VIRAL: జేసీబీలతో ప్రసాదాన్ని మిక్స్ చేశారు!
గరిటెలతో కాకుండా జేసీబీతో ఆహారాన్ని మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి ఆసక్తికర ఘట్టాన్ని రాజస్థాన్లోని భైరూజీ ఆలయ జాతరలో చూడొచ్చు. లక్షలాది మంది భక్తుల కోసం 65,100 కిలోల చూర్మ ప్రసాదాన్ని వండటం మనుషుల వల్ల కాదని నిర్వాహకులు ఈ భారీ యంత్రాలను వాడారు. కుప్పలు తెప్పలుగా ఉన్న పిండిని, నెయ్యిని కలపడానికి జేసీబీలు 'భారీ గరిటెలు'గా మారిపోయాయి. ఈ వింత వంటకానికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱