👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
601 views • 3 days ago
మార్గశిర మాసం
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️
వేదములలో సామవేదమును, రుద్రులలో శంకరుడను, చందస్సులో గాయత్రిని, మాసాలలో మార్గశీర్షమాసాన్ని అన్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. మహాభారతకాలంలో మాసములు మార్గశీర్షముతో ఆరంభమవుతూ ఉండేవి. కనుక మాసములలో మార్గశీర్షము మొదటిది. అట్లే ఈమాసములో ఆచరించబడు ఉపవాసాది వ్రతములన్నియు మహాఫలమును ఇచ్చునవిగా శాస్త్రములయందు చెప్పబడినది.
శుక్లే మార్గశిరే పక్షే యోషిత్ భర్తురనుజ్ఞయా!
ఆరభేత వ్రతమిదం, సార్వకామిక మాదతః!!
వివాహిత యువతి క్రొత్తగా కాపురమునకు వచ్చిన పిమ్మట వచ్చు మొదటి మార్గశిరమాసమునందలి శుక్లపక్షమున పతియనుమతితో ’పుంసవన వ్రతము’ను ఆచరింపవలెను. అది సమస్త మనోరథములను తీర్చును అని భాగవతమునందు చెప్పబడినది. ఈమాసమునందే క్రొత్తగా ఇంటికి వచ్చిన పంటను భగవదర్పణము కావింతురు. దీనినే ’అన్నయజ్ఞము’ అందురు. వాల్మీకి రామాయణమునందు ఈ మార్గశిర మాసము మాస శిరోభూషణముగాను, ఆ సంవత్సరమునకే అలంకార ప్రాయముగాను చెప్పబడినది.
అంతేకాక కలువపూలతో శివుని అర్చించిన అది మహాఫలమునొసగును. ఈమాసములో ఒకపూట భుజించి, తనశక్తిని అనుసరించి బ్రాహ్మణులకు భోజనం పెట్టినవాడు వ్యాధులనుండి, పాపాలనుండి విముక్తినందగలడు. సర్వకళ్యాణ సంపూర్ణుడై, అన్నిరకాల ఓషధులను పొందగలడు.
ఈమాసములో ఉపవసించినవాడు మరుసటి జన్మలో వ్యాధి రహితుడు, బలశాలి కాగలడు. వ్యవసాయంలో భాగస్వామియై బహుధనధాన్య సంపన్నుడు అవుతాడు. ఈమాసములో రోజంతా ఉపవాసముండి కేశవుని అర్చిస్తే అశ్వమేధయాగ ఫలితాన్ని పొందవచ్చు. ఆవ్రతశీలుని పాపం కూడా నశిస్తుంది. ఈవిధముగా ఇతరమాసములకంటె మార్గశిరమునందు అనేక విశిష్ట లక్షణములు గలవు. కనుక భగవానుడు దీనిని తన స్వరూపముగా తెల్పెను.
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️
*మార్గశిర మాసం*
తెలుగు మాసాల్లో ఒక్కోదానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది.
అలాగే మార్గశిర మాసం కూడా చాలా ప్రత్యేకమైనది.
అయితే ఈ మాసాన్ని..
అన్ని మాసాల్లోనే అగ్రగణ్యమైనదిగా పురాణాలు చెప్తున్నాయి.
మరి ఈ మాసామే ఎందుకు అంత విలక్షణమైనదో?
మార్గశిర మాసాన్నే ‘మార్గశీర్షం’ అని కూడా వ్యవహరిస్తారు.
శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం. మాసాల్లోకెల్లా అగ్రగణ్యమైనది కాబట్టి మార్గశిరానికి ఈ పేరు వచ్చింది.
ఈ విషయాన్నే తేటతెల్లం చేసేలా మాసాలలో తానే మార్గశిరమని అర్జునునికి గీతాచార్యుడు విభూతి యోగంలో తేటతెల్లం చేశాడు.
అర్జునునితో కృష్ణపరమాత్మ తాను ‘వేదానాం సామవేదోస్మి దేవానాం వాసవః’అంటే ‘ఇంద్రుడు’ అని చెబుతూనే….. తాను ‘మాసానాం మార్గశీర్షోహం’ అని ప్రకటించాడు.
జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. సూర్యభగవానుడు.. దేవగురువు అయిన బృహస్పతికి సంబంధించినటువంటి ధనూరాశిలో సంచరించే పుణ్యకాలాన్నే మార్గశిరము అంటారు.
హేమంత ఋతువులో వచ్చే మొదటి నెల. దీనినే జ్యోతిష్యాన్ని అనుసరించి సౌరమాన ప్రకారం ధనుర్మాసమని, చంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అంటారు.
ఆధ్యాత్మికం గా ప్రసిద్దమైన ఈ మాసం ప్రకృతి లో కూడా సౌందర్యాన్ని, శాంతిని సంతరిస్తుంది.
మృగశిర నక్షత్రం లో కూడిన పూర్ణిమ వచ్చిన కారణం గా
ఈ మాసానికి మార్గశీర్ష మాసమని పేరు.
శ్రీ కృష్ణ పరమాత్ముడు మార్గశిర మాసం స్వయంగా ఆయనే అని తెలియజేశాడు.
ఈ మాసం లో చేసే ఏ పూజైనా, హోమమైనా, అభిషేకమైనా ఎటువంటి దైవకార్యం చేసినా దానిని స్వయం గా తనే స్వీకరిస్తానని తెలియచేసాడు.
చంద్రుడు మనః కారకుడు, ఆ చంద్రుడు అనుకూలంగా లేకపోతే, మంచి ఆలోచనలు కలగవు, మానసిక స్థితి సరైనమార్గంలో ఉండదు. అందుకని చంద్రుడు అనుకూలించే కాలం లో మన దైవపూజలని ప్రారంభిస్తే వాటి మీద శ్రద్ధ బాగా పెరిగి తద్వారా మనోధైర్యం వృద్దిచెందుతుంది.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుని కి ఉచ్ఛ స్థానం వృషభ రాశి, మృగశిర నక్షత్రం వృషభరాశి కి చెందినది కావున, చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి దైవ కార్యాలని చేసే కొద్దీ చేయాలనిపించే మంచి ఆలోచనలు కలుగుతాయి.
‘రుతూనాంకుసుమాంకం' అనే శ్లోకంలో మార్గశీర్షాన్ని నేనే, ఆరు రుతువులలో పుష్ష సౌరభం నేనే, సామవేదానికి చెందిన గానాలలో బృహత్సామాన్ని నేనే, ఛందస్సులో గాయత్రీ ఛందాన్ని నేనే, శోభ అధికంగా ఉండే వసంతకాలాన్ని నేనే అని భగవద్గీతలోని విభూతి యోగంలో ఆ క్రిష్ణభగవానుడే వివరించాడు. మొత్తానికి మార్గశిరం అంటే నేనేనని చెప్పుకున్న మాసమన్నమాట. ఉత్తమమైనవి అనగా పక్షులలో గరుత్మంతుడు, మృగాలలో సింహము, నెలలో మార్గశిర మాసం, వేదాలలో సామవేదం ఎంతో ఉత్తమమైనవని భగవద్గీతలో సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే తెలిపారు.
ఇది ప్రకృతి కాంతకు సీమంతం. తుషార బిందువుల హేమంతం. ఈకాలంలో పొలాలనుంచి ధాన్యం ఇళ్లకు చేరి ప్రజలు సంతోషంగా ఉంటారని ఉత్తమ మాసంగా పరిగణిస్తారు.
మార్గశిరం ఆధ్యాత్మిక భావ వికాసానికి ప్రతీక. కార్తీకంలో పుణ్యనదీ స్నానాలతో తరించిన భక్తుల హృదయాలు మార్గశిర మాసంలో మరింత భగవచ్చింతనలో తన్మయమవుతాయి.
నిర్మలమైన ఆకాశం మాదిరిగా మనస్సులు కూడా ఈ మాసంలో నిర్మలంగా ఉంటాయి.
ఏడాదిలో వచ్చే ఇరవైనాలుగు ఏకాదశి తిథుల్లో ప్రతిదీ పవిత్రమైనదైనా.. వీటన్నింటిల్లో వైకుంఠ ఏకాదశి మాత్రం ఉండదు. ఎందుకంటే అన్ని ఏకాదశుల్నీ చంద్రమానం ప్రకారం గణిస్తే... వాటికి భిన్నంగా వైకుంఠ ఏకాదశిని సౌరమానం ప్రకారం గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయనానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. ‘వైకుంఠ ఏకాదశి’, ‘ముక్కోటి ఏకాదశి’, ‘స్వర్గద్వార ఏకాదశి’, ‘మోక్ష ఏకాదశి’ అంటూ పిలిచే ఈ ఏకాదశి రోజునే శ్రీమహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠంలోని వాకిళ్లు తెరుచుకుంటాయని అంటారు.
దక్షిణాయనంలో యోగనిద్రలోకి వెళ్లిన నారాయణుడు కార్తిక శుద్ధ ఏకాదశిరోజున మేల్కొంటాడు. అలా మేల్కొన్న స్వామిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలూ మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి రోజున వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుడిని దర్శించుకుంటే స్వర్గలోకప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.
అలాగే... మార్గశిర శుద్ధ ఏకాదశి భగవద్గీత లోకానికి అందిన రోజు కూడా. ఇంతటి పవిత్రమైన మార్గశిర మాసంలో చేసేటటువంటి
ఏ పూజ అయినా, ఏ అభిషేకాలు అయినా, ఏ హోమమైనా తానే స్వీకరిస్తానని ఆ విష్ణుభగవానుడు తెలియజేశాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రునికి ఉచ్ఛ స్థానం వృషభ రాశి మృగశిర నక్షత్రం కావటంవల్ల మనం ఎటువంటి కార్యక్రమాలు చేయాలని తలపెట్టిన ఆ చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి ఆ కార్యాలను నిర్వహిస్తారు.
కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు కోరలు తెరుచుకొని ఉంటాడు, ఈ రోజుల్ని యమదంష్ట్రలుగా చెబుతారు. మార్గశిర పౌర్ణమి తో అనేక రకమైన వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి, కనుక కృతజ్ఞత పూర్వకంగా ఈ దినం.. యమధర్మ రాజుని ఆరాధిస్తారు.
ఈ పౌర్ణమి ని కోరల పున్నమి, నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు. మార్గశిరం..ఆధ్యాత్మిక భావ వికాసానికి ప్రతీక. కార్తీకంలో పుణ్యనదీ స్నానాలతో తరించిన భక్తుల హృదయాలు.. మార్గశిర మాసంలో మరింత భగవచ్చింతనలో తన్మయమవుతాయి.. నిర్మలమైన ఆకాశం మాదిరిగా మనస్సులు కూడా ఈ మాసంలో నిర్మలంగా ఉంటాయి. తూర్పు తెలతెల వారుతుండగా..పొగమంచు ఇంకా విచ్చిపోకముందే ముంగిట రకరకాల ముగ్గులు.. వరిపిండితోనూ .. సున్నపుపిండితోనూ వేసి.. వాటి మధ్య బంతిపూలు తురిమిన గొబ్బిళ్లు పెట్టే ఆడపిల్లలు.. తెలుగు పల్లెటూళ్ల ధనుర్మాస శోభకు వన్నెలు.. చేకూరుస్తారు.✍️
ఓంనమోభగవతే వాసుదేవాయ నమః
``` *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
#మార్గశిర మాసం ప్రాశస్త్యం 🕉️ విశిష్ట పండుగల మాసం 🪔మహావిష్ణు ప్రీతికరంమైన మార్గశిర మాసం మోక్షదాయిని #మోక్షానికి మార్గం మార్గశిర మాసం #ముక్తికి మార్గం మార్గశిర మాసం #🙏🕉️మార్గశిర మాసం విశిష్టత☪️✍️🥰 #🙏🕉️శ్రీ మహావిష్ణువు🕉️🙏
17 likes
10 shares