మానవత్వం
#

మానవత్వం

😃
#👏🏻అవయవ దానం బ్రెజిల్ లో ఒక కోటీశ్వరుడు తన One Million Dollar ఖరీదుగల బెంట్లీ కారుని పలానా రోజు పాతిపెడుతున్నాను అని పత్రికా ప్రకటన ఇచ్చాడు..!! నేను ఈ కారుని ఎందుకు పాతి పెడుతున్నానంటే.. నా మరణానంతరం కూడా ఈ కారు నాకు పనికివస్తుంది అని చెప్పాడు..!! అప్పుడు ఈ కోటీశ్వరుడుని అందరూ ఈయన ఒక పెద్ద అవివేకి అని, One Million Dollar కారుని వృధా చేస్తున్నాడు అని విమర్శించారు..!! మీడియాతో పాటుగా ప్రజలు కూడా చాలా తిట్టారు అతన్ని..!! అతను పాతిపెట్టే రోజు ఏమి జరుగుతుందో అని చూడటానికి ఆత్రంగా జనం అంతా పోగై ఆ చోటికి వచ్చి రెడీగా ఉన్నారు..!! పెద్ద కారుని పాతిపెట్టడానికి అక్కడ ఒక పెద్ద గొయ్యి తవ్వి ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇంతలో అక్కడికి ఆ కోటీశ్వరుడు వచ్చాడు..!! అక్కడికి వచ్చిన ప్రజలు అతన్ని తిడుతూ కోపంగా.. ఎందుకు మీరు ఈ కారుని ఇలా పాతిపెట్టి వృధా చేస్తున్నారు..? మీ మరణానంతరం ఇది మీకు ఏ విధంగా పనికి రాదు..!! దీనిని వేరోకరికైనా దీనిని ఇవ్వచ్చు కదా.. అని పదిమంది పదిరకాలుగా ప్రశ్నించారు..!! అప్పుడు ఆ కోటీశ్వరుడు చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చాడు..!! "నేను నా కారుని ఇలా సమాధి చేయడానికి నేనేమి అవివేకిని కాను..!! దీని ద్వారా నేను మీకు ఒక సందేశాన్ని ఇవ్వాలని కోరుకున్నాను..!! ఈ కారు ధర కేవలం 1 మిలియన్ డాలర్.. నేను దాన్ని పాతిపెట్టే నిర్ణయం తీసుకున్నందుకు మీ అందరికి నా మీద మీకు ఇంత కోపం వచ్చింది..!! నిజమే కానీ మీరు మాత్రం వెలకట్టలేని... మీ(మన) గుండె... కళ్ళు... ఊపిరితిత్తులు.. మూత్రపిండాలు.. ఇలా మన శరీరంలోని ప్రతి అవయవమూ మానవ సమాజానికి ఉపయోగపడతాయి కదా..? ఈ అవయవాలన్నీ మనతోపాటే అనవసరంగా వృధాగా మట్టిలో కలిసిపోతున్నాయి కదా..? వాటి గురించి మీకు ఏ మాత్రం చింతకాని.. ఆలోచన కాని లేదు ఎందుకు..? కారు పోయినా.. డబ్బు పోయినా మళ్ళి తిరిగి వస్తుంది..!! మరి మన అవయవాలు తిరిగి వస్తాయా..? వాటికి విలువ కట్టగలమా..? మరి మనం ఎందుకు వాటిని ఒక బహుమతిగా ఇతరులకి దానం చెయ్యలేక పోతున్నాం..? కొన్ని లక్షలమంది ప్రజలు అవయవదానం కోసం ఎదురు చూస్తున్నారు కదా..? మనం అంతా ఎందుకు వారికి సాయం చెయ్యకూడదు..? ఆలోచించండి..!! అవయవదానం చెయ్యడానికి నడుం బిగించండి..!! మీ అందరిలో అవయవదానం ప్రాముఖ్యత గ్రహించేలా చేయడానికే నేను ఈ నాటకం ఆడానని అక్కడున్నవారి జ్ఞానోదయం కలిగించాడు ఆ పెద్దమనిషి. షేర్ చేసి అవయవ దాన ప్రాముఖ్యతను అందరికి తెలియజేయండి..... #👏🏻అవయవ దానం #అవయవ దానం #ℹ️సమాచారం
23 వీక్షించారు
22 రోజుల క్రితం
#

మానవత్వం

కారు ఆగిపోయింది . అందులోంచి దిగిన ఆమెకు 40 సంవత్సరాలు ఉంటాయి . దిగి చూసింది టైర్ పంక్చర్ అయ్యింది . స్టేఫినీ ఉందికానీ తనకు వెయ్యడం రాదు . రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం చూస్తోంది . ఒక్కరూ ఆగడం లేదు . సమయం చూస్తే సాయంత్రం ఆరు దాటుతోంది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి . మనసులో ఆందోళన . ఒక్కతే ఉంది . తోడు ఎవరూ లేరు . చీకటి పడితే ఎలా? దగ్గరలో ఇళ్ళు లేవు . సెల్ పనిచెయ్యడం లేదు ( సిగ్నల్స్ లేవు ). ఎవరూ కారునూ , పక్కనే నిలబడిన ఆమెనూ చూసినా ఆపడం లేదు . అప్పటికే దాదాపు ఒక గంట గడిచింది . ఎలారా దేవుడా అనుకుంటూ భయపడడం మొదలయ్యింది . చలి కూడా పెరుగుతోంది ..అటుగా వెడుతున్న ఒక బైకు ముందుకు వెళ్లి పక్కకు తిప్పి వెనక్కు వచ్చింది . ఒక వ్యక్తి బైకు స్టాండ్ వేసి, ఈమె దగ్గరకు వస్తుండటం తో ఆమె సహజంగా భయపడుతుంది. ....ఎవరతను ?ఎందుకు వస్తున్నాడు ? ఏమి చేస్తాడు .? ఆందోళన !. అతను దగ్గరకి నవ్వుతూ వచ్చాడు ? టైర్ లో గాలి లేదని చూశాడు . ఆమె బెదిరిపోతోందని గ్రహించాడు ." భయపడకండి . నేను మీకు సహాయం చెయ్యడానికి వచ్చాను . బాగా చలిగా ఉంది కదా ! మీరు కారులో కూర్చోండి . నేను స్టేఫినీ మారుస్తాను" అన్నాడు. ఆమె భయపడుతూనే ఉంది ." నా పేరు బ్రియాన్. ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ లో పని చేస్తాను " అన్నాడు .అతను డిక్కీ తెరిచి కావలసిన సామాను తీసుకుని కారు కిందకి దూరి జాకీ బిగించాడు . తారు రోడ్డు గీసుకొన్న రక్తపు చారాల చేతులతో జాకీ బిగించి టైరు తీసి టైర్ మార్చాడు . సామాను తిరిగి కారులో పెట్టాడు .. ఆమె డబ్బులు తీసి ఇవ్వబొయింది . వద్దు అన్నాడు ." మీరు కాదనకండి . మీరు ఈ సహాయం చెయ్యక పోతే నా పరిస్థితిని తలుచుకుంటే నాకు భయం వేస్తోంది" అంది. " నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు సహాయ పడ్డారు . మీకు సహాయం చెయ్యాలనిపిస్తే ఎవరైనా కష్టాల్లో ఉన్నారనిపిస్తే నా పేరు తలచుకుని వారికి సహాయం చెయ్యండి " అని వెళ్లి పోయాడు...మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆమె కారు నడుపుకుంటూ వెడుతోంది . అప్పుడు ఆమెకు ఆకలి గుర్తుకు వచ్చింది . తను వెళ్ళ వలసిన దూరం చాలా ఉంది . ఆకలి, చలీ ఆమెను రోడ్డుపక్కన ఉన్న హోటల్ కి వెళ్ళేలా చేశాయి . అదొక చిన్న హోటల్ . కస్టమర్ల టేబుల్స్ దగ్గరకి ఒక గర్భిణీ మహిళ సర్వ్ చేస్తోంది . ఆమెను చూస్తుంటే నిండు గర్భిణీ అనిపించింది . డెలివరీ రోజులు దగ్గరకి వచ్చేసి ఉంటాయి అనిపించింది . బరువుగా నడుస్తోంది . అన్ని టేబుల్స్ దగ్గరకీ వెళ్లికావలసిన ఆర్డర్ తీసుకోవడం , సర్వ్ చెయ్యడం బిల్ తీసుకుని చిల్లర ఇవ్వడం అన్నీ తనే చేస్తోంది . ఆమె ముఖం లో ప్రశాంత మైన చిరునవ్వు.ఆమె తన టేబుల్ దగ్గరకి వచ్చింది . చిరు నవ్వుతో ఏమి కావాలండి ? అని అడిగింది . అంత శ్రమ పడుతూ కూడా చెరిగిపోని చిరు నవ్వు ఆమె ముఖం లో ఎలా ఉందొ ? అని ఆశ్చర్య పడుతోంది తను తన మనసులో. భోజనం ఆర్డర్ ఇచ్చింది . భోజనం చేసి ఆమెకు 1000నోటు ఇచ్చింది . ఆమె చిల్లర తేవడానికి వెళ్ళింది . తిరిగి వచ్చేటప్పటికి ఈమె కనబడలేదు .. ఈమె కూర్చున్న టేబుల్ మీద ఉన్న గ్లాసు క్రింద ఒక కాగితమూ దానికింద నాలుగు 1000 నోట్లూ ఉన్నాయి . ఆ కాగితం చదివిన హోటల్ మెయిడ్ కి కన్నీళ్లు ఆగలేదు .అందులో ఇలా ఉంది .." చిరు నవ్వుతో ఉన్న నీ ముఖం నీకు బాధలు లేవేమో అన్నట్టు ఉంది . నువ్వు నిండు నెలలతో పని చేస్తున్నావు అంటే నీకు డబ్బు అవసరం అని అనిపిస్తోంది . నాకు ఒక మిత్రుడు సహాయ పడినట్టే అతడిని తలచుకుంటూ నేను నీకు సహాయ పడుతున్నాను. నువ్వూ ఇలాగే ఇతరులకు సహాయపడు . " అని రాసి ఉంది.. ఇంటికి వచ్చింది . అప్పుడే ఇంటికి వచ్చి అలసి పోయి పడుకున్న భర్త చేతి కేసి చూసింది . గీసుకు పోయిన చేతులు రక్తపు చారలతో ఉంది . అతడి పక్కన మంచం మీదకు చేరుతూ మనం దిగులుపడుతున్నాం కదా డెలివరీకి డబ్బులెలాగా అని....ఇక ఆ బెంగ తీరిపోయిందిలే బ్రియాన్! భగవంతుడే మనకు సహాయం చేశాడు . ఆయనకి కృతజ్ఞతలు అంది ప్రశాంతంగా..మనం ఎవరికయినా మనస్పూర్తిగా సహాయం చేస్తే అది ఎక్కడికి వెళ్ళదు.. మనం ఆపదల్లో ఉన్నపుడు తిరిగి మన దగ్గరకే చేరుతుంది అన్నది ఆ కధ యొక్క పరమార్ధం..!! #మానవత్వం #నీతి కథలు #📋కథలు
139 వీక్షించారు
4 నెలల క్రితం
#

మానవత్వం

216 వీక్షించారు
8 నెలల క్రితం
#

మానవత్వం

చాలా బాధాకరంగా ఉంది... సిగ్గు గా కూడా ఉంది... మన దేశం కోసం మనకోసం సరిహద్దుల్లో జవానులు పోరాడుతు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంటే... నా దేశంలో నా ఆడపడుచులను కాపాడే నాధుడే లేకపోయే... కామం కళ్ళకు ఎక్కిపోయే ... ప్రేమ అనే ముసుగు ధరించి... నా ఆడపడుచులను కుదిరితే వచించి... కుదరక పోతే ఇలా దాడులు చేసి... కన్న వారికి కడుపుకోత మిగులుసుతున్నారు... వీటికి అంతం లేదా ? ఇలాంటి మృగాళ్లను ఆపలెమా? నోట్:- (నా మనవి) అయ్యా గొప్ప గొప్ప రాజకీయ నాయలకులరా మాకు నిరుద్యోగ భృతి వద్దు... పెట్రోల్ తగ్గింపులు వద్ధు... మీ నుండి ఎటువంటి లబ్ధి మా కొద్దు... నా అడపడుకచుల జీవితాన్ని నాశనం చేసే ఇలాంటి వాళ్ళకు తక్షణం శిక్షను అమలు చేయండి... నా తల్లుల,ఆడపడుచుల, బాలికల ఆవేదనని అర్థం చేసుకుని ఇకనైనా ఒక్క అడుగు ముందుకు వేయండి... దేశంలో కూడా ఒక్క సారి ఇలాంటి వాళ్లపై సర్జికల్ స్ట్రైక్ నీర్వహించి యిలాంటి సైకోలని ఒకే దగ్గర చేర్చి తగల పెట్టండి... మన భారత మాత గౌరవాన్ని కాపాడండి...
224 వీక్షించారు
9 నెలల క్రితం
#

మానవత్వం

చాలా బాధాకరంగా ఉంది... సిగ్గు గా కూడా ఉంది... మన దేశం కోసం మనకోసం సరిహద్దుల్లో జవానులు పోరాడుతు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంటే... నా దేశంలో నా ఆడపడుచులను కాపాడే నాధుడే లేకపోయే... కామం కళ్ళకు ఎక్కిపోయే ... ప్రేమ అనే ముసుగు ధరించి... నా ఆడపడుచులను కుదిరితే వచించి... కుదరక పోతే ఇలా దాడులు చేసి... కన్న వారికి కడుపుకోత మిగులుసుతున్నారు... వీటికి అంతం లేదా ? ఇలాంటి మృగాళ్లను ఆపలెమా? నోట్:- (నా మనవి) అయ్యా గొప్ప గొప్ప రాజకీయ నాయలకులరా మాకు నిరుద్యోగ భృతి వద్దు... పెట్రోల్ తగ్గింపులు వద్ధు... మీ నుండి ఎటువంటి లబ్ధి మా కొద్దు... నా అడపడుకచుల జీవితాన్ని నాశనం చేసే ఇలాంటి వాళ్ళకు తక్షణం శిక్షను అమలు చేయండి... నా తల్లుల,ఆడపడుచుల, బాలికల ఆవేదనని అర్థం చేసుకుని ఇకనైనా ఒక్క అడుగు ముందుకు వేయండి... దేశంలో కూడా ఒక్క సారి ఇలాంటి వాళ్లపై సర్జికల్ స్ట్రైక్ నీర్వహించి యిలాంటి సైకోలని ఒకే దగ్గర చేర్చి తగల పెట్టండి... మన భారత మాత గౌరవాన్ని కాపాడండి...
256 వీక్షించారు
9 నెలల క్రితం
మరిన్ని పోస్ట్‌లు లేవు
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post