శ్రీ కావ్యం
#శ్రీ కావ్యం 💗హనుమంతుడి శరీరానికి సింధూరం ఉంటుందేం?*💗 ఒంటి మీద సింధూర వర్ణం లేని హనుమంతుని విగ్రహం అరుదు. ఇంతకీ ఆంజనేయుడు అలా సింధూరపు రంగులో ఎందుకు ఉంటాడు! అనే సందేహం వెనుక అందరికీ ఆదర్శవంతమైన ఓ కథ ఉంది. అదేమిటంటే... ఒక రోజు హనుమంతులవారు శ్రీరాముని అంతఃపురంలోకి ప్రవేశించారు. అలా ప్రవేశించే సమయంలో సీతమ్మ తన పాపిట సింధూరాన్ని అద్దుకోవడం గమనించాడు ఆంజనేయుడు. సీతమ్మవారు అలా పాపిట సింధూరాన్ని అలముకోవడం చూసి ఆయనకి భలే ఆశ్చర్యం వేసింది. సీతమ్మ చెంతకి అడుగులో అడుగు వేసుకుంటూ ‘అమ్మా! మీరు నుదుటిన ఆ సింధూరాన్ని ఎందుకు ధరిస్తున్నారు’ అని అడిగాడు. ‘హనుమా! నా స్వామికి సంతోషాన్ని కలిగించేందుకు ఇలా రోజూ సింధూరాన్ని ధరిస్తాను. పైగా ఇలా పాపిట సింధూరాన్ని ధరించడం వల్ల ఆయన దీర్ఘాయుష్షులుగా ఉంటారన్నది నా నమ్మకం!’ అంటూ చిరునవ్వుతో సెలవిచ్చింది జానకి. సీతమ్మ మాటలు విన్న హనుమంతుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. సీతమ్మ పాపిట సింధూరం వెనుక తన స్వామి శ్రేయస్సు, సంతోషం ఉన్నాయా? అనుకుని మురిసిపోయాడు. వెంటనే ఆయన మనసులో ఒక ఉపాయం మెదిలింది. ఈ కాస్త సింధూరాన్ని ధరిస్తేనే స్వామివారి ఆయుష్షు పెరుగుతుందంటే... మరి ఒంటినిండా సింధూరాన్ని ధరిస్తే తిరుగేముంది అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం, తన ఒంటినిండా నూనె కలిపిన సింధూరాన్ని దట్టించాడు. శిరసు నుంచి పాదాల దాకా సింధూర వర్ణంలో మెరిసిపోతున్న ఆంజనేయుడు... నేరుగా రాముని దర్బారులో ప్రవేశించాడు. ఆ స్థితిలో హనుమంతుని చూసిన రాముడు ఆశ్చర్యానికి అవధులు లేకపోయాయి. ‘ఏమిటి హనుమా! ఒంటి నిండా ఏమిటా రంగు’ అని చిరునవ్వుతో అడిగాడు. ‘స్వామీ! సీతమ్మ తన పాపిట సింధూరం ధరిస్తే మీకు సంతోషమూ, ఆయుష్షూ వృద్ధి చెందుతాయని సెలవిచ్చారు... మరి నేను ఒంటి నిండా సింధూరాన్ని అలముకుంటే మరెంత శ్రేయస్సు కలుగుతుందో కదా! అందుకనే ఇలా...’ అంటూ చెప్పుకొచ్చాడు. మనుమంతుని మనసులో తన పట్ల ఉన్న ఆరాధనని గమనించిన రాముని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ‘హనుమా! నువ్వు నా భక్తులందరికీ మరోసారి ఆదర్శంగా నిలిచావు. ఇక మీదట ఎవరైతే నీ సింధూరాన్ని ధరిస్తారో... వాళ్లు నీ అనుగ్రహానికే కాదు, నా అనుగ్రహానికి కూడా పాత్రులవుతారు’ అంటూ ఆశీర్వదించారు. అదిగో అప్పటి నుంచీ హనుమంతుల వారు నిత్యం సింధూరవర్ణంలో మెరిసిపోవడం, ఆయన సింధూరాన్ని మనమూ కాస్త నుదుటిన అద్దుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆయన అనుగ్రహమూ భక్తులకు లభిస్తోంది 💗శ్రీ....💗
#

శ్రీ కావ్యం

శ్రీ కావ్యం - ShareChat
275 వీక్షించారు
5 నెలల క్రితం
💟ఓయి కృష్ణయ్య 💟: ఓ నా.... ప్రియమైన.... అల్లరి ...కన్నయ్యా!!! నీ.. జ్ఞాపకాల ...తాకిడిలో ఈ...విరహ ...వేదనలో!!! నా ...గుండె ....ఉక్కిరి ....బిక్కిరి అవుతున్నది!!!! ఏ... క్షణంలోనైనా.... ఈ అక్షరాలు... నా ...కన్నీటి.... వానలో ...కొట్టుకుపోవచ్చు!!!! నీ... రాక.. క్షణం ...ఆలస్యమైనా ....!!! ఈ.... గుండె.... కదలికై ఆగిపోవచ్చు!!!! ఇక ...నీ కైలా... తెలుస్తుంది... నా బాధ...!!! నీ... ప్రేమ... పొందాలని... నేను పడే.. ఆరాటం నీన్ను.... చేరూకోవల్లన్న... తపన... నీ తో.... కలిసి.... జీవితం... పంచు కోవాలని... ఎదురు... చూసే... ఆ క్షణాలు... వర్ణించలేని ...ఆనంద ....భరితం!!!! ఓ యి ...మరి ..... నీతో కలసి....మధుర క్షణాలను...!!!! ఆస్వాదించే.... రోజు కోసం... నీకై నా నిరీక్షణ....!!!! మరి ...ఇక ఎప్పటికి.... పూర్తవుతుందో ....మరి ప్రియతమా!!!! నా.... చివరి.... క్షణం... వర కు.... నీకై ఎదురు చూపులు... ఆరాటం ... మీ క్షేమసమాచార సందేశం కోసం.....!!!! ప్రియత్రమా.... నీవచట కుశలమా!!!! నేను.... ఈచట... ఏమాత్రం ...క్షేమముగా లేనని నీకు... ఎలా.... తెలుపగలను....!!!! అమావాస్య..... చీకటి నేనైతే ....పున్నమి.... వెలుగు నీ ప్రేమ!!!! మండే.... ధరణి ....నేనైతే... కురిసే... చిరుజల్లు .... నీ ప్రేమ!!!! ఆకర్షించే.... పువ్వు నేనయితే.... నాకు,.. రక్షణ కల్పించే....తోటమాలి .... నీ ప్రేమ!!!! ప్రశాంతమైన..... నిద్ర నేనయితే.... మధురమైన... కల... నీ ప్రేమ!!!! చిగురులు .....తొడిగే ....వసంతం నేనైతే.... ఆ వసంతానికి... వెలికితెచ్చి... కోయిల గానం .... నీ ప్రేమ!!! 💟శ్రీ💟
#

శ్రీ కావ్యం

శ్రీ కావ్యం - ShareChat
327 వీక్షించారు
6 నెలల క్రితం
❣️చాలా ముందుకు అడుగు వేస్తునాము ❣️:. గతంలో సంసారం చీకట్లోనే జరిగేది జీవితాలు వెలుగులో ఉండేవి నేడు సంసారం వెలుగులోకి వచ్చి జీవితాలు చీకట్లొ మగ్గుతున్నాయి కప్పుకోవాల్సిన వాటిని చూపిస్తూ, చూపించాల్సిన అందమైన ముఖాన్ని కప్పేస్తున్నారు నాడు కొందరికే మందు, విందు అలవాటు నేడు కొందరే వీటికి దూరం నాడు కష్టమొస్తే కుటుంబంలోని పెద్దలు ధైర్యం చెప్పేవారు నేడు కొన్ని కుటుంబాలలో కలహాలకు పెద్దలే కారణమౌతున్నారు నాడు తినడానికి శ్రమించి సంపాదించే వాళ్ళం నేడు కదలకుండా కూర్చోని సంపాదిస్తూ తిన్నది అరగడానికి వాకింగులతో శ్రమిస్తున్నాం నాడు పండ్లు పాలు తిని బలంగా బోలెడు మంది సంతానాన్ని కని పోషించాము ఇప్పుడు సంసారం చేయడానికే మందులు మింగుతున్నారు ఇంక పిల్లలెక్కడ, అందుకేగా అన్ని చోట్లా సంతాన సాఫల్య కేంద్రాలు గతంలో అందరూ హార్డువేరు ఇంజనీర్లే మనసు మాత్రం సాప్టు ఇప్పుడు అంతా సాప్టువేర్ ఇంజనీర్లే మనసు మాత్రం హార్డు అప్పుడు వైద్యుడు ఇల్లుల్లు తిరిగి వైద్యం చేసేవాడు,అమృతాంజనానికే జబ్బులు తగ్గేవి ఇప్పుడు తలకాయ నొప్పికే ఇళ్ళమ్ముకునేంత ఖర్చు ఔతోంది నాడు దొంగలు " నట్టింట్లొ" పడి దోచుకెళ్ళేవారు నేడు దొంగలు దొరల్లాగా " నెట్ ఇంట్లొ" దోచేస్తున్నారు ఒకప్పుడు చదువులేనోడు దొంగగా మారేవాడు గతిలేక ఇప్పుడు దొంగతనాలు చేయడానికే కొత్తకోర్సులు చదువుతున్నారు సైబరు నేరగాళ్ళు అప్పుడు అప్పుచేయాలంటే తప్పు చేసినట్లు భాదపడే వాళ్ళం ఇప్పుడు క్రెడిటు కార్డు మీద అప్పుతో కొనుక్కొవడమే క్రెడిటుగా పీలౌతున్నాం ఒకప్పుడు పాలు,పెరుగు అమ్మి సొమ్ముచేయలేక తాగేవాళ్ళం ఇప్పుడు రెడీ మేడు చపాతీలు,పొంగలి దాంట్లొ కూరతో సహా కొనుక్కొచ్చుకొని తింటున్నాం చైనా నుండి ఒకనాడు పింగాణీ వస్తువులొచ్చేవి నేడు తినే కంచం నుంచి దాంట్లొకి ప్లాస్టిక్ బియ్యంతో సహా అక్కడి నుంచే ఇది మనం సాదించిన పురోగతా లేక మనకు మనం తెచ్చుకున్న అధోగతా...? 💜❣️శ్రీ❣️💜
#

శ్రీ కావ్యం

శ్రీ కావ్యం - ShareChat
284 వీక్షించారు
7 నెలల క్రితం
❣️నా పరిణయం❣️: తన పేరేంటో, తన ఊరేంటో..., తన అమ్మా నాన్నా ముద్దుగా పిలిచే పిలుపేంటో..., తన రూపేంటో, తన రంగేంటో..., తన పెదవులపై చిగురించే తియ్యని పలుకేంటో..., ఏంటో అని ఆలోచిస్తే కనులకు కునుకే రానేరాదు...!! ఏంటో అని ఆలోచిస్తే ఆకలి దప్పిక లేనేలేదు...!! ఏంటో అని ఆలోచిస్తే చేసే పనిపై ధ్యాసే లేదు...!! ఏంటో అని అలోచిస్తే గడియారంపై ఊసే లేదు...!! ఈ గోలేంటో, ఈ గోడవేంటో...?? తన మాయేంటో, తన మహిమేంటో...?? " తన పేరేంటో " ఏంటో ప్రతిరోజూ కలలో తనకై ఆరా తీస్తున్నా..., ఏంటో మరి పగలంతా తన ఊహల్లో గడిపేస్తున్నా..., ఏంటో నేనెరుగని తనకై ప్రతి నిమిషం పడి చస్తున్నా..., ఏంటో తన ఉహాచిత్రం నా గుండెలపై గీస్తున్నా..., ఏంటో రెక్కలు లేకున్నా ఆకాశంలో ఎగిరేస్తున్నా..., ఏంటో పక్కన లేకున్నా నిను చూస్తూనే నడిచేస్తున్నా..., ఏంటో ఏ పుస్తకమైనా తలకిందులుగా చదివేస్తున్నా..., ఏంటో నిలువద్దంలో నను నేనె కొత్తగ చూస్తూ ఉన్నా... ఈ తలపేంటో ఈ తపనేంటో తన పరిచయమెపుడో మా పరిణయమెపుడో...??? ❣️శ్రీ❣️
#

శ్రీ కావ్యం

శ్రీ కావ్యం - Soron obed - ShareChat
231 వీక్షించారు
7 నెలల క్రితం
ఉగాదిని ఎలా జరుపుకోవాలి.. ఉగాది విశిష్టత ఉగాది విశిష్టత ఏమిటి, ఎలా చేసుకోవాలి, ఆరోజు చేయాల్సిన దైనందిన కార్యక్రమాల గురించి శాస్త్రం ఏం చెబుతుంది అనే విషయాలు సంక్షిప్తంగా… పర్వదినాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన పండుగ ఉగాది. యుగానికి ఆది యుగాది.. కాలక్రమేణ ఉగాదిగా మారింది. సంస్కృతంలో యుగాది అనే మాటకు కృత, త్రేత, ద్వాపర,కలియుగాల్లో ఏదో ఒకదానికి ఆది లేక ప్రారంభం అని అర్థం. తెలుగులో ఉగాదిని సంవత్సరాది అంటే కొత్త ఏడాది ప్రారంభంగా వాడుతున్నాం. చైత్ర శుద్ధ పాడ్యమిని ఉగాదిగా జరుపుకొంటాం. పురాణాల్లో ఉగాది బ్రహ్మపురాణం, నారద పురాణం, మత్స్య పురాణాల్లో ఉగాది గురించి ఉంది. ఇక రామాయణంలో రావణ సంహారం తర్వాత చైత్రశుద్ధ పాడ్యమి రోజున రాముడు అయోధ్యకు బయలుదేరుతాడు. తర్వాత వసుచరిత్రలో, విక్రమార్క పట్టాభిషేకం పలు సందర్భాలు ఉగాది గురించి తెలియజేస్తున్నాయి. ఉగాదిని ఎలా జరుపుకోవాలి: అభ్యంగన స్నానం ధర్మసింధువు, నిర్ణయ సింధువు అనే ధర్మశాస్త్ర గ్రంథాలు ఉగాది నాడు చేయాల్సిన విధులను పేర్కొన్నాయి. వాటి ప్రకారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటుకొని అభ్యంగన స్నానాన్ని చేయాలి. దీని వల్లన లక్ష్మీ, గంగల అనుగ్రహం కలుగుతుంది. సైన్స్ పరంగా శారీరక పుష్టి కలుగుతుంది. అభ్యగంగన స్నానం అంటే శరీరమంతా నూనెను పట్టించి కొంతసేపు ఆగి నలుగు పిండితో స్నానం చేయాలి. గృహాలంకరణ ఉగాదినాడు రంగవల్లులతో, పుష్పతోరణాలు, మామిడిఆకుల తోరణాలతో ఇంటిని అలంకరించుకోవాలి. దేవుని గదిలో ప్రత్యేక మంటపాన్ని వేసి దాన్ని అలంకరించి కొత్త పంచాంగాన్ని ఉంచాలి. ఉగాది పచ్చడి అన్ని పండుగల్లోకి ప్రత్యేకమైనది ఉగాది. ఈ రోజు చేసే పచ్చడి చాలా ప్రత్యేకత, విశేషత కలిగినది. ఏడాదిలో అన్ని రకాల రుచులను ఆస్వాదించాలనే తత్త బోధచేసే ఈ పచ్చడిని తప్పక ప్రతి ఒక్కరు స్వీకరించాలి. వేపపువ్వు, కొత్త చింతపండు, బెల్లం, మామిడికాయ ముక్కలు, ఉప్పు, శనగపప్పు సాధారణంగా వాడుతారు. మరికొన్ని ప్రాంతాల్లో జీలకర్ర, చెరుకు ముక్కలు, కొంచెం కారం, నేయి వంటివి కూడా వాడుతారు. మొత్తం మీద షడ్రుచుల సమ్మితంగా దీన్ని తయారుచేస్తారు. దీన్ని కొత్త కుండలో/గిన్నెలో తయారుచేసి పంచాంగ పూజ చేసిన తర్వాత నైవేద్యం పెట్టి తీర్థ ప్రసాదాలను, ఉగాది పచ్చడిని స్వీకరిస్తారు. పంచాంగ శ్రవణం అవకాశాన్ని బట్టి దగ్గర్లోని దేవాలయం లేదా పంచాంగ శ్రవణం జరిగే ప్రాంతానికి వెళ్లాలి. దీనిద్వారా నూతన సంవత్సర గోచార ఫలాలు, కందాయ ఫలాలు, ఆదాయ వ్యయాలు, శీతోష్ణస్థితులు, పంటలు, నవనాయకుల ఫలాలను తెలుసుకోవచ్చు. ఉగాది నాడు ఏ పూజలు చేస్తారు ఉగాదినాడు ఇంద్రధ్వజ పూజ, బ్రహ్మధ్వజ పూజ, ఛత్రచామరాది స్వీకారం, రాజదర్శనం, వసంత నవరాత్రుల ప్రారంభం అవుతాయి. ఇంకా పలు ప్రాంతాల్లో పలు రకాలుగా ప్రాంతీయ ఆచారాలను పాటిస్తారు. కొత్త దస్త్రం సంవత్సరాదినాడు వర్తకులు కొత్త దస్ర్తాలను అంటే ఖాతా పుస్తకాలను ప్రారంభించడం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. పండితులు వేద, శాస్త్ర పూజ గ్రంథాలను పూజిస్తారు. అందరూ ఆనందంగా ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఆరాధించి ఉగాదిని సంబురంగా జరుపుకోండి. కొత్త కొత్త ఆలోచనలతో ఉగాది నుంచి పరోపకారం, లోకకళ్యాణం, కుటుంబ ధర్మాన్ని ధర్మబద్ధంగా ఆచరించి సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు వర్థిలాలని ఆ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తూ.. మంగళం మహత్!
#

శ్రీ కావ్యం

శ్రీ కావ్యం - ShareChat
288 వీక్షించారు
7 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post