హార్ట్
94 Posts • 199K views
#గుండె_పోటు. ఈ ట్రిక్ నేను ఫాలో అయ్యాను బ్రతికి బయట పడ్డాను. దయచేసి మీరు మీ రెండు నిమిషాల సమయం వెచ్చించి దీన్ని చదవండి. 1)అది రాత్రి7.25 గం.లనుకొందాం. ఆ రోజున ఎన్నడు లేనంతగా విపరీతంగా పనిలో శ్రమించి ఇంటికి మరలా లనుకొందాం(కాకపోతే ఒంటరిగా). 2) మీరు నిజంగానే బాగా అలసి, విసిగి వేసారి ఉన్నారు. 3) ఉన్నట్టుండి మీకు ఛాతీ లో తీవ్రమైన నెప్పనిపిస్తూవుంది ఆ నెప్పి మీ దవడ లోపలి నుండి మీ చేయి వరకూ గుంజేస్తూ వుంటుంది. మీ ఇంటి నుండి ఏదేనీ దగ్గరగా వుండే ఆసుపత్రికి మధ్య దూరం 5 కి.మీ. అనుకొందాం. 4) దురదృష్టవశాత్తు, అంతవరకూ మీరు చేరుకోగలరో లేదో మీకు తెలియదనుకొందాం. 5) మీరు CPR లో శిక్షణ పొందిన వారైయుండొచ్చును గానీ ఆ శిక్షణనిచ్చినతను అది మీకు మీరే ఎలా చేసుకోవాలో నేర్పలేదనుకొందాం. 6) మీరు ఎవరూ పక్కన లేని ఒంటరి సమయంలో వచ్చే గుండె పోటుని తట్టుకొని తేరుకుని బతికేదెలా? చాలా మంది గుండె పోటు ఎదురైనప్పుడు సాయం చేయటానికి పక్కన ఎవరు లేక ఒంటరిగా వుంటారు. వారి గుండె అస్తవ్యస్తంగా కొట్టుకొంటూవుంటుంది.బాగా నీరసం అనిపిస్తుంది. ఇక స్పృహ కోల్పోవటానికి కేవలం పదే పది క్షణాలు మిగిలి వుండొచ్చు. 7) అయినా సరే ఈ భాధితులు పదేపదే బాగా గట్టిగా దగ్గేయడం ద్వారా తమకు తామే సాయంచేసుకొని రక్షించుకోవచ్చు. దగ్గే ప్రతీసారి బాగా వూపిరి తీసుకోవాలి.ఆ దగ్గు కూడా బాగా గొంతు లోపలనుండి వచ్చేలా కాస్తంత ఎక్కువ సేపు దగ్గాలి.అదీనూ ఛాతీ లోలోపల నుంచి కళ్ళె బయటకు కక్కేలా/ఊసేలా. ఏదేనీ సాయం అందేవరకీ,లేదా గుండె మరల మామూలు గానే పనిచేస్తుంది అని మీకు అనిపించేంత వరకూ ఎడతెరిపి లేకుండా ప్రతీ రెండు సెకన్లకొకసారి మార్చి ,మార్చి ఊపిరి తీసుకొంటూ గట్టిగా దగ్గుతూ వుండాలి. 😎 గట్టిగా తీసుకొనే ఊపిరి ఆక్సిజన్ ని ఊపిరి తిత్తులకు చేరవేస్తుంది.గట్టిగా దగ్గే దగ్గు కదలికల వల్ల గుండెని నొక్కినట్టై రక్తప్రసరణ కొనసాగుతుంది. బాగా నొక్కపెట్టినట్టు అనిపించే ఒత్తిడి కూడా గుండె తిరిగి యథాస్థితిలో పని చేయటానికి దోహదం చేస్తుంది. ఇలాగా గుండె పోటు భాధితులు ఏదేనీ ఓ ఆసుపత్రికి చేరేలోపున ప్రమాదాన్ని దూరంగా పెట్టొచ్చు. 9) ఈ విషయాన్ని వీలైనంత ఎక్కువగా ఇతరులకు చెప్పండి. అది వారి ప్రాణాలు కాపాడవచ్చు. 10) ఓ హృద్రోగ నిపుణులు ఏమంటారంటే ఈ సందేశం అందుకొన్న ఎవరైనా దయతో మరో పది మందికి పంపుదురు అని .ఇలా చేసి కనీసం ఒక్క ప్రాణాన్ని అయినా కాపాడలేమా అని మీరు సవాలుగా తీసుకోవాలని. 11) జోకులు గట్రా పంపటం లాంటివి కన్నా దయచేసి ఓ వ్యక్తి ప్రాణం నిలిపే ఈ సందేశాన్ని పదిమందికి తెలియజేయండి. 12 ) ఇదే సందేశం పంపిన మీకే మరలా పదే పదే వస్తుంటే దయచేసి చికాకు పడకండి. మీరంటే శ్రద్దతో ,ప్రేమతో ఈ గుండె పోటుని ఎలా ఎదుర్కోవాలో తెలియచేసే మిత్రులు ఇందరున్నారా అని మీరు సంతోషపడే విషయం సుమా ఇది మీ కోసం ఈ సందేశం పంపిన వారు. డా. ఎం .అశోక్ Cardiology Doctor #🌄శుభోదయం #🌹good morning #గుడ్ మార్నింగ్ #గుండెపోటు #💓హార్ట్ ఇమేజ్ ఆర్ట్స్ 💓 #హార్ట్
14 likes
10 shares
🎡 M.𝚂 𝙰 𝚂 𝙸 2277🎡
727 views 2 months ago
**గుండె కు అమర్చే పంపు-LVAD** చాలామంది గుండె జబ్బు వచ్చే పేషెంట్లకు ఆఖరి సమయంలో హార్ట్ ఫెయిల్యూర్ అనేది వస్తుంది.. గుండె ప్రధాన పని ఏంటి అంటే రక్తాన్ని శరీరంలోని వివిధ భాగాలకు పంపించడమే.. అది పుట్టినప్పటినుంచి చనిపోయేదాకా నిరంతరం పనిచేసే ఒక పంపు.. కానీ ఆ పంపు పని గుండె చేయలేనప్పుడు అది పూర్తి ఫెయిల్యూర్ అయిపోయి కాళ్ళ వాపులు ఆయాసము వస్తాయి.. గుండె ఎన్లార్జ్ అయిపోయి చాలా పెద్దగా అవుతుంది.. అప్పుడు దానిని కార్డియామయోపతి అని అంటారు.. అటువంటి అప్పుడు హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనేది చాలా అవసరం అంటే గుండె మార్పిడి శస్త్ర చికిత్స.. కానీ ఇది చాలామందికి అవసరం ఉండడము మరియు గుండెను చనిపోయినప్పుడు కడావరిక్ ట్రాన్స్ ప్లాంటుకు దానం చేయడం మన లాంటి దేశాలలో చాలా తక్కువగా ఉంటుంది.. అన్ని దేశాలలో కూడా గుండె ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఎదురు చూసే వాళ్లకు గుండె దొరకడం అనేది కష్ఠం గా ఉంటుంది.. ఎందుకంటే అవయవ దానం అనే కాన్సెప్ట్ ఇప్పుడిప్పుడే మన దేశంలో వస్తూ ఉంది.. బ్రెయిన్ డెడ్ అయిన పేషంట్ల అవయవాలను మనం దానం చేయవచ్చు.. అలా గుండె మార్పిడి కోసం వెయిటింగ్ చేస్తున్న వాళ్ళకు ఈ హార్ట్ ఫెయిల్యూర్ నుంచి ఉపశమనం కలిగించే కి ఓ పరికరాన్ని అనగా ఓ యంత్రాన్ని గుండె లోపల పంపు చేయడానికి అమరుస్తారు.. కొన్ని కారణాల వలన గుండె మార్పిడి చేయడానికి పనికిరాని అప్పుడు కూడా ఈ యంత్రాన్ని అమరుస్తారు.. దీనిని లెఫ్ట్ వెంట్రుకలర్ అసిస్టెంట్ డివైస్ LVAD అని అంటారు.. ఇది ఎడమ జఠరికలో అమరుస్తారు అక్కడినుంచి రక్తాన్ని తీసుకొని బృహద్దమని అనగా అయోర్టాలోకి పంపిస్తుంది.. ఇది బ్యాటరీ సహాయంతో పనిచేస్తుంది ఈ బ్యాటరీ లోకి కనెక్ట్ చేసే లీడ్ ను మన చర్మం నుంచి బయటికి తీసుకొచ్చి పెడతారు.. ఇవి రీఛార్జిబుల్ బ్యాటరీలు 12 గంటల నుంచి 24 గంటల వరకు పనిచేస్తాయి.. ఈ పరికరం ఖరీదు దానికి అమర్చేకి అంతా కలిపి ఓ 40-80 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది.. ఇది మన దేశంలో చాలా తక్కువగా అమరుస్తారు కానీ జర్మనీ లాంటి దేశాలలో ఎక్కువగా అమరుస్తారు.. కొందరు గుండె మార్పిడి కంటే ఇదే సౌకర్యంగా ఉంది అని కూడా ఫీల్ అవుతారు.. మన దేశంలో ఇది రేటు తక్కువగా ఉండండం వల్ల దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం ద్వారా అమర్చుకుంటూ ఉన్నారు.. ఇది చాలా ఖరీదైనది కానీ ప్రాణాలు పోకుండా ఆపుతుంది... డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు #💓హార్ట్ ఇమేజ్ ఆర్ట్స్ 💓 #హార్ట్ #గుండె
11 likes
13 shares