బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
662 views • 3 months ago
నాన్న తమ పిల్లల ఉజ్వల,బంగారు భవిష్యత్ కు ఓ రోల్ మోడల్ వంటివారు! ( ఈ రోజు ఫాదర్స్ డే ను పురస్కరించుకొని - 15 - 6 - 2025)!
లేదా
తమ పిల్లల యోగ,క్షేమాలే ధ్యేయంగా నిత్యం చెమటోడ్చే నిస్వార్థజీవి,త్యాగధనుడు నాన్న అంటే!
నాన్న అంటే ఓర్పుకు మారుపేరు,నీతికి,న్యాయానికి నిదర్శనం,మన ఉజ్వల భవిష్యత్ కు మార్గ దర్శకుడు, ఓ చుక్కాని వంటి వారు.ఒక విధంగా చెప్పాలంటే మన ప్రగతికి సోపానం ' నాన్న '. బయటి ప్రపంచాన్ని పరిచయం చేసేది,నలుగురిలో ఎలా మెలగాలో నేర్పేది కేవలం ఒక్క నాన్న మాత్రమే.కన్న తల్లి లేకపోతే రోడ్డు మీద ఎవరినైనా అమ్మ అని పిలిచి బంధాన్ని కలుపుకుపోవొచ్చు.కానీ నాన్న అనే పిలుపు ఒక్కసారి దూరం అయితే గుండెలు పగిలేలా ఏడ్చిన దిక్కులు అదిరేలా పిలిచిన బదులు రాదు,ఎందుకంటే ఆ పిలుపు రక్తం పంచిన తండ్రికి మాత్రమే సొంతం. అంతేకాకుండా నాన్న అంటే ఓ మరచిపోలేని జ్ఞాపకం, ఎలాగంటే మన తప్పులను సరిచేస్తూ మనం చేసిన మంచి పనులను ఎప్పుడు మెచ్చుకుంటూ ప్రతి క్షణం మన ఎదుగుదలనే,అభివృద్ధినే ఆకాంక్షిస్తూ ఉంటాడు నాన్న.అదేమాదిరి మలి బడికి తొలిమెట్టు నాన్న,బయట ప్రపంచాన్ని చూపే దివ్యదృష్టి నాన్న. కొడుకు బైక్ కోసం తన సైకిల్ జీవితాన్ని పొడిగిస్తాడు నాన్న,కూతురు చలువటద్దాల కోసం పగిలిన అద్దాలలో నుంచే పైళ్ళు చూస్తారు నాన్న.అంతేకాదు మేఘంలా గర్జిస్తూ కరుకుగా కనపడతాడు నాన్న, తొలకరి జల్లు లాంటి ప్రేమను మదిలో దాచుకుంటాడు నాన్న.పండుగలకి,పుట్టినరోజులకి కొత్త బట్టలున్నాయంటాడు ' నాన్న ',కానీ తన పిల్లల సంబరాల అంబరంలో మాసికల చొక్కాను కప్పేసుకుంటాడు నాన్న.అదేమాదిరి తాను ముళ్లబాటలో నడిచిన పిల్లలకి పూలబాట అవుతాడు నాన్న,అహార్నిశలూ కుటుంబశ్రేయస్సుకే తన జీవితాన్ని అర్పిస్తాడు నాన్న.అందుకే మనమంతా నాన్నంటే నిస్వార్తానికి మారుపేరని నమ్ముతాము,నాన్నంటే విశ్వ రూపమని విశ్వానికి ఎలుగెత్తి చాటుతాము కూడా మనమంతా!
ఏదిఎమైన నాన్న ఒక శ్రమ,కష్టజీవి,ఓ శ్రామికుడు లాంటి వారు,తాను తిన్న తినకపోయినా పస్తులుండి మరీ తన బిడ్డల కడుపు నింపాలనుకునే ధన్యజీవి నాన్న.తాను పడ్డ కష్ట,నష్టాలు,తిన్న డక్కా మొక్కిలు, తాను ఎదుర్కొన్న ఎదురు దెబ్బలు,అవమానాలు, అవహేళనలు తన పిల్లలకు ఎదురుకాకుడదని తన పిల్లలను పువ్వుల్లో పెట్టుకొని మరీ పోషిస్తారు నాన్న. ఏమైనా తన జీవిత చదరంగంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా,కష్టాల కడలిలో తాను నిత్యం తేలియాడుతున్న,ఏటికి ఎదురీదూతున్న తన పిల్లలకు మాత్రం మంచి ఉన్నత చదువులు చెప్పించి వారిని ఈ సమాజంలో ఒక యోగ్యులుగా తయారుచేసేందుకు ఎల్లవేళలా కంకణబద్దులై,వారికి ఓ ఉజ్వల, మహోన్నత భవిష్యత్తును ప్రసాదించేందుకు తన శక్తివంచన లేకుండా నిత్యం ఆవిరళ కృషి సల్పుతూనే వుంటారు నాన్న.అలాంటి అపురూపమైన,కోహినూర్ వజ్రం కంటే విలువైన మన తండ్రి గారికి మున్ముందు ఎలాంటి ఆపదలు,కష్టాలు రాకుండా,వారి శేష జీవితం అత్యంత సుఖమయంగా సాగిపోయేలా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత ముమ్మాటికీ వారి పిల్లలదే.మనం మన తండ్రి కోసం ఎన్ని చేసిన వారి ఋణాన్ని మాత్రం ఎప్పటికి తీర్చుకోలేం అనే మాట అక్షర సత్యం.అలాంటి గొప్ప త్యాగధనుడు అయిన నాన్నకు ఈ ప్రత్యేక సందర్బంగా మనమంతా శిరస్సు వంచి శతకోటి వందనాలు తెలియజేద్దాం! జైహింద్! హమారా ##ఫాదర్స్ డే కొట్స్ హిందూస్తాన్ మహాన్!✍️✍️✍️
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా!
11 likes
6 shares