Mohan
1K views • 15 days ago
#🗞️నవంబర్ 30th ముఖ్యాంశాలు💬 #🌍నా తెలంగాణ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #🏛️రాజకీయాలు అస్లీ విలన్ కాంగ్రెస్సే!.. తెలంగాణ కథానాయకుడు కేసీఆరే! తెలంగాణకు కథానాయకుడు కేసీఆర్ అయితే, ముమ్మాటికీ విలన్ కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఉవ్వెత్తున ఎగిసిపడ్డ మలిదశ తెలంగాణ పోరులో కేసీఆర్ దీక్ష ఒక చారిత్రాత్మక ఘట్టమని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ప్రస్థానంలో 2009, నవంబర్ 29 ఒక ఉజ్వల దృశ్యమని, తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన అద్వితీయ సందర్భమని, నాలుగు కోట్ల ప్రజల స్వరాష్ట్ర లక్ష్యం సాకారమయ్యేందుకు తొలి అడుగు పడిన రోజు అని అభివర్ణించారు
కేసీఆర్ అనే మూడు అక్షరాలు లేకుంటే ఇవ్వాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం లేదు
ప్రాణాలు పణంగాపెట్టి లక్ష్యాన్ని ముద్దాడిండు
దీక్షతో 4 కోట్ల ప్రజల గతిని మార్చిండు
కేసీఆర్ ఆమరణ దీక్ష చారిత్రక ఘట్టం
రాష్ట్ర చరిత్రను మలుపుతిప్పిన సుదినం
గులాముల ఎగుర్లాట ఇక కొంతకాలమే
వచ్చే కాలమంతా గులాబీ సేనలదే
కుంభకోణాల కుంభకర్ణుల భరతం పడుదాం
సింహాసనంపై మళ్లీ సింహాన్ని కూర్చోబెడుదాం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
తెలంగాణ భవన్లో అట్టహాసంగా దీక్షా దివస్
పెద్దసంఖ్యలో తరలివచ్చిన గులాబీ శ్రేణులు
కేసీఆర్ సచ్చుడో..తెలంగాణ వచ్చుడో..కేసీఆర్ శవయాత్రనా? తెలంగాణ జైత్రయాత్రనా? అని ఒక బక్క పలుచని వ్యక్తి ఇచ్చిన సమరనాదం యావత్ జాతిని ఏకం చేసింది. ఆ 11 రోజులు పోరాట సముద్రం పోటెత్తి సునామీని సృష్టించింది. అగ్నిపర్వతం బద్ధలైనట్టు.. భూకంపం వచ్చినట్టు, పెను తుఫాను తీరం దాటినట్టు.. తెలంగాణ ఉద్యమ శిఖరంపై శిగమూగింది. మడి దున్నే రైతు..బడికెళ్లే బాలుడు..కార్ఖానాలో కార్మికుడు.. కార్యాలయంలో ఉద్యోగి..నల్లకోటు లాయర్..తెల్లకోటు డాక్టర్..కలంపట్టిన జర్నలిస్టు.. ఎన్నారైలు బరిగీసి కొట్లాడిన అపురూప ఘట్టమది. తరం మారుతున్నది. స్వరం మారుతున్నది. 30 ఏండ్లకోసారి కొత్త జనరేషన్ వస్తున్నది..ఉడుకు నెత్తురుతో ఉరకలెత్తే యువతరం ముందుకొస్తుంటది. నవతరం ఏడు తరాల కథను తెలుసుకోవాలి..అప్పుడే మన కథ ఎటుపోతుందో అర్థమవుతది.
11 likes
5 shares