నేటి మహిళ ఆవేదన
ఇది మహిళా వత్సరం! అప్పుడే 2018 అయిపోయిందా...! ఒక్కో రోజును తీసుకున్నా... 365 రోజులు గుర్తుచేసుకున్నా... ఈ ఏడాది మహిళలకు ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చింది. కొన్ని సమస్యలు భయపెడితే... కొందరి విజయం స్ఫూర్తిని పెంచింది. కొన్ని పోరాటాలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తే... కొంత ప్రోత్సాహమూ లభించింది. ఓర్పుకు ఓదార్పుకి ప్రతీకగా... అపర కాళికగా... ఆమె నడక మారింది. కొలువులు, చదువులు ఆసక్తులు.... ఇలా ఏ రంగం తీసుకున్నా... ఈ సారి మహిళలకు అన్నీ ప్రత్యేకతలే. పద్మ పురస్కారాలతో మెరిసి... ఈ ఏడాది మొదటి నెల జనవరే మహిళలకు గుర్తింపు మోసుకొచ్చింది. సేవ, యోగా, రాజకీయం, క్రీడలు, వైద్యం, సాహిత్యం... ఇలా విభిన్న రంగాలకు చెందిన దాదాపు పద్నాలుగు మంది మహిళలు ఈ ఏడాది పద్మ పురస్కారాల గ్రహీతలయ్యారు. వీళ్లలో చిన్నచిన్న పనులు చేస్తూ సమాజానికి తమవంతుగా సాయం అందించినవారూ లేకపోలేదు. కోల్‌కతాకు చెందిన సుభాషిణికి అక్షరం ముక్క రాదు. దినసరి కూలి. భర్త అనారోగ్యంతో చనిపోవడంతో తనలాంటి నిరుపేదలకు ఆ పరిస్థితి రాకూడదని ఓ ఆసుపత్రి కట్టించాలనుకుంది. ఆ డబ్బు సమకూర్చేందుకు కూరగాయలు అమ్మింది. కూలి పనులకూ వెళ్లింది. చివరకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని ఎన్నోవేలమందికి ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదే ఆమెకు పద్మశ్రీ తెచ్చిపెట్టింది. న్యాయపోరాటం చేశారు... నడిరోడ్డుమీదా, కాలేజీల్లో, కార్యాలయాల్లో వేధించే మగాళ్లకు కాళికలుగా మారారు కొందరు. కన్న కొడుకును పోలీసులే చంపేసి మసిబూసి మారేడుకాయ చేస్తే... పోలీసుల్నే ఎదిరించింది ఓ అమ్మ. చదువు లేకపోయినా, అవమానాలు పడినా, వయసు మీదపడి శక్తి సన్నగిల్లుతున్నా, ఏళ్లు గడిచిపోతున్నా అనుకున్నది సాధించగలిగింది. ఆ పోలీసులకు శిక్షపడేలా చేసింది. ఆమే కేరళకు చెందిన ప్రభావతీ అమ్మ. సాధారణ మధ్యతరగతి కుటుంబం దంగేటి పావనిది. తండ్రి లేడు. ఆమెకు ఉన్నది తల్లి, అక్కే. కళ్లముందే అక్క మరణాన్ని చూసింది. దాన్ని ప్రమాదంగా మార్చాలనుకున్నారు నిందితులు. పోరాటానికి సిద్ధపడింది. ఇరుగుపొరుగు వద్దన్నారు. బంధువులు వెలేశారు. అయినా మూసేసిన కేసుని హత్యకేసుగా రుజువు చేయించింది. ఫోనులో వైరల్‌ అయిన ఓ నగ్నచిత్రాన్ని చూసి తన భార్యదే అని భావించిన ఓ భర్త ఆమెను ఇంటినుంచి గెంటేశాడు. తాను తప్పుచేయలేదు శిక్ష ఎందుకు అనుభవించాలనుకుని శివంగిలా మారిందామె. సీడాక్‌ నివేదిక ద్వారా తనని తాను నిరూపించుకుంది. ఆ ఫొటోలో ఉన్నది ఆమె కాదని నిరూపితమైంది. ఆమే కేరళకు చెందిన శోభా సాజు. హెచ్‌ఐవీ ఉందని డాక్టర్లు చెప్పిన ఓ తప్పుడు నివేదికను అబద్ధం అని రుజువు చేసేందుకు డాక్టర్లపై పోరాటం చేసింది వరంగల్‌కి చెందిన మమత. నష్టపరిహారం కూడా అందుకుంది. శానిటరీ న్యాప్‌కిన్‌... మహిళల నిత్యావసర వస్తువుల్లో ఇప్పుడు ఇదీ ఒకటి. ప్రభుత్వం దానిపైనా జీఎస్‌టీ వేటు వేస్తే రద్దు చేయమంటూ పోరాడింది ఉత్తర ప్రదేశ్‌కు చెందిన జర్మీనా ఇస్రార్‌ఖాన్‌. ఆమె పోరాటం ఫలించి జీఎస్‌టీ పన్నెండు శాతం రద్దయ్యింది. ఓ సమస్య ఎదురైనప్పుడు చనిపోవడం కన్నా పోరాడి గెలవాలని నిరూపిస్తూ తమలాంటి మహిళలకు ఆదర్శంగా నిలిచారు వీళ్లు. అంతర్జాతీయ యానంలోనూ... అమ్మాయిలు చీకటిపడేలోగా ఇంటికి చేరాలనే రోజులు ఎప్పుడో పోయాయి. ఈ రోజుల్లో అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా ఉద్యోగాలు చేసేవారే ఎక్కువ. అలాంటివాళ్లందరికీ ఇంకాస్త స్ఫూర్తిని పంచారీ మహిళలు. హైదరాబాద్‌కి చెందిన జయభారతి బృందం యాభై రోజుల పాటు పదిహేడువేల కిలోమీటర్లు ప్రయాణం చేసింది. చేనేత యాత్రనూ చేపట్టింది. ఐఎన్‌ఎస్‌ తరణి పేరుతో ప్రపంచమంతా తెరచాప పడవపై చుట్టొచ్చిన ఆరుగురు మహిళా నౌకా అధికారిణుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సమస్యలు ఎదురైనా అన్నింటినీ అధిగమించి ప్రపంచాన్నే చుట్టొచ్చారు. ఆర్మీ అధికారిణులు అంతే. ‘మహిళలు మీరు కూడా సైన్యంలో చేరండి’ అంటూ ప్రత్యేంగా వివిధ రాష్ట్రాల్లో ప్రయాణించారు. సరస్వతీ పుత్రికలే... తలచుకుంటే ఏదీ అసాధ్యం కాదు... అని పోరాడి మరీ తమ హక్కుల్ని సాధించుకున్నారు కొందరు. ఆమె పేరు రమణమ్మ. నిరుపేద కుటుంబం. శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామం. పన్నెండేళ్లకే తల్లిదండ్రులు పెళ్లిచేసేందుకు సిద్ధమయ్యారు. వద్దని బతిమాలినా, తల్లిదండ్రులు కరగలేదు. చివరకు పోరాడి మరీ తన హక్కును సాధించుకుంది. ఇప్పుడు ట్రిపుల్‌ఐటీలో సీటు సంపాదించుకుంది. ఆమే కాదు... చాయ్‌ అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తోన్న ఓ పేద తండ్రి సమస్యల్ని తీర్చేందుకు కష్టపడి చదివింది చిత్తూరు జిల్లా, నాగులాపురం మండలం, ఎస్‌. ఎస్‌ పురానికి చెందిన సుభాషిణి. పన్నెండో తరగతిలో 98 శాతం మార్కులు తెచ్చుకుని 3.8 కోట్లు స్కాలర్‌షిప్‌తో మసాచుసెట్స్‌లోని బాబన్స్‌ కాలేజీలో ఛాన్సు కొట్టేసింది. అక్షరాస్యతలో బిహార్‌ ఇప్పటికీ వెనకబడే ఉంది. అలాంటి చోట చదువులతల్లిగా మారి సాటి ఆడపిల్లలకు ఆదర్శంగా నిలిచింది కల్పనాకుమారి. నీట్‌లో 99.99 పర్సంటైల్‌తో జాతీయ స్థాయిలో మొదటిస్థాయి ర్యాంకర్‌గా నిలిచింది. ఒకేసారి ఐదు బంగారుపతకాలు సాధించినవారూ లేకపోలేదు. 96 ఏళ్ల వయసులో పరీక్ష రాసిన మహిళా ఉన్నారు. మీటూతో... పనిచేసేచోట లైంగికవేధింపులు ఎందుకు ఎదుర్కోవాలీ అంటూ ఎంతోమంది మహిళలు మీటూతో తమ సమస్యల్ని నలుగురికీ చెప్పేందుకు బయటకు రావడం ఈ సంవత్సరం ఓ పెద్ద ప్రకంపనే రేపింది. బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా, చిన్మయి శ్రీపాద మొదలు ఎంతోమంది మహిళలు తమ రంగాల్లో ఎదుర్కొన్న వేధింపుల్ని, ఇబ్బందుల్ని బయటపెట్టారు. దానివల్ల వాళ్లకు ఉన్న అవకాశాలు తగ్గాయి. అవమానాలు ఎదురయ్యాయి. అయినా భయపడలేదు. వెంటనే తమ సమస్య పరిష్కారం కాకపోవచ్చు కానీ... భావితరాలకు ఓ శక్తిమంతమైన వేదికను ఏర్పాటుచేయగలిగారు. ఎప్పుడయినా సరే... ధైర్యంగా బయటకు వచ్చి తమ సమస్యను తెలియజేసేలా ఓ చక్కని మార్గాన్ని ఏర్పాటు చేశారు వీళ్లు. అడుగులు సాధికారత వైపు... అవరోధాలు ఎన్ని ఉన్నా... ఒక్కోదాన్ని దాటుకుంటూ అనుకున్నది సాధిస్తూ సాధికారత, సమానత్వం దిశగా ప్రయాణం సాగించే మహిళలు కొందరు లేకపోలేదు. మహిళల సంఖ్య తక్కువగా ఉండే న్యాయ రంగంలో ఈ సంవత్సరం ఇందూ మల్హోత్రా తనకంటూ గుర్తింపు సాధించింది. ఓ మహిళా న్యాయవాది అయిన ఆమె ఈ ఏడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైంది. అలా ఎంపికైన మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది. కర్నూలుకు చెందిన అనితా నరహరి ప్రపంచ ఆహార పథకం డిప్యూటీ ఛీఫ్‌ ఆఫ్‌ బిజినెస్‌గా ఎంపికైంది. ఆమె కూడా అలాంటి అవకాశాన్ని అందుకున్న తొలి భారతీయురాలే. ఎక్కువమంది మహిళలు శాస్త్ర, సాంకేతిక రంగాల్లోకి రారు. కానీ ఈ సంవత్సరం ఈ రంగంలోకి చకచకా అడుగులు వేయడం మొదలుపెట్టారు కొందరు మహిళలు. వారిలో విశ్వంలో తొలి నక్షత్ర కాంతి కనుక్కొన్న శాస్త్రవేత్తల బృందంలో ఒకరైన నివేదితా మహేష్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భారతీయ మూలాలున్న ఆమె ఈ రంగంలోకి ఆసక్తిగా వచ్చింది. ఇక, 2022 లక్ష్యంగా మానవ సహిత అంతరిక్ష ప్రాజెక్టు బృందానికి నాయకురాలిగా ఎంపికైంది ఇస్రోకు చెందిన వీ.ఆర్‌. లలితాంబిక. ప్రకృతిది బిహార్‌. పాతికేళ్లకే ఇండో టిబెటన్‌ సరిహద్దు పోలీస్‌ విభాగంలో తొలి మహిళా అధికారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. గువహటిలో ఇప్పటివరకూ రైలుపెట్టెల నిర్వహణ విభాగం బాధ్యత పురుషులదే. అలాంటిది ఈ ఏడాది 165 ఏళ్ల చరిత్రను తిరగరాసి ఆ బాధ్యతని మొదటిసారి తమ చేతుల్లోకి తీసుకుంది ఓ మహిళాబృందం. ఆమె పేరు జిల్‌మోల్‌. చేతుల్లేవు. కానీ కారు నడపడం అంటే ఇష్టం. ఎలాగైతేనేం నేర్చుకుంది. కానీ లైసెన్సు ఉండాలిగా. దానికోసం పెద్ద పోరాటమే చేసింది. చివరకు సాధించింది. అలా లైసెన్సు సాధించిన తొలి భారతీయురాలిగా అరుదైన గుర్తింపునీ సొంతం చేసుకుంది.
#

నేటి మహిళ ఆవేదన

నేటి మహిళ ఆవేదన - ShareChat
153 వీక్షించారు
10 నెలల క్రితం
శరీరం లో మాలమూత్రాలు తయారైనట్లుగా యవ్వనం లో పురుషులకు శుక్రకణాలతో కూడిన వీర్యం తయారవుతుంది, అలాగే స్త్రీఅoడంలో పిండానికి ఆహారం తయారవుతుంది, ఆ స్త్రీ, పురుషునితో లైంగికంగా పాల్గొన్నప్పుడు శుక్రకణo అండపుగుడ్డులోకి చొరబడి పిండంగా రూపుదిద్దుకున్నపుడు అoడంలోతయారైన ఆహారం అండంలోని శిశువును బ్రతికిస్తుంది, లైoగికచర్యజరగ నప్పుడునప్పుడు అండంలో తయారైన ఆహారం బహిస్తురూపంలో బయటికి వస్తుంది,ప్రతినెల ఇలా ఆహారం తయారవుతుంది బయటకువస్తుంది, గర్భం దరించినప్పుడు రాదు, అప్పటినుండి బహిష్టు ఆగిపోయి శిశువుకు ఆహారంగా ఉపయోగపడుతుంది, ప్రతినెల వచ్చేబహిస్ట్ ఆగిపోవడాన్ని నెలతప్పడం అంటారు, ఇది ప్రతిశరీరాంలో జరిగే ప్రక్రియ. ఆ మూడురోజులు శరీరం నీరసంగా ఉంటుంది కాబట్టి ఒకదగ్గర కూర్చోవాలని అప్పటివాళ్ళు పెట్టుకున్న ఏర్పాటు, ఇప్పటిలాగా పాడ్స్ పెట్టుకొని చకచకా తిరగడాని కి అప్పుడు పాడ్స్ లేవు, స్త్రీలకు కూడా ఈవిషయం తెలియక ఈరోజుల్లోకూడా కోట్లమంది స్త్రీలు అపచారం అనుకుంటారు,ఇది శరీరంలో జరిగే సహజసిద్ధమైన ప్రక్రియ. దీన్ని అనవసరపు రాద్ధాంతం చేయడం మూర్ఖత్వం. భారత సమాజంలో ఋతుస్రావం గురించి పబ్లిక్ గా మాట్లాడటం నేరంగా, బూతుగా భావించే దుర్మార్గమైన సంస్కృతి పాతుకుపోయి ఉన్నది. ఋతుస్రావం పట్ల ఇంకా అనేక చర్చలు జరగవలసి ఉంది. అనేక గొంతులు మౌనాన్ని వీడాల్సి ఉంది. ఈ సమాజంలో పెనుమార్పులతో కూడిన నూతన చైతన్యం వెల్లివిరియాల్సి ఉంది. స్త్రీలు ప్రతినెలా మూడు రోజుల నుండి ఐదు రోజుల పాటు ఋతుస్రావానికి బాధపడాల్సి ఉంటుంది. అది ప్రకృతిలో సహజమైనప్పటికి ఆ సమయం చాలా భయంకరమైంది. ఆ సమయంలో స్త్రీలు పడే ఇబ్బంది, పెయిన్, వేదనను అక్షరీకరించడానికి అక్షరాలు పూర్తిగా న్యాయం చేయలేమని గొల్లుమంటాయేమో. తీవ్రమైన బాధ, కడుపునొప్పి, ఒక్కోసారి ప్రాణాలు పోతాయేమోనన్నంతటి పెయిన్, నీరసం లాంటివి స్త్రీలను పీడిస్తాయి. ఆ వేదననంతటినీ ఓర్చుకోవడం కోసం బాధనంత పంటి బిగువున దాచేస్తుంటారు. అసహజమైన స్థితిలోంచి కృత్రిమ చిరునవ్వుతో సహజమైన స్థితిలోకి వస్తుంటారు. యధావిధిగా అందరిలో కలిసిపోతుంటారు. కలిసిపోతు వాళ్ళు ఎంత అలసిపోతారో మన సమాజం ఎప్పుడూ గుర్తించదు. కనీసం గమనించదు. అట్లా చేయడానికి ప్రయత్నించదు. అంతే కాదు. ఋతుస్రావాన్ని అంటుగా చూస్తుంది. గడప అవతలకి ముట్టుగా నెట్టివేస్తుంది. ఒక్కోసారి ఎముకలు కొరికే చలిలో అనారోగ్యం పాలవుతున్న స్థితిని గుర్తించదు. వాళ్ళకు సాయంగా ఓ చెయ్యి అందించడానికి ముందుకు రాదు. అట్టా రాకపోవడం పట్ల ఈ సమాజం సిగ్గుపడదు. సిగ్గులేనితనానికి సంస్కృతి అనే పేరును తగిలిస్తారు. దానిని భారతీయ సంస్కృతిగా చలామణి చేస్తారు. అట్లాంటి సంస్కృతి ఎంత కృరమైందో ఆలోచించాల్సి ఉంది. మనిషి బాధను గుర్తించడానికి సిద్ధపడని అనాగరికతను సంస్కృతిగా చెలామణి చేయడం ఎంత సిగ్గులేని తనమో కదా .. -సేకరణ వివిధ వ్యక్తుల భావాల నుండి నేను మగాడిని అని విర్రవీగే వాడా నువ్వు మగాడిలా ఇలా ఉన్నావు అంటే కూడా ఆ ఆడతల్లి పడ్డ ఎన్నో కష్టాల ఫలితమేరా ... ఆడవాళ్ళు పడే కష్టాలను గుర్తించకపోయినా పర్వాలేదు కానీ అవమానించి అసహ్యించుకోకండిరా .... కాపీ పోస్ట్ ఫేస్ బుక్ నుండి
#

నేటి మహిళ ఆవేదన

నేటి మహిళ ఆవేదన - ShareChat
198 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
మరిన్ని పోస్ట్‌లు లేవు
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post