*చరిత్ర మనల్ని విడగొట్టకూడదు - చరిత్ర మనల్ని కలపాలి*నా స్వస్థలమైన కాకినాడలో జరిగిన కీలక సంఘటన గుర్తు చేస్తూ.. ‘వందేమాతరం’ 150 సంవత్సరాల పూర్తైన సందర్భంగా ఈరోజు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మాట్లాడే అవకాశం రావటం నా మాతృభూమి నాకు ఇచ్చిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.కాకినాడకు భారత స్వాతంత్ర ఉద్యమానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ.. సరిగ్గా 102 ఏళ్ల క్రితం అంటే 1923లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) సమావేశంలో, అప్పటి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మౌలానా మొహమ్మద్ అలీ జవహర్ వందేమాతరం గేయాన్ని ఆలపించకుండా నాడు సభలో నుంచి వాకౌట్ చేసి వందేమాతరం గేయాన్ని ఆవమానించిన చేదు ఘటనను ప్రస్తావించాను. ఆ సంఘటనతో కాంగ్రెస్ ఆ విధికి మౌలానా ఆలీ పేరును పెట్టడం జరిగిందని చరిత్ర తప్పిదాలను కూడా గుర్తు చేశాను.వందేమాతం 150 ఏళ్ల సంబరం సందర్భంగా చంద్రబాబు గారి పిలుపు మేరకు బీజేపీ జాతీయ కార్యదర్శి ఎంపీ రాధా మోహన్ దాస్ అగర్వాల్ గారు, బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గార్లతో కలిసి వందేమాతరం గేయ గౌరవార్థం ఆ వీధికి ‘వందేమాతరం మార్గ్’ నామకరణం చేయటం జరిగిందని తెలిపాను. ఇది కేవలం రోడ్డు పేరు మార్పు కాదని భారత జాతీయ చైతన్యనికి ఇచ్చిన గౌరవమని, కాకినాడ నేల పై మళ్లి వెలిగిన దేశభక్తి జ్యోతి అని నేను గర్వంగా చెప్పాను.బంకిమ్ చంద్ర చట్టర్జీ గారు రచించిన వందేమాతరం గేయాన్ని ఏ మతానికి ప్రాతిపందించలేదని, ఇది మాతృభూమిని తల్లిగా భారతీయ భావనకు ప్రతీకగా రచించారని ఈ సందర్భంగా తెలియజేయటం జరిగింది. #📰ఈరోజు అప్‌డేట్స్