హిందూ దేవుళ్ళు * దేవాలయాలు
192 Posts • 114K views
𝗥𝗔𝗢
1K views 5 days ago
#🗞️అక్టోబర్ 6th అప్‌డేట్స్💬 #రామాయణం #రామాయణం 🙏🙏 #🔱హిందూ దేవుళ్ళు🙏🏻 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు భూమిపై సమస్త జీవకోటి మానవులను కాపాడటానికి అశ్వమేధ గుర్రం దారి మళ్ళిస్తున్న ఇంద్ర దేవుడు. 06/10/25,11:55am
15 likes
9 shares
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
588 views 1 months ago
#తీర్థయాత్రలు ... తీర్థయాత్రలకు వయసు పైబడ్డాక వృద్ధాప్యం లోనే వెళ్లాలని కొందరు అనుకుంటారు. బాధ్యతలన్నీ పూర్తి చేసిన తర్వాత తీర్థయాత్రలకు వెళ్తుంటారు అనేకమంది. అయితే తీర్థయాత్రలకు వయస్సుతో పని లేదు. భగవంతుడి నామస్మరణ చేయడానికి వయసుతో సంబంధం లేదు. భగవంతుడి దర్శనం, నామస్మరణ, పూజాభిషేకాలు మనకు అనంతమైన పుణ్య ఫలితాలను ఇస్తాయి. అందుకే స్వామిని దర్శించుకునేందుకు వయస్సును అడ్డు పెట్టకూడదు. తీర్థయాత్రలకు వయస్సున్నప్పుడే వెళ్లడం ఉత్తమం. ఇలా చేస్తే.., సమస్త దోషాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి. సంతృప్తికర జీవితం లభిస్తుంది. కొందరు అనుకునే విధంగా బాధ్యతలు తీరిన తర్వాత తీర్థయాత్రలకు వెళ్తే మాత్రం అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు తప్పవు. కనుక అనుకున్న క్షేత్రానికి వెళ్ళాలనే ఆలోచనను జాప్యం చేయకుండా పూర్తి చేసుకోవాలి. వృద్ధాప్యంలో తీర్థయాత్రలకు శరీరం సహకరించకపోవడం ద్వారా స్వామి దర్శనానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఆరోగ్యంగా ఉన్నప్పుడే తీర్థయాత్రలు చేయడం ఉత్తమం. వయస్సున్నప్పుడే తీర్థయాత్రల్లో భాగం కావడం ద్వారా వివాహం, సంతానానికి సంబంధించిన దోషాలు సైతం తొలగి పోతాయి. అందుకే వయస్సున్నప్పుడే పవిత్ర క్షేత్రాలు, యోగులు, మహర్షులు, మహాభక్తులు, సిద్ధులు నడయాడిన ప్రాంతాల్లో తీర్థయాత్రలు చేపట్టాలి. జీవితంలో ఆధ్యాత్మికత, ధార్మికం మొదలైన ఉత్తమ గుణాలను చిన్న నాటి నుండి పెంచుకోవాలి. సుప్రసిద్ధ ఆలయాలకు వెళ్లడం ద్వారా దోషాలన్నీ తొలగిపోయి.. అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. #తెలుసుకుందాం #గుళ్ళు #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #హిందూ దేవాలయాలు💐🎂 #hindu temples
16 likes
9 shares
#గుడి_ముందు_గోపురం_ఎందుకు ?? భారతదేశం అనగానే ఆధ్మాత్మికత ఆ ఆధ్యాత్మికతను ప్రతిబింబాలైన ఆలయాలు గుర్తుకువస్తాయి. భారతదేశమంతటా ఒకో ప్రాంతంలోని ఆలయాలు ఒకో శైలిలో ఉంటాయి. కానీ దక్షిణాదికి వచ్చేసరికి భారీ గోపురాలే ఇక్కడి ఆలయాల ప్రత్యేకతగా కనిపిస్తాయి. ఇప్పటికీ దక్షిణాది ప్రజలు గోపురాలని తమ సాంస్కృతిక వారసత్వంగా భావిస్తారు. అందుకనే తమిళనాడు రాజముద్ర మీద సైతం శ్రీవిల్లిపుత్తూరు గోపురమే దర్శనమిస్తుంది. ఇంతకీ ఈ గోపురాలు కేవలం ఆడంబరానికేనా, లేకపోతే వీటి వెనుక పెద్దలు ఆలోచించిన కారణాలు ఏమన్నా ఉన్నాయా అంటే... - ఇప్పుడంటే అంతస్తులకొద్దీ ఎత్తైన భవంతులను కట్టేస్తున్నారు కానీ.. ఒకప్పుడు ఊరంతటికీ ఎత్తైన భవనం ఆ ఊరి గోపురమే. ఒక ఊరికి వెళ్లేందుకు దాదాపు కొన్ని కిలోమీటర్ల దూరం నుంచే ఈ గోపురాలు కనిపించేవి. అందుకేనేమో గోపురం అన్న మాటకి ‘పట్టణ ద్వారం’ అన్న అర్థం కూడా ధ్వనిస్తుంది. ఇప్పటికీ కంచికి వెళ్లే దారిలో దాదాపు పది కిలోమీటర్ల దూరం నుంచే ఆ ఊరి గోపురాలు కనిపిస్తూ ఉంటాయి. - ఊరిలోనే ఎత్తైన, సురక్షితమైన భవనం కాబట్టి ప్రకృతి విపత్తులలో గోపురాన్ని మించిన ఆపన్న హస్తం ఉండదు. విపత్తులలో స్వామివారి ఆధ్యాత్మిక అభయం ఎలాగూ ఉంటుంది. ఇక భౌతిక రక్షణ కూడా వారి పాదాల చెంతనుండే గోపురం దగ్గర లభిస్తుందన్నమాట! - ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లే బాటసారులకి అన్నిచోటలా సత్రాల వసతి ఉండదు. కానీ గుడి లేని ఊరు మాత్రం కనిపించదు. ఆ గుడి గోపురం నీడన కాసింత సేదతీరి, చీకటివేళన బడలికను తీర్చుకుని, ఇంత ఆహారం తీసుకుని మళ్లీ బయల్దేరేవారు బాటసారులు. - గత సహస్రాబ్ది అంతా ఏదో ఒక యుద్ధంలోనే గడిచిపోయింది. ఎప్పుడు ఎటు వైపు నుంచి శత్రుసైన్యం విరుచుకుపడుతుందో, ఏ వైపు నుంచి అల్లరి మూకలు చెలరేగుతాయో తెలియని పరిస్థితి. ఇక తరుష్కుల దండయాత్రలు, బ్రిటిషర్ల దురాక్రమణలు సరేసరి! ఇలాంటి సమయంలో ఊరి వైపుగా ఎవరన్నా శత్రువులు వస్తున్నారేమో అని గమనించే ‘వాచ్ టవర్లు’గా గోపురాలు ఉపయోగపడేవి. - గోపురాల విషయంలో చాలామంది విశ్వసించే అంశం... పిడుగుల నుంచి రక్షణ. గోపురాల పైన ఉండే కలశాలు పిడుగుపాటుని నిర్వీర్యం చేసే ‘ఎర్త్’లాగా పనిచేస్తాయని చాలామంది నమ్మకం. ఊరిలో ఉండే కట్టడాలన్నింటికంటే గోపురాలే పై ఎత్తున ఉంటాయి కాబట్టి, పిడుగులని దిగమింగి ఊరిని సురక్షితంగా ఉంచుతాయంటారు. గోపుర నిర్మాణానికి వాడే సామాగ్రి కూడా పిడుగులను నిర్వీర్యం చేసేందుకే అనువుగా ఉంటుందట. - భౌతికమైన విషయాలను పక్కనపెడితే... ఉన్నతమైన గోపురాలు, వాటి మీద చెక్కిన కళాఖండాలు అంతులేని ప్రశాంతతని అందిస్తాయి. భగవంతుని వైభవానికి భక్తుడు అందించే చిరుకానుకగా తోస్తాయి. గోపురం దగ్గరకి వచ్చి తల ఎత్తి చూడగానే మనసు మరో లోకంలోకి ప్రవేశించేందుకు సిద్ధపడిపోతుంది. గోపురం లోపలికి అడుగుపెట్టగానే ఆధ్మాత్మిక సామ్రాజ్యంలోకి కాలుమోపిన అనుభూతి కలుగుతుంది. భౌతికంగా, ఆధ్మాత్మికంగా గోపురాలను ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టే, వేయి సంవత్సరాలకు పూర్వం మొదలైన ఈ తరహా కట్టడాలను ఇప్పటికీ ఆదరిస్తున్నారు, అనుసరిస్తున్నారు. 🌹🙏🏿🌹 #తెలుసుకుందాం #హిందూ దేవాలయాలు💐🎂 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #hindu temples
13 likes
9 shares