🛕తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు🕉️
4 Posts • 404 views
PSV APPARAO
809 views 2 months ago
#🛕తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు🕉️ #తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం 🙏 #అలివేలుమంగ అమ్మవారు, తిరుచానూరు #తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వైభవం 🪔🕉️🙏🙏🙏 #🔱లక్ష్మిదేవి కటాక్షం *తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం* - విశేషంగా ఆకట్టుకున్న అష్టలక్ష్మీ మండపం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన అమ్మవారు బంగారు చీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ పద్మావతీ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి సాంప్రదాయ పుష్పాలతో అమ్మవారిని ఆరాధించారు. ఈ సందర్భంగా అమ్మవారిని 9 గ్రంథులతో(నూలుపోగు) అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు. భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు వరలక్ష్మీ వ్రతం పూజావిధానాన్ని, మహత్యాన్ని తెలియజేశారని ఆలయ అర్చకులు శ్రీ శ్రీనివాస ఆచార్యులు తెలిపారు. పూర్వం శంకరుడు పార్వతిదేవికి ఈ వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత, ఆచరించవలసిన విధానాన్ని తెలియ చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. త్రేతాయుగంలో కుండలినీ నగరంలో నివసించిన చారుమతి అనే భక్తురాలు వరలక్ష్మీ నోము ఆచరించి పొందిన ఫల ప్రదాన్ని ఈ సందర్భంగా వివరించారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ప్రీతితో తిరుచానూరులో శ్రీ పద్మావతీ అమ్మవారు అవతరించారని, వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న మహిళలకు సత్సంతానం, దీర్ఘమాంగల్యసౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. తరువాత 12 రకాల వివిధ నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహా మంగళ హరతితో వరలక్ష్మీ వ్రతం ముగిసింది. ఈ సందర్భంగా టిటిడి ఈవో మీడియాతో మాట్లాడుతూ, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినట్లు చెప్పారు. ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడికి అమ్మవారి ప్రసాదాలు అందించేలా చర్యలు చేపట్టామన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో వ్రతంలో పాల్గొన్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూలైన్లు, అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, తదితర ఏర్పాట్లు చేశామన్నారు. వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు వీక్షించేలా ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు అందించామన్నారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా టిటిడికి చెందిన 52 ఆలయాల్లో 8 లక్షల గాజులు, 1.60 లక్షల కంకణాలు, 1.60 లక్షల పసుపు దారాలు, 1.60 లక్షల కుంకుమ ప్యాకెట్లు, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పుస్తక ప్రసాదాలను అందించామన్నారు. *భక్తులను విశేషంగా అకట్టుకున్న వ్రత మండపం* టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్యర్యంలో ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన వ్రత మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. 40 మంది సిబ్బంది, 3 ట‌న్నుల సంప్రదాయ పుష్పాలు, ఆరు రకాల 30 వేల కట్ ఫ్లవర్స్ తో మూడు రోజుల పాటు శ్రమించి అమ్మవారి ఆలయం, ఆస్థాన మండపం, వ్రత మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇందులో బత్తాయి, ఆపిల్ వంటి ఫలాలు, వివిధ సంప్రదాయ పుష్పాలతో వ్రత మండపాన్ని అద్భుతంగా రూపొందించారు. మండపం పైభాగంలో గజ లక్ష్మీ అమ్మవారు, కింది భాగంలో రెండు వైపుల ఐరావతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆస్థాన మండపాన్ని అష్టలక్ష్మి మూర్తులతో, రోజాలు, తామరపూలు లాంటి రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. చెన్నైకి చెందిన దాత విరాళంతో పుష్పాలంకరణ చేపట్టామని ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు తెలిపారు. భక్తులందరూ వ్రతాన్ని వీక్షించేందుకు వీలుగా ఆస్థాన మండపంలో, పుష్కరిణి వద్ద, వాహన మండపం వద్ద, ఫ్రైడే గార్డెన్స్, తొలప్ప గార్డెన్ వద్ద కలిపి 5 ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. *స్వర్ణరథోత్సవం* వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
17 likes
11 shares
Rochish Sharma Nandamuru
1K views 2 months ago
🌿🌼తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనం 🌼🌿 🌿🌼🙏సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం🙏🌼🌿 క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే| శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే|| ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే| త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్| సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ| రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః|| కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా| స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే|| వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ| గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః|| కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్| రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే|| కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే| విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ| పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే| కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే|| కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ| రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే|| ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా| రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః|| ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్| యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్|| అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్| సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్|| పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్| అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్|| పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్| భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్|| హత బంధుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్|| కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్|| సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్| హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్|| || ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం || 🌿🌼🙏ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే 🙏🌼🌿 #🌅శుభోదయం #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్ #🔱లక్ష్మిదేవి కటాక్షం #🛕తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు🕉️
20 likes
18 shares
Rochish Sharma Nandamuru
714 views 2 months ago
🌿🌼 తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనం 🌼🌿 🌿🌼🙏సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం🙏🌼🌿 క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే| శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే|| ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే| త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్| సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ| రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః|| కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా| స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే|| వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ| గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః|| కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్| రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే|| కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే| విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ| పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే| కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే|| కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ| రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే|| ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా| రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః|| ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్| యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్|| అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్| సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్|| పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్| అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్|| పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్| భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్|| హత బంధుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్|| కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్|| సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్| హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్|| || ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం || 🌿🌼🙏ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే 🙏🌼🌿 #🌅శుభోదయం #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్ #🔱లక్ష్మిదేవి కటాక్షం #🛕తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు🕉️
17 likes
16 shares