దుర్గాష్టమి,మహర్నవమి శుభాకాంక్షలు
39 Posts • 29K views
PSV APPARAO
875 views 1 days ago
#శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు 🙏 🔱🕉️🔱🙏 #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 #శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు) #🔱దుర్గ దేవి🙏 #దుర్గాష్టమి,మహర్నవమి శుభాకాంక్షలు 🔔 *శ్రీ మాత్రే నమః* 🔔 ✨ దుర్గాష్టమి ✨ ఆశ్వయుజ శుక్లపక్షం తొమ్మిది రోజులనూ దసరా లేదా దేవీ నవరాత్రులు అంటారు. చివరి మూడు రోజులు ప్రత్యేకంగా దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. ఈ రోజుల్లో విద్యార్థులు పుస్తకపూజ, శ్రామికులు పనిముట్లపూజ, క్షత్రియులు ఆయుధపూజ చేసి అమ్మవారి కృపను పొందుతారు. పురాణాల్లో రాజులు దేవి మహిషాసురమర్దనిగా విజయం సాధించిన స్ఫూర్తితో ఈ రోజునే దండయాత్రలు ప్రారంభించేవారని చెప్పబడింది. దుర్గాష్టమి నాడు అమ్మవారు లోహుడు అనే రాక్షసుని సంహరించగా లోహ పరికరాలను పూజించే ఆచారం ప్రారంభమైంది అని చెబుతారు. “దుర్గ” అంటే – దుర్గతులను తొలగించేది. ‘దుర్’ అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్ర్యం. ‘గ’ అంటే వాటిని నశింపచేసేది. అందుకే ఈరోజు దుర్గాసహస్రనామ పారాయణం, “దుం” బీజాక్షరంతో అమ్మవారి పూజ ప్రత్యేకం. ఈసారి దుర్గాష్టమి మంగళవారంతో కలవడంతో మరింత శ్రేష్టత ఉంది. 🌺🌺🌺 ✨ మహర్నవమి ✨ నవరాత్రి దీక్షలో అత్యంత ముఖ్యమైన రోజు. ‘సిద్ధిదా’ అనే పేరుగల ఈ నవమి మంత్రసిద్ధిని ప్రసాదిస్తుంది. జపసంఖ్య పూర్తిచేసిన ఉపాసకులు ఈరోజు హోమాలు చేసి వ్రతాన్ని సమాప్తి చేస్తారు. క్షత్రియులు, కార్మికులు, వాహన యజమానులు ఆయుధపూజలు చేసి, తల్లి కృపను పొందుతారు. భగీరథుడు గంగను భూమిపైకి తీసుకొచ్చిన పవిత్రమైన ఘట్టం కూడా ఈ రోజే జరిగిందని పురాణాలు చెబుతాయి. 🌸🌸🌸 ✨ విజయదశమి ✨ పాలసముద్ర మథనంలో అమృతం వెలిసిన శుభముహూర్తం ఈ విజయదశమి రోజే. శ్రవణా నక్షత్రంతో కలిసిన ఆశ్వీయుజ శుక్ల దశమి “విజయదశమి”. ఈరోజు ఏ కార్యాన్ని ప్రారంభించినా విజయవంతమవుతుంది అని చతుర్వర్గ చింతామణి గ్రంథం తెలిపింది. శమీపూజ ఈరోజు ప్రత్యేకం. జమ్మిచెట్టు (శమీవృక్షం) పాండవులకు అపరాజితా దేవి రూపంలో విజయాన్ని ఇచ్చింది. శ్రీరాముడు కూడా విజయదశమి రోజున అపరాజితా దేవిని పూజించి రావణాసురునిపై విజయం సాధించాడు. తెలంగాణలో శమీపూజ అనంతరం పాలపిట్ట దర్శనం చేసే ఆచారం కూడా ఉంది. ఈ రోజు సాయంత్రం శమీవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ క్రింది శ్లోకాన్ని స్మరించడం శ్రేయస్కరం: 🌿శ్లోకము🌿 శమీ శమయతే పాపం శమీ శత్రు నివారిణీ | అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ || శ్లోకం వ్రాసిన చీటీని చెట్టు కొమ్మకు కట్టి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ఇది శనిదోష నివారణకు కూడా ప్రయోజనం ఇస్తుందని విశ్వాసం. https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
15 likes
5 shares