కాగజ్‌నగర్ టౌన్‌లోని 20వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సార్ గారు పర్యటించి పేదవారి ఇంటిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాల జీవన పరిస్థితులను అడిగి తెలుసుకొని వారి సమస్యలను ఓర్పుగా విన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొంగ సత్యనారాయణ గారు, గొలేం వెంకటేష్, టౌన్ మహిళా కన్వీనర్ తాండ్ర వరలక్ష్మి, లావణ్య, శోభన్ అన్న తదితరులు పాల్గొన్నారు. పేదల సంక్షేమమే బిఆర్ఎస్ పార్టీ లక్ష్యమని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరిగేలా పార్టీ నిరంతరం పోరాడుతుందని డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సార్ గారు తెలిపారు.
ప్రభుత్వం పేదల సమస్యలను పట్టించుకోవడంలో విఫలమవుతోందని విమర్శించిన ఆయన, ప్రజల పక్షాన బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. స్థానిక సమస్యల పరిష్కారానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
#BRS #BRS పార్టీ సోషల్ మీడియా #BRS party #RS ప్రవీణ్ కుమార్#
#Swaeros Student Union