*బెంగళూరులో తయారై పాక్ లో దుమ్ములేపాయి.. ఈ డ్రోన్స్ గురించి తెలుసా?*
పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రమూకలను వణికించేసింది భారత సైన్యం. 25 నిమిషాల వ్యవధిలో 9 ఉగ్రస్థావరాలపై భారత త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో విరుచుకుపడ్డాయి. ఈ సమయంలో భారత్.. హ్యూమర్ బాంబులు, స్కాల్ప్ క్షిపణులతో పాటూ దేశీ సూసైడ్ డ్రోన్లను వాడినట్లు తెలుస్తోంది. వాటి ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం..!
ఇజ్రాయెల్ కు చెందిన ఎల్బిట్ సిస్టమ్స్ తో కలిసి బెంగళూరుకు చెందిన ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ (ఏడీటీఎల్) అభివృద్ధి చేసిన స్కైస్ట్రైకర్ "సూసైడ్ డ్రోన్లు".. ఆపరేషన్ సిందూర్ లో తొలిసారి తమ కార్యచరణను ప్రారంభించాయి! ఈ సమయంలో.. సక్సెస్ ఫుల్ గా లక్ష్యాలని చేదించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి!
2021లో ఈ డ్రోన్ లను భారత సైన్యంలోకి చేర్చారు. శత్రు లక్ష్యాలను గుర్తించి, దాడి చేయడానికి రూపొందించిన ఈ డ్రోన్ లు సుమారు 5 నుంచి 10 కిలోల మందుగుండు సామాగ్రిని మోసుకెళ్ల సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. ఇదే సమయంలో సుమారు 100 కిలోమీటర్ల పరిధిలో కదుపుతున్న లక్ష్యాలను చేధించడం వీటి ప్రత్యేకతగా చెబుతున్నారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోనే కాకుండా.. పాక్ లోని ఉగ్రస్థావరాలను గుర్తించి దాడి చేయడంలో ఈ సూసైడ్ డ్రోన్లు కీలక భూమిక పోషించినట్లు చెబుతున్నారు. కామికేజ్ డ్రోన్లు అని పిలవబడే ఈ ఆత్మాహుతి డ్రోన్లు కాస్త ఖర్చుతో కూడుకున్నవైనప్పటికీ.. దీర్ఘ శ్రేణి దాడులను చేయగలవని.. సెర్చ్ అండ్ అటాక్ కార్యక్రమాల్లో ఇవి కీరోల్ పోషిస్తయని అంటున్నారు.
#operationsindhoor
#drone #drone
#suicidedrone
#పహల్గాం ఉగ్రదాడి #🔥జమ్ము కాశ్మీర్ లో దాడులు #🧐ఈరోజు అప్డేట్స్ #pakistani drone carrying guns | పాకిస్థాన్ డ్రోన్ కు తుపాకులు అమర్చి భారత్ పైకి ..| nt18