శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్
23 Posts • 1K views
PSV APPARAO
672 views
#టీటీడీ పాలకమండలి సమావేశం #శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ #టీటీడీ న్యూస్ #టీటీడీ న్యూస్!!!📰 #తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS 👆 *శ్రీ‌వారి ఆల‌యంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం* *– కాణిపాకంలో నూత‌న యాత్రికుల వ‌స‌తి స‌ముదాయం నిర్మాణం* *– టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు* తిరుమ‌ల‌, 2025 అక్టోబ‌రు 28: భ‌క్తుల‌కు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పించ‌నున్న‌ట్లు టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు చెప్పారు. అదేవిధంగా ధ‌ర్మ ప్ర‌చారంలో భాగంగా గ్రామాల్లో భ‌జ‌న మందిరాలు నిర్మించ‌నున్న‌ట్లు ఆయ‌న‌ తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌తో కలసి మంగ‌ళ‌వారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యాంశాలు…… 1.ఇటీవల శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. బ్రహ్మోత్సవాల విజయవంతంలో భాగస్వాములైన ఉద్యోగులు, జిల్లా, పోలీసు యంత్రాంగం, ఇతర విభాగాల సిబ్బందికి, శ్రీవారి సేవకులకు, సహకరించిన మీడియాకు, భక్తులకు టీటీడీ బోర్డు అభినందనలు తెలియజేస్తోంది. 2.తిరుమలలో గదుల టారీఫ్ లను పరిశీలించి నివేదిక సమర్పించడానికి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.  3. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో టిటిడి ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం. పర్మినెంట్ ఉద్యోగులకు రూ.15,400, కాంట్రాక్ట్ / జౌట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.7,535 ఇవ్వాలని నిర్ణయం. అయితే బ్రహ్మోత్సవాలలో పనిచేసిన తిరుమల, తిరుపతికి చెందిన సిబ్బందికి అదనంగా 10 శాతం ఇవ్వాలని నిర్ణయం.  4. టీటీడీ గోశాల నిర్వహణకు సబంధించి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా గోశాల నిర్వహణ, అభివృద్ధిపై తదుపరి చర్యలు తీసుకుంటాం.  5. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం రూ.37 కోట్ల వ్యయంతో 100 గదులను ఆధునిక వసతులతో నూతన అతిధి భవనాన్ని నిర్మించేందుకు ఆమోదం.  6. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వద్ద భక్తులకు మరింత ఆహ్లాదకర, ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించేందుకు రూ.2.96 కోట్లతో 1.35 ఎకరాల్లో పవిత్ర వనం ఏర్పాటుకు ఆమోదం.  7. కాణిపాకంలోని శ్రీ వ‌ర‌సిద్ధి వినాయ‌క స్వామి ఆల‌యం వ‌ద్ద యాత్రికుల వ‌స‌తి స‌ముదాయం, సామూహిక వివాహాల‌కు ప్ర‌త్యేక హాల్స్ నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరుకు ఆమోదం. ఇందుకు సంబంధించి ప్ర‌భుత్వ అనుమ‌తి కొర‌కు పంపాప‌ల‌ని నిర్ణ‌యం.  8. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చెన్నై టి.నగర్ లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం పరిధిలో ఉన్న 6,227 చ.అ. స్థలాన్ని దాతల సహకారంతో రూ.14 కోట్లతో కొనుగోలు చేసేందుకు నిర్ణయం .  9. తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ లో శ్రీ పద్మావతి మరియు శ్రీ ఆండాళ్ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, ఆలయ ప్రాకారం, రాజగోపురం, నాలుగు మాడ వీధులు, తదితర మౌళిక సదుపాయాల కల్పనకు ఇప్పటికే ఆమోదించిన రూ.20 కోట్ల నిధులతో పాటు అదనంగా మరో రూ. 10 కోట్లు దాత‌ల ద్వారా సేక‌రించాల‌ని నిర్ణయం. 10. వేద విశ్వ‌విద్యాల‌యం విసి ఆచార్య రాణి స‌దా శివ‌మూర్తిని తొల‌గించాల‌ని నిర్ణ‌యం. 11. టీటీడీ కొనుగోలు విభాగంలో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఎసిబితో విచార‌ణ జ‌ర‌పాల‌ని నిర్ణ‌యం. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ వెంక‌య్య చౌద‌రి, ప‌లువురు బోర్డు స‌భ్యులు, జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం త‌దిత‌రులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
10 likes
8 shares
PSV APPARAO
953 views
#తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS #కాల్ టు టిటిడి ఈవో ☎️ Dial Your EO #టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ #తిరుమల వెళ్లే వారికి గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ #శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ 👆 *సామాన్య భక్తులకు పెద్దపీట* *– భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతం* *– బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి* *– మాడ వీధుల్లోని గ్యాలరీలలో షెల్టర్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాల పరిశీలన* *– టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్* తిరుమల, 2025 అక్టోబరు 03: శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సామాన్య భక్తులకు మరింత మెరుగ్గా శ్రీవారి దర్శనం, వసతి, అన్నప్రసాదాలు తదితర సౌకర్యాలు కల్పిస్తామని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం ఉదయం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, గౌ.ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తనకు రెండవసారి శ్రీవారి సన్నిధిలో ఈవోగా అవకాశం ఇవ్వడం తన అదృష్టం అన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులు గంటల తరబడి వేచి ఉండి స్వామివారి వాహన సేవలు దర్శించుకున్నారన్నారు. భక్తులకు టిటిడి అందించిన అన్న ప్రసాదాలు, రవాణా, పారిశుద్ధ్యం, భద్రత, శ్రీవారి సేవకుల సేవలు, తదితర సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారని భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యంగా గరుడసేవ నాడు ఉదయం ఎండ తీవ్రత, మధ్యాహ్నం మూడు సార్లు వర్షం పడిందన్నారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడగా, వారి విజ్ఞప్తి మేరకు నాలుగు మాడ వీధిలోని గ్యాలరీలలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా షెల్టర్లు ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అనంతరం పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు…… 1. శ్రీ శ్రీనివాస్ – కడప ప్రశ్న : రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు నెలలో ఒక్కరోజు ప్రత్యేకంగా విడుదల చేయండి. ఈవో : పరిశీలిస్తాం 2. శ్రీ శంకరయ్య గౌడ్ – హైదరాబాద్ ప్రశ్న : నవంబర్ 14 నుండి 16వ తేదీ వరకు పరకామణి సేవ బుక్ చేసుకున్నాం. కానీ 14వ తేదీ రిపోర్టు చేయాలని ఉంది. ఈవో : సాఫ్టు వేర్ లో మార్పులు చేసాం, నవంబర్ 13వ తేదీ రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 3. శ్రీ మల్లేశ్వరరావు – పల్నాడు ప్రశ్న : ప్రభుత్వ ఉద్యోగులకు వారి వారి లెటర్ తో సంవత్సరంలో ఒకసారి శ్రీవారి దర్శనం కల్పించండి. ఈవో : ఇప్పటికే రూ.300/- ఎస్ఈడి టికెట్లు ఆన్ లైన్ లో, తిరుపతిలో కరెంటు బుకింగ్ ఎస్ఎస్ డి టికెట్లు జారీ చేస్తున్నాం. శ్రీవారి దర్శనానికి వీటిని పొందవచ్చు. 4 శ్రీ శ్రీనివాస్ – మెట్టపల్లి ప్రశ్న: లడ్డు ప్రసాద సేవ తిరిగి ప్రవేశపెట్టండి. ఈవో: కొన్ని కారణాల వల్ల లడ్డు ప్రసాద సేవ ఆపివేశం. 5. శ్రీ వీరబాబు – కాకినాడ ప్రశ్న: అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో నడిచి వచ్చే భక్తులకు నిరంతరాయంగా దర్శనం టోకెన్లు మంజూరు చేయండి. ఈవో: ప్రతిరోజు 16 నుండి 24 వేల వరకు ఎస్ ఎస్ డి టోకెన్లు జారీ చేస్తున్నాం. 6. శ్రీ నాగేశ్వరరావు – తిరుపూర్ ప్రశ్న : వెండి వాకిలి నుండి బంగారు వాకిలి వరకు భక్తులను మధ్య తోపులాట ఎక్కువగా ఉంది. అక్కడ విధుల్లో ఉన్నవారు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఈవో : వెండి వాకిలి నుండి బంగారు వాకిలి వరకు భక్తులతో ఏ విధంగా ప్రవర్తించాలి అనే దానిపై శ్రీవారి సేవకులు, సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాం. శ్రీవారి దర్శనానికి 20 గంటలకు పైగా భక్తులు వేచి ఉంటారు. కావున ఒక్క నిమిషం పాటైనా స్వామి వారిని చూడాలనుకుంటారు. క్యూలైన్లు సాఫీగా ఉండేలా చర్యలు చేపడతాం. 6. శ్రీ నాగేశ్వరరావు – తిరుపూర్ ప్రశ్న :రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నప్పుడు వేడిగా ఉన్న అన్నప్రసాదాలు ఇచ్చిన వెంటనే గేట్లు తెరవడం వలన అన్నప్రసాదాలు వృధా అవుతున్నాయి. అదేవిధంగా తిరుమల సంప్రదాయానికి విరుద్ధంగా మహిళలు పూలు పెట్టుకు వస్తున్నారు, అవగాహన కల్పించండి. ఈవో : అన్నప్రసాదాలు వృధా కాకుండా చర్యలు తీసుకుంటాం. తిరుమల క్షేత్ర సాంప్రదాయం పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. 8. కృష్ణ చైతన్య – ఖమ్మం ప్రశ్న : లక్కీ డిప్ ద్వారా శ్రీవారి సేవలు పొందాం. తిరుమలలో వసతిని ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం. గదులు పొందేందుకు నిర్ణీత సమయం కంటే రెండు గంటలు అధిక సమయం ఇవ్వండి. ఈవో : పరిశీలిస్తాం. 9. గీతా కుమారి – పశ్చిమగోదావరి ప్రశ్న : సెప్టెంబర్ 16 నుండి 30వ తేదీ వరకు సీనియర్ శ్రీవారి సేవకులుగా సేవలు అందించాం. హరినామ సంకీర్తన వద్ద అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది పోలీస్ వారి కుటుంబ సభ్యులను అనుమతించారు, మాకు గేట్ తీయలేదు. ఈవో : 3500 మంది శ్రీవారి సేవకులు బ్రహ్మోత్సవాలలో అత్యద్భుతంగా భక్తులకు సేవలు అందించారు. ప్రత్యేకంగా గరుడసేవనాడు అందించిన సేవలకు భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వల్ల ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకుంటాం. 10. శ్రీ హరికృష్ణ – ఖమ్మం మాధురి – హైదరాబాద్ ప్రశ్న : అంగప్రదక్షిణ టోకెన్లు ఆన్లైన్లో ప్రతినెలా ఇవ్వాలి. ఒకసారి పొందితే ఆరు నెలల వరకు పొందేందుకు అవకాశం లేదు, కావున ప్రతినెల అవకాశం కల్పించండి. ఈవో : చాలామంది భక్తులు అంగప్రదక్షిణ టికెట్ల జారీపై తనను సంప్రదించారని, టిటిడి బోర్డు మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. 11 అలేఖ్య హైదరాబాద్ ప్రశ్న : వయోవృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రతి నెల టోకెన్లు జారీచేయండి. మూడు నెలలకు ముందు బుక్ చేసుకుంటే వారు అనారోగ్య కారణాల వలన రాలేకపోతున్నారు. ఈవో : ఎక్కువ మంది భక్తులకు మేలు చేయాలనేదే ముఖ్య ఉద్దేశం. మీరు చెప్పిన అంశాన్ని పరిశీలిస్తాం. 12 అరుంధతి – హైదరాబాద్ సుబ్బలక్ష్మి – హైదరాబాద్ ప్రశ్న : వయోవృద్ధులకు, దివ్యాంగులకు ఇదివరకు తిరుమలలో ప్రతిరోజు కేటాయించే విధంగా దర్శన టోకెన్లు కేటాయించండి. ఆన్లైన్లో మూడు నెలలకు ముందు కాకుండా 15 రోజులకు ముందు విడుదల చేయండి. ఈవో: పరిశీలిస్తాం. 13. హరి ప్రసాద్ తిరుపతి, ప్రశ్న : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కొందరు దళారులు టిటిడి ఉద్యోగులు దర్శనం ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నారు దర్శనం ఇప్పించకపోగా, తిరిగి డబ్బులు ఇవ్వలేదు. ఈవో : ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా టిటిడి ఉద్యోగులు, దళారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్ఓ శ్రీ కే.వి. మురళీకృష్ణ, సిఈ శ్రీ సత్యనారాయణ, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి చే జారీ చేయబడింది.
4 likes
16 shares
PSV APPARAO
786 views
#తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS #టీటీడీ న్యూస్ #శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ #తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైభవం🕉️ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చూద్దాం రారండి 🙏 #తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS 👆 *శ్రీవారి బ్రహ్మోత్సవాలకు స్మూక్ష–క్షేత్రస్థాయిలో ప్రణాళికలు* *భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి* *టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్* తిరుమల, 2025 సెప్టెంబర్ 19: తిరుమల పవిత్రత కాపాడటమే కాకుండా సాధారణ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడం ముఖ్య లక్ష్యంగా పని చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు స్మూక్ష్మ, క్షేత్రస్థాయి ప్రణాళికలు రూపొందించి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్ లో ఆయన టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, టీటీడీ వివిధ విభాగాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వివరించారు. *సమావేశంలోని ముఖ్యాంశాలు:* • 2025 సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి. • జిల్లా పాలన, పోలీసులతో కలిసి సూక్ష్మ- క్షేత్రస్థాయి ప్రణాళికలు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పాల్గొనగలిగేలా సమన్వయంతో ఏర్పాట్లు. • ఇప్పటికే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఆభరణాల శుభ్రత, వాహనాల ట్రయల్ రన్ పూర్తి. • ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు. సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు గరుడసేవ. • ధ్వజారోహణం రోజు (సెప్టెంబర్ 24) రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పణ. సెప్టెంబర్ 25న పిఏసి-5ను ప్రారంభం. • సివిల్ ఇంజినీరింగ్ పనులకు రూ.9.50 కోట్లు, విద్యుద్దీపాలంకరణకు రూ.5.50 కోట్లు కేటాయింపు. దాతల విరాళాల ద్వారా రూ.3.50 కోట్లతో పుష్పాలంకరణ. • పుష్పాలంకరణకు 60 టన్నుల పుష్పాలు వినియోగం. • బ్రహ్మోత్సవ రోజుల్లో సిఫార్సు లేఖల ద్వారా గదుల కేటాయింపులు రద్దు. ఈ సమయంలో 3500 గదులు ఆఫ్‌లైన్‌లో సాధారణ భక్తులకు మాత్రమే కేటాయింపు. • భక్తులు వాహన సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించేందుకు ఈ ఏడాది 36 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు. • 1.16 లక్షల ప్రత్యేక దర్శన టికెట్లు, రోజూ 25 వేల SSD టోకెన్లు (గరుడసేవ మినహా) విడుదల. అన్ని ప్రివిలేజ్ దర్శనాలు రద్దు. వీఐపీ బ్రేక్ దర్శనం స్వయంగా విచ్చేసే ప్రోటోకాల్ ప్రముఖులకే పరిమితం. • రోజూ 8 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్. • 20 హెల్ప్ డెస్కులు ఏర్పాటు. ప్రతి గ్యాలరీలో భక్తుల అభిప్రాయాలను సేకరించేందుకు శ్రీవారి సేవకులు ప్రత్యేకంగా నియామకం. • గరుడసేవ రోజున భక్తులకు 14 రకాల వంటకాలు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కేంద్రంలో రోజూ ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాద వితరణ. • తిరుమలలో 24 ప్రాంతాల్లో సుమారు 4000 వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు. • తిరుపతిలో అలిపిరి లింక్ బస్‌స్టాండ్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, ఇస్కాన్ గ్రౌండ్, ఎస్వీ మెడికల్ కాలేజ్ గ్రౌండ్, భారతీయ విద్యాభవన్ గ్రౌండ్, దేవలోక్, AP టూరిజం ఓపెన్ ఏరియాల్లో మొత్తం 5250 ద్విచక్ర వాహనాలకు, 2700 కార్లకు పార్కింగ్ స్థలం కేటాయింపు. • పార్కింగ్ ప్రదేశాల నుండి తిరుమలకు ఆర్టీసీ బస్సులు. సాధారణ రోజుల్లో ఆర్టీసీ బస్సుల ద్వారా 1900 ట్రిప్పులు, గరుడసేవ రోజున 3200 ట్రిప్పులు తిరిగేందుకు ఏర్పాట్లు. • 2000 మంది టీటీడీ భద్రతా సిబ్బంది, 4700 పోలీసు సిబ్బంది, 450 సీనియర్ అధికారులు విధులు. • 3500 మంది శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు సేవలు. • 3000 సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం. • పారిశుద్ధ్యం కోసం 2300 సిబ్బందితో పాటు, 960 మంది అదనపు సిబ్బంది నియామకం. • కల్యాణకట్టలో భక్తుల తలనీలాల సమర్పణకు అందుబాటులో 1150 మంది క్షురకులు. • గతంలో ఎన్నడూ లేని విధంగా 28 రాష్ట్రాల నుండి వచ్చిన 298 బృందాల ప్రదర్శనలు. • గరుడసేవ రోజున 20 రాష్ట్రాల నుండి వచ్చిన 37 బృందాలు సంప్రదాయ, ఆధ్యాత్మిక కళారూపాల ప్రదర్శన. • భక్తులకు వైద్య సేవలు అందించేందుకు 60 డాక్టర్లు, 60 మంది పారా మెడికల్ సిబ్బంది. • అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 14 అంబులెన్స్ లు ఏర్పాటు. ఈ సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు, తిరుపతి మున్సిపల్ కమిషనర్ శ్రీమతి మౌర్య, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, సిఈ శ్రీ సత్య నారాయణ, తిరుమల ఏఎస్పీ శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
14 likes
6 shares