PSV APPARAO
743 views • 5 months ago
#హయగ్రీవ జయంతి - శ్రావణమాసంలో రాఖీ పౌర్ణమి రోజు మరో ఆధ్యాత్మిక ప్రత్యేకత #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: రక్షా బంధనం - రాఖీ పూర్ణిమ - జంధ్యాల పౌర్ణమి - హయగ్రీవ జయంతి 🚩 #హయగ్రీవ జయంతి #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩
*హయగ్రీవ ఆవిర్భావం*
శ్రీమహావిష్ణువు దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం ఎన్నో సందర్భాల్లో ఎన్నో రూపాల్లో అవతరించాడు. ఆయన తేజోమయమైన రూపంతో హయగ్రీవావతారం పొంది వేదాలను రక్షించాడు. వేదోద్ధరణే లక్ష్యంగా హయగ్రీవావతారం కనిపిస్తుంది. వేదాల సంరక్షణలో నిరంతరం మహా విష్ణువు నిమగ్నమై ఉంటాడని, హయగ్రీవావతారం తెలియజేస్తుంది.
సృష్టికర్త బ్రహ్మ తన పనిలో తాను నిమగ్నమై ఉండగా ల మధుకైటభులు అనే ఇద్దరు రాక్షసులు బ్రహ్మ దగ్గర ఉన్న నాలుగు వేదాలను అపహరించారు. వారు సముద్రంలో ప్రవేశించి, రాసాతలానికి చేరకున్నారు. వేదాలను కోల్పోయిన బ్రహ్మ అవి లేకపోతే తానూ సృష్టిని చేయడం కుదరదని విచారించసాగాడు. శ్రీమహావిష్ణువును స్తుతించాడు. బ్రహ్మ ఆవేదన శ్రీహరి అర్థం చేసుకొని వేద క్షణ కోసం ఒక దివ్య రూపాన్ని పొందాడు. ఆ రూపమే హయగ్రీవ అవతారం శ్రీహరి ధరించిన హయగ్రీవావతరం బ్రహ్మ ముందు నుంచి అంతర్ధానమై రాసాతలానికి ప్రవేశించింది.
అక్కడ హయగ్రీవుడు సామవేదం గానం చేయసాగాడు. ఆ గానావాహిని రసాతలం అంటా మారు మోగింది ఆ గానానికి రసం రసాతలంలో వేదాలను దొంగిలించి దాక్కున రాక్షసులకూ వినిపించింది. ఆ గానానికి పరవశించిన ఆ రాక్షసులిద్దరు బ్రహ్మ దగ్గర నుంచి దొంగిలించిన వేదాలను ఒక చోట దాచిపెట్టి గానం వినిపించిన వైపుకు బయలుచేరారు. ఎంత వెతికినా వారికి ఎవరూ కనిపించలేదు. తిరిగి వేదాలను దాచిన ప్రదేశానికి వెళ్లి చూశారు. అక్కడ వేదాలు కనిపించలేదు. వెంటనే ఆ ఇద్దరూ రసాతలం నుంచి వెలుపలకి వచ్చి చూశారు అక్కడ దివ్య కాంతితో ఉన్న హయగ్రీవుడిని చూసి తాము దాచిన వేదాలను మాయం చేసింది. అతడేనని గ్రహించి కోపంతో అతని మీదకు యుద్ధానికి వెళ్లారు. అప్పుడు హయగ్రీవుడు ఆ రాక్షసులతో యుద్ధం చేసి వారిని సంహరించాడు. అలా హయగ్రీవావతారం వేదోద్ధారణ లక్ష్యంగా అవతరించింది. వేదాలను కాపాడిన ఆ స్వామి విద్యలకు అధిపతిగా జ్ఞాన ప్రదాతగా పూజలందుకుంటున్నాడు. తన అవతార లక్ష్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దైవతలకు దర్శనమిచ్చాడు. శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి. ఆ రోజున హయగ్రీవస్వామిని పూజించడం వలన విద్యతో పాటు విజ్ఞానం లభిస్తాయని పురాణ వచనం.
*జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్ |*
*ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే ||*
జ్ఞానం, ఆనందం మూర్తీభవించిన దైవస్వరూపం హయగ్రీవుడు నిర్మలమైన స్పటికాకృతి కలిగి అన్ని విద్యలకు ఆధారమైన విద్యాధిదేవుడైన హయగ్రీవుడికి సమస్కరిస్తున్నాను. అని ఈ శ్లోకానికి అర్ధం. హయగ్రీవుడిని పూజించిన వారికి విద్యలం లభించడమే కాదు సకల సమస్యలు తీరి చల్లగా బతుకుతారని శాస్త్రాలు చెబుతున్నాయి.
భాగవతంతో పాటు దేవీ పురాణం, స్కాంధ పురాణం. అగమ శాస్త్రాల్లో కూడా హయగ్రీవుని ప్రస్తావన ఉంది. వేద విద్యను: అభ్యసించేవారు హయగ్రీవ ఆవిర్భావం రోజునే ప్రారంభిస్తారు. ఆ రోజున హయగ్రీవస్వామిని షోడశోపవారాలతో అష్టోత్తరాలతో పూజించాలి. ఆయనకు ప్రీతికరమైన యాలకుల మాలను వేసి శనగ గుగ్గిళ్లను నివేదించాలి తెల్లని పూలతో పూజించడం శ్రేష్టం. ఆ రోజున ఉప్పులేని ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి.
*🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
9 likes
12 shares