కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతిలో అడుగు పెట్టగానే వినిపించే పదం 'గోవిందా'. భక్తులంతా 'ఏడుకొండలవాడా వేంకటరమణ గోవిందా, గోవిందా' అని స్మరిస్తూ శ్రీనివాసుడి దర్శనానికి బయల్దేరుతారు. తిరుమలలోని సప్తగిరుల్లో గోవింద నామ స్మరణ మార్మోగుతుంది. అయితే, గోవిందా అంటే అర్థం ఏమిటో చాలా మంది భక్తులకు తెలియదు. గోవిందా అంటే వేంకటేశ్వరస్వామి నామం అనే అనుకుంటారు కానీ, ఆ పదం ఆవిర్భావం వెనుక చరిత్ర చాలామందికి తెలియదు. ఈ నేపథ్యంలో గోవిందా అనే పదం ఎలా వచ్చిందో తెలుసుకుందామా?
గోవింద" అనే పదం "గో"+"వింద" అనే రెండు పదాల కలయికగా తెలుస్తోంది. గో అంటే గోవులు, వింద అంటే కాపరి అని అర్థం.
గో అంటే ఇంద్రియాలు, వింద అంటే ఇంద్రియాలకు ఆనందాన్ని ఇచ్చేదని మరో అర్థం కూడా భాగవతంలో ఉంది. శ్రీకృష్ణుడు తన బాల్యంలో గోపాలకులలో పెరిగి, గోవులను కాపాడేవాడు కాబట్టి ఈ పేరు ఆయనకు ఎంతో సరిపోతుంది,
గోవిందా.. గోవిందా...!!🙏🙏
మన దైవం🙏భక్తివైభవము🙏 #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🌿🌼🙏ఓం నమో వెంకటేశః🙏🌼🌿