🙏🙏Praise the Lord🙏🙏
దేవుని వాగ్ధానము జీవితంలో పొందుకోవాలంటే..🤔🤔🤔 అదొక్కటే సరిపోదు..🙅🏻♂️🙅🏻♂️
ఏమిటది?? 🤔🤔
మరేమి చేయాలి..??🤔🤔
ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు..🗣️🗣️
మనలో చాలామంది నూతన సంవత్సరంలోనికి వచ్చేముందు దేవుని వాగ్ధానాలను(వాగ్ధానం కార్డులు) తీసుకుంటూ ఉంటాము.😊😊
సంవత్సరం అంతా ఎలా జీవించేసినా ఆ రోజు మందిరానికి వెళ్లి వాగ్ధానాలు తీసుకుని ఆ వాగ్ధానమే జీవితంలో నెరవేరిపోతాదిలే అని మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటూ ఉంటాము.🤷🏻♂️🤦🏻♂️
కానీ అలా జీవిస్తే ఆ వాగ్ధానాలు మన జీవితాలలో నెరవేరవు.🙅🏻♂️🙅🏻♂️ ఆ వాగ్ధాన ఫలము మన జీవితంలో పొందలేము..🙅🏻♂️🙅🏻♂️
ప్రతీ వాగ్ధానము లేదా ప్రతీ ఆశీర్వాదము ముందు ఒక ఆజ్ఞ ఉంటుంది.✅✅
ఎప్పుడైతే మనము ఆ ఆజ్ఞలను పాటిస్తామో అప్పుడే ఆ ఆశీర్వాదాలను, ఆ వాగ్ధానాలను పొందుకుంటాము.💯%✅
ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి..🧏🏻🧏🏻
♻️ ఆయన ఆజ్ఞలను పాటించకుండా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోలేము,🙅🏻♂️🙅🏻♂️
♻️ ఆయన వాక్యము ప్రకారము ప్రవర్తించకుండా ఆయనిచ్చు వాగ్ధానాలను పొందుకోలేము/అనుభవించలేము..🙅🏻♂️🙅🏻♂️
దేవుని వాక్యము ఈలాగు సెలవిస్తుంది..📖📖
ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును.
ఆజ్ఞవిషయమై భయభక్తులుగలవాడు “లాభము”పొందును.
మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి, ఆయన మాటను విని, ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగముచేయక మీరు.... మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు “క్షేమము” కలుగును.
Proverbs(సామెతలు) 13:13
1 Samuel(మొదటి సమూయేలు) 12:14
అవును.✅✅
వాగ్ధానము చూసుకుని అది మనకి వచ్చేస్తాదిలే అనుకుని మన ఇష్టం వచిన్నట్లు జీవిస్తే మన జీవితంలో ఆ వాగ్ధానము నెరవేరదు.🙅🏻♂️🙅🏻♂️ కానీ ఆజ్ఞల విషయమై భయభక్తులు కలిగి జీవిస్తే ఆశీర్వాదాలు పొందుకునేవారముగా ఉండగలము.🤩✅✅
❇️ దేవుడు అబ్రహాముకు ఆజ్ఞ ఇచ్చిన తరువాతే వాగ్ధానము ఇచ్చాడు.(ఆదికాండం:12:1-3)✅
దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి ముందే దేవుని మాటను అబ్రహాము విని దాని ప్రకారము ప్రవర్తించాడు.(ఆదికాండం:26:5)✅ అందుకే దేవుడిచ్చిన వాగ్ధానాన్ని అబ్రహాము తన జీవితంలో అనుభవించాడు.✅ గొప్ప ఉన్నతమైన వ్యక్తిగా మన ముందున్నాడు.✅
మరి మన జీవితాల్లో దేవుని వాగ్ధానాల సంగతి ఏమిటి...???🤔🤔
ఊరికే వాగ్ధానం వచ్చేసిందిలే అని మురిసిపోతూ జీవించేద్దాంలే అనుకుంటున్నామేమో...🤔🤔
లేదు నేస్తమా... అలా జరగదు.🙅🏻♂️🙅🏻♂️
దేవుని వాగ్ధానము నూటికి నూరు శాతం వాస్తవమే..✅ కానీ....🧏🏻🧏🏻
ఆజ్ఞలు గైకొన్నవారికే ఆశీర్వాదము.✅✅
వాక్య ప్రకారము ప్రవర్తించినవారికే వాగ్ధాన ఫలము.✅✅
ఇక ఆలోచించుకుందాం...🙏🏻🙏🏻
దేవుడు మనకిచ్చిన వాగ్ధానాలను అనుభవించాలని ఆశపడితే...🧏🏻🧏🏻 ఆయన ఆజ్ఞలను గైకొనుటకు ఇష్టపడుదాం..🙏🏻🙏🏻 ఆయన వాక్య ప్రకారము జీవించుటకు నిర్ణయించుకుందాం..🙏🏻🙏🏻 దేవుడిచ్చిన ప్రతీ వాగ్ధాన ఫలములను అనుభవిద్దాం..🤩✅🙏🏻
అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్..!! ఆమెన్..!!
God bless you.
#✝యేసయ్య ఆదరణ📿 #🔱దేవుళ్ళు #✝జీసస్ #యేసయ్య దీవెనలు #📕బైబిల్ వాక్యాలు