Failed to fetch language order
Failed to fetch language order
సాంబార్ పొడి
5 Posts • 625 views
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
949 views 3 months ago
😋😋😋సాంబారు పొడి😋😋😋 . సాంబారు రుచికరంగా తయారవ్వాలంటే మరుగుతున్న పులుసులో , సాంబారు పొడి కాని లేక సాంబారు ముద్ద కాని వేసుకోవాలి . దక్షిణాదిన తమిళనాడు వారే రక రకాల సాంబారులు ప్రతి రోజు పెట్టుకుంటారు . ప్రతిరోజు భోజనములో వారు సాంబారుతో పాటుగా రసము కూడా పెట్టుకుంటారు . దక్షిణాది వారు సాంబారులో అన్ని రకములైన కాయగూరలు మరియు ఎక్కువ మోతాదులో పప్పు వేసి బాగా చిక్కగా సాంబారు పెట్టుకుంటారు. ఉదయం ఇడ్లీ , వడలు మొదలైన టిఫిన్ల లో సాంబారు ఒక రకంగా , మధ్యాహ్నము భోజనము లోకి సాంబారు మరో రకంగా పెట్టుకుంటారు . మన ఆంధ్రాలో దొరికే సాంబారు పొడులు అంత రుచిగా ఉండవు . తమిళనాడులో అంబిక , శక్తి ఇంకా ఇతర కంపెనీ వారి సాంబారు పొడులు ప్రతి షాపులోను విరివిగా దొరుకుతాయి . వాటిలో With మసాలా , Without మసాలా అని కూడా ఉంటాయి . మసాలా అంటే దాల్చిన చెక్క మరియు లవంగాలు వాసన వేస్తూ పొడి చాలా ఘాటుగా ఉంటుంది . మసాలా వేయనిది అంటే పై వస్తువులు లవంగాలు మరియు దాల్చిన చెక్క వంటివి వేయకుండా చేసినది కూడా దొరుకుతుంది . మామూలుగా సాంబారు , మసాలా వేయనిదే రుచిగా ఉంటుంది . ఈ సాంబారు పొడి నెలకు సరిపడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు . సాంబారు పొడి . తయారీ విధానము . కావలసినవి. ఎండుమిరపకాయలు -- 20 చాయమినపప్పు -- 20 గ్రాములు పచ్చి శనగపప్పు -- 50 గ్రాములు. కందిపప్పు -- 25 గ్రాములు బియ్యము -- రెండు స్పూన్లు మెంతులు -- స్పూను జీలకర్ర -- స్పూను ఆవాలు -- అర స్పూను. ధనియాలు -- 50 గ్రాములు. మిరియాలు -- షుమారు 15 గ్రాములు ఇంగువ -- పొడి కాకుండా పలుకులు 5 గ్రాములు పసుపు -- ఒక స్పూను. తయారీ విధానము . ముందుగా చాయ మినపప్పు , పచ్చి శనగపప్పు , కందిపప్పు , బియ్యము , ధనియాలు నూనె అసలు వేయకుండా ఒక బాండిలో కమ్మని వాసన వచ్చేదాకా వేయించుకుని విడిగా వేరే పళ్ళెంలోకి తీసుకోవాలి .దానిపైన స్పూను పసుపు వేసుకోవాలి . ఆ తర్వాత తిరిగి బాండిలో నూనె లేకుండా ఎండుమిరపకాయలు , మెంతులు , జీలకర్ర , ఆవాలు , మిరియాలు మరియు ఇంగువ పలుకులు కూడా వేసి వేయించుకోవాలి . ముందుగా మిక్సీ లో మొదట వేయించుకున్న ధనియాలు , శనగపప్పు , కందిపప్పు , మినపప్పు తదితర మిశ్రమాన్ని వేసి మెత్తగా పొడి వేసుకుని ఒక బేసిన్ లో తీసుకోవాలి . తర్వాత రెండవసారి వేసుకున్న ఎండుమిరపకాయలు , జీలకర్ర , మెంతులు , ఇంగువ మిశ్రమాన్ని వేసుకొని మిక్సీ లో మెత్తగా వేసుకోవాలి. ఈ పొడిని ముందుగా తీసుకున్న బేసిన్ లోని పొడిలో వేసుకుని రెండూ చేతితో బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక సీసాలో పోసుకుని ఫ్రిజ్ లో పెట్టుకుని అవసరమైనప్పుడు మూడు స్పూన్లు చొప్పున సాంబారు లో వేసుకుని , తిరిగి సీసాను ఫ్రిజ్ లో పెట్టుకుంటే నాలుగు నెలలు పైన ఈ సాంబారు పొడి ఘుమ ఘుమ లాడుతూ సాంబారుకు మంచి రుచిని తెస్తుంది. #tasty food recipes 😋 #🥗tasty వంటకాలు #సాంబార్ పొడి #sambar powder #తెలుసుకుందాం
13 likes
12 shares