🔴జూలై 9th అప్‌డేట్స్📢
268 Posts • 1M views
Mohan
1K views
#🔴జూలై 9th అప్‌డేట్స్📢 #🌍నా తెలంగాణ #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్ బతుకమ్మ కుంట చెరువు కబ్జాలకు గురై, చెత్త కుప్పలతో నిండి, పూర్తిగా తన పాత అందాన్ని కోల్పోయి అధ్వానంగా మారింది. ఒకప్పుడు ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రాంతం, ఆనవాళ్లు కోల్పోయి మూలన పడింది. కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముందుచూపు, దార్శనికతతో ఇప్పుడు బతుకమ్మ కుంటకు కొత్త జీవం వచ్చింది. సీఎం గారి ఆదేశాల మేరకు, (హైడ్రా) కమిషనర్ రంగనాథ్ గారి నేతృత్వంలో చేపట్టిన పునరుద్ధరణ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ఈ చెరువును తిరిగి దాని పూర్వ వైభవానికి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి గారి సంకల్పం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో కబ్జాల పాలైన చెరువు స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని, దానిని పూర్తిగా ప్రక్షాళన చేశారు. ఇప్పుడు జలకళతో నిండిన ఈ బతుకమ్మ కుంట, నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటూ, వారికి ఆహ్లాదాన్ని పంచుతోంది. మిగిలి ఉన్న పునరుద్ధరణ పనులు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తవుతాయని హైడ్రా వెల్లడించింది. Anumula Revanth Reddy
18 likes
12 shares