హెల్మెట్లు పెట్టుకోరు-హైకోర్టు

హెల్మెట్లు పెట్టుకోరు-హైకోర్టు

#

హెల్మెట్లు పెట్టుకోరు-హైకోర్టు

రోడ్లు దాటే పరిస్థితి ఏది?‘జంట నగరాల్లో జీబ్రా లైన్ల వద్ద రోడ్డు దాటేందుకు పాదచారులకు వాహనదారులు అవకాశం ఇవ్వట్లేదు. వాహనదారుల దెబ్బకు పాదచారులు హడలిపోతున్నారు. పాదచారులు కూడా చెవుల్లో ఇయర్‌ ఫోన్లు పెట్టుకుని పాటలు వింటూ రోడ్లు దాటుతున్నారు. పక్క నుంచి, వెనుక నుంచి వచ్చే వాహనాలను పట్టించుకోవట్లేదు. ఛత్తీస్‌గఢ్‌లో ద్విచక్రవాహనంపై ముగ్గురు వెళ్తారు. హెల్మెట్‌ పెట్టుకోరు. ఇక్కడ కూడా అంతే. అయితే ఒకటే తేడా. ఇక్కడ ముగ్గురితో పాటు బరువైన సంచో, బస్తానో ఉంటుంది’అని వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందంది.  తల్లిదండ్రులపై చర్యలు తీసుకునే చట్టం లేదా?కొందరు పిల్లలు వాహనం నడిపే అర్హత లేకపోయినా అత్యంత వేగంగా వాహనాలు నడుపుతున్నారని, అలాంటి వారి తల్లిదండ్రులపై చర్యలు తీసుకునే చట్టం ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందా అని ధర్మాసనం ఆరా తీసింది. వన్‌వేల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడుపుతున్నారని, దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఆసుపత్రులు, న్యాయస్థానాలు, నివాస ప్రాంతాల్లో ఇష్టమొచ్చినట్లు హారన్లు వినియోగించడంపై కూడా దృష్టి సారించాలని పేర్కొంది.కాగా, హైదరాబాద్‌లో రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్లను విస్తరించట్లేదని, రోడ్డు ప్రమాదాలను నివారించే విషయంలోనూ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదంటూ న్యాయవాది రాపోలు భాస్కర్‌ రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా పరిగణించిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం విచారణ జరిపిన ధర్మాసనం.. ఈ వ్యాజ్యాన్ని కూడా విపిన్‌ శ్రీవాత్సవ వ్యాజ్యంతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.  
1.6k views
3 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post