ-హ్యుమాశాంకరీ కౌమారీ నిగమార్థ-గోచరకరీ-హ్యోంకార-బీజాక్షరీ । మోక్షద్వార-కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 4 ॥ దృశ్యాదృశ్య-విభూతి-వాహనకరీ బ్రహ్మాండ-భాండోదరీ లీలా-నాటక-సూత్ర-ఖేలనకరీ విజ్ఞాన-దీపాంకురీ । శ్రీవిశ్వేశమనః-ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 5 ॥ ఉర్వీసర్వజయేశ్వరీ భగవతీ [జయకరీ] మాతా కృపాసాగరీ వేణీ-నీలసమాన-కుంతలధరీ నిత్యాన్న-దానేశ్వరీ । సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 6 ॥ ఆదిక్షాంత-సమస్తవర్ణనకరీ శంభోస్త్రిభావాకరీ కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శర్వరీ । స్వర్గద్వార-కపాట-పాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 7 ॥ దేవీ సర్వవిచిత్ర-రత్నరుచితా దాక్షాయిణీ సుందరీ వామా-స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ । భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 8 ॥ చంద్రార్కానల-కోటికోటి-సదృశీ చంద్రాంశు-బింబాధరీ చంద్రార్కాగ్ని-సమాన-కుండల-ధరీ చంద్రార్క-వర్ణేశ్వరీ మాలా-పుస్తక-పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 9 ॥ క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ । దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 10 ॥ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర-ప్రాణవల్లభే । జ్ఞాన-వైరాగ్య-సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ ॥ 11 ॥ మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః । బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం ॥ 12 ॥ సర్వ-మంగళ-మాంగళ్యే శివే సర్వార్థ-సాధికే । శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోఽస్తు తే ॥ 13 ॥ *ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ అన్నపూర్ణా స్తోత్రమ్ ।* *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
10 likes
8 shares
PSV APPARAO
2K views 10 days ago
#శ్రీ అన్న పూర్ణ దేవీ అలంకరణ శ్రీ దేవి శరన్నవరాత్రులు #శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు) #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #🍲శ్రీ అన్నపూర్ణ దేవి🍚 *** దసరా దుర్గ నవరాత్రులలో 3వ రోజు శ్రీ అన్నపూర్ణా దేవి అమ్మ అలంకారణ. అమ్మవారి అలంకారణ : నేడు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించాలి. అమ్మ చీర రంగు : అమ్మను తెలుపు రంగు, గంధపు రంగు లేదా పసుపు రంగు వస్త్రంతో అలంకరిస్తారు. ఎందుకంటే ఈ రంగు గుణానికి సంకేతం. కాబట్టి ఆ తల్లి అనుగ్రహంతోనే సమస్త జీవులకు ఆహారం చేకూరుతుంది. ఆ తల్లి అన్ని జీవరాసులకు ఆహారాన్ని ఇస్తుంది. నైవేద్యం : కొబ్బరి అన్నం, అల్లంగారెలు, దద్దోజనం, క్షీరాన్నం, కట్టె పొంగలి నైవేద్యంగా పెట్టాలి. అమ్మను శాంతపరచడానికి గారెలను పెట్టాలన్నది భక్తుల నమ్మకం. పారాయణం : శ్రీ అన్నపూర్ణా అష్టోత్తర శతనామావళి "ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ నారీనీల సమానకుంతల ధరీ నిత్యాన్నదానేశ్వరీ సాక్షాత్ మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ"|| అన్నపూర్ణాదేవిని తెల్లని పుష్పాలతో పూజించాలి. "హ్రీం శ్రీం క్లీం ఓం నమో భాగవత్యన్నపూర్ణేశ మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి నైవేద్యంగా దధ్ధోజనం, కట్టె పొంగలి నివేదించాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణం చేయాలి. కాశీ లేదా వారణాసి అంటే అందరికీ గుర్తొచ్చే విషయాలు పవిత్ర గంగానది, కాశీ విశ్వనాధుడు. వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడ ఉంది అదే కాశీ అన్నపూర్ణ ఆలయం. ఇక్కడి ప్రజలు ఎప్పుడు కూడా ఆకలితో అలమటించరు, అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణమ్మను భక్తులు కొలుస్తారు. పరమశివుని సతీమణి పార్వతీ దేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలందుకుంటున్నారు. ఈ భూమిపై మానవులు బ్రతకడానికి తిండి, నీరు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసిందే. కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే, ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది. ప్రజలకు ఇక్కడ ఎప్పుడు సంమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. కాశీ విశ్వనాథ్ ఆలయానికి సమీపంలో విశ్వనాథ్ గలీలోని దశశ్వమేధ్ రోడ్డులో అన్నపూర్ణ ఆలయం ఉంది. అన్నపూర్ణా దేవి కథ : కాశీ అన్నపూర్ణ దేవికి సంబంధించి ప్రముఖంగా ఒక కథ ప్రచారంలో ఉంది. పవిత్ర హిందూ గ్రంధాలు, పురాణాల ప్రకారం ఒకసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటాడు. భక్తుల ఆకలిని తీర్చే అమ్మ అయిన పార్వతీ దేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్లిపోతుంది, దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించడం ప్రారంభవుతుంది. ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది. చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకుని భిక్ష పాత్రను పట్టుకుని పార్వతీదేవి వద్దకు వెళ్లి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు. అప్పటి నుండి పార్వతీ దేవి అన్నపూర్ణగా కాశీలో నేటికీ భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని నమ్ముతారు. అన్నకూట్ ఉత్సవం : ఈ ఆలయంలో అన్నపూర్ణ దేవి యొక్క బంగారు విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని దీపావళి తరువాత మరుసటి రోజు వచ్చే అన్నకూట్ పండుగలో సంవత్సరానికి ఒకసారి భక్తుల దర్శనం కోసం ఉంచుతారు. ఇతర రోజులలో అన్నపూర్ణ ఆలయ గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఇత్తడి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో నిర్వహించే అన్నకూట్ ఉత్సవాన్ని వీక్షించేందుకు అనేక ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు. వారికి ఇక్కడ ప్రత్యేక నాణేలను కూడా పంపిణీ చేస్తారు. కాశీలో ప్రజలు ఎవరూ ఆకలితో ఉండకుండా అన్నపూర్ణ దేవి చూసుకుంటుందని భక్తుల విశ్వాసం. శ్రీ అన్నపూర్ణా అష్టోత్తర శతనామావళి : ఓం అన్నపూర్ణాయై నమః ఓం శివాయై / దేవ్యై నమః ఓం భీమాయై /పుష్ట్యేనమః ఓం సరస్వత్యై / సర్వజ్ఞాయై నమః ఓం పార్వత్యై / దుర్గాయై నమః ఓం శర్వాణ్యై నమః ఓం శివవల్లభాయై నమః ఓం వేదవేద్యాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం విద్యాదాత్ర్యై / విశారదాయై నమః ఓం కుమార్యై / త్రిపురాయై నమః ఓం లక్ష్మ్యై / భయహారిణ్యై నమః ఓం భ్వాన్యై నమః ఓం విష్ణుజనన్యై నమః ఓం బ్రహ్మదిజనన్యై నమః ఓం గణేశ జనన్యై / శక్త్యై నమః ఓం కౌమారజనన్యై / శుభాయై నమః ఓం భోగప్రదాయై / భగవత్యై నమః ఓం భక్తాభీష్టప్రదాయిన్యై నమః ఓం భవరోగహరాయై నమః ఓం భవ్యాయై / శుభ్రాయై నమః ఓం పరమమంగళాయై నమః ఓం భ్వాన్యై / చంచలాయై నమః ఓం గౌర్యై నమః ఓం చారుచంద్రకళాధరాయై నమః ఓం విశాలక్ష్యై / విశ్వమాత్రే నమః ఓం విశ్వవంద్యాయై నమః ఓం విలాసిన్యై / ఆర్యాయై నమః ఓం కల్యాణ నిలయాయై నమః ఓం ర్ద్రాణ్యై కమలాసనాయై నమః ఓం శుభప్రదాయై /శుభాయై నమః ఓం అనంతాయై నమః ఓం మత్తపీనపయోధరాయై నమః ఓం అంబాయై నమః ఓం సంహారమథన్యై నమః ఓం మృడాన్యై నమః ఓం సర్వమంగళాయై నమః ఓం విష్ణు సేవితాయై నమః ఓం సిద్దాయై / బ్రహ్మాణ్యై నమః ఓం సురసేవితాయై నమః ఓం పరమానందాయై నమః ఓం శాంత్యై నమః ఓం పరమానందరూపిణ్యై నమః ఓం పరమానంద జనన్యై నమః ఓం పరానంద ప్రదాయిన్యై నమః ఓం పరోపకార నిరతాయై నమః ఓం పరమాయై నమః ఓం భక్తవత్సలాయై నమః ఓం పూర్ణచంద్రాబ్భవదనాయై నమః ఓం పూర్ణచందనిభాంశుకాయై నమః ఓం శుభలక్షణ సంపన్నాయై నమః ఓం శుభానంద గుణార్ణవాయై నమః ఓం శుభసౌభాగ్యనిలయాయై నమః ఓం శుభదాయై నమః ఓం రతిప్రియాయై నమః ఓం చండికాయై నమః ఓం చండమదనాయై నమః ఓం చండదర్పనివారిణ్యై నమః ఓం మార్తాండనయనాయై నమః ఓం సాధ్వ్యై నమః ఓం చంద్రాగ్నినయనాయై నమః ఓం సత్యై నమః ఓం పుండరీకహరాయై నమః ఓం పూర్ణాయై నమః ఓం పుణ్యదాయై నమః ఓం పుణ్యరూపిణ్యై నమః ఓం మాయాతీతాయై నమః ఓం శ్రేష్ఠమాయాయై నమః ఓం శ్రేష్ఠధర్మాత్మవందితాయై నమః ఓం అసృష్ట్యై నమః ఓం సంగరహితాయై నమః ఓం సృష్టిహేతుకవర్థిన్యై నమః ఓం వృషారూఢాయై నమః ఓం శూలహస్తాయై నమః ఓం స్థితి సంహార కారిణ్యై నమః ఓం మందస్మితాయై నమః ఓం స్కందమాత్రే నమః ఓం శుద్దచిత్తాయై నమః ఓం మునిస్తుత్యాయై నమః ఓం మహాభగవత్యై / దక్షాయై నమః ఓం దక్షాధ్వరవినాశిన్యై నమః ఓం సర్వార్థ దాత్ర్యై నమః ఓం సావిత్ర్యై నమః ఓం సదాశివకుటింబిన్యై నమః ఓం నిత్యసుందరస్ర్వాంగై నమః ఓం సచ్చిదానంద లక్షణాయై నమః ఓం సర్వదేవతా సంపూజ్యాయై నమః ఓం శంకరప్రియవల్లభాయై నమః ఓం సర్వధారాయై నమః ఓం మహాసాధ్వ్యై నమః ఓం శ్రీ అన్నపూర్ణాయై నమః శ్రీ అన్నపూర్ణా స్తోత్రమ్ సంపూర్ణం. ఓం శ్రీ అన్నపూర్ణా దేవియే నమః #namashivaya777
22 likes
29 shares