బొగ్గు గని కార్మికుడిగా ఉద్యోగం నుంచి రిటైర్ అయిన ఓ వ్యక్తి.. 72 ఏళ్ల వయసులో విద్యార్థిగా మారారు. పదవీ విరమణ పొంది 10 ఏళ్లైనా చదవాలన్న ఉత్సుకతతో విద్యార్థిగా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించడంతో స్థానికులు అభినందిస్తున్నారు. తమిళనాడులోని కడలూర్ జిల్లా వడలూర్ కు చెందిన సెల్వమణి (72) నేషనల్ లిగ్నైట్ కార్పొరేషన్ బొగ్గు గనిలో 37 ఏళ్లుగా కార్మికుడిగా పని చేసి పదవీ విరమణ పొందారు. ఎంకామ్, ఎంబీఏ, ఐటీఐ పూర్తి చేసిన ఆయనకు ఇద్దరు కుమారులున్నారు. ఇంకా చదువుకోవాలనే ఆసక్తి ఉండటంతో మైలాడుదురై జిల్లా సీర్గాళిలోని శ్రీనివాస సుబ్బరాయ ప్రభుత్వ పాలిటెక్నిక్ లో డిప్లొమా (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) కోర్సులో చేరారు. ఇంటి పనుల్లో భార్యకు సాయం చేస్తూ, క్రమం తప్పకుండా తరగతులకు హాజరవుతున్నారు.
#great