మహిళా శక్తి
422 Posts • 633K views
*ఆవిడ గుర్రం మీద వెళ్తుంటే వెనుక ఉన్న వారికి దుమ్ము తప్ప గుర్రం కనబడేది కాదట.* *కరవాలం తిప్పుతుంటే ఆవిడ మీద విసిరిన వడ్లగింజలు ఆవిడ ఒంటిని తాకలేకపోయేవట.* *నేటికీ మాల్వా ప్రాంతంలో ఆవిడ జానపదుల పాటల్లో సజీవంగా ఉన్నారు.* *ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్న కొడుకు రాజారాం భోంస్లే భార్య.. తారాభాయ్ భోస్లే* *శంభాజీ మహరాజ్ ను ఔరంగజేబ్ క్రూరంగా హింసించి చంపిన తర్వాత శివాజీ మహరాజ్ చిన్న కొడుకు రాజారాం రాయ్ ఘడ్ కోట నుంచి నేటి తమిళనాడు జింగీ కోటకు వలస వెళ్లారు.* *అక్కడ నుంచే ఆయన మరాఠా సామ్రాజ్యాన్ని పాలించేవారు.* *దురదృష్టవశాత్తూ ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో అక్కడే మరణించారు. అప్పటికి మహారాణి తారాభాయ్ భోంస్లే వయసు కేవలం 25 ఏళ్ళు.* *ధైర్యం కోల్పోకుండా తిరిగి రాయ్ ఘడ్ కు చేరుకొని మరాఠా సైన్యానికి నాయకత్వం వహించి కోల్పోయిన కోటలన్నీ తిరిగి రాబట్టారు.* *ఆవిడ ప్రతి కోటనూ తన నియంత్రణలోకి తెచ్చుకొని కొత్తగా* *మాల్వాప్రాంతాన్ని(ఉజ్జయిన్..బుర్హాంపూర్..సిరోంజీ..ముంద్రా) తన అధీనంలోకి తెచ్చుకున్నారు.* *ఒక విధవ ఇద్దరు చిన్నపిల్లలతో తననేమి గెలవగలదని మదంతో తారాభాయ్ మీద యుద్ధానికి వచ్చిన నాటి ఔరంగజేబ్ సేనాని ఆలంగీర్ గుండెల మీద తన గుర్రాన్ని పైకి లేపి డెక్కలతో కొట్టి కిందపడేసిన సివంగి మహారాణి తారాభాయ్.* *బతుకుజీవుడా అని పారిపోయి తిరిగి తన జీవితకాలంలో మరాఠాల మీదకు యుద్ధానికి వచ్చే సాహసం చేయలేదు పిరికి ఆలంగీర్.* *తన బావ శంభాజీ..భర్త రాజారాం ల మరణంతో నీరసించిన వీర మరాఠా సైన్యాన్ని పునర్నిర్మించి అజేయంగా మలచి కోటలను శత్రు దుర్భేద్యంగా నిర్మించి 27 ఏళ్ళు పాటు మరాఠా సామ్రాజ్యాన్ని అవిచ్చన్నంగా ఏలిన* *'వారియర్ క్వీన్'..* *భారత్ లో ఒక రాణి ఝాన్సీ..* *కాకతీ రుద్రమ్మ..చౌతా అబ్బక్క ల సరసన చేర్చదగ్గ వీరవనిత మహారాణి తారాభాయ్.🚩 #తెలుసుకుందాం #మహిళా శక్తి #woman power🔥 #woman power
6 likes
18 shares
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
793 views 1 months ago
ఒకేసారి 5 ఉద్యోగాలు కొట్టిన "అమ్మ" శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళ ఒకేసారి 5 ఉద్యోగాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. సరుబుజ్జిలి (M) మతలబుపేటకు చెందిన చింతా రాధాకుమారి-కేఎల్ నాయుడుకు ఇద్దరు పిల్లలు. ఎప్పటికైనా టీచర్ కావాలనే ఆశయంతో సంసారాన్ని నడిపిస్తూనే రాధ MA, లాంగ్వేజ్ పండిట్ కోర్స్, TTC, B.Ed పూర్తి చేశారు. ఇటీవల ప్రకటించిన DSC SGT-14, SA -23, SA -39, TGT తెలుగు-113,TGT సోషల్లో 77వ ర్యాంక్ సాధించారు. #మహిళా శక్తి #woman power🔥 #woman power #woman power #congratulations
4 likes
10 shares