సర్వేపల్లి. రాధాకృష్ణన్ వర్దంతి

సర్వేపల్లి. రాధాకృష్ణన్ వర్దంతి

అది 1952 ఏప్రిల్ 5వ తేదీ. మాస్కో నగరం. రష్యా అధినేత స్టాలిన్ నుండి భారత రాయబారి కార్యాలయానికి ఒక లేఖ అందింది. భారత రాయబారి, డా.రాధాకృష్ణన్ గారిని ఆహ్వానిస్తూ స్టాలిన్ వ్రాసిన లేఖ అది. అందరికీ ఆశ్చర్యం కల్గించింది. సాధారణంగా స్టాలిన్ విదేశీ రాయబారులను చూచేవాడు కాదు. అదివరలో శ్రీమతి విజయలక్ష్మి పండిట్ 18 మాసాల పాటు రష్యాలో భారత రాయబారిణిగా పనిచేశారు. కాని ఆమెకు రష్యా అధినేత మార్షల్ స్టాలిన్ తో ఇంటర్వ్యూ లభించలేదు. రాధాకృష్ణన్ తత్వవేత్త. చాలా సౌమ్యుడు. రాజకీయాలు, దౌత్యవ్యవహారాలతో ఆయనకు అంతగా పరిచయం లేదు. స్టాలిన్ ను చూద్దామా అతి క్రూరుడని, అతని తత్వానికి రాధాకృష్ణన్ కు ఏమాత్రం పడదని అందరూ అన్నారు. రాయబారిగా రష్యా వచ్చిన రాధాకృష్ణన్ రోజుకు పద్దెనిమిది గంటలు పుస్తకాలు చదవటం, వ్రాయటంలో గడుపుతుంటాడని విన్నాడు స్టాలిన్. ఆహ్వానం అందుకున్న డా. రాధాకృష్ణన్ రాయబార కార్యాలయోద్యోగి రాజేశ్వర్ దయాళ్ తో పాటు స్టాలిన్ వున్న గదిలో ప్రవేశించారు. రష్యా విదేశాంగమంత్రి విటాన్‌స్కీ స్టాలిన్ ప్రక్కనే ఉన్నారు. పావ్‌లోవ్ దుబాసిగా ఉన్నాడు. ఆ సమావేశాన్ని వివరిస్తూ రాధాకృష్ణన్ ఇలా వ్రాశారు. "మా సంభాషణలో అశోక చక్రవర్తి ప్రస్తావన వచ్చింది. ఆయన పెక్కు యుద్ధాలు చేశాడని, వేలాది ప్రజలను చంపి యుద్ధంలో విజయం సాధించాడని, చివరకు ఆ మహారాజు సన్యాసిగా మారిపోయాడు అంటూ కళింగ యుద్ధం గురించి చెప్పాను. అశోకుని పరిస్థితి మీకూ కలగవచ్చు అన్నాను. అందుకు స్టాలిన్, 'అవును అద్భుత సంఘటనలు సంభవిస్తాయి' అన్నాడు. సమావేశం చివర నేను స్టాలిన్ చెక్కిళ్ళను నిమిరి వీపుపై తట్టాను. ఆయన తలపై నా చేతిని ఆడించాను. అప్పుడు స్టాలిన్ "అయ్యా, నన్ను రాక్షసునిగాకాక, మనిషిగా గుర్తించిన వారు మీరొక్కరే. మీరు త్వరలోనే స్వదేశానికి తిరిగి వెళుతున్నట్లు విన్నాను. అందుకు విచారిస్తున్నాను. నేను ఇక ఎంతోకాలం బ్రతకను." అన్నాడు. తర్వాత ఆరు నెలలకే చనిపోయాడు స్టాలిన్. గాంధీజీ హత్యకు గురి అయ్యే కొద్ది రోజులముందు రాధాకృష్ణన్ గాంధీజీని కలుసుకున్నారు. తాను రచించిన 'భగవద్గీత' ఆంగ్లానువాదాన్ని గాంధీకి అంకితం చేయదలచినట్లు చెప్పారు రాధాకృష్ణన్. అందుకు గాంధీజీ సమాధానమిస్తూ "మీ రచనలు చాలా గొప్పవి. కానీ నా అభిప్రాయం వినండి. నేను, మీ అర్జునుణ్ణి. మీరు నా కృష్ణభగవాన్ " అన్నాడు గాంధీజీ. ఇలా మహాత్ముని మన్ననలందుకున్న మహాపండితుడు, రాధాకృష్ణన్. జననం - విద్యాభ్యాసం శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ 5-9-1888న మద్రాసుకు 40 మైళ్ళ దూరంలోని తిరుత్తణి లో జన్మించారు. తండ్రి వీరాస్వామయ్య. ఒక జమీందారీలో తహసిల్దార్. ప్రాథమిక విద్య తిరుత్తణిలో సాగింది. తిరుపతి, నెల్లూరు, మద్రాసు క్రిస్టియన్ కాలేజీ మున్నగుచోట్ల చదివి ఎం.ఏ పట్టా పొందాడు. బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు కలవాడాయాన. విద్యార్ధిగా వున్నపుడు, మనస్తత్వశాస్త్రంపై చేసిన ఉపన్యాసాలు అందరినీ అలరించేవి. 21 సంవత్సరాలైనా దాటని వయసులో ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యారు. తత్వశాస్త్రంలో అతని ప్రతిభను విని మైసూరు విశ్వవిద్యాలయం అతనిని ప్రొఫెసర్ గా నియమించింది. ఆయన ఉపన్యాసాలను ఎంతో శ్రద్ధగా వినేవారు విద్యార్థులు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చేపట్టమని, డా. అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ టాగూర్‌లు కోరారు. కలకత్తా వెళ్ళాలని నిశ్చయించుకున్నారు రాధాకృష్ణన్. ఆయన ఇంటిముందు గుర్రపుబండి సిద్ధంగా ఉంది. తమ అధ్యాపకునికి వీడ్కోలు చెప్పటానికై విద్యార్థులు ఆయన ఇంటికి వచ్చారు. బండికి కట్టిన గుర్రాలను వదిలించారు. రైల్వే స్టేషన్ దాకా బండిని తామే లాక్కొని వెళ్ళారు. అది విద్యార్ధులకు ఆయన పట్ల వున్న ప్రేమకు సంకేతం. విద్యార్ధుల భక్తిశ్రద్ధలను గమనించిన రాధాకృష్ణన్ కళ్ళు చెమ్మగిల్లాయి. అది గురుశిష్యుల హృదయానుబంధం. ఆ ప్రేమానుబంధం ఈనాడు అంతగా కానరాదు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా వున్నప్పుడు ఆయన 'భారతీయ తత్వశాస్త్రం' అన్న గ్రంథం వ్రాశాడు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలందుకున్నది. "మీరు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ తీసుకుని వుంటే మీకు మరింత గొప్ప పేరు వచ్చేది" అన్నాడొక మిత్రుడు. అందుకు బదులుగా, డా. రాధాకృష్ణన్ "నేను ఆక్స్‌ఫర్డ్ వెళ్తే, అధ్యాపకుడిగా మాత్రమే వెళ్తాను. కాని విద్యార్ధిగా మాత్రం వెళ్ళను" అన్నాడు. అలా అన్న ఆరేళ్ళ తర్వాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం వారి ఆహ్వానంపై, ప్రాచ్య తత్వశాస్త్రంపై ఉపన్యాసాలిచ్చేందుకు వెళ్ళారు. ఇంగ్లండ్, ఫ్రాన్స్, అమెరికాలలో పలుచోట్ల ఉపన్యాసములిచ్చి మాతృదేశం వచ్చారు. 1931లో డా. సి.ఆర్.రెడ్డి గారి తర్వాత రాధాకృష్ణన్ గారు ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్‌గా పనిచేశారు. అప్పట్లో డా. రాధాకృష్ణన్‌గారి పిలుపుననుసరించి ప్రొఫెసర్ హిరేన్ ముఖర్జీ, హుమయూన్ కబీర్ వంటి మేధావులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పనిచేశారు. 1931లోనే రాధాకృష్ణన్ "లీగ్ ఆఫ్ నేషన్స్ 'ఇంటలెక్చ్యుయల్ కో-ఆపరేషన్ కమిటి'" సభ్యులుగా ఎన్నుకోబడినారు. 1936లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమతాల గౌరవాధ్యపకులయ్యారు. చైనా, అమెరికా దేశాల్లో పర్యటించి పెక్కు ప్రసంగాలు చేశారు. 1946లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులయ్యారు. 1947 ఆగష్టు 14-15తేదీన మధ్యరాత్రి 'స్వాతంత్ర్యోదయం' సందర్భాన శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం సభ్యులను ఎంతో ఉత్తేజపరిచింది. 1949లో భారతదేశంలో ఉన్నత విద్యాసంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఒక కమిటి నియమించింది. దానికి అధ్యక్షుడు డా. రాధాకృష్ణన్. డా.రాధాకృష్ణన్, ప్రధాని నెహ్రూ కోరిక మేరకు 1952-62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. రచనలు ముఖ్యమైన ఉపనిషత్తులు, ఈస్ట్ అండ్ వెస్ట్ సమ్-రెఫ్లెక్షన్, రికవరీ ఆఫ్ ఫేత్, ఎ సోర్స్ బుక్ ఇన్ ఇండియన్ ఫిలాసఫి, కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ వంటి చాలా గొప్ప గ్రంథాలు రచించినారు. 1962లో బాబూ రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతి పదవి నుండి విరమించుకున్నారు. వారి తర్వాత రాష్ట్రపతిగా ఉన్న డా. రాధాకృష్ణన్ అయిదేళ్ళ కాలంలో ఎన్నో దేశాల్లో పర్యటించారు. అసమాన వాగ్ధాటితో, ప్రాచ్య పాశ్చాత్వ తత్వశాస్త్రాలపై చేసిన ఉపన్యాసాలు అన్ని దేశాల వారిని ఆశ్చర్యపరిచాయి. ఛలోక్తులు ఆయన ఉపన్యాసాల్లో ఛలోక్తులు, హాస్యోక్తులు దొర్లేవి. ఒకసారి సర్. మహమద్ ఉస్మాన్ (ఒకప్పుడు మద్రాసు రాష్ట్రమంత్రి) డా.రాధాకృష్ణన్ ఒకే సభలో మాట్లాడారు. సర్ మహమద్ ఉస్మాన్‌ను గురించి మాట్లాడుతూ, "శ్రీ ఉస్మాన్ నాకు చాలా సన్నిహిత మిత్రుడు. ఆయన కాలేజీలో మొదట సీనియర్. ఆ తర్వాత నా క్లాస్‌మేట్. తర్వాత నా జూనియర్. నేను మద్రాసులో ప్రొఫెసర్‌గా వున్నప్పుడు ఆయన అదే యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్. నేను వైస్ ఛాన్స్‌లర్‌గా వుండినపుడు ఆయన ఛాన్స్‌లర్." రాధాకృష్ణన్, మానవజీవితంలో మంచిని పెంచాలనీ, ఉత్తమ సమాజాన్ని రూపొందించాలని, మతాన్ని సరిగా అర్థం చేసుకోవాలని బోధించారు. మానవుల్లోని మమతానురాగాలను పెంచుటకు ప్రపంచం కృషి చేయాలన్నారు. అహింసా విధానం ద్వారా ప్రపంచ దేశాలన్నీ శాంతిని పెంచాలన్నారు. ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు వారిని గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 1969లో భారత ప్రభుత్వం వారిని 'భారతరత్న' తో సత్కరించింది. 1975లో 'టెంపుల్ టన్' బహుమతి ద్వారా లభించిన 96 వేల డాలర్ల మొత్తాన్ని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ సంస్కృతిపై ప్రసంగాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. రాధాకృష్ణన్ గారు, డా. కె. యం మున్షీగారితో కలిసి భారతీయ విద్యాభవన్ స్థాపించారు. మహామేధావిగా, గొప్పవ్యక్తిగా, గొప్ప గ్రంథకర్తగా, తత్వవేత్తగా, ప్రపంచ దేశాల మన్ననలందుకున్న డా. రాధాకృష్ణన్ భారతీయ మహర్షులకోవకు చెందిన వారు. రాష్ట్రపతి పదవీ విరమణ చేసిన తర్వాత (1967) చివరిరోజు వరకు మద్రాసులోని తమ భవనంలో, తాత్విక చింతన చేస్తూ 17.4.1975న పరమపదించారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్థంతి సందర్భంగా ఘన నివాళి 💐🌹🌺🏵️🌸🌼🌻✨🙏 Tributes to Great Indian Philosopher, President of India, Educationist & #BharatRatna Dr. #SarvepalliRadhakrishnan on his death anniversary today. #RadhaKrishnan birthday observed as #TeachersDay in India on sept 5. #DrSRadhaKrishnan placed Indian Philosophy on the World Map
#

సర్వేపల్లి. రాధాకృష్ణన్ వర్దంతి

సర్వేపల్లి. రాధాకృష్ణన్ వర్దంతి - India ' s first vice - president & scoond President , Dr Sarvepalli Radhakrishnan , was died on Apr 17 . 1975 డా , సర్వేపల్లి రాధాకృష్ణన్ Sool sooo on us Jade INDIA ' S MOST FAMOUS TEACHER Awarded the Bharat Ratna , Order of Merit , Knight Bachelor , Templeton Prize Taught in Madras Presidency College , University of Mysore , University of Calcutta , BHU Knighted by King George Vin 1931 for his services to cducation Slopped using the lille ' Sir ' aler India ' s independence Placed Irdan Phi osophy on the world map Reading a book gives us the habit of solitary reflection and true enjoyment H . రావు - ShareChat
241 వీక్షించారు
7 నెలల క్రితం
#

సర్వేపల్లి. రాధాకృష్ణన్ వర్దంతి

🤝టీచర్స్ డే 🤝 🙏 గురుదేవోభవః... ఆచార్యదేవోభవః🙏 సెప్టెంబర్ 5. సమాజ నిర్మాణానికి తోడ్పడుతున్న ఉపాధ్యాయులకు నీరాజనం అర్పించే సుదినం టీచర్స్ డే. భారత్‌లో ప్రతి ఏటా సెప్టెంబర్ 5న ఈ గురుపూజా దినోత్సవాన్ని విద్యార్థినీ విద్యార్థులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు మరో సందర్భంలో కూడా ఓ విశిష్టమైన దిన టీచర్స్ డే సెప్టెంబర్ 5. సమాజ నిర్మాణానికి తోడ్పడుతున్న ఉపాధ్యాయులకు నీరాజనం అర్పించే సుదినం టీచర్స్ డే. భారత్‌లో ప్రతి ఏటా సెప్టెంబర్ 5న ఈ గురుపూజా దినోత్సవాన్ని విద్యార్థినీ విద్యార్థులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు మరో సందర్భంలో కూడా ఓ విశిష్టమైన దినంగా వెలుగొందుతోంది.    భారత దేశం గర్వించదగిన మహోపాధ్యాయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సెప్టెంబర్ 5. విద్యతో మాత్రమే ఒక సమాజం దృఢంగా నిర్మించబడుతుందని త్రికరణశుద్ధిగా నమ్మినవారు రాధాకృష్ణన్. భారతీయ దౌత్యవేత్తగా, స్కాలర్‌గా, దేశాధ్యక్షుడిగా అన్నిటికంటే మించి బోధకుడిగా జీవితలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహనీయులు రాధాకృష్ణన్.    టీచర్స్ డే ఎలా పుట్టింది? రాధాకృష్ణన్ 1962లో భారత రాష్ట్రపతిగా పదవీ ప్రమాణం చేసిన సందర్భంగా కొంతమంది విద్యార్థులు, స్నేహితులు కలిసి సెప్టెంబర్ 5న తన పుట్టిన రోజును ఘనంగా జరిపేందుకు అనుమతివ్వాలని కోరారు. అయితే తన పుట్టిన రోజును ప్రత్యేకంగా జరిపేందుకు బదులుగా ఆరోజును ఉపాధ్యాయదినంగా జరుపుకుంటే తనకు చాలా సంతోషంగా ఉంటుందని ఆయన సూచించారు. ఉపాధ్యాయ వృత్తికి డాక్టర్ రాధాకృష్ణన్ ఎంత ప్రాధాన్యత ఇచ్చారో దీన్ని బట్టి అర్థమవుతుంది. అప్పటినుంచి ప్రతిఏటా సెప్టెంబర్ 5ను భారత్‌లో గురుపూజా దినోత్సవంగా జరుపుకుంటున్నారు.    ఒక వ్యక్తి పుట్టిన రోజును దేశంలోని ఉపాధ్యాయులందరినీ స్మరించుకునే ఉత్సవంగా జాతి నిర్వహించుకోవడానికి గల కారణాలు ఏమిటి అంటే... తాత్వికంగా, ఆధ్యాత్మికపరంగా, విద్యాపరంగా, సామాజిక, సాంస్కృతిక పరంగా ఆధునిక భారత్‌లోని విశిష్టమైన రచయితలలో రాధాకృష్ణన్ ఒకరు. తన కాలంలో పేరు గాంచిన అన్ని పత్రికలలోనూ ఆయన రచనలు చేశారు. ఆ రచనలోని గాఢత, నైశిత్యం, అర్థవంతమైన వ్యక్తీకరణలకు పలువురు పాఠకులు దాసోహమయ్యారంటే ఆశ్చర్యపడవలసింది లేదు.   ఉపాధ్యాయులు జాతి పథ నిర్దేశకులు తాము ప్రభావితం చేసే శిష్యుల, విద్యార్థుల జీవితాలను తీర్చిదద్దగల శక్తి సమాజంలో ఉపాధ్యాయులకు మాత్రమే ఉంది. ఎందుకంటే గురుముఖంలో నేర్చుకున్న పాఠాలు, విలువలు విద్యార్థుల జీవిత పర్యంతం నిలిచి ఉంటాయి. అందుకే మన ఉపాధ్యాయులను మనం ఎల్లప్పుడు గౌరవించాలి. అలాగే విద్యార్థుల ఉన్నతి పట్ల గురువులు చూపుతున్న శ్రద్ధాసక్తులకు గాను సమాజం, కమ్యూనిటీ కూడా వారిని ప్రోత్సహించాలి.    ఒక సంవత్సరం లేదా కొన్ని సంవత్సరాలు తాము పాఠాలు నేర్చుకున్నందుకు కృతజ్ఞతా భావంతో విద్యార్థులు ఈ రోజు తమకు విద్య నేర్పిన గురువులను, అధ్యాపకులను స్కూళ్లలో, కళాశాలల్లో లేదా వారి ఇళ్లలో కలిసి నమస్కరించే వేళ యావత్ జాతి గురుపీఠానికి నీరాజనం పడుతున్నట్లు అనిపిస్తుంది. జీవితంలో పైచదువులకో, ఉద్యోగాలకో, పరిశోధనలకో వెళుతూ చివరిసారిగా ఉపాధ్యాయులను కలిసి అభివందనాలను అర్పించే సమయంలో గురుశిష్య సంగమాన్ని చూసినపుడు లేదా అనుభూతి చెందినప్పడు కలిగే భావోద్వేగాలు అనిర్వచనీయాలు.    పాఠాలు నేర్చుకునే దశ దాటి భవిష్యత్తులో బోధనా వృత్తిలో అడుగుపెట్టాలని కలలు గనే భావి ఉపాధ్యాయులు, తమ గురువుల్లాగా తాము ఎంతమంది రేపటి విద్యార్థుల జీవితాలపై ప్రభావం చూపగలమో ఊహించుకుని పరవశించిపోయే విద్యార్థులు, అలాగే తాము విద్యార్థి దశలో ఉన్నప్పుడు కేరింతల జీవితంతో గడిపిన క్షణాలను తలచుకుని ఆనందించే గురువులు.. ఇలా గురుశిష్య పరంపరకు నిండైన అర్థం చెప్పే గురుపూజా దినోత్సవాన్ని మనసారా జరుపుకుందాం..    అలాగే ఒక చిన్న పట్టణంలో అల్లరి పిల్లాడిగా జీవితం ప్రారంభించి భారతీయ విద్యావైభవాన్ని ఆపోసన పట్టి ప్రజాస్వామిక భారత చరిత్రలో అత్యంత గౌరవనీయ వ్యక్తిగా మన్ననలందుకొంటూ జాతి జనుల హృదయాల్లో నిలిచిపోయిన డాక్టర్ రాధాకృష్ణన్ చిరస్మృతిని కూడా ఈ టీచర్స్ డే సందర్భంగా గుర్తుచేసుకుందాం. మంచి టీచర్ అంటే తను కొవ్వొత్తిలా వెలిగేవాడు... ఇతరులకు మార్గనిర్దేశం చూపేందుకు తనను తాను కరిగించుకునేవాడు.  అందుకే... గురుదేవోభవః ఆచార్యదేవోభవః
6k వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
మరిన్ని పోస్ట్‌లు లేవు
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post