ఎం.ఎస్.సుబ్బలక్ష్మి జయంతి

ఎం.ఎస్.సుబ్బలక్ష్మి జయంతి

ఎం.ఎస్. సుబ్బలక్ష్మి ఆమె పాడకపోతే దేవుళ్ళకు కూడా తెల్లవారదు!!!!! తన సుప్రభాత గీతంతో భగవంతుణ్ణి నిదురలేపే ఆ సంగీత ఆధ్యాత్మిక స్వరం ఆమెకు ఒక వరం. ” కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవ మాహ్నికమ్ ….. …..అంటూ సాగే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం భారతీయుడి గుండెల్లో భక్తిభావాల్ని కలిగిస్తుంది. ఆమె పాటలు వింటుంటే మనసు ప్రశాంతంగా, హాయిగా వుంటుంది. అభిమానులు ప్రేమగా ఎం.ఎస్ అని, అమ్మ అని పిలిచుకొనే మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి దేశములో మొట్ట మొదటి సారిగా భారతరత్న పురస్కారం అందుకున్న గాయకురాలుగా చరిత్ర సృష్టించి ఎందరికో స్ఫూర్తినిచ్చి చరిత్రలో తన గానంతో అజరామరురాలు అయ్యారు. బాల్యం: తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో సుబ్రహ్మణ్య అయ్యర్ , ప్రముఖ వీణావాద్య విద్యాంసురాలు షణ్ముఖవడివు అమ్మల్ కు 1916 సెప్టెంబర్ 16 న జన్మించింది. తల్లి ఆమె ఆది గురువు. పదేళ్ళ ప్రాయం నుంచే సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. అయితే ఆమెలో భక్తితత్వానికి బీజం వేసింది మాత్రం ఆమె తండ్రి అయ్యర్. సుబ్బలక్ష్మి శుద్ధ సంప్రదాయ కుటుంబంలో జన్మించింది కనుక తన జీవితకాలమంతా ఆమె భారతీయ సంప్రదాయాన్ని, సంస్కారాన్ని అమితంగా ప్రేమించింది. బాల్యంలో సెమ్మంగుడి శ్రీనివాస్ అయ్యర్ వద్ద సంగీతంలో శిక్షణ పొంది తన ప్రతిభకు స్పష్టమైన రూపునిచ్చి, తదనంతర కాలంలో జాతి గర్వించతగ్గ అంతర్జాతీయ సంగీత సామ్రాజ్ఙిగా ఎదిగింది. 1926 లో 10 సంవత్సరాల వయసులో గుడిలో పాటలు పాడడంతో తన తొలి సంగీత ప్రదర్శన మొదలైంది. నాటి నుండి సంగీత ప్రియులను తన మధుర స్వరంతో సంగీతంలో ఓలలాడిస్తూనే ఉంది. అప్పుడే తను మొట్టమొదటిసారిగా హెచ్.ఎం.వి. కోసం ‘ఆల్బమ్ ‘ అందించింది. జీవితం: సుబ్బలక్ష్మిలోని ప్రతిభను గుర్తించిన తల్లి మధురై నుంచి చెన్నై కి మకాం మార్చటంతో ఆమె జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. ఆమె 1933 లో మద్రాస్ సంగీత అకాడెమీలో తన మొట్ట మొదటి సంగీత కచేరీకి శ్రీకారం చుట్టింది. సంగీతపరంగా సుబ్బలక్ష్మి జీవితంలో ఇది ఒక మలుపైతే తన గురువు, మార్గదర్శి, ఆనంద వికటన్ పత్రిక సీనియర్ ఎగ్జిక్యూటివ్ , స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది అయిన త్యాగరాజన్ సదాశివన్ తో 1940 లో ఆమె ప్రేమవివాహం మరో ముఖ్యమైన మలుపు. 1938 సంవత్సరంలో సేవాసదనం సినిమా ద్వారా సుబ్బలక్ష్మి సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టింది. సదాశివన్ సినీ నిర్మాత కూడ కావడంతో సుబ్బలక్ష్మి సినీ సంగీత జీవితానికి ఎటువంటి అడ్డంకులు ఎదురు కాలేదు. తమిళ సినిమాలలో గాయనిగా తెరపై కూడా కనిపించి ప్రేక్షకులను అలరించింది. 1940 వ సంవత్సరంలో శకుంతలై అన్న తమిళ సినిమాలో ఆమె తొలిసారిగా గాయక నటిగా తెరపై కనిపించింది. 1945 వ సంవత్సరంలో నిర్మించబడిన ‘మీరా’ చిత్రం హిందీలో పునర్నిర్మించబడి కూడా విజయవంతం కావడంతో సుబ్బలక్ష్మి పేరు భారతదేశమంతటికీ సుపరిచితమయింది. ‘మీరా’ సినిమాలోని ఆమె నటనకు, గాన మాధుర్యానికి జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి. అది ఆమె ఆఖరి సినిమా. భక్తిగాయనిగా సుబ్బలక్ష్మి పేరు ప్రఖ్యాతులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంలో సదాశివన్ కృషి ఎంతో వుంది. గానం, గాత్రం, స్తోత్రం, గీతం: అమ్మ పాడుతుంటే స్వయంగా సరస్వతీదేవి పాడుతున్నట్లు భావించేవారు. నిండైన విగ్రహం, భారతీయతకు ప్రతీకగా ఒంటినిండా పట్టుచీర, నుదుటి మీద ఎర్రటి కుంకుమబొట్టు, తమిళ సాంప్రదాయానికి ప్రతీకగా ముక్కుపుడక, చేతుల నిండా గాజులు, కళ్లకు నిండుగా కాటుక, కొప్పు, కొప్పు నిండా మల్లెపూలు, చేతిలో తంబూర పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో మునిగిపోయేవారు. కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. గానం ధ్యానంలా సాగేది. పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలును, శాస్త్రీయ, లలిత గీతాలను, భజన్స్, జానపద గేయాలు, మరాఠీలో అభ్యాంగ్స్, దేశభక్తి గేయాలు కూడా పాడారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బలక్ష్మి గారి ప్రత్యేకత. శృతి, లయ , ఆలపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళ్ళలో వ్యక్తీకరించడంతోపాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యం! ముఖ్యంగా సంక్లిష్ట సమాసాలతో కూడిన సంస్కృత భాషలోని భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించడం ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బలక్ష్మి తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు. మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన ‘ వైష్ణవ జనతో….’ జె పీర్ పరాయీ జానేరే……’ వంటి గీతాలకు ప్రాణం పోసిన వ్యక్తి ఆమె. అమె కంఠం అత్యంత మధురం. భజనపాడుతూ అందులొనే అమె పరవశురాలవుతారు. ప్రార్ధన సమయములొ ఎవరయిన అలా లీనమవాలి. ఓ భజనను మొక్కుబడిగా పాడటం వేరు, అలా పాడుతూ పూర్తిగా దైవ చింతనలొ లీనవడం వేరు అని మహాత్మా గాంధీ అన్నారు అంటే, సుబ్బలక్ష్మి గారి సంగీతం లోని మాధుర్యపు ప్రభావం, సారాంశం ఏమిటో అర్థం చేసికోవచ్చు! ఐక్య రాజ్య సమితి లో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బలక్ష్మి. ఆ సందర్భంలో ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక సుబ్బలక్ష్మిని ప్రశంసిస్తూ తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలిగా పేర్కొన్నాయి. రాయల్ ఆల్బర్ట్ హాల్, లండన్ లో ప్రదర్శన యిచ్చినపుడు ఇంగ్లండ్ రాణిని కూడా తన్మయురాలిని చేసి, ప్రశంసించేలా చేసింది. పురస్కారాలు – సన్మానాలు: తన జీవితకాలంలో సంగీత ప్రపంచంలో బహుశా ఎవరూ సాధించని, చేధించని రికార్డులు, రివార్డులు ఆమె అందుకుంది. ఆమె ఎక్కని ‘శిఖరం లేదు, పొందని బహుమానం లేదు.అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాలు ఎన్నో సుబ్బలక్ష్మి గాత్రానికి దాసోహమంటూ ఆమె ముందు వాలాయి. 1954 లో భారత ప్రభుత్వ పద్మభూషణ్ 1969 లో మద్రాస్ సంగీత అకాడమీ వారి సంగీత కళానిధి — మొట్టమొదటి సారిగా అందుకున్న స్రీగాయకురాలు 1971 లో శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం వారి డాక్టరేట్ 1973 లో ఢిల్లీ విశ్వ విద్యాలయం వారి డాక్టరేట్ 1974 లో ఫిలిప్ఫీన్స్ ప్రభుత్వం వారి రామన్ మెగససే పురస్కారం 1975 లో భారత ప్రభుత్వ పద్మ విభూషణ్ 1980 లో బెనారస్ విశ్వ విద్యాలయం వారి డాక్టరేట్ 1987 లో మద్రాస్ విశ్వ విద్యాలయం వారి డాక్టరేట్ 1988 లో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం నుండి కాళీదాస్ సన్మాన్ పురస్కారం 1990 లో భారత ప్రభుత్వం నుండి ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం 1998 lo భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం- భారత రత్న (సంగీతవిభాగం లో ఈ పురస్కారం అందుకున్న మొదటి వ్యక్తి) 2004 లో ఢిల్లీ ప్రభుత్వం నుండి జీవిత సాఫల్య పురస్కారం ( పురస్కారం క్రింద వచ్చిన 11 లక్షల రూపాయల నగదు ని స్వర్గీయ కంచి ఆచార్య చంద్ర శేఖరానంద సరస్వతీ స్మృతికట్టడానికి విరాళమిచ్చారు) ఇంటింటా పవిత్ర సుమసుగంధాలను వెదజల్లిన ‘ సుప్రభాత ‘ గీతమై, ప్రతి ఇంటా ఆధ్యాత్మిక భావనలను విరజిమ్మిన విష్ణు సహస్రనామ నిత్యస్తోత్రమై, ఈ ధరణీతలాన్ని కొన్ని దశాబ్దాల పాటు పులకింపచేసిన కర్ణాటక శాస్త్రీయ సంగీత స్వరధార 2004, డిసెంబర్ 11న శాశ్వతంగా మూగబోయింది. కాని ఆ తల్లి గొంతు మాత్రం విశ్వం ఉన్నంత కాలం ప్రపంచం అంతా మారుమోగుతూనే ఉంటుంది. ఎందరో మహానుభావులు ……. అందరికీ వందనములు.🌹 https://b.sharechat.com/EdodIGjMfQ?referrer=otherShare
#

ఎం.ఎస్.సుబ్బలక్ష్మి జయంతి

ఎం.ఎస్.సుబ్బలక్ష్మి జయంతి - ShareChat
646 views
2 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post