🌅శుభోదయం

🌅శుభోదయం

#

🌅శుభోదయం

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 ✍✍ *నా మాట*✍✍ 💐💐💐💐💐💐💐💐💐 *బంధాలు.. బంధుత్వాలు..!!* 💑💑💑💑💑💑💑💑💑 కొన్ని సంబంధాలు.. అద్దె ఇల్లు లాంటివి. వాటితో ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా.. ఎప్పటికి వాళ్ళు మన వాళ్ళు కాలేరు..!! ఇంకొన్ని బంధాలు... సముద్ర కెరటాలు లాంటివి. వాటితో ఎంత అరుచుకున్నా, వాటితో ఎంత పొట్లాడుకున్నా.. వారు విడిచిపోరు,పోలేరు. వారు ఎప్పటికి పరాయి వారు కాలేరు..!! మరికొన్ని బంధుత్వాలు... మన వెంట నడిచే నీడ లాంటివి. మనం సంతోషాలు, వేడుకల్లో వెంటే ఉంటారు,మనం కాస్త కష్టం అనే చీకటిలో ఉంటే..మనతో రారు,ఉండరు..!! ఇంకొన్ని బంధుత్వాలు... కడలి లాంటివి.. కనిపించడానికి కనుచూపు మేర ఉంటాయి. కానీ కష్టంలో కాస్త కూడా కన్నీరు కార్చవు.ఎప్పటికి వాళ్ళు మారారు,మన వారు కారు..!! మరికొన్ని సంబంధాలు... జాబిల్లి వెన్నెల లాంటివి. మనం ఉంటే మనతో ఉంటాయి. మనల్ని విడిచి పోలేవు.ఉండలేవు. వారే మనవారు..!! 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 🙏🙏 శుభోదయం 🙏🙏 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 🍋🍋మీ..ఎస్.పి.బాష🍋🍋 ⛱⛱⛱⛱⛱⛱⛱⛱⛱
152 views
8 hours ago
#

🌅శుభోదయం

*తెలుగువాణ్ణి తిండిలో కొట్టగలరా ?* మినపట్టు పెసరట్టు రవ్వట్టు పేపర్ దోసె మసాల దోసె ఉల్లి దోసె కొబ్బరి అట్టు గోధుమ అట్టు అటుకుల అట్టు సగ్గుబియ్యం అట్టు బియ్యపు పిండి అట్లు పుల్లట్టు ఊతప్పం పులి బొంగరం ఉప్మా అట్టు రాగి దోసె చీజ్ పాలక్ దోసె ఇడ్లీ మసాల ఇడ్లీ రవ్వ ఇడ్లీ ఆవిరి కుడుము సాంబారు ఇడ్లి బొంబాయి రవ్వ ఉప్మా గోధుమ రవ్వ ఉప్మా సేమ్యా ఉప్మా టమోటా బాత్ ఇడ్లీ ఉప్మా బియ్యపు రవ్వ ఉప్మా నూకలుప్మా మరమరాల ఉప్మా కొబ్బరి ఉప్మా ఉప్పిడి పిండి పూరి చపాతి వడ సాంబారు వడ పప్పు పొంగలి కంచి పులిహోర నిమ్మ పులిహోర కొబ్బరి అన్నం పుదీనా పులావ్ బిర్యాని దధ్యోదనం చక్రపొంగలి కట్టుపొంగలి వెజ్ ఫ్రైడ్ రైస్ జీరా రైస్ పులగం ఉల్లిపాయ చట్నీ ఎండుమిరపకాయ చట్నీ కొబ్బరి చట్నీ మినప చట్నీ వేరుశనగపప్పు చట్నీ శనగపప్పు చట్నీ శనగపిండి చట్నీ (బొంబాయిచట్నీ) శనగపప్పు పొడి ధనియాల పొడి కొబ్బరి పొడి వెల్లుల్లిపాయ కారప్పొడి కరివేపాకు పొడి కందిపొడి మునగాకు చట్నీ గుమ్మడి చట్నీ అటుకుల పులిహార చింతపండు పులిహార నిమ్మకాయ పులిహార మామిడికాయ పులిహార రవ్వ పులిహార సేమ్యా పులిహార ఆలు పరోట చపాతి పరోట పుల్కా పూరి రుమాల్ రోటీ కాలీఫ్లవర్ పరోటాలు పాలక్ పన్నీర్ కొత్తరకం పూరీలు ముద్దపప్పు దోసకాయ పప్పు బీరకాయ పప్పు టమోటా పప్పు మామిడి కాయ పప్పు తోటకూర పప్పు గుమ్మడి పప్పు చింత చిగురు పప్పు కంది పచ్చడి కొబ్బరి పచ్చడి క్యాబేజి పచ్చడి క్యారెట్ పచ్చడి దొండకాయ పచ్చడి దోసకాయ పచ్చడి బీరకాయ తొక్కు పచ్చడి బెండకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి వంకాయ పచ్చడి వెలక్కాయ పచ్చడి టమోటా పచ్చడి మెంతికూర పచ్చడి పొట్లకాయ పెరుగు పచ్చడి బీరకాయ పచ్చడి సాంబారు సాంబారు పొడి పులుసు (తీపి) పొట్ల కాయ పులుసు సొరకాయ పులుసు మజ్జిగ పులుసు పప్పు పులుసు ఉల్లిపాయ పకోడి క్యాబేజి పకోడి గోధుమ పిండి పకోడి పాలక్ - పకోడి (పాలకూర పకోడి) బియ్యపు పిండి పకోడి మసాల పకోడి మెత్తటి పకోడి బ్రెడ్ పకోడి పల్లీ పకోడీలు సేమ్యా పకోడి కాలీఫ్లవర్‌ పకోడి ఆలూ పకోడి ఖాండ్వీ అటుకుల పోణీ అప్పడం బజ్జి అరిటికాయ బజ్జి ఉల్లిపాయ బజ్జి టమటా బజ్జి బంగాళదుంప బజ్జి బీరకాయ బజ్జి బ్రెడ్ బజ్జి మిరపకాయ బజ్జి వంకాయ బజ్జి క్యాప్సికమ్ బజ్జి కొర్ర బజ్జీ గుమ్మడికాయ బజ్జీలు దోసకాయ బజ్జి గుంట పునుగులు పునుగులు మైసూర్ బోండ సాగో బోండాస్ (సగ్గుబియ్యం పునుగులు) మసాల గారె నేతి గారె పప్పు వడ మసాల వడ వెజిటబుల్ వడ పెసర గారెలు మినపచెక్క వడలు సగ్గుబియ్యం బోండా బఠాణీ బోండా పచ్చి బఠానీ బోండాలు మామిడి అల్లం పచ్చడి(అల్లంపచ్చడి) ఉసిరి ఆవకాయ ఉసిరికాయ పచ్చడి కాకరకాయ పచ్చడి కొత్తిమీర పచ్చడి గోంగూర పచ్చడి చింతకాయ పచ్చడి టమోటా పచ్చడి దబ్బకాయ ఊరగాయ పండు మిరపకాయల పచ్చడి మామిడికాయ ఆవకాయ మామిడికాయ తురుంపచ్చడి మామిడికాయ (మాగాయ) ముక్కల పచ్చడి మునక్కాయ ఆవకాయ పెసర ఆవకాయ కాలీఫ్లవర్ పచ్చడి చిలగడదుంపల పచ్చడి క్యాబేజీ ఊరగాయ వంకాయ పచ్చడి నిమ్మకాయ ఊరగాయ వెల్లుల్లి పచ్చడి కాజాలు బూంది చక్రాలు కారప్పూస చెగోడి చెక్కలు తపాళ చెక్కలు పెసర చెక్కలు చెక్క పకోడి పెరుగు చక్రాలు సగ్గుబియ్యం చక్రాలు శనగపప్పు చక్రాలు వాంపూస గవ్వలు ఆలూ చిప్స్ బనానా చిప్స్ మసాల బీన్స్ కారం చెక్కలు అలూతో చక్రాలు కొబ్బరి చెక్కలు జొన్న మురుకులు మైదా కారా (మైదాచిప్స్) వెన్న ఉండలు పన్నీర్ చట్ పట్ సోయా సమోస, సమోస చిలకడ దుంప చిప్స్ కాకరకాయ చిప్స్ జంతికలు గుమ్మడి వరుగు (చిప్స్) అరిసెలు బూరెలు కొబ్బరి బూరెలు పచ్చి బూరెలు తైదు బూరెలు మైదాపిండితో పాల బూరెలు సజ్జ బూరెలు గోధుమ బూరెలు చలిమిడి కొబ్బరి పూర్ణాలు గోధుమ పిండితో పూర్ణాలు పూతరేకులు జొన్న బూరెలు బూంది లడ్డు రవ్వ లడ్డు తొక్కుడు లడ్డు మినప ముద్దలు సున్నుండలు బాదుషా మడత కాజా తీపి కాజాలు మైసుర్ పాకు జాంగ్రి పూస మిఠాయి కోవా కజ్జి కాయలు తీపి గవ్వలు జీడిపప్పు పాకం శనగపప్పు పాకం వేరుశనగపప్పు ముద్దలు మరమరాల ముద్దలు డ్రైఫ్రూట్స్ హల్వా నువ్వుల లడ్డు (చిమ్మిరిముద్ద) కోవా కజ్జికాయ మిల్క్ మైసూర్‌ పాక్ కాజు క్యారెట్ బటర్ బర్ఫీ కిస్‌మిస్ కలాకండ్ బూంది మిఠాయి పాపిడి చాంద్ బిస్కట్స్ ఖర్జూరం స్వీట్ సేమ్యాతో అరిసెలు కొబ్బరి ఖర్జూరం బాదంపాకము బాంబే హల్వా వీటిల్లో మీకు ఇష్టమైనది చేసుకొని తినండి. చేయించుకొని తినండి. చేసుకున్నవాళ్ళింటికెళ్ళి కూర్చోండి. వాళ్ళు పెడితే తినండి. లేకపోతే అడగండి. హోటల్లో కొనుక్కొని తినండి. అంతే గానీ తినడం మాత్రం మానకండి. 🙏🙏🙏💐💐💐🙏🙏🙏
533 views
3 days ago
#

🌅శుభోదయం

పల్లె అంటే ఆరాధన.. ఎందుకో తెలియదు.. ఊర్లోకి అడుగు పెట్టగానే పరిచయం లేనివారైనా వారు పిలిచే ఆత్మీయ ఆప్యాయ పలకరింపులతోనే సగం కడుపు నిండిపోవడం ఖాయం. కాళ్ళు కడుక్కోవడానికి చెంబుడు నీళ్లతో సిద్ధంగా ఉండే చుట్టబంధువులు..తుడుచుకోవడానికి ఇచ్చే కండువాతో..ముఖం మీద విరబూసే ఆనందాల చిరునవ్వులతో ఆహ్వానం పలుకుతూ ఉంటారు. సమయమేదైనాగానీ పిండివంటలు భోజనంలా పెట్టడం తెలిసిన అమాయకత్వం.. వేడివేడిగా స్వచ్చమైన గేదెపాలతో కాచిన తేనీరు ఇవ్వడమే అక్కడి మర్యాద. గ్యాస్ స్టవ్ ఉన్నప్పటికీ కట్టెలపొయ్యమీదనే వంటలు చేసి పెట్టడం ఇక్కడి సంస్కృతి. ఆ పొగచూరిన వంటలే అమృతం అమోఘం. మిక్సీలు గ్రైండర్లూ ఉన్నప్పటికీ సహజసిద్ధమైన రోట్లోనే రుబ్బే పిండితో టిఫెన్స్..రోటి పచ్చళ్ళైతే అద్భుతం.. ఆరుబయటి స్నానాలు(మగవారు సుమా)..చెరువుకట్టమీదకు కాలకృత్యాలూ..ఇంటిముందరి కట్టుగొయ్యలకు కట్టేసిన గేదెలూ లేగదూడలూ.. పేడవాసనల వాకిలి.. గడ్డిమోపులకై ఓ రబ్బరు ట్యూబులకట్ల సైకిలూ.. ఏ పిలుపైనా నిర్మొహమాటంగా వరసలుపెట్టి పిలుస్తూ పలకరించే ముసలవ్వలూ తాతయ్యలూ... ఎంతో ధైర్యంగా తిరుగాడే చిన్నపిల్లలూ.. ఏ వీధి చూసినా గేదెలూ మేకలూ గొర్రెలూ ఆవులూ తిరుగాడుతూ అవి వదిలే విసర్జితాలతో కలగలిసిన మట్టి సువాసలూ... అందరూ కలిసి కూర్చుని చేసే భోజనాలూ.. ఎవరైనా అలిగితే బుజ్జగించే ఇంటిల్లిపాది కుటుంబసభ్యులూ.. ఎటుచూసినా ఎలా చూసినా మచ్చుకైనా కానరాని నగరవాతావరణం..నగర సంప్రదాయం..కనిపించేదల్లా స్వచ్చతే...మురికిమాటున దాగిన మమతలే.. ఉమ్మడిగా కూర్చుని కబుర్లాడుకునే జనాలూ.. వేడివేడి రాజకీయ ముచ్చట్లూ... పొద్దుకూకగానే కీసుకీసుమంటూ కీచురాళ్ళ శబ్ధాలతో ఏడింటికే నిద్రపోయే పల్లెవాసులూ... ఆరోగ్యంగా జీవించడానికి ఇంతకన్నా ఏంకావాలీ... ఏనాటికైనా పల్లెలే పట్టుకొమ్మలు అనే నానుడి నిజం అవుతుందనే నా గట్టినమ్మకం.. పల్లెవాసమే పరమావధి..అంతిమ గమ్యం..కావాలి ప్రతిఒకరికీ...చేద్దామా ఆ ప్రయత్నం..
220 views
6 days ago
#

🌅శుభోదయం

రామాపురంలో రాజారావు అనే వ్యాపారి ఉన్నాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలను అప్పగించాలని వారికో పరీక్ష పెట్టి, ఆ పరీక్షలో ఎవరు నెగ్గితే వారికి తన వ్యాపార బాధ్యతలు అప్పగించుటకు నిర్ణయించుకున్నాడు. తన ఇద్దరు కొడుకులను పిలిచి ఇద్దరికీ కొంత డబ్బు ఇచ్చి "ఈ డబ్బుతో ఇంటిని పూర్తిగా నింపగల వస్తువేదైనా కొనండి" అని వారితో చెప్పాడు. పెద్ద కొడుకు డబ్బు తీసుకొని ఉన్న పళంగా మార్కెట్టు వైపు వేగంగా వెళ్లి, మార్కెట్టులో ఉన్న వస్తువులలో గడ్డి చాలా చౌకైన వస్తువని అతడు తెలుసుకున్నాడు. తండ్రి ఇచ్చిన మొత్తం డబ్బుతో గడ్డి కొన్నాడు. అయినా ఆ మొత్తం ఇంటిని నింపడానికి ఆ గడ్డి సరిపోలేదు. రెండవ కొడుకు తన తండ్రి అప్పజెప్పిన పని ఎంతో తెలివి తేటలతో పూర్తి చేయాలి అని అనుకుని దాన్ని గురించి బాగా ఆలోచించి, తండ్రి ఇచ్చిన డబ్బులో ఒక్క రూపాయితో క్రొవ్వొత్తిని కొని ఇంటికి వచ్చి, గదిలో క్రొవ్వొత్తిని వెలిగించాడు. చూస్తుండగానే ఆ క్రొవ్వొత్తి ఇంటి మొత్తాన్ని వెలుగుతో నింపేసింది. రాజారావు తన చిన్న కొడుకు తెలివితేటలకు సంతృప్తి చెంది చిన్న కొడుకుకు వ్యాపార బాధ్యతలు అప్పగించి అతనికి తోడుగా సహాయ సహకారాలు అందించమని పెద్దకొడుకుకి చెప్పాడు. అందుకు కొడుకులిద్దరూ సంతోషించారు.
395 views
7 days ago
#

🌅శుభోదయం

ప్రస్తుతం మొత్తం ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధన నడుస్తుంది. తల్లితండ్రులకు మన ఇంటిలో ఉండే ప్రతి వస్తువుల పేర్లు ఇంగ్లీషులో తెలిసి ఉండాలి. అందుకే ఈ క్రింద ఇచ్చిన పదాలు తెలుసుకుంటే పిల్లలకు వస్తువుల పేర్లను ఇంగ్లీష్ లో చెప్పవచ్చు. *Names of Spices :* 1. cumin seeds - జీలకర్ర 2. Turmeric - పసుపు 3. Cinnamon - దాల్చిన 4. Coriander leaves - కొత్తిమీర 5. Clove - లవంగం 6. Black Mustard seeds - ఆవాలు 7. Blackpepper - మిరియాలు 8. Bayleaves --. బిరియానీ ఆకు 9. Cardamom --. యాలకులు 10.Fenugreek --. మెంతులు 11.Asafoetida --. ఇంగువ 12.Fennel seeds --.సోపు గింజలు 13.Curry leaves ---. కరివేపాకు 14.Poppy seeds ---. గసగసాల 15.Sesame seeds - నువ్వులు 16.Watermelon -- పుచ్చకాయ 17. Dry mango powder - మామిడి పొడి 18.Carom seeds -- వాము 19.Garlic --. వెల్లుల్లి 20. Nutmeg -- జాజికాయ 21.Camphor --కర్పూరం 22.Saffron --. కుంకుమపువ్వ 23.Mace --. జాపత్రి 24.Wailong -- మరాఠిమొగ్గ 25.Basil -- తులసి 26.Sandal -- చందనం 27.Soap nuts - కుంకుడు 28.Betal nuts - వక్కలు 29.Dried ginger - శొంఠి 30.Sago --. సగ్గు బియ్యం 31.Jaggery -- బెల్లం 32.Mint ---. పుదీన 33.Coriander Seeds -- ధనియాలు 34.Almond -- బాదం 35.Cashew --. జీడిపప్పు. *Names of Vegetable* 1. Sweet potato - చిలకడదుంప 2. Onions - ఉల్లి పాయలు 3. Yam --. కంద గడ్డ 4. Brinjal --. వంకాయ 5. Cucumber - దోసకాయ 6. Drumstick - మునగకాయ 7. Pumpkin/Squash - గుమ్మడికాయ 8. Mustard greens --. ఆవ ఆకులు 9. Peppermint leaves- మిరియాల ఆకులు 10.BitterGourd - కాకరకాయ 11.BottleGourd - సొరకాయ 12.Ridge Gourd - బీరకాయ 13.SnakeGourd - పొట్లకాయ 14.Soft Gourd -. దొండకాయ 15. Colocasia roots - చేమదుంప, చేమగడ్డ 16.Turnip-వోక 17.Broccoli - ఆకుపచ్చ కోసుపువ్వు, బ్రోకోలి 18.Chilli --- మిరపకాయ 19.Lady's finger-బెండకాయ 20.Aloo. ----. ఉర్లగడ్డ. *Names of dry fruits:* 1. Almond Nut. -- బాదం 2. Apricot dried --- ఎండిన సీమ బాదం/ జల్లారు పండు 3. Betel-nut -- తమలపాకుల గింజ 4. Cashew nut --. జీడి పప్పు 5. Chestnut --. చెస్ట్నట్ 6. Coconut --. కొబ్బరి 7. Cudpahnut --. సార పలుకులు 8. Currant --. ఎండుద్రాక్ష 9. Dates Dried -- ఎండు ఖర్జూరం 10.Fig --. అత్తి పండ్లు 11.Groundnuts, Peanuts - వేరుశెనగ పప్పు 12.Pine Nuts - చిల్గోజా, పైన్ కాయలు 13.Pistachio Nut - పిస్తా 14.Walnuts - అక్రోటుకాయ. *ధాన్యాలు, పిండ్లు మరియు పప్పుల పేర్లు -:* 1. Barley -. బార్లీ 2. Buckwheat -- కుట్టు, దానా 3. Chickpeas -- ముడిశెనగలు 4. Cracked wheat- గోోధుమ రవ్వ 5. Cream of wheat / semolina - సెమోలినా 6. Flour ---. పిండి 7. Chickpea flour -- శనగ పిండి 8. Pastry flour --. మైదా పిండి 9. Garbanzo beans - ముడిశెనగలు 10.Red gram --. కందులు 11.Green gram -- పెసలు 12.Blackgram --. మినుము 13.Bengal gram - శనగలు 14.Horsegram --. ఉలవలు 15.maize --. మొక్కజొన్న 16.Pearl millet -. సజ్జలు 17.Beaten paddy- అటుకులు 18.Rice --. బియ్యం 19.Sorghum - జొన్న
1.5k views
1 months ago
#

శుభోదయం 🌅

* తల్లితండ్రుల గొప్పతనం తల్లితండ్రుల గొప్పదనం గురించి శాస్త్రాలలో చెప్పబడిన విధానం 01. ఈ సమస్త భూమి కంటే బరువైనది తల్లి. 02. ఆకాశము కన్నా ఉన్నతుడు తండ్రి0 03. ఒక్కసారి తల్లికి, తండ్రికి నమస్కరించిన గోదానము చేసిన పుణ్యము వచ్చును. 04. సత్యం తల్లి .............. జ్ఞానం తండ్రి. 05. పదిమంది ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడు. వందమంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రి కంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి. 06. తల్లితండ్రులకు సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ దక్కుతాయి. 07. ఎవరు మాతృదేవతను సుఖముగ ఉంచరో, సేవించరో వారి శరీర మాంసాలు శునక మాంసము కన్నా హీనం 08. ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంటుంది కానీ, కన్నతల్లి కంట కన్నీరు తెప్పించిన లక్ష గోవులు దానమిచ్చినా, వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినా ఆ పాపం పోదు. 09. తను చెడి తన బిడ్డలను చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పే అని ధర్మశాస్త్రం చెబుతోంది. 10. తల్లిని మించిన దైవం లేదు. గాయత్రిని మించిన మంత్రం లేదు.
1.3k views
3 months ago
#

శుభోదయం

🙏 *प्रणाम का महत्व* 🙏 💎💎💎💎💎💎💎💎 *महाभारत का युद्ध चल रहा था -* *एक दिन दुर्योधन के व्यंग्य से आहत होकर "भीष्म पितामह" घोषणा कर देते हैं कि -* *"मैं कल पांडवों का वध कर दूँगा"* *उनकी घोषणा का पता चलते ही पांडवों के शिविर में बेचैनी बढ़ गई -* *भीष्म की क्षमताओं के बारे में सभी को पता था इसलिए सभी किसी अनिष्ट की आशंका से परेशान हो गए|* *तब -* *श्रीकृष्ण ने द्रौपदी से कहा अभी मेरे साथ चलो -* *श्रीकृष्ण द्रौपदी को लेकर सीधे भीष्म पितामह के शिविर में पहुँच गए -* *शिविर के बाहर खड़े होकर उन्होंने द्रोपदी से कहा कि - अन्दर जाकर पितामह को प्रणाम करो -* *द्रौपदी ने अन्दर जाकर पितामह भीष्म को प्रणाम किया तो उन्होंने* - *"अखंड सौभाग्यवती भव" का आशीर्वाद दे दिया , फिर उन्होंने द्रोपदी से पूछा कि !!* *"वत्स, तुम इतनी रात में अकेली यहाँ कैसे आई हो, क्या तुमको श्रीकृष्ण यहाँ लेकर आये है" ?* *तब द्रोपदी ने कहा कि -* *"हां और वे कक्ष के बाहर खड़े हैं" तब भीष्म भी कक्ष के बाहर आ गए और दोनों ने एक दूसरे से प्रणाम किया -* *भीष्म ने कहा -* *"मेरे एक वचन को मेरे ही दूसरे वचन से काट देने का काम श्रीकृष्ण ही कर सकते है"* *शिविर से वापस लौटते समय श्रीकृष्ण ने द्रौपदी से कहा कि -* *"तुम्हारे एक बार जाकर पितामह को प्रणाम करने से तुम्हारे पतियों को जीवनदान मिल गया है "* - *" अगर तुम प्रतिदिन भीष्म, धृतराष्ट्र, द्रोणाचार्य, आदि को प्रणाम करती होती और दुर्योधन- दुःशासन, आदि की पत्नियां भी पांडवों को प्रणाम करती होंती, तो शायद इस युद्ध की नौबत ही न आती "* - *......तात्पर्य्......* *वर्तमान में हमारे घरों में जो इतनी समस्याए हैं उनका भी मूल कारण यही है कि -* *"जाने अनजाने अक्सर घर के बड़ों की उपेक्षा हो जाती है "* *" यदि घर के बच्चे और बहुएँ प्रतिदिन घर के सभी बड़ों को प्रणाम कर उनका आशीर्वाद लें तो, शायद किसी भी घर में कभी कोई क्लेश न हो "* *बड़ों के दिए आशीर्वाद कवच की तरह काम करते हैं उनको कोई "अस्त्र-शस्त्र" नहीं भेद सकता -* *"निवेदन 🙏 सभी इस संस्कृति को सुनिश्चित कर नियमबद्ध करें तो घर स्वर्ग बन जाय।"* *क्योंकि*:- *प्रणाम प्रेम है।* *प्रणाम अनुशासन है।* *प्रणाम शीतलता है।* *प्रणाम आदर सिखाता है।* *प्रणाम से सुविचार आते है।* *प्रणाम झुकना सिखाता है।* *प्रणाम क्रोध मिटाता है।* *प्रणाम आँसू धो देता है।* *प्रणाम अहंकार मिटाता है।* *प्रणाम हमारी संस्कृति है।* 🙏 🙏 🙏 🙏 *सबको प्रणाम* 🙏
3.5k views
4 months ago
#

శుభోదయం

'నేను’ తెలుసుకో *అప్పుడు కలుసుకో!..🙏 శ్రీరామ చంద్రుడికి హఠాత్తుగా మనసులో ఒక సందేహం పుట్టుకొచ్చింది. సరాసరి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్లి తలుపు తట్టాడు. ఇంత రాత్రి వేళ వచ్చిందెవరని ఆశ్చర్యపడ్డాడు వశిష్ఠుడు. ‘‘ఎవరూ?’’ అని గట్టిగా అన్నాడు... ‘‘నేనే’’ అన్నాడు రాముడు! ‘‘నేనంటే ఎవరు?’’ అని తిరిగి ప్రశ్నించాడు. ‘అది తెలుసుకోవాలనే ఇలా వేళకాని వేళ తలుపు తట్టాను గురుదేవా’ అని గాఢంగా నిట్టూర్చాడు స్వామి. ‘నేనెవరిని’ అనేది యుగయుగాలుగా మనిషిని వేధిస్తున్న ప్రశ్న. వెంటాడుతున్న సందేహం! ఇది వేదాంతాన్ని గురించి చర్చ కాదు... వివేకాన్ని గురించిన మథనం... ఆధ్యాత్మిక లోకాల్లోనే కాదు, రోజువారీ జీవితాల్లో కూడా అహంకారం ఉండకూడదని విజ్ఞులు చెబుతారు. నేనుని సంస్కృతంలో అహం అంటారు. అహం అంటే తాననే భావన మాత్రమే కాదు. తనలో ఉన్న కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అవలక్షణాలు కూడా. ఆధునిక జీవన సరళిలో అగచాట్లకు గురి చేస్తున్నది, జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తోంది ఇవే. అహాన్ని, దానికి అంటిపెట్టుకుని ఉన్న ఈ చెడ్డలక్షణాలను కూడా వదులుకోగలిగితే జీవితం ఆనందమయం అవుతుంది. లోకంలో ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. మాటిమాటికీ మనిషి నోట ‘నేను’ అనే మాట వస్తూనే ఉంది. కానీ ఈ ‘నేను’ ఎవరనేది చిక్కు ప్రశ్నగా, చిదంబర రహస్యంగా మిగిలిపోతూనే ఉంది. సత్యభామ కాలు కృష్ణుడి తలకు తగిలింది. ‘‘నన్ను’’ తంతే తన్నావు. నీ కాలు తగలడం నాకు గౌరవమే’ అన్నాడా భార్యా విధేయుడు. తలనే కాదు, శరీరంలో ఎక్కడ తన్నినా నన్ను తన్నాడనే అంటారు. అలా అని శరీరమే ‘నేను’ కాదు. కన్ను నాది, కాలు నాది అంటున్నాం. కానీ కన్నూ, కాలూ నేను కాదు. ఎందుకంటే కన్నూ కాలు లేకున్నా ‘నేను’ ఉన్నాను. నాలుక మిఠాయిని రుచి చూసింది. చెవి చక్కని సంగీతాన్ని ఆలకించింది. ముక్కు సువాసన పసిగట్టింది. ‘నేను’ తిన్నాను, నేను విన్నాను, నేను వాసన చూశాను అనేస్తాం. కానీ ఇవేవీ ‘నేను’ కాదు. ఎవరైనా తిట్టిపోస్తే మనసు గాయపడుతుంది. కాస్త పొగిడితే చాలు, సంతోష పడుతుంది. కానీ అదెక్కడుందో అంతు చిక్కదు. అంటే పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు... వీటిలో ఏ ఒక్కటీ నేను కాదు.సత్యం ఏంటంటే నేనుకు అంటిపెట్టుకుని ఇవన్నీ ఉన్నాయి. ఇదివరకొక రాజు జ్ఞానోపదేశం పొందాలనుకున్నాడు. ప్రసిద్ధుడైన ఒక ఆధ్యాత్మిక గురువు ఇంటికి వెళ్లాడు. అక్కడున్న శిష్యుడిని పిలిచాడు. ‘నేనొచ్చానని మీ గురువుగారికి చెప్పు’ అన్నాడు. లోపలికి వెళ్లిన శిష్యుడు చెప్పిన మాట విని గురువు ఇలా బదులిచ్చాడు ‘నేను’ పోయాక రమ్మను... ఉపదేశిస్తాను’. ఆ మాట రాజును అయోమయంలో పడేసింది. ‘పోయినాయన చెప్పేదేముంది?’ అని తెల్లబోయాడు. మారు మాట లేకుండా ఇంటికి తిరిగెళ్లిపోయాడు. కానీ గురువు మాట మాత్రం రాజు మనసును గట్టిగా పట్టుకుంది. ఎన్నాళ్లో మథనపడగా అకస్మాత్తుగా రాజుకు సత్యం స్ఫురించింది. క్షణంలో ముడివిడిపోయింది. గురువు చెప్పింది ఆయన పోయాక రమ్మని కాదు... ‘నేను’ వచ్చానని కదా రాజు చెప్పాడు. ఆ నేను పోయాక వస్తే తనకు ఉపదేశిస్తానని అన్నాడు. ఇంతే విషయం!. ఎప్పుడైతే ఈ ఎరుక కలిగిందో రాజుకు ఆనందం ఉబికివచ్చింది. మూసి ఉంచిన గదిలో చీకటిని తరిమేయడానికి దీపానికి క్షణం చాలు. ఏళ్లు పట్టదు. తనలోని గుజ్జు, పోగులు సమస్తం కాలి పోయాక వెదురు వేణువుగా మారుతుంది. రాజు విషయంలో జరిగిందదే. ‘నేను’ అని తాను భావిస్తున్నది తొలగిపోయే సరికి కథ సుఖాంతమైంది. స్త్రీ లోలత్వం, పానం, జూదం, దుబారా ఖర్చు, వేటపై ప్రీతి, దండ పారుష్యం (దండించడంలో పైశాచికత్వం), వాక్పారుష్యం (మాటలో సౌమ్యత లేకపోకపోవడం)... ఈ ఏడింటినీ సప్త వ్యసనాలు అంటారు. వీటిలో మొదటి ఐదూ కామజాలు. అంటే కోరికల్లోనుంచి పుడతాయి. తక్కిన రెండూ క్రోధజాలు. కోపంలో నుంచి వస్తాయి. అంటే అరిషడ్వర్గాలలోని తొలి రెండిటి నుంచే ఏడు వ్యసనాలు పుట్టుకొస్తున్నాయి. మిగిలిన వాటి నుంచయితే లెక్కే లేదు. ధర్మరాజు జూద వ్యసనం, దుర్యోధనుడి దురభిమానం, ధృతరాష్టుడి మితిమీరిన పుత్ర వ్యామోహం, దక్ష ప్రజాపతి దురహంకారం, రావణుడి కాముకత, కీచకుడి మూర్ఖత్వం, విశ్వామిత్రుడి ద్వేషం, అశ్వత్థామ పగ, కుమార్తె దేవయానిపై శుక్రాచార్యుడి అలవిమాలిన మమకారం... ఇలా మనిషి పతనానికి సమాజానికి చేటు కలిగించడానికి కారణమవుతున్న ఎన్నో స్వభావాలు కలగలిస్తే నేను అవుతోంది. ఏది మితిమీరినా మనిషి చెడిపోతాడు, సంఘమూ చెడిపోతుంది. ఇప్పుడు ఆనందం కావాలంటే ఏం చేయాలి? ‘నేను’లోంచి అరిషడ్వర్గాలను, సప్త వ్యసనాలను, వల్లమాలిన అహంకార మమకారాలను తొలగించాలి. అప్పుడు మిగిలే ‘నేను’ స్వయంగా ఆనంద స్వరూపుడవుతాడు. పై చెప్పిన వన్నీ సుఖాన్నో, సంతోషాన్నో అందించగలవుగానీ శాశ్వతమైన అవసరమైన ఆనందాన్ని మాత్రం అందించలేవు. వీటిలో ఒక్కోదాన్ని విశ్లేషించుకుంటూ, ఒక్కోదాన్నుంచి ‘నేను’ను విడిపించుకుంటూ మనిషి ఆనంద స్వరూపుడు కావాల్సిన అవసరం ఎంతో ఉంది. దీన్నే జీవన కళ (ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌) అంటారు.🙏
4.7k views
4 months ago
#

శుభోదయం

-----------వాస్తు దోషాలు లేకుండా ఇంటిని అలంకరించుకొనుటఎట్లా---------------మీఇల్లు స్వంతమైనా కావచ్చు, లేదా బాడుగదైనా కావచ్చు. మనం ఉంటున్న ఇంటిని అలంకరించుకోవడానికి మీనమేషాలు లెక్కించాల్సిన అవసరం ఉండదు. పట్టణాలలో, మహా నగరాలలో ఫ్లాట్ల సంస్కృతి నడుస్తోంది. ఫ్లాట్లలో సామాన్లు తరలించడానికి నానాయాతనలు పడాల్సివస్తుంది. దీంతో మన వస్తువులెన్నో పగిలి పోవడం, లేదా పాడైపోవడం పరిపాటే. దీనికి సమాధానంగా బాడుగ ఇండ్లను కూడా అందంగా అలంకరించుకోవడానికి కొన్ని చిట్కాలు మీ కోసం.. వీటిని మీరు పాటిస్తే బాడుగ ఇల్లు కూడా స్వర్గధామంలా మారుతుందనడంలో సందేహంలేదు. * చిట్కాలు * మీరు పడుకునే మంచం, దీవాన్‌, సోఫాలను ఒక పెట్టెలా తయారు చేయించుకోండి. ఇందులో కొన్ని వస్తువులను ఇల్లు మార్చేటప్పుడు భద్రపరచుకోవచ్చు. దీన్ని ఒక ప్రాంతంనుండి మరో ప్రాంతానికి తరలించడానికి ఆస్కారముంటుంది. * షోకేస్, డ్రెస్సింగ్ టేబుల్ లాంటివి కొనేటప్పుడు అవి దృఢంగా ఉండేట్లు చూసుకోండి. అవి కాస్త నాజూకుగావుంటే ప్రమాదం. * మీ పిల్లలుకు పెయింటింగ్ వేసే అలవాటుంటే వారి కోసం ప్రత్యేకంగా వారి గదిలో ఒక బ్లాక్ బోర్డు ఉంచండి. దానిపై వారు తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించుకోగలరు. * ఇంట్లో పనికి రాని వస్తువులను చేర్చుకోకండి. * గోడలపై చీలలు (మేకులు) ఎక్కువగా కొట్టకండి. * ఫోల్డింగ్ డైనింగ్ టేబుల్ మీకు ఎంతో శ్రేయస్కరం కాగలరు. * బాడుగ ఇండ్లల్లోని అలమారాలలో తలుపులు లేకపోతే వాటికి తలుపులు బిగించుకుని మీరు ఎంచక్కా వాటిని వాడుకోవచ్చు. వాస్తు ప్రకారం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సానుకూల ఫలితాలను పొందవచ్చు. ఇంకా వాస్తు ప్రకారం ఇంట్లో పనికి రాని వస్తువులను ఉంచకూడదు.
1.5k views
5 months ago
No more posts
ShareChat Install Now
ShareChat - Best & Only Indian Social Network - Download Now
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post